జీవన్మరణ సమస్యగా మారింది: హిమంత
రాంచీ: జనాభా సమీకరణాల్లో మార్పు అస్సాంలో అతిపెద్ద సమస్యగా మారిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. ‘అస్సాంలో 1951లో ముస్లింల జనాభా 12 శాతం మాత్రమే. కానీ ఇప్పుడది 40 శాతానికి చేరుకుంది. నాకిది రాజకీయ సమస్య కాదు. జీవన్మరణ సమస్య.
మనం ఎన్నో జిల్లాలను కోల్పోయాం’ అని హిమంత వ్యాఖ్యానించారు. 2021 జూన్‌లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక హిమంత మాట్లాడుతూ.. ‘జనాభా విస్పోటం అస్సాం ముస్లింలలో పేదరికానికి, ఆర్థిక అసమానతలకు మూలకారణం’ అని అన్నారు. రాంచీలో బుధవారం బీజేపీ సమావేశంలో మాట్లాడుతూ జార్ఖండ్ గిరిజన ప్రాంతాల్లో బంగ్లా చొరబాటుదారుల సంఖ్య పెరుగుతోందన్నారు. జార్ఖండ్‌ను సీఎం హేమంత్ మినీ బంగ్లాదేశ్‌గా మార్చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment