దిస్‌పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
నేవీ, ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.
అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన.
ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే!
Comments
Please login to add a commentAdd a comment