అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక | Rs 22000 Crore Online Trading Scam Busted In Assam CM Issues Warning | Sakshi
Sakshi News home page

అస్సాంలో రూ. 22 వేల కోట్ల భారీ మోసం.. సీఎం హెచ్చరిక

Published Wed, Sep 4 2024 10:32 AM | Last Updated on Wed, Sep 4 2024 11:04 AM

Rs 22000 Crore Online Trading Scam Busted In Assam CM Issues Warning

రోజురోజుకు ఆన్‌లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. పోలీసులు, అధికారులు ఎంత అవగాహన కల్పించినా, మోసపోయే వాళ్లు పోతూనే ఉన్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలంటూ ఆశచూపి లక్షలాది రూపాయలను ముంచేసి మోసం చేస్తున్న కేటుగాళ్ల ఆగడాలు ఇంకా మితిమీరిపోతున్నాయి. తాజాగా ఇలాంటి ఓ భారీ  ఆన్‌లైన్‌ స్కామ్‌​ అస్సాంలో వెలుగుచూసింది

రాష్ట్ర పోలీసులు రూ. 22 వేల కోట్ల భారీ ఆర్థిక కుంభకోణాన్ని గుట్టురట్టు చేశారు.  ప్రజల సొమ్మును రెట్టింపు చేస్తామంటూ ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడుల పేరిట మోసగాళ్లు ఈ సొమ్మును సేకరించారు.

ఈ కేసులో దిబ్రూఘఢ్‌కు చెందిన 22 ఏళ్ల ఆన్‌లైన్ వ్యాపారి విశాల్ ఫుకాన్, గౌహతికి చెందిన స్వప్నిల్ దాస్ అనే ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అయితే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ కుంభకోణంలో మరికొంతమందిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.

వ్యాపారవేత్త అయిన విశాల్‌ ఫుకాన్‌ తన పరపతిని ఉపయోగించి పెట్టుబడిదారులకు 60 రోజుల్లో వారి పెట్టుబడులపై 30 శాతం అధిక లాభాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు నాలుగు నకిలీ కంపెనీలను స్థాపించి అస్సామీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి పలు ఆస్తులు సంపాదించినట్లు పేర్కొన్నారు.

దిబ్రూగఢ్‌లోని ఆయన ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహించి అనేక కోట్ల కుంభకోణానికి సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఫుకాన్ నెట్‌వర్క్‌తో కనెక్ట్ అయిన అస్సామీ కొరియోగ్రాఫర్ సుమీ బోరా కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

మరోవైపు మోసపూరిత ఆన్‌లైన్ స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ప్రజలను హెచ్చరించారు. తక్కువ సమయంలో డబ్బును రెట్టింపు చేస్తామనే మాటలు అబద్దమని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement