ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు
వైఎస్‌ఆర్ జిల్లా, రామాపురం : కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై మండల పరిధిలోని చిట్లూరు పంచాయతీ పాలన్నగారిపల్లె సమీపంలో మంగళవారం సాయంత్రం కారు అదుపుతప్పి బోల్తా పడడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తెలం గాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన వేణుగోపాలాచారి తన కుటుంబంతో కలసి టీఎస్ 06 ఈఆర్ 6484 నంబరు గల కారులో తిరుపతి వెళ్లి తిరుగు ప్రయాణంలో కాణిపాకంలో వినాయకుడిని దర్శనం చేసుకొని మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు. రామాపురం మండలం పాలన్నగారిపల్లె సమీపంలోకి రాగానే కారు టైర్ పంక్చర్ కావడంతో అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న భార్య సంధ్య, కుమార్తె వైష్ణవి, కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేసినప్పటికి ఎంతకూ రాకపోవడంతో అటుగా వెళుతున్న మరో వాహనంలో ఆసుపత్రికి తరలించారు. రామా«పురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment