divers
-
అసోం: ఇంకా బొగ్గు గనిలోనే కార్మికులు!
దిస్పూర్: అసోంలోని బొగ్గుగని ప్రమాదంలో రెండు రోజులు గడిచినా.. ఇంకా కార్మికుల జాడ కానరావడం లేదు. ఈ క్రమంలో ఈ ఉదయం గని నుంచి ఓ మృతదేహాన్ని గజ ఈతగాళ్లు బయటకు తెచ్చాయి. దీంతో.. మిగిలిన కార్మికుల ఆచూకీపై కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. అయితే అధికారులు మాత్రం గాలింపు చర్యలను ముమ్మరం చేయించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం (జనవరి 7) అసోం దిమాహసావో జిల్లాలోని ఓ బొగ్గుగనిలోకి సోమరాత్రి ఒక్కసారికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. సుమారు 100 ఫీట్ల నీరు గనిలోపల ముంచెత్తింది. దీంతో గనిలో ఉన్న వారిలో ముగ్గురు జలసమాధై కనిపించారు. మరికొంత మంది లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.నేవీ, ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్లు సహాయక చర్యల్లో(Rescue Operations) పాల్గొంటున్నాయి. మరోవైపు.. విశాఖపట్నం నుంచి వచ్చిన డైవర్స్ బృందం మైన్ వద్ద రెక్కీ నిర్వహించి, ఆపై రంగంలోకి దిగింది. అయితే గనిలో ప్రతికూల పరిస్థితులు ఉండడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఒకానొక టైంలో తొలుగు గుర్తించిన మూడు మృతదేహాలను బయటకు తీయడం కూడా కష్టమైంది. గని నుంచి నీటిని బయటకు పంపి.. సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.అయితే ప్రమాద సమయంలో లోపల 15 మంది కార్మికులు ఉండొచ్చనే ప్రచారం నడుస్తోంది. అయితే అధికారులు మాత్రం తొమ్మిది మంది పేర్లను మాత్రమే ప్రకటించారు. వీళ్లులో ఒకరు ఈ ఉదయం మృతదేహాంగా బయటకు వచ్చారు. మిగిలినవాళ్ల ఆచూకీ తెలియాల్సి ఉంది. ఈ కార్మికులు అసోం, పశ్చిమ బెంగాల్, నేపాల్‌కు చెందిన వాళ్లుగా గుర్తించారు. గనిలో సుమారు 340 ఫీట్ల లోపల వాళ్లు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.సదరు గనికి అనుమతులు లేవని తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఎం హిమంత బిస్వ శర్మ(Himanta Biswa sharma) స్వయంగా ప్రకటించారు. ఘటనకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఒకరిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించారాయన. అలాగే రెస్క్యూ ఆపరేషన్‌లో కోల్‌మైన్ సహకారం కోసం కేంద్ర బొగ్గు గనుల శాఖా మంత్రి కిషన్‌రెడ్డి తోనూ మాట్లాడినట్లు తెలిపారాయన. ఇదీ చదవండి: ముగ్గురు పోరాడినా.. పోటీ ఇద్దరి మధ్యే! -
విడాకులు తీసుకున్న నటి.. నేను సరైన పనే చేస్తున్నా
బాలీవుడ్లో బుల్లితెర నటి, యూట్యూబ్ వ్లాగర్‌గా చారు అసోపా మంచి గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్ టాప్ హీరోయిన్ సుష్మితా సేన్ బ్రదర్ అయిన రాజీవ్ సేన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. జూన్ 9, 2019న గోవాలో వీరి వివాహం ఘనంగా జరిగింది. 2021లో వారికి పాప జన్మించడంతో జియానా అని పేరుపెట్టుకున్నారు. వారి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో జూన్ 8న విడాకులు తీసుకున్నారు. తాజాగా తన మాజీ భర్త రాజీవ్ సేన్ గురించి తను మొదటి వీడియో షేర్ చేసింది. ఆమె యూట్యూబ్‌లోని తన వ్లాగ్‌లో విడాకుల కోసం కోర్టుకు వెళ్లే ముందు తన ఆలోచనలు ఎలా ఉన్నాయో పంచుకుంది. (ఇదీ చదవండి: వైరల్ అవుతున్న రకుల్ డ్రెస్.. అతను పట్టుకోవడంతో..!) ఆ వీడియోలో విడాకుల కోసం కోర్టుకు వెళ్తున్న ప్పుడు తీసిన సన్నివేశాలను ఇలా పంచుకుంది. 'నేను కొంచెం ఆందోళనగా ఉన్నాను, నేను సరైన పని చేస్తున్నానని నాకు తెలుసు, కానీ ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ అదే ఆందోళనను అనుభవిస్తారని భావిస్తున్నాను. విడాకుల ద్వారా...రాజీవ్ ఎల్లప్పుడూ జియానా తండ్రిగా ఉంటాడు. అతను ఎప్పుడు కావాలంటే అప్పుడు జియానాను కలుసుకోవచ్చు'. అని తెలిపింది. ఆమె వ్లాగ్పై పలువురు నెటిజన్లు మద్దతుగా నిలిచారు. జీవితంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదర్కొనేందుకు సిద్దంగా ఉండాలని వారు కామెంట్స్ చేశారు. View this post on Instagram A post shared by Charu Asopa (@asopacharu) (ఇదీ చదవండి: ఆ సినిమాతోనే మా ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది: తమన్నా) -
షార్క్ చేపతో ముఖాముఖి షూటింగ్: షాకింగ్ వైరల్ వీడియో!!
షార్క్ చేపలు ఎంత ప్రమాదకరమైనవో తెలిసిందే. అయితే ఈ షార్క్ చేపలను వీడియో తీసేటప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. నిజానికి వాటికి తెలియకుండానే వీడియో తీస్తారు గానీ నేరుగా తీసే ధైర్యం మాత్రం చేయరు. అలాంటిది ఈ వ్యక్తి ఏకంగా షార్క్ చేపను నేరుగా కొన్ని నిమిషాల పాటు వీడియో తీశాడు. అసలు విషయంలోకెళ్లితే...డేవిడ్ షెర్రర్ అనే చేపల పట్టే వ్యక్తి నార్త్ కరోలినా సముద్రపు ఒడ్డున డైవింగ్ చేస్తూ ఒక అద్భుతమైన తెల్ల షార్క్ చేప ఫుటేజ్‌ని తీశాడు. అయితే అతను ఆ షార్క్ చేపను చాలా దగ్గర నుంచి(ముఖాముఖి) వీడియో తీశాడు. ఒకనొక దశలో ఆ చేప అతనికి దగ్గరగా సమీపించడమే కాక చేతిలో ఉన్న గన్ని చూసి తనను తాను రక్షించుకునే నిమిత్తం వెనుదిరుగుతుంది కూడా. ఎంతోమంది ఈ షార్క్ చేపలను వీడియో తీశారు గానీ ఇలా షార్క్ చేపకు అతి చేరువలో నేరుగా వీడియో చిత్రీకరించలేదు. అతని అదృష్టమో ఏమో గానీ అతనిపై మాత్రం దాడిచేయలేదు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింత తెగ వైరల్ అవుతుంది. మీరు కూడా వీక్షించండి. -
విచిత్రం: పోయిందనుకున్న బంగారు ఉంగరం దొరికింది!
వాషింగ్టన్: ప్రతి ఒక్కరు తమ జీవితంలో కొన్నివస్తువులను చాలా అపురూపంగా చూసుకుంటారు. కానీ పొరపాటున ఆ వస్తువును ఎక్కడైనా కోల్పోతే.. ఇంకేమైనా ఉందా? ఎవరు ఓదార్చినా ఆ బాధ తగ్గేది కాదు. కానీ అదే వస్తువు మళ్లీ కళ్లముందు ప్రత్యక్షమైతే.. ఆ ఆనందానికి అవధులు ఉండవు. ఇలాంటి సంఘటనే అమెరికాలో చోటుచేసుకుంది. పాపిని అనే వ్యక్తి సరదాగా కాలిఫోర్నియాలోని నదిలో ఈతకు వెళ్లాడు. ఈ క్రమంలో అతని వేలికున్న వెడ్డింగ్ రింగ్ జారిపోయి నీటిలో పడిపోయింది. పాపం.. దానికోసం ఎంతో వెతికాడు. కానీ ఆ ఉంగరం దొరకలేదు. దీంతో చాలా దిగులు పడ్డాడు. కానీ, ఆ ఉంగరం ఎప్పటికైనా తనకు దొరుకుతే బాగుండని ఆశపడేవాడు. విడ్డూరంగా అతను మనసులో పెట్టుకున్న నమ్మకమే నిజమైంది. డైపర్ కర్ల్ బ్లే అనే వ్యక్తి అదే నదిలో ఈదుతున్నప్పుడు అతనికి ఒక బంగారు ఉంగరం దొరికింది. దీన్ని అతడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్చేశాడు. ఈ పోస్ట్ చూసిన పాపిని తెగ సంబరపడిపోయి.. వెంటనే కర్ల్ బ్లేను కలిశాడు. ఆ ఉంగరం తన పెళ్లినాటిదని, దాన్ని ఆ నదిలో పోగొట్టుకున్నానని అతడితో చెప్పాడు. ఉంగరాన్ని దొరికిన విషయాన్ని సోషల్ మీడియాలో పంచున్నందుకు కర్ల్ బ్లేకు ధన్యవాదాలు తెలిపాడు. పొగొట్టుకున్న తన ఉంగరం దొరకడంతో పాపిని ఇప్పటికీ తన కళ్లను తాను నమ్మలేకపోతున్నాడు. కాగా, కర్ల్ బ్లేకి చిన్నప్పటి నుంచి ఈత కొట్టడం అలవాటు. ఈ క్రమంలో నీటిలో ఏదైనా వస్తువు దొరికితే వాటిని సోషల్ మీడియాలో పంచుకొని దాని నిజమైన యజమానికి అవి చేరేలా చూస్తూ ఉంటాడు. -
మాస్క్ ధరించమన్నందుకు ఉబర్ డ్రైవర్‌పై మహిళ దాడి
వాషింగ్టన్: కరోనా సమయంలో మాస్క్ ధరించడాన్ని ప్రభుత్వాలు తప్పనిసరి చేశాయి. కొంతమంది ముఖానికి మాస్క్ ధరించడాన్ని విధిగా పాటిస్తున్నారు. మరికొంత మంది మాస్క్ వేసుకోవాడన్ని లేక్క చేయకుండా యథేచ్ఛగా తిరుగుతున్నారు. తాజాగా ఓ ఉబర్ డైవర్ తన కారులో ప్రయాణిస్తున్న మహిళను మాస్క్ ధరించాలని కోరగా ఆమె అతనిపై దాడికి దిగి, అసభ్యంగా ప్రవర్తించింది. ఈ ఘటన అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కోలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుభాకర్ ఖాడ్కా అనే ఉబర్ డ్రైవర్ ఆదివారం బేవ్యూ ప్రాంతంలో ముగ్గురు మహిళలను తన కారులో ఎక్కించుకున్నాడు. కారులో కూర్చున్న ముగ్గురు మహిళల్లో ఓ మహిళ మాస్క్ ధరించలేదు. దీంతో ఉబర్ డ్రైవర్ సదరు మహిళను మాస్క్ ధరించాలని కోరాడు. దీంతో ఆ మహిళ కోపంగా డ్రైవర్ మీదకు వెళ్లుతూ కావాలని దగ్గటం ప్రారంభించింది. అదీకాక తీవ్రంగా అరుస్తూ అతని మాస్క్, మొబైల్ ఫోన్‌ను లాక్కోవడానికి ప్రయత్నించింది. ఆ మహిళలు తమ గమ్యస్థానంలో కారు దిగి వెళ్లిపోయారు. ఈ ఘటనపై స్పందించిన ఉబర్ సంస్థ ఇక సదరు మహిళకు ఉబర్ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. డ్రైవర్ సుభాకర్ ఖాడ్కా మాట్లాడుతూ.. ఆ మహిళ కారులో తనపై పెప్పర్ స్ప్రే చల్లిందని తనకు శ్వాస తీసుకోవాడనికి చాలా ఇబ్బంది అయినట్లు తెలిపాడు. తనది నేపాల్దేశామని, ప్రయాణికులతో ఎప్పుడూ దురుసుగా ప్రవర్తించలేదని తెలిపాడు. తనది నేపాల్ దేశమని ఆ మహిళలు వివక్ష చూపి, దాడికి చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. చదవండి: వ్వాట్! ఏమన్నారూ.. అనేముందు ఆలోచించాలి -
సూపర్ హీరో... రిచర్డ్ స్టాన్టన్
చియంగ్ రాయ్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన థాయ్‌లాండ్ గుహ ఘటనలో బ్రిటన్ డైవర్ రిచర్డ్ స్టాన్టన్ సూపర్ హీరోగా అందరి అభిమానాలు అందుకుంటున్నారు. కోచ్ సహా ‘వైల్డ్ బోర్స్’ సాకర్ విద్యార్థుల బృందం.. హఠాత్తుగా వచ్చిన వరద కారణంగా గుహ లోపల చిక్కుకున్న ప్రాంతా న్ని మొదటగా గుర్తించిన స్టాన్టన్.. సహాయక చర్యలు ముమ్మరం కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈయనిచ్చిన సమాచారం ఆధారంగానే వీరిని కాపాడిన ఆపరేషన్ జోరందుకుంది. బ్రిటన్ సహా వివిధ దేశాల డైవర్లు చొరవతీసుకుని మూడ్రోజులపాటు తీవ్రంగా శ్రమించి చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. ఆపరేషన్ పూర్తయ్యాక థాయ్‌లాండ్ నుంచి బయలుదేరిన స్టాన్టన్ శుక్రవారం లండన్ చేరుకున్నారు. ప్రమాదం జరిగినప్పటినుంచి.. బాధితులంతా బయటకు వచ్చేంతవరకు జరిగిన రోమాంచిత ఘటనలను ఆయన వివరించారు. గుర్తించేందుకే ఆలస్యమైంది! జూన్ 23న అందరిలాగే థాయ్ పాఠశాల విద్యార్థుల ఫుట్‌బాల్ బృందం, కోచ్ ఎక్కాపోల్ చాంథవాంగ్తో కలిసి థామ్ లువాంగ్ గుహలను సందర్శించేందుకు వెళ్లింది. ఇంతలో హఠాత్తుగా గుహను వరద ముంచేయడంతో కోచ్ సహా సాకర్ చిన్నారుల బృందం తప్పించుకునే ప్రయత్నంలో గుహలోపల చిక్కుకుపోయారు. వీరిని కాపాడాలని థాయ్ అధికారులు, డైవర్లు ప్రయత్నించినప్పటికీ.. పిల్లలను గుర్తించడమే పెద్ద సవాల్‌గా మారిందని స్టాన్టన్ తెలిపారు. ఘటన జరిగిన 10 రోజుల వరకు వీరంతా ఎక్కడున్నారో తెలుసుకోలేకపోయామన్నారు. ఆ తర్వాత లోయలో దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఓ భారీ రాయి వెనక వీరున్నట్లు తను గుర్తించినట్లు ఆయన తెలిపారు. లోయలో చిన్నారులను తొలిసారి చూసినపుడు ఒక్కరొక్కరిని లెక్కబెడుతూ.. 13 మంది ఉన్నారని నిర్ధారించుకున్నాకే హమ్మయ్య అనిపించింది’ అని స్టాన్టన్ వెల్లడించారు. -
వైట్ షార్క్‌ల కోసం.. డైవర్ల సాహసం..!!
మెక్సికో సిటీ : పసిఫిక్ మహా సముద్రంలో డైవర్స్ సాహసం చేశారు. వైట్ షార్క్‌పై పరిశోధన కోసం బోనులో సముద్రం అడుగుకు వెళ్లారు. వారిని చూసిన షార్క్ ఒక్కసారిగా బోను వైపు దూసుకొచ్చింది. పలుమార్లు బోను చుట్టూ వేట కోసం తిరిగింది. ఇలా ఒక్క షార్క్ మాత్రమే కాదు.. మూడు రకాల వైట్ షార్క్స్‌పై డైవర్స్ పరిశోధనలు చేశారు. మెక్సికో సిటీకి కొద్దిదూరంలో గల గ్వాడాలుపే ద్వీపంలో కనిపించిన రెండు టన్నులు బరువున్న వైట్ షార్క్ మాత్రం భిన్నంగా ప్రవర్తించిందని పరిశోధకుల్లో ఒకరైన జాన్ చెప్పారు. బాగా లోతైన ప్రదేశాలకు వెళ్లి బోటు నుంచి కేజ్‌లను 40 అడుగుల లోతుకు దించినట్లు తెలిపారు. ఇలా మూడు రోజుల పాటు వైట్ షార్క్స్ కోసం అన్వేషణ కొనసాగినట్లు వివరించారు. 20 అడుగులు పొడవున్న ఓ ఆడ షార్క్ తనవైపునకు దూసుకొచ్చినట్లు చెప్పారు. ఈ సీజన్లో డైవర్స్ చేసిన పరిశోధనల్లో ఇదే అతిపెద్ద షార్క్ అని మాత్రం చెప్పగలనని అన్నారు. గ్రేట్ వైట్ షార్క్స్కు ప్రత్యర్థులపై మెరుపుదాడి చేసే శక్తి ఉంటుంది. కన్నుమూసి తెరచేలోగా లక్ష్యాన్ని అవి చేధిస్తాయి. సీల్స్ చేపలు అధికంగా ఉండే గ్వాడాలుపే ద్వీపంలో వైట్ షార్క్స్ అత్యధికంగా నివసిస్తున్నాయి. -
కూలిన హెలికాప్టర్...ఇద్దరు మృతి
న్యూయార్క్ : అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికన్ విమానయాన అధికారి ఒకరు మాట్లాడుతూ యూరోకోప్టర్ ఏఎస్350 విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు రూజ్వెల్ట్ ఐలాండ్‌కు ఉత్తరంగా ఉన్న నదిలో పడిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు, నౌకాశ్రయ సిబ్బంది ఘటనా స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
వినాయక నిమిజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేసే క్రమంలో ఓ వ్యక్తి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కొమ్మమూరు ఛానల్లో వినాయకులను నిమజ్జనం చేస్తున్న క్రమంలో పెదనందిపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గజ ఈతగాళ్లు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
ఒలింపిక్స్‌లో నగ్నంగా డైవింగ్ క్రీడలు?
రి డిజెనీరో: ఒలింపిక్స్‌లో పురుషుల డైవింగ్ ఈవెంట్ చాలా పాపులర్. గాలిలో గింగిరాలు తిరుగుతూ క్రీడాకారులు చేసే అద్ధుమైన డైవింగ్ విన్యాసాలను చూసేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. తాజాగా రియోలో జరిగిన డైవింగ్ ఈవెంట్‌ను కూడా ప్రేక్షకులు చాలామంది కళ్లప్పగించకుండా తిలకించారు. ఈ ఈవెంట్‌ను తిలకించిన చాలామందికి డైవర్స్ నగ్నంగా పాల్గొన్నారా అనే డౌటు వచ్చింది. కండలు తిరిగిన దేహాలతో ఒంటిపై లోదుస్తులు మాత్రమే ధరించే డైవర్స్ పోటీల్లో పాల్గొనే విషయం తెలిసిందే. అయితే, సరిగ్గా లోదుస్తులు ధరించే ప్రాంతంలోనే వ్యూహాత్మకంగా స్కోరు బోర్డును చానెళ్ల చూపించడంతో.. సదరు ఆటగాళ్లు ఒంటిపై నూలుపోగులేకుండా ఈ పోటీల్లో పాల్గొన్నారా? వారి నగ్నత్వాన్ని కవర్ చేసేందుకే ఆ ప్రాంతంలో స్కోరుబోర్డును ఇచ్చారా? అంటూ పలువురు ట్వీట్లతో సందేహాలు వ్యక్తం చేశారు. వీరికి అమెరికా నటి కిరా కొసారిన్ కూడా వీరికి కోరస్ కలిపింది. 'ఒలింపిక్స్‌లో డైవింగ్ నాకు ఎందుకిష్టమంటే.. టీవీ స్క్రీన్‌లో బాటమ్‌లైన్‌లో చూపించే స్కోరుబోర్డు వల్ల ఆటగాళ్లంతా నగ్నంగా పాల్గొంటున్నట్టు అనిపించి గిలిగింతలు పెడుతుంది' అని ఆమె ట్వీట్ చేసింది. -
కృష్ణా నదిలో నలుగురు యువకులు గల్లంతు
కృష్ణా జిల్లా కోడూరు మండలం విశ్వనాథపల్లి వద్ద శుక్రవారం ఉదయం కృష్ణా నదిలో మునిగి నలుగురు బాలురు గల్లంతయ్యారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు .. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన కొందరు కుటుంబాలతో కలసి శుక్రవారం విశ్వనాథపల్లిలోని అద్దంకి నాంచారమ్మను దర్శించుకునేందుకు ఆలయం వద్దకు వచ్చారు. వారంతా సమీపంలోని కృష్ణా నదిలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. అయితే, నీళ్ల లోతు తెలియక లోపలికి దిగిన మైలా నాంచారయ్య కుమారుడు జయకృష్ణ(18), తోలుసూరి బాలయ్య కుమారుడు నాగరాజు(14), ఆరజాల శ్రీను కుమారుడు శ్రీకాంత్(16), ముత్తిపల్లి నాంచారయ్య కుమారుడు పవన్‌కుమార్(16) మునిగిపోయారు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని మత్స్యకారుల సాయంతో వారి కోసం గాలిస్తున్నారు. -
ఎయిర్ ఏషియా మృతదేహాల కోసం వేట
జకర్తా: ఎయిర్ ఏషియా విమానం ప్రమాదంలో మరణించినవారి మృతదేహాలను వెలికితీసేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సోమవారం వాతావరణం అనుకూలించడంతో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. విమానం శకలాలు తేలిన ప్రాంతంలో గజ ఈతగాళ్ల బృందాన్ని రంగంలోకి దించారు. ఇందుకోసం ఐదు నౌకలను అందుబాటులో ఉంచారు. విమానంలోని బ్లాక్ బాక్స్‌ను గుర్తించగల పరికరాలను నౌకల్లో అమర్చారు. గజ ఈతగాళ్లతో సాధ్యంకాకపోతే సముద్రంలో వస్తువులను గుర్తించగల అధునాతన పరికరాలను ఉపయోగిస్తామని సహాయక చర్యలకు నేతృత్వం వహిస్తున్న సుప్రియాడి తెలిపారు. వారం క్రితం ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళ్తున్న విమానం జావా సముద్రంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. విమానంలో ఉన్న 162 మంది మరణించారు. ఇప్పటివరకు 34 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఆదివారం గజ ఈతగాళ్లు ప్రమాద ఈ ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించినా వాతావరణం అనుకూలించకపోవడంతో సాధ్యపడలేదు. -
తీస్తున్న కొద్దీ మద్యం
అలమండ(జామి), న్యూస్‌లైన్ : వెతుకుతున్నకొద్దీ మద్యం బాటిళ్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. మండలంలోని అలమండ విజయసీతారామరాజు చెరువు గర్భంలో సుమారు 1500గోవా మద్యం బాటిళ్లను గజ ఈతగాళ్లు, ఎక్సైజ్ సిబ్బంది గురువారం వెలికి తీసిన విషయం విదితమే. శుక్రవారం కూడా ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీధర్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం మరో 150 మద్యం బాటిళ్లు లభ్యమయ్యాయి. మొత్తం 1,650 బాటిళ్లు బయటపడినట్లు అసిస్టెంట్ సూపరింటెండెంట్ కె.వెంకటరామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. చేపల పెంపకం కోసం చెరువును లీజుకు తీసుకున్న వ్యక్తిపైన, మరికొంతమందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు వివరించారు. గతంలో ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురు వ్యక్తులను కూడా విచారణ జరుపుతున్నామని తెలిపారు. రాజానవానిపాలెంలో.. వ్యవసాయ బావిలో... కొత్తవలస : మండలంలోని కొత్తవలస మేజర్ పంచాయతీ శివారు రాజానవానిపాలెంలో ఎం.అప్పలనాయుడుకు చెందిన మామిడితోటలో గోవా మద్యం ఉన్నట్లు స్థానిక ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గుర్తించారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయ బావిలో మద్యం సీసాలు ఉన్నాయని, కొంతమంది అప్పుడప్పుడు వీటిని తీసుకుని తాగుతున్నారని ఆ నోటా ఈ నోటా వినిపించడంతో ఎక్సైజ్ పోలీసులు రంగంలోకి దిగారు. ఈ బావిలో సుమారు పది అడుగుల లోతు మేరకు నీరు ఉంది. ముందుగా ఎస్.కోట ఎక్సైజ్ కానిస్టేబుల్ జైరామ్‌నాయుడు బావిలో దిగి మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారు. తొలుత ఆయన ఆరు మద్యం సీసాలను బయటకు తీశారు. దీంతో రెండు కిరోసిన్ ఇంజిన్లు రప్పించి నీరు పైకి తోడించారు. బాటిళ్లకు ఉన్న పై కప్పు రంగును బట్టి, అలమండ చెరువులో దొరికిన మద్యం.. ఈ మద్యం ఒక్కటేనని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం రాత్రి 8 గంటల వరకూ బావిలోఉన్న నీటిని తోడారు. ఇంకా నీరు ఉండడంతో అప్పటికి విరమించుకున్నారు. శనివారం ఉదయం మళ్లీ ప్రారంభించనున్నారు. అలాగే మండలంలోని చినమన్నిపాలెం సమీపంలో ఉన్న చెరువులో కూడా ఇటువంటి మద్యం బాటిళ్లు ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. సమీపంలో ఉన్న చెరువుల గట్టు వద్ద ఖాళీ మద్యం బాటిళ్లు గుట్టలుగుట్టలుగా పడి ఉండడం ఈ అనుమానాలకు మరింత ఊతమిస్తోంది. విజయనగరం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.శ్రీధర్, ఏఈఎస్ కె.వెంకటరామిరెడ్డి, కొత్తవలస ఎక్సైజ్ సీఐ రాఘవయ్య, టాస్కుఫోర్స్ సూపరింటెండెంట్ ఆచారి, ఎన్ఫోర్స్మెంట్ సీఐ శ్రీధర్, ఫ్లయింగ్ స్క్వాడ్ ఏఎస్సై సయ్యద్ జియాఉద్దీన్, వీఆర్వో రాధాకృష్ణ ఆధ్వర్యంలో గాలింపు చర్యలు చేపడుతున్నారు.