online trading
-
అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక
రోజురోజుకు ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ భారీ ఆన్లైన్ స్కామ్ అస్సాంలో వెలుగుచూసిందిరాష్ట్ర పోలీసులు రూ. 22 వేల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు. ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తామంటూ ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసగాళ్లు ఈ సొమ్మును సేకరించారు.ఈ కేసులో దిబ్రూఘఢ్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.వ్యాపారవేత్త అయిన విశాల్ ఫుకాన్ తన పరపతిని ఉపయోగించి పెట్టుబడిదారులకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం అధిక లాభాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు.దిబ్రూగఢ్‌లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. మరోవైపు మోసపూరిత ఆన్లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను హెచ్చరించారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామనే మాటలు అబద్దమని పేర్కొన్నారు. -
ట్రేడింగ్‌లో పెట్టుబడి రూ. 5.4 కోట్లు.. లాభం రూ.15.58 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ట్రేడింగ్‌లో పెట్టుబడులతో అధిక లాభాలంటూ ఆశ చూపించి ఒకరి నుంచి రూ.5.4 కోట్లు కొల్లగొట్టిన ఇద్దరిని విజయవాడలో టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. ఆ వివరాలను టీజీ సీఎస్బీ డైరెక్టర్ శిఖాగోయల్ శనివారం మీడియాకు తెలిపారు. హైదరాబాద్ చిక్కడపల్లికి చెందిన ఓ వ్యక్తి వాట్సాప్‌నకు సైబర్ నేరగాళ్లు జూన్ 8న ఇన్వెస్టిమెంట్ లింకు పంపారు. దీంతో లింక్ ఓపెన్ చేసి ఆ వ్యక్తి గ్రూపులో చేరాడు. ‘బీ6/ స్టాక్ విజనరీస్’ పేరుతో ఉన్న గ్రూప్‌లో లైదియశర్మ గోల్డ్‌మెన్ స్కీం గురించి వివరించింది. త్వరలో రాబోతున్న మరిన్ని ఐపీఓల గురించి తెలుసుకొని ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టి లాభాలు ఆర్జించాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించింది.పాన్‌కార్డు, ఆధార్‌కార్డుతోపాటు ఇతర వివరాలతో ఆమె చెప్పిన వెబ్సైట్లో లాగిన్ అయ్యాడు. ఆపై ట్రేడింగ్ మొదలుపెట్టాడు. ప్రముఖ సంస్థలకు సంబంధించిన ట్రేడింగ్ ఆప్షన్స్ వెబ్సైట్లో పొందుపర్చగా, బాధితుడు సులువుగా నమ్మాడు. జూలై 10 నుంచి పలు దఫాలుగా నెలరోజుల్లోనే రూ.5.4 కోట్లు పెట్టుబడిగా పెట్టాడు. ఇలా వెబ్సైట్లో బాధితుడికి రూ.15.58 కోట్లు లాభం వచ్చినట్టు చూపించింది. దీంతో ఆ అమౌంట్ విత్ డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. విత్‌డ్రా సదుపాయం కల్పించాలంటే మరికొంత చెల్లించాలని సైబర్ నేరగాళ్లు బాధితుడ్ని డిమాండ్ చేశారు.దీంతో తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలోని సైబర్ క్రైం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు రాంపల్లి కొండల్రావు, అతని సోదరుడు చంద్రశేఖర్ఆజాద్లను విజయవాడలో అరెస్ట్ చేశారు. వీరిద్దరూ రిక్కి సాఫ్ట్వేర్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. నిందితులు ఈ తరహా మోసాలకు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలపై దేశవ్యాప్తంగా 26 ఫిర్యాదులు ఉన్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని శిఖాగోయల్ ప్రజలకు సూచించారు. -
సైబర్ వలలో మహిళలు!
సాక్షి, సిటీబ్యూరో: ‘వేసవి సెలవులు వచ్చాయి..మా పిల్లలకు యోగా నేర్పించాలని అనుకుంటున్నాం’ అంటూ గచ్చిబౌలికి చెందిన ఓ యోగా శిక్షకురాలికి ఫోన్ వచ్చింది. సరే అని ఆమె సమయం, ఫీజు తదితర వివరాలు తెలిపింది. అడ్వాన్స్ చెల్లిస్తామని శిక్షకురాలి బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్ కార్డు వివరాలను సైబర్ నేరస్తులు తీసుకున్నారు. ఫోన్ పే ద్వారా తాము పంపిన లింక్‌కు రూ.10 చెల్లించండి, మీ ఖాతా అని నిర్ధారించుకున్న తర్వాత అడ్వాన్స్ పంపిస్తామని కేటుగాళ్లు సూచించారు. నిజమేనని నమ్మిన ఆమె నగదు బదిలీ చేయగానే క్షణాల్లో ఆమె ఖాతాలోని డబ్బు ఖాళీ అయిపోయింది. లింక్‌లు పంపించి బురిడీ.. ఇంట్లోనూ ఉంటూ నెలకు రూ.లక్షల్లో సంపాదించుకోండి’ అంటూ సైబర్ నేరస్తులు వల విసురుతున్నారు. నిజమేనని నమ్మి గృహిణులు చేతిలోని సొమ్ము, బ్యాంకు ఖాతాలో ఉన్న నగదునూ పోగొట్టుకుంటున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగం, వివాహం, ఆన్లైన్ ట్రేడింగ్ వంటి సైబర్ మోసాల బారిన పడుతున్నారని, సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్లలో ఈ తరహా కేసులు పెరిగిపోతున్నాయని పోలీసులు చెబుతున్నారు. నగరంలో జీవన వ్యయం పెరిగింది. భార్యభర్తలిద్దరూ సంపాదిస్తే తప్ప గడవని పరిస్థితి. తమ చదువు, విజ్ఞానానికి అనుగుణంగా గృహిణులు టైలరింగ్, బ్యూటీషియన్, బేకింగ్ వంటి ఉపాధి అంశాలను ఎంచుకోవటం సాధారణం. ఆన్లైన్ లావాదేవీలు పెరిగాక ఈ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ట్యూషన్లు, సంగీతం, యోగా, నృత్యం, డిజిటల్ ప్రకటనలు, పెట్టుబడులు తదితర అంశాలను నగర మహిళలు ఉపాధిగా మలుచుకుంటున్నారు. ప్రతి నెలా రూ.10 వేల నుంచి రూ.40 వేల వరకూ సంపాదిస్తున్నారు. ఈ వెసులుబాటును సైబర్ నేరస్తులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. నకిలీ వెబ్సైట్లతో.. ప్రముఖ సంస్థల పేర్లతో నకిలీ వెబ్సైట్లు రూపొందించి గృహిణులను లక్ష్యంగా చేసుకొని మోసాలకు పాల్పడుతున్నారు. అదనపు సంపాదన కోసం మేమిచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ఆశ చూపిస్తున్నారు. మాయగాళ్ల వలకు చిక్కి రూ.లక్షల్లో పోగొట్టుకుంటున్నారు. క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభాలు వస్తాయని మోసగాళ్ల ప్రకటనను నమ్మిన ఓ యువతి ఒంటి మీద బంగారం అమ్మి మరీ పెట్టుబడి పెట్టడం ఇందుకు ఉదాహరణ. కుటుంబానికి అండగా నిలవాలన్న ఆలోచన మంచిదే కానీ.. ఆన్లైన్ ద్వారా వచ్చే సందేశాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై ప్రకటనలు తేలిగ్గా నమ్మకూడదు. వాటిలో ఎంత వరకు నిజమో నిర్ధారించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. -
సైబరాసురులు దోచేస్తున్నారు..కంపెనీల పేరులో వల
‘ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి ఇంట్లోనే కూర్చుని నెలకు లక్షలాది రూపాయల్ని స్పందించే అవకాశం’ అంటూ విజయవాడ మాచవరం ప్రాంతానికి చెందిన ఓ వివాహిత ఫోన్‌కు రెండు నెలల క్రితం మెసేజ్ వచ్చింది. ఆశతో మెసేజ్ కింద ఉన్న వెబ్‌లింక్‌ను క్లిక్ చేయగా.. ఓ ప్రముఖ కంపెనీ పేరిట వెబ్సైట్ తెరుచుకుంది. కంపెనీలో పెట్టుబడి పెట్టే వారికి లాభాలు పంచుతామని అందులో పేర్కొనడంతో.. ఆమె రూ.వెయ్యి పెట్టుబడి పెట్టింది. మరుసటి రోజున రూ.15 వేలు లాభం వచ్చినట్టు ఆమె పేరిట ఉన్న ఆ కంపెనీ వాలెట్లో ఆ మొత్తాన్ని జమ చేసినట్టు చూపించారు. వాలెట్లోని నగదు విత్‌డ్రా చేయాలంటే మరో రూ.5 వేలు పెట్టుబడి పెట్టాలనే మెసేజ్ వచ్చింది. దీంతో ఆమె రూ.5 వేలను పెట్టుబడి పెట్టింది. ఇలా ప్రతి రోజూ ఆమె పేరిట ఉండే వాలెట్లోని నగదు పెరగడం.. ఆ మొత్తాన్ని తీసుకోవాలంటే మరికొంత నగదు జమ చేయాలనే ఆంక్షల రూపంలో మెసేజ్‌లు రావడం పరిపాటిగా మారింది. ఇలా నెల రోజుల వ్యవధిలోనే ఆమె వాలెట్లో 1,13,42,181 రూపాయలు చేరాయి. ఈ నగదు తీసుకునే నిమిత్తం విడతల వారీగా రూ.9 లక్షలు సమర్పించాక మోసపోయానని గ్రహించిన ఆ మహిళ సైబర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు. భర్త చనిపోవడంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. డబ్బులు వస్తే పిల్లల చదువుకు ఉపయోగపడతాయనే ఆశతో బంగారాన్ని అమ్మేసి మరీ సైబర్ ఉచ్చులో చిక్కుకుని విలవిల్లాడుతోంది. విజయవాడ నగరంలో ఇలాంటి మోసాలకు సంబంధించి నెలకు సగటున 10 వరకు కేసులు నమోదవుతుండటంతో సైబర్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఆశ చూపి లూటీ చేస్తున్నారు అమెజాన్, ఈబే, లవ్ లైఫ్, క్రి΄్టో, స్నాప్ డీల్, ఫ్లిప్‌కార్ట్, ఓలా తదితర బడా కంపెనీల్లో స్వల్ప పెట్టుబడి పెడితే భారీగా లాభాలొస్తాయంటూ పలువురి ఫోన్లకు మెసేజ్‌లు పంపించి సైబరాసురులు ఆకర్షిస్తున్నారు. ఇంట్లోనే కూర్చుని నెలకు రూ.లక్షలు సంపాదించవచ్చంటూ మెసేజ్‌ల ద్వారా సూచిస్తారు. నమ్మకం కుదరకపోతే రూ.లక్షలు సంపాదించిన వారి వీడియోలు చూడండి అంటూ.. వారే తయారు చేసిన కొన్ని వీడియోలను యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్ ద్వారా లింక్‌లను పంపుతారు. మొత్తం ఆన్లైన్ అయిపోయిందని, భవిష్యత్ వ్యాపారం పూర్తిగా ఆన్లైన్ వేదికగానే జరుగుతుందంటూ ముగ్గులోకి దించుతారు. ముందుగా రూ.100 పెట్టుబడి పెట్టి పరీక్షించుకోండంటూ బంపర్ ఆఫర్ ఇస్తారు. వారు పంపిన వెబ్‌లింక్ క్లిక్ చేయగానే వారే రూపొందించిన ఆయా కంపెనీల నకిలీ వెబ్సైట్లోకి తీసుకెళ్తారు. తరువాత ఒక యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అక్కడ మన కోసం ఒక వాలెట్‌ను రూ΄÷ందించి పెట్టుబడులను పలు రకాలైన ఆఫర్లతో ఆకర్షిస్తారు. రూ.100 పెట్టుబడి పెట్టిన 24 గంటల్లోపే లాభం రూ.1,500లకు పైగా వచ్చిందని వాలెట్లో చూపిస్తారు. ఆ నగదు మీ బ్యాంక్ ఖాతాకు చేరాలంటే మరో రూ.500 పెట్టుబడి పెట్టాలంటూ ఆంక్షలు విధిస్తారు. ఇలా వాలెట్లో నగదు అంకెలను పెంచుకుని΄ోతూ ఆశను పెంచేసి ఒక్కొక్కరి నుంచి రూ.లక్షలు గుంజుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి క్యాష్ ఇన్వెస్ట్మెంట్ తరహా సైబర్ నేరాలు జరుగుతున్నాయి. కేసులు నమోదు చేసి సైబర్ నేరగాళ్ల బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేస్తున్నాం. ఈ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ప్రజలు అవసరం లేని వెబ్‌లింక్‌ల జోలికి ;పోకూడదు. – యేలేటి శ్రీరచన, ఎస్ఐ, సైబర్ క్రైం, విజయవాడ (చదవండి: భారతీయ చిన్నారులు బాగా ‘స్మార్ట్’ ) -
కేరళ ఎన్ఐటీలో కూకట్పల్లి విద్యార్థి అనుమానాస్పదస్థితి మృతి.. అసలేం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: కేరళ కోజికోడ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ)–కాలికట్లో విద్యనభ్యసిస్తున్న నగర యువకుడు చెన్నుపాటి యశ్వంత్ (22) అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఇది ఆత్మహత్య అని, దానికి సంబంధించిన సూసైడ్ నోట్ లభించిందని యాజమాన్యం ప్రకటించింది. అయితే, యశ్వంత్ తండ్రి నాగేశ్వరరావు దీన్ని ఖండించారు. సూసైడ్ నోట్లోని చేతిరాత తన కుమారుడిది కాదని చెప్పారు. తన కుమారుడి బ్యాంకు ఖాతాలో ఉన్న రూ.7 లక్షలు కాజేసిన హాస్టల్ మేట్స్ అతడిని భవనంపై నుంచి తోసి చంపారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. దర్యాప్తు పూర్తి కాకుండానే ప్రకటన సోమవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో యశ్వంత్ హాస్టల్లోని తొమ్మిదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం సమాచారమిచ్చింది. దీంతో తల్లిదండ్రులు హుటాహుటిన అక్కడికి వెళ్లారు. అప్పటికే ఎన్ఐటీ యాజమాన్యం ఫిర్యాదుతో అనుమానాస్పద స్థితిగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. యశ్వంత్ రాసినట్లు చెబుతున్న ఓ లేఖ అతడి గదిలో దొరికింది. దీనిపై దర్యాప్తు పూర్తి కాకుండానే ఎన్ఐటీ యాజమాన్యం యశ్వంత్‌ది ఆత్మహత్యగా తేల్చేసింది. ఆన్లైన్ ట్రేడింగ్‌లో నష్టపోయాడని, దీంతోపాటు వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని పేర్కొంది. దీంతో తన కుమారుడి కేసు దర్యాప్తు పక్కాగా సాగేలా చూడాలంటూ నాగేశ్వరరావు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఆ దిశగా చర్యలు తీసుకోవాలంటూ ట్విట్టర్ ద్వారా కేరళ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని (సీఎంఓ) కోరారు. కుమారుడి పేరుతో ట్రేడింగ్ ఖాతా ఏపీలోని గుంటూరుకు చెందిన చెన్నుపాటి నాగేశ్వరరావు కొన్నేళ్ల క్రితం నగరానికి వలసవచ్చి కూకట్‌పల్లిలో స్థిరపడ్డారు. ఈయన కుమారుడు యశ్వంత్‌కు గతేడాది ఐఐటీ–గాంధీనగర్పాటు ఎన్ఐటీ కాలికట్లోనూ సీటు వచ్చింది. కంప్యూటర్ సైన్స్‌పై ఆసక్తి ఉండటంతో ఎన్ఐటీ కాలికట్‌ను ఎంచుకున్నారు. ప్రస్తుతం సీఎస్ఈలో మూడు సెమిస్టర్లు పూర్తి చేశారు. క్లాస్ టాపర్‌గా ఉన్న ఈయన రిప్రజెంటేటివ్‌గానూ ఎన్నికయ్యారు. నాగేశ్వరరావు కొన్నాళ్లుగా ట్రేడింగ్ చేస్తున్నారు. తన పేరుతో ఒక ట్రేడింగ్ ఖాతా చాన్నాళ్లుగా ఉండటంతో కొద్దిరోజుల క్రితం యశ్వంత్ పేరుతో మరో ఖాతా తెరిచారు. దీన్ని నగరంలో ఉంటున్న నాగేశ్వరరావే నిర్వహిస్తున్నారు. మూడు నెలల క్రితం ఈ ఖాతాలో రూ.20 లక్షలు డిపాజిట్ చేసిన ఆయన దాని నుంచి రూ.13 లక్షలు తన డీ–మ్యాట్ ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. మిగిలిన రూ.ఏడు లక్షలు మూడు నెలలుగా యశ్వంత్ ఖాతాలోనే ఉన్నాయి. రూ.ఏడు లక్షలు వివిధ ఖాతాల్లోకి... యశ్వంత్ మృతిపై అనుమానాలు ఉండటంతో నాగేశ్వరరావు అతడి బ్యాంకు ఖాతా లావాదేవీలను పరిశీలించారు. దీంతో పలు అనుమానాస్పద అంశాలు ఆయన దృష్టికి వచ్చాయి. యశ్వంత్‌కు రూ.100 అవసరమైనా తమకు చెప్పే తీసుకుంటాడని నాగేశ్వరరావు తెలిపారు. అయితే శుక్ర, శని, ఆదివారాల్లో మాత్రం యశ్వంత్ ఖాతా నుంచి జరిగిన 20 లావాదేవీల్లో రూ.7 లక్షలు వేరే ఖాతాల్లోకి వెళ్లినట్లు గుర్తించారు. అవన్నీ అతడి రూమ్ మేట్స్‌తోపాటు అదే హాస్టల్లో ఉండే వారి ఖాతాలుగా నాగేశ్వరరావు చెప్పారు. యశ్వంత్ సొమ్ము కాజేసిన వాళ్లే ఎవరికీ తెలియకుండా ఉండటానికి హాస్టల్ పైనుంచి తోసి హత్య చేసినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఎన్ఐటీ పరువు పోతుందనే ఉద్దేశంతో కేసును నీరు గార్చేందుకు యత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. ‘నేను మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేసిన తర్వాత కేరళ ఏసీపీ నన్ను కలిశారు. మా అనుమానాలను ఆయనకు చెప్పడంతోపాటు యశ్వంత్ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాం. పోస్టుమార్టం అనంతరం ఎఫ్ఐఆర్ కాపీ, ఎన్ఓసీ మాకు ఇచ్చారు. దహనసంస్కారాలు పూర్తయ్యాక రావాలని సూచించారు’అని నాగేశ్వరరావు చెప్పారు. -
ఆన్లైన్ ట్రేడింగ్: మోసాల నుంచి తప్పించుకోండి ఇలా..
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను స్క్రోల్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు పాప్ అప్ అవుతూ ఉంటాయి. కానీ, అవి ఎలాంటి రిజిస్టర్ కాని వాణిజ్య పోర్టల్స్. ఎవరైనా నమ్మి వీటిలో మెంబర్స్‌గా చేరితే, అధిక మొత్తంలో నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. గృహిణులను లక్ష్యం చేసుకునే ఈ మోసాలు జరుగుతుంటాయి. ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి స్కామర్లు కొత్తమార్గాలను ఎంచుకుంటుంటారు. ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలిసుండాలి. అప్పుడే మోసాల బారిన పడకుండా ఉండగలం. ఇంటర్నెట్ ఆధారిత సమాచారం రోజు రోజుకూ పెరుగుతున్న ఈ కాలంలో ఎక్కువ మంది వ్యక్తులు తమ పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవడానికి ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడుతున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఫింగర్ టిప్స్ మీద లభిస్తుండటమే కారణం. అందుకే, స్కామర్లు కూడా ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడుల కోసం చూస్తున్న వ్యక్తులను మోసం చేయడానికి వేగవంతంగా కొత్త మార్గాలను అమలు చేస్తుంటారు. ► ఫ్యాన్సీ ప్రకటనలు చాలావరకు ఆన్లైన్ ప్రకటనలన్నీ ఆకర్షణీయంగా ఉంటాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ల ద్వారా సమాచారం కోసం స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అనేక ప్రకటనలు కనిపిస్తూ ఉంటాయి. అవి అలా కుప్పలు తెప్పలుగా ఆన్‌లైన్‌లోకి రావడం కూడా బ్రోకరేజీ రహితంగా ఉండటం, సులభమైన వాణిజ్య పోర్టల్, తక్షణ పరిష్కారాలు ఉండటం వల్లనే. వీటిలో చాలా ఏజెన్సీలు రిజిస్టర్ చేసి ఉండవు. కానీ ప్రముఖ అధికారిక కార్పొరేట్ ట్రేడింగ్ కంపెనీల కంటే మరింత శక్తిమంతమైన ఫ్యాన్సీ ప్రకటనలను ఉంచుతుంటారు. స్కామర్లు ఆకర్షణీయంగా ఉన్న ప్రకటనలను ఎర వేసి ఈ బోగస్ యాప్‌లు, వెబ్సైట్లలో తమ వివరాలతో రిజిస్టర్ చేసుకున్న వారికి మొదట్లో కొంత మొత్తంలో డబ్బులు జమ చేస్తుంటారు. ఈ విధానం ద్వారా డబ్బు సంపాదించినట్లు చెప్పుకునే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వీరు అనుసరిస్తారు. పాయింట్లకు బదులుగా వారు యాప్ వాలెట్లో డబ్బును డిపాజిట్ చేయమని అడుగుతారు, అది తర్వాత ట్రేడింగ్ కోసం ఉపయోగిస్తారు. మోసగాళ్లు ఉపయోగించే కొన్ని పథకాలు ► పోంజీ పథకం ఇది కొత్త పెట్టుబడిదారుల నుండి సేకరించిన డబ్బుతో చేసే మోసం. ఇప్పటికే ఉన్న పెట్టుబడిదారులకు కొంత మొత్తం చెల్లిస్తూ వారి ద్వారా మరిన్ని పెట్టుబడులను రాబట్టడం. ► పంప్, డంప్ స్కీమ్ ఇది ఒక పెట్టుబడి మోసం. ఇక్కడ సలహాదారులు పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించేలా సమాచారాన్ని అందించి, షేర్ల ధరను బంప్ చేయడానికి (పెంచడానికి) ప్రయత్నిస్తారు. అప్పుడు ఈ పెట్టుబడిదారులు సలహాదారులను నమ్మి తమ షేర్లను (అవి మంచి విలువ కలిగినప్పుడు) అమ్మేస్తారు. ► యాప్ ఆధారిత స్కీమ్‌లు పెట్టుబడిదారులకు మోసగాళ్లు తరచు వాలెట్ బ్యాలెన్స్‌ల నకిలీ చిత్రాలను చూపుతూ ఫిషింగ్ ఇ–మెయిల్స్‌ను పంపుతారు. సాధారణంగా క్రిప్టో కరెన్సీలు స్టాక్‌లు లేదా ఈ కామర్స్ ఉత్పత్తులు.. వీటిలో భాగంగా ఉంటాయి. ► తప్పుదారి పట్టించడానికి.. పెట్టుబడి పోకడలు, పరిశోధన స్టాక్‌లపై సమాచారాన్ని సేకరించడానికి, ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా వేగవంతంగా ఆదాయ అవకాశాలను చర్చించడానికి పెట్టుబడిదారులు ఫేస్బుక్, ట్విటర్, టీమ్ వ్యూవర్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్.. వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగిస్తారు. స్కామర్లు నకిలీ సిఫారసులు చేస్తారు. అయాచిత పెట్టుబడి చిట్కాలు ఇస్తారు. వీటిలో నకిలీ గుర్తింపు లేదా తప్పుదారి పట్టించే సమాచారం ద్వారా పెట్టుబడిదారులను ఒప్పించే కొన్ని పద్ధతులు ఉంటాయి. ► పెట్టుబడిని ఎరగా వేస్తారు చాలా మంది పెట్టుబడిదారులు మొదట్లో సంస్థ నుండి కొంత రాబడిని పొందుతారు. దీంతో ఇన్వెస్టర్ల ట్రేడింగ్ విజయవంతమైందని స్కామర్లు అనుకుంటారు. స్కామర్లు ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి శిష్యుడిని లేదా స్నేహితుడిని పరిచయం చేయడానికి మరింత ప్రోత్సహిస్తారు. డబ్బులు వస్తాయి కదా అని తమకు తెలిసినవారికి సదరు యాప్ లేదా వెబ్సైట్ వివరాలు ఇచ్చి వారిని కూడా చేరమని అంటారు. అయితే, చివరికి రిటర్న్‌లు ఆగిపోతాయి, కస్టమర్ ఖాతా సస్పెండ్ చేయబడుతుంది. డబ్బు వాలెట్లో ఇరుక్కుపోయి ఉంటుంది. సంస్థతో తదుపరి ఎలాంటి పరిచయం ఉండకపోవడంతో తాము పెట్టిన పెట్టుబడిని ఎలా పొందాలో తెలియక చాలా ఇబ్బంది పడతారు. ► అవకాశాల కోసం 7 రకాల వలలు దశ 1: ముందుగా బాధితులను వాట్సాప్ / టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరమని అభ్యర్థిస్తారు. దశ 2: లింక్‌ల ద్వారా యాప్‌లను డౌన్లోడ్ చేయమని అడుగుతారు. ఈ కొత్త సభ్యులందరికీ మొదట్లో జాయినింగ్ బోనస్ లభిస్తుంది. అయితే అది వారి వాలెట్లో మాత్రమే కనిపిస్తుంది. దశ 3: ట్రేడింగ్ జరుగుతుంది (బాధితులు విధులు నిర్వర్తించమని అడుగుతారు), అంటే, షేర్ల అమ్మకం/కొనుగోలు, లేదా కొన్నిసార్లు బాధితులు ఇ–కామర్స్ ఉత్పత్తులను కొనుగోలు చేయమని లేదా విక్రయించమని అడుగుతారు. దశ 4: బాధితులను సిస్టమ్‌కి కొత్త వ్యక్తులను పరిచయం చేయమని అడుగుతారు. ఇది నిజమని, తమకూ కొంత పెట్టుబడి చేరుతుందన్న ఆశతో మంచి పార్టీలను పరిచయం చేస్తారు. అలా పరిచయం చేసిన వ్యక్తి ద్వారా స్కామర్లు వారి వాలెట్‌కి డబ్బు చేరేలా చేస్తారు. దశ 5: చేసిన పనుల ఆధారంగా వాలెట్ డబ్బును కూడగట్టుకుంటుంది. దశ 6: బాధితుడు వారి వాలెట్ల నుండి తమ ఆదాయాన్ని ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించినప్పుడు వీలుపడదు. ఒక్కోసారి వీలున్నా ఆదాయపు పన్ను, ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీ రుసుము మొదలైనవి చెల్లించాల్సి ఉంటుంది. దశ 7: కోరిన ఫీజు చెల్లించిన తర్వాత, యాప్‌లు పని చేయవు. అవి ఏదో ఒక సాంకేతిక లోపాన్ని చూపుతాయి. కస్టమర్ సేవను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలూ ఫలించవు. మోసానికి మార్గాలు ► స్కామర్లు తాము విజయవంతమైన వ్యాపారులుగా, గ్యారెంటీ రిటర్న్ ఇస్తున్నట్టుగా, ట్రేడింగ్ సలహాలను అందిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటారు ∙ఇందుకోసం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చేసిన ఫోనీ టెస్టిమోనియల్ యూట్యూబ్ వీడియోలను ఉపయోగిస్తారు ∙‘పంప్ అండ్ డంప్‘ కార్యకలాపాలను నిరోధించడానికి ట్విట్టర్, ఫేస్బుక్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారు ∙నకిలీ సమాచారంతో ఆన్లైన్ పెట్టుబడి చిట్కాలు, నకిలీ ఎండార్స్మెంట్లను పంపుతుంటారు ∙స్టాక్ సిఫార్సులు లేదా పెట్టుబడి సలహాలకు బదులుగా సబ్స్క్రిప్షన్ రుసుమును సేకరించేందుకు ఉద్దేశించిన స్టాక్ పోర్ట్ ఫోలియో స్క్రీన్షాట్లను ప్రదర్శిస్తుంది ∙పెట్టుబడిదారులను టెక్నికల్ అనలిస్ట్‌లు లేదా ట్రేడింగ్ నిపుణులను చేస్తానని నమ్మబలికి స్కామర్లు వర్క్‌షాప్‌ల కోసం రిజిస్ట్రేషన్ ఫీజులను తీసుకుంటారు కానీ వారికి హోస్ట్ చేయరు. పెట్టుబడులకు డేంజర్ సిగ్నల్స్ బాధితుల ఆశను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన విభిన్న పద్ధతులతో మోసగాళ్లు వారి లక్ష్యాన్ని ఛేదిస్తారు. అలా కాకుండా మనల్ని మనం కాపాడుకోవా లంటే.. ► అసాధారణంగా అధిక హామీతో కూడిన రాబడిని వాగ్దానం చేస్తారు, గమనించాలి. ► అధిక ప్రారంభ పెట్టుబడిని అభ్యర్థిస్తారు. ► సంక్లిష్టమైన, నిలకడలేని వ్యాపార నమూనా ఉంటుంది. ► నష్టాలను తిరిగి చెల్లిస్తామని వాగ్దానం చేస్తారు. ► వెంటనే డబ్బు పెట్టుబడిగా పెట్టమని ఒత్తిడి చేయచ్చు. ► యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్లలో లిస్ట్‌లో లేని యాప్‌లలో పెట్టుబడి పెట్టమని కోరతారు. ► అధిక రాబడిని పొందినట్లు పేర్కొంటూ సోషల్‌మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మద్దతును కోరుతారు. ► స్కామర్ల కార్యాలయాలు మన దేశం లోపల ఉన్నాయా, వెబ్సైట్, యాప్‌లలో ఉండే చిరునామాలను చూపుతున్నాయా అనేది చెక్ చేసుకోవాలి. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
వెంటాడిన అప్పులు... భయంతో తప్పుదోవలో వెళ్లి చివరికి...
బనశంకరి: ఐటీ ఉద్యోగం, దండిగా జీతం, కానీ షేర్ మార్కెట్లో ప్రవేశించి నష్టపోయాడు. చివరకు హత్య చేయడానికీ వెనుకాడలేదు. ఆన్లైన్ ట్రేడింగ్‌లో తలెత్తిన నష్టాలనుంచి గట్టెక్కడానికి ఇంటి యజమానురాలిని హత్యచేసి బంగారు నగలను దోచుకెళ్లిన టెక్కీని ఆదివారం బెంగళూరులోని చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులు అరెస్ట్‌చేశారు. దక్షిణ విభాగ డీసీపీ కృష్ణకాంత్ విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన వినాయకనగర మూడో క్రాస్‌లోని ఇంట్లో యశోదమ్మ (75) అనే వృద్ధురాలు హత్యకు గురైంది. విచారించిన పోలీసులు జై కిషన్ అనే టెక్కీని అరెస్టు చేశారు. ముంచేసిన ఆన్లైన్ ట్రేడింగ్ దందా జైకిషన్ యశోదమ్మ ఇంట్లో పై అంతస్తులో బాడుగకు ఉండేవాడు. ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగి కాగా షేర్మార్కెట్లో పెట్టుబడులు, ఆన్లైన్ ట్రేడింగ్ చేసేవాడు. ఇటీవల తీవ్ర నష్టాలు రావడంతో చాలావరకు అప్పులు చేశాడు. యశోదమ్మ వద్ద కూడా రూ.6 లక్షలు వరకు అప్పు తీసుకున్నాడు. అప్పులవారి బాధలు అధికం కావడంతో యశోదమ్మ వద్ద ఉన్న బంగారు నగలను కొట్టేయడానికి పథకం పన్నాడు. ఈ నెల 1వ తేదీ రాత్రి యశోదమ్మ ఇంట్లోకి చొరబడిన జైకిషన్ చాకుతో ఆమెను హత్య చేసి నగలు దోచుకుని వెళ్లిపోయాడు. అద్దెకు ఉంటున్న వ్యక్తులు మృతురాలి కుమారుడు రాజుకు సమాచారం అందించారు. అతడు చెన్నమ్మకెరె అచ్చుకట్టు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 60 కత్తిపోట్లు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో ఎలాంటి క్లూ దొరకలేదు. ఆరా తీయగా గతంలో యశోదమ్మతో టెక్కీ జైకిషన్ గొడవపడినట్లు తెలిసింది. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. 60 సార్లు కత్తితో పొడిచి చంపడం గమనార్హం. అయినా ఏమీ తెలియనట్లు నటించాడు. వృద్దురాలి అంత్యక్రియల్లో కూడా పాల్గొని పోలీసులకు పలు విషయాలు చెప్పాడు. దీంతో పోలీసులకు ఇతడిపై అనుమానం రాలేదు. కాగా అతడు దోచుకున్న నగలను కుదువ దుకాణంలో పెట్టి నగదు తీసుకున్నాడు. అప్పులు తీర్చడానికే హత్యచేసినట్లు చెప్పాడు. కేసు విచారణలో ఉందని డీసీపీ తెలిపారు. (చదవండి: రైల్వే బ్రిడ్జిని ఢీకొట్టిన కారు) -
‘ఆన్లైన్ ట్రేడింగ్’ పేరుతో రూ.1.2 కోట్లు కొట్టేసిన గ్యాంగ్!!
సాక్షి హైదరాబాద్: ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో నగర మహిళకు ఎర వేసి, ఆమె నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన కేసులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వీరిలో కీలక సూత్రధారితో పాటు అతడికి సహకరించిన వ్యక్తీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రజిత్ పతారియా సూత్రధారిగా ఓ ముఠా ఏర్పడింది. అదే ప్రాంతానికి చెందిన అశ్విన్ ఇతడికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరించాడు. ఓ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన వీళ్లు అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపారు. నగరానికి చెందిన మహిళకు వీరి నుంచి సాక్షి మెహతా పేరుతో వచ్చి రిక్వెస్ట్‌ను ఆమె యాక్సెప్ట్ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్ నడిచాయి. అలా ఆమెను ముగ్గులోకి దింపిన నేరగాళ్లు ఆన్లైన్ ట్రేడింగ్, పెట్టుబడులు, భారీ లాభాలంటూ మొత్తం రూ.1.2 కోట్లు తమ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేశారు. ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్ల ఆధారంగా ముందుకు వెళ్లింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్‌లలో గాలించిన బృందాలు ఇప్పటికే అజయ్ ఓజా, సుమిత్ వర్మ, రాహుల్, మహేష్, తరుణ్ ప్రజాపతి, బాలు చౌహాన్, సందీప్‌లను అరెస్టు చేశారు. వీరి విచారణ నేపథ్యంలోనే ఈ గ్యాంగ్ మొత్తానికి రజిత్ పతారియా సూత్రధారని, అతడి సహాయకుడు అశ్విన్ సైతం కీలక పాత్ర పోషించాడని తేలింది. దీంతో వీరిని భోపాల్‌లో అరెస్టు చేసిన అధికారులు సిటీకి తీసుకువచ్చారు. వీరిపై ఛత్తీస్‌గడ్‌లోనూ అనేక కేసులు నమోదై ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. -
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులంటూ ఆన్లైన్ మోసాలు
-
ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో టోకరా.. రూ.1.2కోట్లు స్వాహా
సాక్షి, సిటీబ్యూరో: ఫేస్బుక్ ద్వారా ఎర వేసి, ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టించి, భారీ లాభమంటూ నమ్మబలికి నగర మహిళ నుంచి రూ.1.2 కోట్లు కాజేసిన ముఠాలో ఇద్దరు నిందితుల్ని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశా రు. ఇరువురినీ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పట్టుకున్నామని, పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామ ని సంయుక్త పోలీసు కమిషనర్ అవినాష్ మహంతి తెలిపారు. నగరానికి చెందిన ఓ మహిళ వివరాలు తెలుసుకున్న సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ద్వారా రిక్వెస్ట్ పంపారు. సాక్షి మెహతా పేరుతో వచ్చి దాన్ని ఈమె యాక్సెప్ట్ చేయడంతో ఇరువురి మధ్యా చాటింగ్స్ నడిచాయి. తాను ఢిల్లీలోని వసంత్ కుంజ్‌లో ఉన్న కంపెనీ సెంట్రల్ ట్రేడ్ రీసెర్చ్‌లో షేర్ ట్రేడింగ్ విభాగంలో కన్సల్టెంట్ అంటూ సాక్షి నమ్మబలికింది. ఆపై బాధితురాలి ఫోన్ నంబర్ తీసుకుని పలుమార్లు మాట్లాడింది. ఆన్లైన్ ట్రేడింగ్ ద్వారా భారీ లాభా లు పొందవచ్చని చెప్పిన సాక్షి నగర మహిళతో డీమాట్ ఖాతాలు తెరిపించింది. ఆపై ప్రాథమికంగా రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టమని చెప్పిన సాక్షి ఆ మొత్తాన్ని తమ ఖాతాల్లో డిపాజిట్ చేయించుకుంది. కొన్ని రోజుల పాటు అందులో, ఇందులో ట్రేడింగ్ చేస్తున్నామని, భారీ లాభాలు వచ్చాయంటూ మాటలు చెప్పింది. ఓ రోజు కాల్ చేసిన ఆ కి‘లేడీ’ తమ వద్ద ఉన్న ట్రేడింగ్ ఖాతాలో ఉన్న మొత్తం రూ.4 కోట్లకు చేరిందని చెప్పింది. అది మీకు బదిలీ చేయాలంటే కంపెనీ నిబంధనల ప్రకారం ముందుగా తమకు రావాల్సిన బ్రోకరేజ్ చెల్లించాలని షరతు పెట్టింది. ఈ పేరుతో దాదాపు రూ.1.2 కోట్లు బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మోసం చేసింది. ఈ మేరకు బాధితురాలు సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ హరిభూషణ్ రావు నేతృత్వంలోని బృందం బ్యాంకు ఖాతాల వివరాలు, ఫోన్ నంబర్లను బట్టి ముందుకు వెళ్లింది. ఇలా భోపాల్‌కు చెందిన రాహుల్, మహేష్‌లు నిందితులని గుర్తించింది. అక్కడకు వెళ్లిన ప్రత్యేక బృందం ఇద్దరినీ అరెస్టు చేసి తీసుకువచ్చింది. ఈ ముఠాపై నగరంతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కలిపి మొత్తం మూడు కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. చదవండి: మైనర్లకు ‘ప్రేమ’ పాఠాలు.. ఆపై వీడియోలతో బెదిరింపులు -
డిజిటల్ వైపు.. కంపెనీల చూపు..
న్యూఢిల్లీ: కరోనా వైరస్ పరిణామాలతో కంపెనీల వ్యూహాలు గణనీయంగా మారిపోతున్నాయి. చాలా మటుకు సంస్థలు డిజిటల్ మాధ్యమం వైపు మళ్లడం లేదా ఇప్పటికే ఆన్లైన్లో ఉన్న పక్షంలో ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్వరూపాన్ని వేగంగా మార్చుకోవడం వంటి అంశాలపై దృష్టి పెడుతున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఇన్ఫోసిస్, యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, జెన్‌ప్యాక్ట్, విప్రో, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాజెక్టు లు దక్కించుకుంటూ ఉండటమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ మహమ్మారి అందరిపై ప్రభా వం చూపుతున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార సంస్థలు తమ సర్వీసులను, ఉత్పత్తుల విక్రయాలకు తక్షణం ఆన్లైన్ బాట పట్టాల్సిన అవసరాన్ని గుర్తించాయని విశ్లేషకులు తెలిపారు. చదవండి: తగ్గుతున్న కరోనా ప్రభావం వేగంగా వ్యూహాల అమలు.. ప్రస్తుత వ్యాపార కార్యకలాపాల్లో మార్పులు చేర్పులు చేసే దిశగా ఇన్ఫోసిస్‌కు అమెరికాలో రెండు భారీ డీల్స్ దక్కాయి. వీటిలో ఒకటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాన్‌గార్డ్‌ది కాగా మరొకటి ఇంధన రంగ దిగ్గజం కాన్ ఎడిసన్‌ది. కరోనా సంక్షోభం కారణంగా చాలా మటుకు క్లయింట్లు డిజిటల్ వ్యూహాలను మరింత వేగంగా అమలు చేయాలనుకుంటున్నారని ఇన్ఫోసిస్ సీఈవో సలిల్ పరేఖ్ ఇటీవల తెలిపారు. భారీ స్థాయిలో డిజిటల్ రూపాంతరం చెందేందుకు వాన్గార్డ్ అమలు చేస్తున్న ప్రణాళికలు ఇలాంటి ధోరణులకు నిదర్శనమని ఆయన చెప్పారు. అయిదేళ్ల పాటు జరగాల్సిన కొన్ని ప్రాజెక్టుల కాలవ్యవధిని కొంతమంది క్లయింట్లు ఏకంగా 18 నెలలకు కుదించేసుకున్నారని జెన్‌ప్యాక్ట్ వర్గాలు వివరించాయి. డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్కు సంబంధించి గత కొద్ది నెలలుగా ప్రస్తుత, కొత్త క్లయింట్లతో చర్చలు గణనీయ స్థాయిలో జరుగుతున్నాయని పేర్కొన్నాయి. చదవండి: అంత ‘స్పేస్’ వద్దు! వ్యయ నియంత్రణ చర్యలు... వచ్చే రెండు నుంచి నాలుగు క్వార్టర్ల పాటు వ్యాపార సంస్థలు ఖర్చులు తగ్గించుకోవడంపైనా, డిజిటల్‌కు మారడంపైనా దృష్టి పెడతాయని విశ్లేషకులు పేర్కొన్నారు. తదనుగుణంగానే ఐటీ బడ్జెట్లు కూడా ఉంటాయని తెలిపారు. దీంతో ఐటీ కంపెనీలకు భారీగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ డీల్స్ దక్కుతున్నాయని కన్సల్టెన్సీ సంస్థ ఎవరెస్ట్ గ్రూప్ వర్గాలు తెలిపాయి. ఇతరత్రా కారణాల కన్నా ప్రస్తుత పరిస్థితుల్లో డిజిటల్ ద్వారా ఖర్చులను తగ్గించుకోవాలన్నదే వ్యాపార సంస్థల లక్ష్యంగా ఉంటోందని పేర్కొన్నాయి. గత మూడు, నాలుగు నెలలుగా చూస్తే జెన్‌ప్యాక్ట్, ఇన్ఫోసిస్‌తో పాటు ఇతరత్రా టెక్ సర్వీసుల కంపెనీల క్లయింట్లలో ఎక్కువగా కన్జూమర్ గూడ్స్ తదితర రంగాల సంస్థలు త్వరితగతిన డిజిటల్ వైపు మళ్లేందుకు సేవల కోసం డీల్స్ కుదుర్చుకున్నాయి. యాక్సెంచర్, ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, కాగ్నిజెంట్ వంటి సంస్థలు 500 మిలియన్ డాలర్ల పైచిలుకు విలువ చేసే పలు ఒప్పందాలతో దూసుకెడుతున్నాయి. ఇప్పటిదాకా డిజిటలీకరణపై తగిన స్థాయిలో ఇన్వెస్ట్ చేయని సంస్థలు ప్రస్తుతం దాని ప్రాధాన్యతను గుర్తించి, ప్రధాన ఎజెండాగా మార్చుకుంటున్నాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
ట్రేడింగ్‌లో మోసాలకు పాల్పడిన ముగ్గురికి రిమాండ్
సాక్షి, వైఎస్సార్ కడప: ఆన్లైన్ ట్రేడింగ్‌లో 25 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కానీస్టెబుల్ ఈశ్వర్ మోసపోవడంతో రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అధిక లాభాలు గడించవచ్చనే ఆశతో కానిస్టేబుల్ ఈశ్వర్ అప్పు చేసిన ఆన్లైన్ ట్రేడింగ్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మోసపోయాడు. కానిస్టేబుల్ ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులకు ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో పట్టుబడ్డారు. దీంతో పీటీ వారెంటుతో నిందితులను పోలీసులు హైదరాబాద్ నుంచి రాజంపేటకు తీసుకువచ్చారు. నిందితుల్లో ఒకరూ చైనా దేశస్థుడు కాగా మరో ఇద్దరూ ఇండియాకు చెందిన హర్యానా వాసులుగా పోలీసులు గుర్తించారు. మూడు రోజుల క్రితం నందలూరు జేఎఫ్ఎం కోర్టులో నిందితులను ప్రవేశపెట్టగా కోర్టు వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. -
పురోగతి లేని ట్రేడ్ బ్రోకర్ కేసు
సాక్షి, రాజాం : జిల్లాను కుదిపేసిన ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసులో పురోగతి లేకుండా పోయింది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితులు జన స్రవంతిలో దర్జాగా తిరుగుతున్నారు. వీరిని పట్టుకోకుండా 18 నెలలుగా కేసు దర్యాప్తు పేరిట సీఐడీ పోలీసులు స్తబ్దుగా ఉండిపోయారు. దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పట్లో హడావుడి చేసిన పోలీసులను పక్కనబెట్టి, మరింత పారదర్శకంగా కేసు విచారణ చేపట్టేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించినా బాధితులకు న్యాయం చేకూరడం లేదు. సూత్రధారి దొరికితేనే.. సంతకవిటి మండలం మందరాడ గ్రామ వేదికగా బయటపడిన ట్రేడ్ బ్రోకర్ కేసు దర్యాప్తులో భాగంగా అప్పట్లో సివిల్ పోలీస్‌లు హడావుడి చేశారు. నెల రోజుల వ్యవధిలో కేసులో పలు కీలక అంశాలు సేకరించి పలువురిని అరెస్టు చేశారు. అనంతరం సీఐడీకి ఈ కేసు బదిలీ చేశారు. అప్పట్నుంచి కేసు దర్యాప్తు పేరిట నాన్చుతున్నారు. అప్పట్లో అధికార పార్టీ అండదండలతో గట్టెక్కిన ప్రధాన పాత్రధారులు, సూత్రధారులు హాయిగా ప్రజల్లో ఉండటం గమనార్హం. రోడ్డున పడ్డ బాధిత కుటుంబాలు.. ట్రేడ్ బ్రోకర్ వద్ద పెట్టుబడులు పెట్టిన వారిలో ఆందోళనకు గురై ఇద్దరు ఆకస్మికంగా మృతిచెందారు. వీరిలో సంతకవిటి మండలం శంకరపేట గ్రామానికి చెందిన దాసరి కన్నంనాయుడు కుటుంబ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా ఉంది. ఈయన కష్టసుఖాలను ఓర్చి గ్రామ పెద్దగా ఎదిగారు. ఎంతోమందికి న్యాయం చేయడంతోపాటు మోసగాళ్లకు బుద్ధి చెప్పారు. అటువంటి తనే చివరికి ట్రేడ్ బ్రోకర్ చేతిలో మోసపోయానని తెలుసుకుని గుండెపోటుకు గురయ్యారు. ఈయన పెట్టిన పెట్టుబడులకు ఎంతో కొంత వస్తుందని కుటుంబానికి ఏమాత్రం భరోసా రాలేదు. ఇదే మండలం మందరాడ గ్రామానికి చెందిన యడ్ల సూరీడమ్మ కూడా పెట్టుబడులు పెట్టింది. మనుమరాళ్లు వివాహం నిమిత్తం పెట్టిన నగదు మరి రాదని తెలుసుకుని మంచం పట్టి ఆస్పత్రి పాలైంది. చివరకు మృతి చెందింది. ఇదేవిధంగా మరి కొంతమంది మంచం పట్టారు. ఇంకా ఎంతోమంది తమ డబ్బులు వస్తాయని ఆశతో ఎదురు చూస్తున్నారు. 18 నెలలుగా గుండె దిటవు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. న్యాయం చేయాలని వేడుకోలు... అప్పటివరకూ అధిక వడ్డీలను కొంతమంది బ్రోకర్లుకు ఇచ్చి, బాగా పెట్టుబడులు వచ్చిన తర్వాత ట్రేడ్ బ్రోకర్ తన కార్యాలయాన్ని 2017 నవంబర్ 17న ఎత్తివేశాడు. అంతవరకూ ఆయనతో కలసిమెలసి, చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన పెద్దమనుషులు తమకేమీ తెలియదని చేతులెత్తేశారు. తొలుత ఈ వ్యాపారం రూ. 2 నుంచి 3 కోట్ల వరకూ మాత్రమే ఉంటుందని అందరూ భావించారు. బ్రోకర్ టంకాల శ్రీరామ్ కార్యాలయానికి తాళాలు వేయడంతో ఈ షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. సంతకవిటి పోలీస్ స్టేషన్లో బ్రోకర్ హామీలు రూపంలో ఇచ్చిన చెక్‌లతో కేసులు పెట్టగా మొత్తం రూ. 36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కోర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. మొత్తం రూ. 180 కోట్ల మేర పెట్టుబడులు ఉంటాయని అంచనాలు ఉన్నాయి. వీరంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ, టీడీపీ నేతల చుట్టూ తిరిగారు. ఫలితం కనిపించలేదు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతున్నారు. సీఐడీ డీఎస్పీ ఏమన్నారంటే.. ఈ విషయంపై సీఐడీ విశాఖ డీఎస్పీ ఎస్ భూషణనాయుడు వద్ద ప్రస్తావించగా ట్రేడ్ బ్రోకర్ కేసుపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులు రికవరీ, ప్రధాన పాత్రధారులు వివరాలు సేకరిస్తున్నామని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. -
చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్
అమెజాన్ ద్వారా ఆన్లైన్ విక్రయాలను ప్రారంభించిన మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని చేనేత ఉత్పత్తులకు ఆన్లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పించడం ద్వారా కార్మికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని జౌళి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. అంతర్జాతీయ ఆన్లైన్ విక్రయ సంస్థ అమెజాన్ ద్వారా ‘టెస్కో’ ఉత్పత్తుల విక్రయాలను ఆప్కోహౌస్లో శుక్రవారం ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పోచంపల్లి, నారాయణ్‌పేట్, గద్వాల్ తదితర ప్రాంతాల్లో చేనేత కార్మికులు తయా రుచేసిన ఉత్పత్తులను ఆన్లైన్లో ప్రదర్శించడం వలన మార్కెటింగ్ అవకాశాలు పెరుగుతాయన్నారు. దళారుల ప్రమేయం తగ్గడం ద్వారా, రాష్ట్రంలోని 1.20లక్షల మంది కార్మికుల ఉత్పత్తులకు మంచి డిమాండూ వస్తుందన్నారు. టెస్కో ఉత్పత్తుల కోసం ‘షాప్.తెలంగాణఫ్యాబ్రిక్స్.కాం’ వెబ్సైట్ సందర్శిం చవచ్చన్నారు. హస్తకళల విక్రయాల కోసం ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్‌ట్రేడింగ్ సత్ఫలితాలనిస్తుంద న్నారు. ఆధునిక ఉత్పత్తులు తయారు చేసేలా చేనేత కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. హ్యాండ్లూమ్స్ విభాగం డెరైక్టర్ ప్రీతీమీనా, జాయింట్ ఎండీ సైదా, టెస్కో జీఎం యాదగరి పాల్గొన్నారు. -
ఏడాదిలోపు ఆన్లైన్ ట్రేడింగ్ సదుపాయం
కర్నూలు : రాష్ట్రంలోని అన్ని మార్కెట్లలో మరో ఏడాదిలోపు ఆన్లైన్ ట్రేడింగ్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డెరైక్టర్ ఇస్రాద్ అహ్మద్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఆయన 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో మార్కెటింగ్ శాఖ, పౌరసరఫరాల సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఉల్లి కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి వివిధ జిల్లాల్లోని 11 వ్యవసాయ మార్కెట్ కమిటీలలో ఆన్లైన్ ట్రేడింగ్‌ను అమలు చేస్తామన్నారు. కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని, హిందూపురం, కళ్యాణదుర్గం, కడప, గుంటూరు దుగ్గిరాళ్ల, ఏలూరు, అనకాపల్లి, గూడూరు, మార్కెట్లలో ఆన్లైన్ ట్రేడింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దశలవారీగా ఏడాదిలోపు రాష్ట్రంలోని అన్ని మార్కెట్లను ఆన్లైన్ ట్రేడింగ్ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. ట్రేడర్స్ లెసైన్స్ విధానంలోనూ సమూల మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలోనే ట్రేడింగ్ లైసన్స్లు ఇస్తారని, దీని ద్వారా దేశంలో ఎక్కడి నుంచైనా ఆన్లైన్ ద్వారా రాష్ట్రంలోని ఏ మార్కెట్లోనైనా వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చన్నారు. 2015-16లో మార్కెటింగ్ శాఖ ఒక శాతం ఫీజు ద్వారా రూ.500 కోట్లు ఆదాయం సాధించాలని లక్ష్యంగా ఎంచుకుందన్నారు. సబ్సిడీ ఉల్లిని రూ.20ల ప్రకారం పంపిణీ చేయడానికి కర్నూలు మార్కెట్లో తగిన మేర ఉల్లి లభించకపోతే కర్ణాటకలో కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. -
అప్పులు తీర్చడానికి మద్యం అక్రమ రవాణా: కంప్యూటర్ ఇంజనీర్ అరెస్టు
అతడో కంప్యూటర్ ఇంజనీర్. చేస్తున్న ఉద్యోగానికి తోడు డబ్బు సంపాదన కోసం ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడు. అందులో 7 లక్షల నష్టం వచ్చింది. దాన్ని పూడ్చుకోడానికి మద్యం అక్రమ రవాణాలోకి దిగాడు! చివరకు పోలీసులకు చిక్కాడు!! ఢిల్లీ నుంచి హర్యానాకు అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్న అతగాడిని పోలీసులు అరెస్టు చేశారు. వినోద్ అలియాస్ భోలు (25) హర్యానా నివాసి. 2010 సంవత్సరంలో అతడు ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ఈమధ్యకాలంలో అతడు మద్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అరెస్టు చేశారు. తాను గత రెండేళ్లుగా హర్యానా నుంచి ఢిల్లీకి మద్యం రవాణా చేస్తున్నట్లు వినోద్ పోలీసులకు తెలిపాడు. గతంలో తాను ఆన్లైన్లో వెండి ట్రేడింగ్ చేసేవాడినని, అందులో ఏడు లక్షల రూపాయల నష్టం రావడంతో అప్పులు తీర్చడానికి ఇలా మద్యం అక్రమ రవాణా మార్గాన్ని ఎంచుకున్నానని అతడు చెప్పినట్లు అదనపు పోలీసు కమిషనర్ (క్రైం బ్రాంచి) రవీంద్ర యాదవ్ తెలిపారు. మద్యం రవాణా చేస్తూ ఏదైనా వాహనం పట్టుబడితే దాన్ని విడిపించుకోవడం అసాధ్యమని.. ఎప్పుడూ ఫైనాన్స్ చేసిన వాహనాలనే ఉపయోగించేవాడు. గతంలో 2011లో కూడా మద్యం రవాణా కేసులో అరెస్టయ్యాడు. బాగా అర్ధరాత్రిపూట మాత్రమే ప్రయాణాలు చేసేవాడని, కొన్నిసార్లు హర్యానా తిరిగి వెళ్లేటప్పుడు దారిలో ప్రయాణికుల నుంచి డబ్బు తీసుకుని ఎక్కించుకునేవాడని పోలీసులు తెలిపారు. కొన్నాళ్ల తర్వాత అలా ఎక్కించుకున్న ప్రయాణికులను దోచుకోవడం కూడా మొదలు పెట్టాడట!! అతడితో పాటు ఇంకా ఎవరెవరు ఈ గ్యాంగులో ఉన్నారో అందరినీ అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
ఆన్లైన్లో పసుపు ట్రేడింగ్‌పై సీబీఐ విచారణకు ఎంపీ డిమాండ్
నేషనల్ కమోడిటీస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజిలో ఆన్లైన్లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్‌లో అక్రమాలు చోటుచేసుకున్నాయని, వాటిపై సీబీఐ విచారణ జరిపించాలని తమిళనాడుకు చెందిన ఓ ఎంపీ డిమాండ్ చేశారు. తమిళనాడులోని ఎండీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి ఈ మేరకు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఎన్.సి.డి.ఇ.ఎక్స్.లో జరుగుతున్న పసుపు ట్రేడింగ్‌లో చాలా అక్రమాలున్నాయని ఆయన ఆరోపించారు. అసలు రైతులకు తగిన ధర రానందువల్ల పసుపును వెంటనే ఆన్లైన్ ట్రేడింగ్ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. పసుపు అభివృద్ధి బోర్డును ఏర్పాటుచేసి, కనీసం క్వింటాలుకు 9వేల రూపాయల కనీస ధర నిర్ణయించాలని ప్రధానమంత్రిని గణేశమూర్తి కోరారు. అఖిలభారత పసుపు రైతుల సంఘాల సమాఖ్య చైర్మన్ పి.కె. దైవసిగమణి కూడా పసుపును ఫ్యూచర్స్ ట్రేడింగ్ నుంచి మినహాయించాలని కోరారు.