ఏవీ సుబారెడ్డి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారి మాదా శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్ చేశారు. సుబ్బారెడ్డి హత్య కేసుకు సంబంధించి జరిపిన ఆర్థిక లావాదేవీల్లో శ్రీనివాసులు ముఖ్య పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. సుబ్బారెడ్డి హత్యకు నిందితులు రూ.50 లక్షలు సుపారీగా తీసుకున్నట్లు వెల్లడైంది. కాగా.. హత్య కేసుకు సంబంధించి మార్చి 21న పోలీసులు ముగ్గురుని అదుపులోకి తీసుకున్నారు.
తాజాగా నిందితులు అందించిన సమాచారం మేరకు సుబ్బారెడ్డి పై హత్యాయత్నం కేసులో ముఖ్య సూత్రధారిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రెండు మొబైల్స్, ఒక వాహనం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే చాలా కాలంగా భూమా కుటుంబానికి ఏవీ సుబ్బారెడ్డికి మధ్య ఆర్థిక విభేదాలు నడుస్తున్నాయి. తనను హత్య చేసేందుకు భూమా కుటుంబం ప్రయత్నిస్తోందని గతంలోనే ఏవీ సుబారెడ్డి ఆరోపించిన సంగతి తెలిసిందే. ఈ హత్యకు తెరలేపిన ప్రధాన సూత్రదారులను త్వరలోనే పట్టుకుంటామని కడప డీఎస్పీ సూర్యనారాయణ తెలిపారు. చదవండి: ఏవి సుబ్బారెడ్డి హత్య కుట్రను భగ్నం చేసిన పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment