
ప్రమాదానికి గురైన హెలికాప‍్టర్
న్యూయార్క్ : అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికన్ విమానయాన అధికారి ఒకరు మాట్లాడుతూ యూరోకోప్టర్ ఏఎస్350 విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు రూజ్‌వెల్ట్ ఐలాండ్‌కు ఉత్తరంగా ఉన్న నదిలో పడిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్టు చేశారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు, నౌకాశ్రయ సిబ్బంది ఘటనా స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.