సాక్షి, వైఎస్సార్ కడప : ఏపీ సీడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను చిన్న చౌక్ పోలీసులు భగ్నం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కడప డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.. ఏవి సుబ్బారెడ్డిని హతమార్చేందుకు నిందుతులు రూ.50లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. నిందితులు ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందినవారేనని పేర్కొన్నారు. కడపలో హత్యకు ప్రణాళిక రూపొందిస్తున్న సమయంలో పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు.
వీరి నుంచి రూ. 3.20 లక్షల నగదు, ఒక పిస్టల్, 6 తూటాలు, రెండు సెల్‌ఫోను స్వాధీనం చేసుకున్నారు. కాగా పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితులపై గతంలో పలు కేసులు నమోదు అయినట్లు, సంజురెడ్డి అనే నిందితుడు సూడో నక్సలైట్‌గా తేలింది. ఇప్పటికే రెండుసార్లు సుబ్బారెడ్డి ఇంటిని రెక్కి చేసిన నిందితులు.. ఆ సమయంలో హైదరాబాద్ పోలీసులకు బయపడి వెనక్కి వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment