వినాయక నిమిజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బొజ్జ గణపయ్యను నిమజ్జనం చేసే క్రమంలో ఓ వ్యక్తి నీట మునిగి గల్లంతయ్యాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా కాకుమాను మండలం అప్పవరం గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానిక కొమ్మమూరు ఛానల్‌లో వినాయకులను నిమజ్జనం చేస్తున్న క్రమంలో పెదనందిపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీట మునిగి గల్లంతయ్యాడు. ఇది గుర్తించిన గజ ఈతగాళ్లు అతని కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
Published Sun, Sep 11 2016 1:31 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement