సాక్షి, వైఎస్సార్ కడప: ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కానీస్టెబుల్ ఈశ్వర్ మోసపోవడంతో రాజంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో కానిస్టేబుల్ ఈశ్వర్ అప్పు చేసిన ఆన్‌లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. దీంతో పీటీ వారెంటుతో నిందితులను పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరూ చైనా దేశస్థుడు కాగా మరో ఇద్దరూ ఇండియాకు చెందిన హర్యానా వాసులుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం నందలూరు జేఎఫ్‌ఎం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది.
Comments
Please login to add a commentAdd a comment