helicopter accident
-
పుణెలో కూలిన హెలికాప్టర్..ముగ్గురు మృతి
పుణె: మహారాష్ట్రలోని పుణెలో బుధవారం(అక్టోబర్2) తెల్లవారుజామున హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు ఒక ఇంజినీర్ దుర్మరణం పాలయ్యారు. పుణెజిల్లాలోని బవ్ధాన్ కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. బవ్ధాన్ పరిసర ప్రాంతంలోని గోల్ఫ్‌కోర్స్‌లో ఉన్న హెలిప్యాడ్ నుంచి గాల్లోకి లేచిన కొద్దిసేపటికే ప్రమాదం జరిగింది. హెలికాప్టర్ ముంబై వెళ్లాల్సి ఉంది. ప్రమాదానికి గల కారణాలు కచ్చితంగా తెలియనప్పటికీ దట్టమైన పొగమంచు వల్లే హెలికాప్టర్ కూలిపోయి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. కుప్పకూలిన హెలికాప్టర్ పుణెలోని హెరిటేజ్ ఏవియేషన్‌కు చెందినదిగా తేల్చారు. కాగా, ముంబై నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో ఇటీవలే కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లోని నలుగురు గాయపడ్డారు.#WATCH | A #helicopter with three people onboard crashed in the Bavdhan area in #Pune. According to the police, two people have died in the incident.More details here: https://t.co/34QkwGCcvh pic.twitter.com/v6tQTKz2K1— Hindustan Times (@htTweets) October 2, 2024 ఇదీ చదవండి: పెరోల్‌పై డేరా బాబా విడుదల -
గిరికీలు కొట్టిన హెలికాప్టర్
కేదార్నాథ్: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో శుక్రవారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. హెలికాప్టర్ హైడ్రాలిక్ వ్యవస్థ విఫలం కావడంతో అత్యవసర ల్యాండయ్యింది. కెస్ట్రెల్ ఏవియేషన్‌కు చెందిన ఈ హెలికాప్టర్ సిర్సి నుంచి ఆరుగురు భక్తులతో కేదార్‌నాథ్‌కు చేరుకుంది. ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపంతో హెలికాప్టర్ వేగంగా గిరికీలు కొట్టింది. హెలిప్యాడ్ వద్ద ఉన్న వాళ్లంతా భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. పైలట్ కల్పేశ్ చాకచక్యంగా వ్యవహరించి, హెలిప్యాడ్ పక్కనే 100 మీటర్ల దూరంలోని ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అందరూ సురక్షితంగా కిందికి దిగారు. -
ఏం జరగనుంది?
ప్రపంచమంతటినీ ఒక్కసారి ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదం... విన్న వెంటనే రకరకాల ఆలోచనలు, అనుమానాలు తలెత్తిన అనూహ్య ఘటన... ప్రతికూల వాతావరణంలో చిక్కుకోవడంతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ, విదేశాంగమంత్రి హుసేన్ అమీర్ అబ్దుల్లాహియన్‌లు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ వాయవ్య ఇరాన్లో ఆదివారం కుప్పకూలిందన్న వార్త పలు పాత, కొత్త విషయాలను ఏకకాలంలో స్ఫురణకు తెచ్చిన సంచలనం. అంతర్జాతీయ ఆంక్షలు, విమానాల నిర్వహణలో కష్టాల వల్ల ఇరాన్లో విమానయాన భద్రత దీర్ఘకాలంగా పెనుసవాలైంది. తాజా ఘటనతో ఆ సంగతి మళ్ళీ రుజువైంది. గగనయానంలో గతంలో పలువురు ప్రముఖుల దుర్మరణాల మొదలు రైసీ హయాంలో ఇరాన్ ప్రస్థానం, రానున్న కాలంలో వచ్చే మార్పుల వరకు అనేకం చర్చనీయాంశాలయ్యాయి.ఇరాన్ – ఇరాక్ యుద్ధం నాటి నుంచి తన విపరీత వర్తనతో వార్తల్లో ఉన్న సంప్రదాయవాద మతబోధకుడు రైసీ దేశాధ్యక్షపదవిని చేపట్టింది 2021లోనే! ఆయన కన్నా ముందు మితవాది అయిన హసన్ రోహానీ ఎనిమిదేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. చర్చల ద్వారా మార్పు తేవాలనీ, దేశాన్ని సుసంపన్నం చేయాలనీ భావించిన రోహానీకి పూర్తి భిన్నమైన వ్యక్తి రైసీ. కరడుగట్టిన ఛాందసం, హిజాబ్ «ధారణ సహా సమాజంలో కఠిన నిబంధనల అమలు, వందలాది ఉరిశిక్షలతో అంతులేని అపకీర్తి సంపాదించుకున్నారు. నిజానికి, అమెరికా సహా ప్రపంచ దేశాలతో అణు ఒప్పందంపై 2015లో రోహానీ సంతకం చేశారు. కానీ, ఆనక అమెరికా అధ్యక్షపీఠమెక్కిన ట్రంప్ మాటతప్పి, 2018లో ఇరాన్‌పై మళ్ళీ ఆంక్షలు విధించేసరికి దేశంలో చెల్లని కాసయ్యారు.ఫలితంగా మితవాదుల్ని తోసిపుచ్చి, ఛాందసులు పట్టు బిగించారు. మానవ హక్కుల సంఘాలు సహా అందరూ వ్యతిరేకించడంతో అంతకు ముందు ఒకటికి రెండు సార్లు ఎన్నికల్లో నెగ్గలేకపోయినప్పటికీ, ఎట్టకేలకు 2021లో రైసీ పీఠమెక్కారు. దేశాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించింది కొద్ది కాలమే! ఆయన హయాంలో పొరుగున ఉన్న అరబ్ దేశాలతో సంబంధాలను సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్‌తో, పాశ్చాత్య ప్రపంచంతో ఘర్షణలు మరింత పెరిగాయి. ప్రాణాలు తీసిన హెలికాప్టర్ చాలా పాతదంటున్నారు. పాశ్చాత్య దేశాల కఠిన ఆంక్షల కారణంగా కొత్త ఛాపర్లు, విమానాలను ఇరాన్ సమకూర్చుకోలేకపోయిందట. అమెరికా మాటెలా ఉన్నా... చైనా, రష్యాలతో సాయిలా ఫాయిలాగా ఉంటున్న దేశానికి, అందులోనూ అసంఖ్యాకంగా డ్రోన్లు సహా అపమిత ఆయుధ సంపత్తి గల దేశానికి పాత ప్రయాణ సాధనాలే గతి అయ్యాయంటే ఆశ్చ ర్యమే. ఏమైనా, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు హమాస్, హెజ్బుల్లా లాంటి వాటికి కొండంత అండగా నిలిచి రైసీ అక్షరాలా అమెరికాకు కంటిలో నలుసయ్యారు. అందుకే, హెలికాప్టర్ ప్రమాదంలో కుట్ర కోణం ఉండవచ్చనే అనుమానాలు వినవచ్చాయి. ఇటీవలి పశ్చిమాసియా పరిణామాలు... ఆ అను మానాలకు బలమిచ్చాయి. తమపై దాడి చేసిన హమాస్‌కు పెద్ద అండ ఇరాన్ గనక తెగబడి ఇజ్రా యెల్ గుట్టుగా హత్య చేయించి ఉండవచ్చనే పుకార్లు షికారు చేస్తున్నాయి. పైగా, గాజా చర్యల్లో ఇజ్రాయెల్‌ను బాహాటంగా సమర్థిస్తూ, దానితో వ్యూహాత్మక సహకారమున్న అజర్‌బైజాన్‌కు రైసీ వెళ్ళి వస్తున్నప్పుడే ఘటన జరగడం గమనార్హం. అయితే అనుమానాలకు తగిన ఆధారాలు కానీ, కనీసం ఇరాన్ నుంచి ఆరోపణలు కానీ... ఏవీ ఇప్పటి దాకా బయటకు రాలేదు. ఫలితంగా, దురదృష్టకర ప్రమాదంలోనే ఇరాన్ అధ్యక్షుడు దుర్మరణం పాలయ్యారని ప్రస్తుతానికి భావించాలి.ప్రమాదంపై లోతుగా దర్యాప్తు జరిపి, నిజానిజాలను సమగ్రంగా బయటపెట్టాల్సిన బాధ్యత ఇరాన్‌దే! ఏమైనా, అమెరికా ఆంక్షలు, ఆర్థికరంగంలో ఇక్కట్లు, సమాజంలో అసంతృప్తి, నెత్తిన పశ్చిమాసియా కుంపటితో అస్తుబిస్తు అవుతున్న వేళ ఈ దుర్ఘటన ఆ దేశానికి అశనిపాతం. ఇక, ప్రస్తుతానికి దేశ ఉపాధ్యక్షుడికి తాత్కాలిక అధ్యక్ష హోదా ఇచ్చారు. యాభై రోజుల సంతాప దినాల తర్వాత ఇరాన్ కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఆ దేశంలో అధినాయకుడి (అలీ ఖమేనీ)దే ఆఖరు మాట. అయినా అధ్యక్ష పదవి సైతం కీలకమే! దేశీయ, ప్రాంతీయ అనిశ్చితులు ఎన్నో ఉన్నా, రైసీ దుర్మరణంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ రాజకీయాల్లో, విధానాల్లో అనూహ్యమైన మార్పులు వస్తాయనీ అనుకోలేం. హెలికాప్టర్ ప్రమాదఘటన ఇరాన్‌కు తీరని విషాదమే తప్ప, రాజకీయ సంక్షోభం కాదని విశ్లేషకులూ తేల్చేస్తున్నారు. అధినాయకుడైన ఖమేనీకి ఆశ్రితుడిగా, ఆయన మాటను ధిక్కరించే ఆలోచనైనా లేని అధ్యక్షుడిగా, ఎనభై అయిదేళ్ళ వయసు మీద పడ్డ ఆయనకు అరవయ్యో పడిలోని వారసుడిగా అందరూ భావించిన రైసీ హఠాన్మరణంతో ఒక అధ్యాయమైతే ముగిసింది. ఇరాన్ చరిత్రలో కొత్త అధ్యాయం ఏమిటి, వారసుడెవరన్నది చర్చ. ఈ వారసత్వ రాజకీయాల కొత్త కూర్పులో ఖమేనీ కుమారుడు సయ్యిద్ మొజ్తబా హుసేనీ పైకి వస్తారని ఓ అంచనా. ఇస్లామిక్ ధర్మశాస్త్ర పాలన (వెలాయత్ ఎ ఫకీ) పేరిట మతాచార్యులకు పెద్ద అయిన షియా ధర్మశాస్త్రవేత్త అధినాయకుడిగా కొనసాగే పద్ధతి 1979లో ఇస్లామిక్ విప్లవం అనంతరం ఇరాన్లో వచ్చింది. అధినాయకుడు, ఆ తర్వాతే దేశాధ్యక్షుడు వగైరా అన్న విధానంపై విమర్శలు, చట్ట బద్ధతపై ప్రశ్నలు, అధికారానికి అనేక సవాళ్ళు వచ్చినా ఇన్నేళ్ళుగా అది కొనసాగింది. 1989 నుంచి ఖమేనీ కనుసన్నల్లోనే ఇరాన్ నడిచింది. కానీ, మారుతున్న భౌగోళిక రాజకీయాలు, దీర్ఘకాలంగా అణిచిపెడుతున్నప్పటికీ పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి లాంటివి ఈ ఇస్లామిక్ దేశం ముందున్న పెనుసవాళ్ళు. వాటిని అధినాయకత్వం ఎలా దీటుగా ఎదుర్కొంటుందో కచ్చితంగా ఆసక్తికరం. -
అమెరికాలో విషాదం.. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో సైనికులు మృతి
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమెరికు చెందిన ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఐదుగురు సైనికులు మృతిచెందారు. ఇక, సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధార ప్రాంతంలో అమెరికా ఒక ఆర్మీ బృందాన్ని మోహరించింది. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. దీంతో ఆ హెలికాప్టర్లో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు మృతి చెందారు. కాగా, మిడిల్ఈస్ట్ దేశాల్లో ఘర్షణలను నివారించడం కోసం అమెరికా ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 5 U.S. Army Special Operations troops were killed in a helicopter refueling accident off the southeastern coast of Cyprus on Saturday morning, according to U.S. officials familiar with the incident.🔽 pic.twitter.com/D0yVCmU8en — Arthur Morgan (@ArthurM40330824) November 12, 2023 మరోవైపు.. హెలికాప్టర్ ప్రమాదంలో సైనికులపై జో బైడెన్ సంతాపం తెలిపారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం సైనికులు ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, మన దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవల్ని కొనియాడారు. -
స్వగ్రామానికి జవాన్ అనిల్ భౌతికకాయం.. నేడు అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్/బోయినపల్లి(చొప్పదండి): జమ్మూ కశ్మీర్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో అమరుడైన ఆర్మీ జవాన్ పి.అనిల్ భౌతికకాయం శనివారం ఉదయం స్వగ్రామం చేరుకుంది. అనిల్ మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. స్థానికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనిల్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్. ఇక, హైదరాబాద్‌కు చెందిన ఆర్మీ అధికారులు శుక్రవారం మల్కాపూర్‌ను సందర్శించారు. జమ్మూకశ్వీర్, హైదరాబాద్ నుంచి సైనికాధికారులు రానున్నారని, అంత్యక్రియల స్థలం విశాలంగా ఉండేలా చూడాలని కుటుంబ సభ్యులను కోరారు. అంతకుముందు.. శుక్రవారం సాయంత్రం హకీంపేటలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు అనిల్ పార్థీవదేహం చేరుకుంది. ప్రత్యేక విమానంలో తీసుకొచ్చిన అనిల్ పార్థివదేహానికి తెలంగాణ, ఆంధ్ర సబ్ ఏరియా హెడ్–క్వార్టర్స్ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ జనరల్ రాకేశ్ మనోచ నివాళులు అర్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన అనిల్ జమ్మూకశ్మీర్‌లో ఆర్మీలో పనిచేస్తున్నాడు. హెలికాప్టర్ కూలి ఓ నదిలో పడిన ప్రమాదంలో అనిల్ మృతిచెందాడు. అయితే, ఇటీవలే 45 రోజుల పాటు లీవ్‌లో ఉండి పదిరోజుల క్రితమే మళ్లీ త్వరలోనే వస్తానని చెప్పి అనిల్ వెళ్లిపోయాడు. ఇంతలోనే ప్రమాదంలో ఇలా మృతిచెందడంతో మాల్కాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబానికి అండగా ఉంటాం: మంత్రి కేటీఆర్ అనిల్ మృతి పట్ల రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యువ జవాన్‌ను కోల్పోవడం బాధాకరమని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనిల్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
ఆకాశంలో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. అందులో ఒకటి..!
బ్రిస్బెన్: ఆకాశంలో ప్రయాణిస్తున్న రెండు హెలికాప్టర్లు ఒకదానినొకటి ఢీకొట్టుకున్న సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. ఆస్ట్రేలియాలని క్వీన్స్‌ల్యాండ్ రాష్ట్రంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఓ హెలికాప్టర్‌లోని ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. ఓ హెలికాప్టర్ ప్రమాదం నుంచి బయటపడి సురక్షితంగా ల్యాండింగ్ అవడంతో పెను ప్రమాదం తప్పినట్లు పేర్కొంది. రాజధాని బ్రిస్బెన్కు 45 కిలోమీటర్ల దూరంలోని గోల్డ్‌కోస్ట్ బీచ్ సమీపంలో రెండు హెలికాప్టర్లు ఢీకొట్టుకున్నట్లు మీడియా తెలిపింది. ఆ ప్రాంతం అత్యంత ప్రజాదరణ పొందిన పర్యటక ప్రాంతంగా ఉంది. ఆస్ట్రేలియాలో సెలవు దినాలు కావడంతో జనవరిలో భారీగా జనం తరలి వస్తారు. ప్రమాదం జరిగిన క్రమంలో బీచ్‌లోని సీ-వరల్డ్ డ్రైవ్‌ను మూసివేశారు అధికారులు. వైద్య సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు క్వీన్స్‌ల్యాండ్ అంబులెన్స్ సర్వీసు తెలిపింది. #BREAKING: Emergency services are responding after a helicopter crash on the Gold Coast Broadwater at Southport. Three people are believed dead, with two more seriously injured. More details to come. #9News pic.twitter.com/Mmtw1ENscL — 9News Gold Coast (@9NewsGoldCoast) January 2, 2023 ఇదీ చదవండి: దేవుడా ఏమిటీ పరీక్ష? పాకిస్థాన్‌లో నిరుద్యోగ సమస్యకు నిదర్శనం..! -
ఇండియా@75: హెలికాప్టర్ ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్ది సమయానికే ప్రతికూల వాతావరణంలో చిక్కుకుని కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి 8 కిలోమీటర్ల దూరంలోని నల్లకాలువ గ్రామం మీదుగా 16 కిలోమీటర్ల దూరంలోని రుద్రకొండ సమీపంలో కూలిపోయింది. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన వారిలో వై.ఎస్. రాజశేఖరరెడ్డితో పాటు ప్రత్యేక కార్యదర్శి పి. సుబ్రహ్మణ్యం, ముఖ్య భద్రతా అధికారి ఎ.ఎస్.సి.వెస్లీ, పైలట్ ఎస్. కె. భాటియా, సహ పైలట్ ఎం. ఎస్. రెడ్డి ఉన్నారు. ముఖ్యమంత్రి ఆచూకీ కోసం గాలించగా 25 గంటల తరువాత ప్రమాదానికి గురైన హెలికాప్టర్ ఆనవాళ్లు లభించాయి. తమ ప్రియతమ నాయకుని మరణాన్ని జీర్ణించుకోలేక రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది మరణించారు. వీరిలో చాలా మంది గుండె ఆగి మరణించగా కొంతమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే ఏడాది మరికొన్ని పరిణామాలు వెలుగులోకి వచ్చిన సత్యం కంప్యూటర్స్ సంస్థ స్కామ్. స్కామ్ నిజమేనని ఆ కంపెనీ సంస్థాపకులు రామలింగరాజు ఒప్పుకోలు. లోక్‌సభ తొలి మహిళా స్పీకర్‌గా మీరా కుమార్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ ప్రకటన జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం. (చదవండి: ‘రాజద్రోహాన్ని’ లెక్కచేయలేదు, కటకటాలనూ లెక్క చేయలేదు) -
రెండు హెలికాప్టర్లు ఢీ; 13 మంది మృతి
సాహెల్ : రెండు సైనిక హెలికాప్టర్లు గగనతలంలో ఒకదానికొకొటి ఢీకొనడంతో ఫ్రాన్స్ దేశానికి చెందిన 13 మంది సైనికులు మరణించారు. ఈ విషాద ఘటన మాలీ దేశంలోని సాహెల్‌లో చోటుచేసుకుంది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మంగళవారం మాలీలో నిర్వహించిన ఆపరేషన్‌లో ఈ దుర్ఘటన జరిగింది.ఇదే విషయాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది. ఈ సందర్భంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమాన్యూయేల్ మక్రాన్ చనిపోయిన సైనికుల కుటుంబలకు ప్రగాడ సానుభూతి తెలిపారు. చనిపోయిన వారిలో ఆరుగురు ఆర్మీ అధికారులతో పాటు మరో ఏడుగురు నాన్ కమీషన్డ్ అధికారులు ఉన్నట్లు తేలింది. 1983లో బీరుట్ బ్యారక్స్ బాంబు దాడిలో 58 మంది ఫ్రెంచ్ పారాట్రూపర్స్ మరణం తర్వాత ఇప్పుడు 13మంది ఫ్రెంచ్ అధికారులను పోగొట్టుకోవడం బాధాకరమని ఫ్రాన్స్ రక్షణ విభాగం పేర్కొంది. అయితే దుర్ఘటనకు సంబంధించిన కారణాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.ఇస్లామిక్ మిలిటెంట్లు మాలీలోని ఉత్తర ప్రాంతాన్ని ఆక్రమించడంతో 2013లో ఫ్రాన్స్ ప్రభుత్వం తన బలగాలను అక్కడ మోహరించింది. ప్రస్తుతం సుమారు 4500 ప్రాన్స్ బలగాలు మాలీ దేశ సైన్యానికి సహకరిస్తున్నాయి. -
కూలిన హెలికాప్టర్...ఇద్దరు మృతి
న్యూయార్క్ : అమెరికాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. అమెరికన్ విమానయాన అధికారి ఒకరు మాట్లాడుతూ యూరోకోప్టర్ ఏఎస్350 విమానం స్థానిక కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 7:15 నిమిషాలకు రూజ్వెల్ట్ ఐలాండ్‌కు ఉత్తరంగా ఉన్న నదిలో పడిపోయినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్టు చేశారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్లో ఎంతమంది ఉన్నారనే విషయం ఇంకా తెలియలేదు. పోలీసులు, నౌకాశ్రయ సిబ్బంది ఘటనా స్థలి వద్దే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. -
మహారాష్ట్ర సీఎంకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబయి : హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీలు తృటిలో తప్పించుకున్నారు. ముంబయికి సమీపంలోని మీరా రోడ్లో గురువారం ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ స్కూల్ ఆవరణలో హెలికాఫ్టర్ ల్యాండ్ కావాల్సిఉండగా, అక్కడ వైర్ ఉండటాన్ని గుర్తించిన పైలట్ చాపర్‌ను వెనుకకు మళ్లించాడు. సమీప ప్రాంతంలోని మరో చోట హెలికాఫ్టర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేశాడు. హెలికాఫ్టర్ ప్రమాదాల నుంచి బయటపడటం ఫడ్నవీస్‌కు ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలోనూ ఆయన హెలికాఫ్టర్ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మే 2017లో సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ లాతూర్‌లో క్రాష్ ల్యాండింగ్ అయింది. అదే నెలలో గడ్చిరోలిలో దేవేంద్ర ఫడ్నవీస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ సాంకేతిక కారణాలతో టేకాఫ్ తీసుకోవడంలో విఫలమైంది. -
పీఓకేలో కూలిన పాక్ సైనిక హెలికాప్టర్
ఇద్దరు విదేశీ రాయబారులు సహా ఏడుగురి మృతి ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం పాక్ సైనిక హెలికాప్టర్ కూలిపోవడంతో ఏడుగురు మృతిచెందారు. మృతుల్లో ఫిలిప్పీన్స్ రాయబారి లీఫ్ లార్సన్, నార్వే రాయబారి డొమింగో లూసెనారియో, మలేసియా, ఇండోనేసియా రాయబారుల భార్యలు, ఇద్దరు ఆర్మీ పెలైట్లు, సిబ్బంది ఒకరు ఉన్నారు. మలేసియా, పోలండ్, డచ్ రాయబారులు గాయపడ్డారు. ఆరుగురు పాకిస్తానీలు, 11 మంది విదేశీయులతో వెళ్తున్న ఈ హెలికాప్టర్ నల్తార్ లోయ ప్రాంతంలో అత్యవసరంగా దిగుతూ కూలిపోయిందని ప్రాథమిక సమాచారం. హెలికాప్టర్ ఖాళీగా ఉన్న స్కూలుపై కూలడంతో ఆ భవనానికీ మంటలు అంటుకున్నాయి. హెలికాప్టర్‌ను క్షిపణితో తామే కూల్చామని, తమ లక్ష్యం పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అతని సహచరులు అని పాక్ తాలిబాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. షరీఫ్ వేరే హెలికాప్టర్లో ఉండడంతో బతికి బయటపడ్డాడని పేర్కొన్నారు. అయితే పాక్ ఆర్మీ దీన్ని తోసిపుచ్చింది. హెలికాప్టర్ ల్యాండ్ అవుతూ సాంకేతిక లోపంతోనే కూలిపోయిందని పేర్కొంది. నల్తార్కు వెళ్తున్న షరీఫ్ విమానాన్ని ఈ ఘటన నేపథ్యంలో దారి మళ్లించి ఇస్లామాబాద్‌కు తీసుకొచ్చామని పేర్కొంది. నల్తార్లో షరీఫ్ పాల్గొనాల్సిన కార్యక్రమం కోసం 37 దేశాలకు చెందిన దౌత్యవేత్తలను 3 హెలికాప్టర్లలో తీసుకెళ్తుండగా ఒకటి కూలిపోయిందని తెలిపింది. హెలికాప్టర్ 25 అడుగుల ఎత్తు నుంచి కూలిం దని పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్ చెప్పారు. -
యూపీలో కూలిన ఐఏఎఫ్ చాపర్
ఏడుగురు మృతి న్యూఢిల్లీ: భారతీయ వైమానిక దళానికి(ఐఏఎఫ్) చెందిన హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు అధికారులు సహా ఏడుగురు వైమానిక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ నుంచి అలహాబాద్ వస్తున్న ‘ఏఎల్‌హెచ్ ధ్రువ్’ చాపర్ సీతాపూర్ జిల్లాలోని పాలిత్పుర్వ గ్రామం దగ్గర్లోని పంట పొలాల్లో కూలిపోయింది. ప్రమాదానికి ముందు పైలట్ ‘మేడే కాల్(ఎమర్జెన్సీ కాల్)’ చేశారని, అనంతరం రేడియో, రాడార్ సంకేతాలకు చాపర్ దూరమైందని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి వెల్లడించారు. బరేలీలో మధ్యాహ్నం 3.53 గంటలకు బయల్దేరిన హెలికాప్టర్ దాదాపు గంట తరువాత ప్రమాదానికి గురైందని ఆయన వివరించారు. ఆ చాపర్‌లో ఇద్దరు పైలట్లు, వివిధ హోదాల్లో ఉన్న ఐదుగురు వైమానికదళ సైనికులు ఉన్నారన్నారు. సమాచారం తెలియగానే సహాయక బృందాలు ఘటనాస్థలికి బయల్దేరాయన్నారు. ప్రమాదంపై అంతర్గత దర్యాప్తునకు ఐఏఎఫ్ ఆదేశించిందని ఆయన తెలిపారు. కూలిపోగానే చాపర్ మంటల్లో చిక్కుకుందని సిధౌలి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఏకే శ్రీవాస్తవ తెలిపారు. -
క్షమించు వినాయకం !
జవాన్ వినాయకం వర్ధంతి రేపు బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించిన ఆయా ప్రభుత్వాలు చిల్లిగవ్వ చెల్లించని ఏపీ సర్కారు వినాయకన్. ఏడాది కిందట కేదార్నాథ్ పర్యటనకు వెళ్లి విపత్తులో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు వెళుతూ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందాడు. అతని కుటుంబానికి అండగా ఉంటామని అప్పటి ప్రభుత్వంతో పాటు ప్రతిపక్ష నేత (ప్రస్తుత ముఖ్యమంత్రి ) భరోసా ఇచ్చారు. కానీ దురదృష్టం. చనిపోయిన జవాన్లలో వినాయకన్ కుటుంబానికి మన ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. సాక్షి, చిత్తూరు: వినాయకం! దేశం కోసం.. దేశ ప్రజల కోసం నువ్వు ప్రాణాలర్పించి రేపటికి (బుధవారం) ఏడాది అవుతుంది. నాకు బాగా గుర్తింది. ఏడాది కిందట దేవభూమి ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర విపత్తు దేశాన్ని కకావికలం చేసింది. ఆ ఘటన తలుచుకుంటేనే భయమేస్తుంది. భర్తలను కోల్పోయిన భార్యలు.. బిడ్డలను పోగొట్టుకున్న తండ్రులు ఎంతో వేదన పడ్డారు. ఒక్కమాటలో చెప్పాలంటే గత ఏడాది కేదార్నాథ్ పర్యటనకు వెళ్లిన ప్రతీ మదీ.. ఆవేదనల న దిగా నేటికీ గత చేదుజ్ఞాపకాలు మొదలుతూనే ఉన్నాయి. అలాంటి విపత్తులో చిక్కుకుపోయిన బాధితులను రక్షించేందుకు నీవంతు ప్రయత్నం చేశావు. ఎంతోమందిని కాపాడావు. నది ఇటువైపు నుంచి అటువైపునకు వెళ్లేందుకు దారి లేకపోతే రోప్‌లు వేసి వాటిపై వంతెనగా నీతో పాటు కొందరు జవాన్లు పడుకుని బాధితులను మీ వీపుపై నడిపించారు. ప్రాణాలు కాపాడారు. ఈ సంఘటన తెలిసి.. నువ్వు నా కడుపున పుట్టినందుకు చాలా గర్వపడ్డాను. హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందావని తెలిసి బోరున విలపించాను. ‘‘మన వినాయకం.. పూతలపట్టు మండలం చిన్నబండపల్లె వాసి. ఎన్డీఆర్ఎఫ్లో పని చేస్తున్నాడు. ఐదేళ్లు దేశానికి సేవచేశాడు. 26 ఏళ్లకే దేశ సేవలో ప్రాణాలు కోల్పోయాడు.’’ అని జిల్లా ప్రజలు మొత్తం రోదించారు. నీ మృతదే హాన్ని ఆర్మీ అధికారులు గుర్తుపట్టలేకపోయారు. డీఎన్ఏ పరీక్ష చేసి శవాన్ని గత ఏడాది జూలై 3న స్వగ్రామానికి తెచ్చారు. మీ అమ్మానాన్నలు రాణెమ్మ, కృష్ణస్వామి ఎంత బాధపడ్డారో నాకు తెలుసు! రెన్నళ్లలో పెళ్లి. పెళ్లి కోసం కొత్త ఇళ్లు నిర్మించుకున్నారు. బిడ్డ వస్తాడు! మిగిలిన ఇంటి పని పూర్తి చేయిస్తాడని నీ రాకకోసం ఎదురుచూశారు. కానీ గుర్తుపట్టలేనంతగా శవమై ఇంటికొచ్చిన నిన్ను చూసి ఇంటిల్లిపాది గుండెలవిసేలా రోదించారు. ప్రభుత్వ లాంఛనాలతో నీ అంత్యక్రియలు జరిపారు. సంతోషించాను. అంత్యక్రియలపై చూపిన గౌరవం నీ కుటుంబాన్ని ఆదుకోవడంపై కూడా చూపిస్తారని భావించాను. అప్పటి మాజీ, నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీ ఇంటికొచ్చారు. మీ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అప్పటి ప్రభుత్వం కూడా అండగా ఉంటానని భరోసా ఇచ్చింది. ఇంటిస్థలం.. ఐదెకరాల పొలం.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామన్నారు. ఇలాంటి హామీలే నీతో పాటు మృతి చెందిన మరో ఎనిమిది మంది జవాన్లకు వారి ప్రభుత్వాలు ఇచ్చాయి. వారంతా ఇచ్చిన హామీలను ఎప్పుడో నెరవేర్చి జవాన్ల కుటుంబాలకు బాసటగా నిలిచారు. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కూడా నీ కుటుంబంతో పాటు తక్కిన తొమ్మిది మంది కుటుంబాలకు 2 లక్షల రూపాయల పరిహారం చెల్లించిం ది. పక్కనే ఉన్న తమిళనాడులో చనిపోయిన నీ సహచర జవాన్‌కు అక్కడి ప్రభుత్వం స్థలం, పొలంతో పాటు రూ. 25 లక్షల పరిహారం ఇచ్చింది. కానీ దురదృష్టం. చనిపోయిన జవాన్లలో నీ ఒక్కడికే మన ప్రభుత్వం చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. స్థలం.. పొలం.. ఉద్యోగం అన్నీ మరిచిపోయింది. చేతికొచ్చిన కొడుకును కోల్పోయి ఎలాంటి ఆసరా లేకుండా నీ తల్లిదండ్రులు ఏడాదిగా క్షోభను అనుభవిస్తున్నారు. ప్రభుత్వం.. ప్రభుత్వ యంత్రాంగం ఏ ఒక్కరూ నువ్వు చనిపోయావని.. ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చామని.. వాటిని నెరవేర్చి దేశం కోసం ప్రాణాలర్పించిన నీ కుటుంబానికి అండగా ఉండాలని బహుశా భావించలేదేమో! అందుకే హామీలను నెరవేర్చలేదేమో! రేపటితో నువ్వు నాకు దూరమై ఏడాది. అందుకే ఒక్కసారి నిన్ను నేను గుర్తుకు చేసుకుని.. హామీలను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నా. ఏదిఏమైనా నీ కుటుంబానికి ఏడాదిగా అన్యాయం జరిగింది వినాయకం. క్షమించు వినాయకం! ఇట్లు..నీ కన్నభూమి చిత్తూరు జిల్లా -
హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మృతి
మాస్క్: రష్యాలో స్థానిక అధికారులు, వ్యాపారస్థులతో పయనిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం కూలిన ఘటనలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. మొత్తం 19 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ ఆకస్మికంగా ఓ లోయలో కూలిపోయింది. వీరిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. మూర్ మాంస్క్ కు వాయువ్య దిశలో హెలికాప్టర్ పయనిస్తున్న సమయంలో వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని చేసింది. కాగా, ఇందులో గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన వారి ఆచూకీ మాత్రం లభించలేదు. ఇదిలా ఉండగా ఆ హెలికాప్టర్ లో మొత్తం 18 మంది మాత్రమే ప్రయాణించినట్లు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ చెబుతుంది. ఏవియేషన్ అధికారుల వైఫల్యం కారణంగానే రష్యాలో తరుచు హెలికాప్టర్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. -
హెలికాప్టర్ ఘటనలో 16 మంది ఆచూకీ గల్లంతు
మాస్కో: రష్యాలో స్థానిక అధికారులు, వ్యాపారస్థులతో పయనిస్తున్న ఓ హెలికాప్టర్ శనివారం కూలిన ఘటనలో 16 మంది ఆచూకీ గల్లంతయ్యింది. మొత్తం 19 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఎమ్ఐ-8 హెలికాప్టర్ నిన్న ఆకస్మికంగా ఓ లోయలో కూలిపోయింది. వీరిలో ఐదుగురు హెలికాప్టర్ సిబ్బంది ఉన్నారు. వాతావరణం సరిగా లేనందును మూర్ మాంస్క్ కు వాయువ్య దిశలో పయనిస్తున్న సమయంలో హెలికాప్టర్ కు సిగ్నల్స్ అందకపోవడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఇందులో గాయపడిన ఇద్దర ఆచూకీ లభించడంతో వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మిగిలిన వారి ఆచూకీ మాత్రం లభించలేదు. ఇదిలా ఉండగా ఆ హెలికాప్టర్ లో మొత్తం 18 మంది మాత్రమే ప్రయాణించినట్లు ఆ దేశ అత్యవసర మంత్రిత్వ శాఖ చెబుతుంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ ఘటన చోటు చేసుకుని ఉండవచ్చని దర్యాప్తు బృందం తెలిపింది. ఏవియేషన్ అధికారుల వైఫల్యం కారణంగానే రష్యాలో తరుచు హెలికాప్టర్ దుర్ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. -
అఖిలేశ్‌కు తృటిలో తప్పిన ముప్పు
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్‌లు హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను పక్షి ఢీకొంది. దీంతో దానిని అత్యవసరంగా కిందకు దించాల్సి వచ్చింది. ఈ ఘటన ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని అధికార వర్గాలు సోమవారం వెల్లడించాయి. అఖిలేశ్ యాదవ్ కనౌజ్ ఎంపీ అయిన తన సతీమణి డింపుల్‌తో కలసి తన బంధువు రతన్‌సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరై సైఫాయ్ నుంచి హెలికాప్టర్లో తిరిగి వస్తుండగా.. దానిని పక్షి ఢీకొందని ఆ వర్గాలు తెలిపాయి. -
నితీశ్‌కు తప్పిన ప్రాణాపాయం
పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆదివారం సాయంత్రం హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పెను గాలుల్లో చిక్కుకోవడంతో సహస్ర జిల్లాలో సోన్‌బర్సాలో పైలట్ అత్యవసరంగా కిందకు దించారు. సోన్బర్సా రాజ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నితీశ్... అక్కడి నుంచి మధేపురాలో జరిగే సభకు వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కారు. హెలికాప్టర్ టేకాఫ్ అయిన కొంతసేపటికే ఆ ప్రాంతంలో పెను గాలులు వీచాయి. సుమారు గంటపాటు (సాయంత్రం 4.30 నుంచి 5.30 వరకూ) వీచిన ఈ గాలుల్లో చిక్కుకున్న హెలికాప్టర్ కొన్ని నిమిషాలపాటు ఊగిసలాడింది. అన్ని వైపుల నుంచి బలమైన గాలులు వీస్తున్నా పైలట్ ఎలాగో అలా హెలికాప్టర్‌ను తిరిగి సోన్‌బర్సాలో అత్యవసరంగా కిందకు దింపారు. ఈ ఘటన అనంతరం నితీశ్ రోడ్డు మార్గంలో మధేపురాకు వెళ్లారు. పాశ్వాన్‌కూ తప్పిన ముప్పు లోక్ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ) అధినేత రామ్ విలాస్ పాశ్వాన్ ఆదివారం ఎక్కిన హెలికాప్టర్ కూడా బలమైన గాలుల్లో చిక్కుకోవడంతో పైలట్ అత్యవసరంగా కిందకు దించాడు. దర్భంగా జిల్లా మీదుగా పాశ్వాన్ హెలికాప్టర్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. -
అనంతపురంలో భారీ పేలుడు
అనంతపురం: జిల్లాలోని లేపాక్షి మండలం కొండూరు అటవీ ప్రాంతంలో ఓ కొండపై శనివారం భారీపేలుడు సంభవించింది. దీంతో కొండూరు అటవీ ప్రాంతానికి సమీపాన నివాసిస్తున్న ప్రజలంతా ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. భారీ పేలుడుతో శబ్ధం వినిపించడంతో హెలికాఫ్టర్ కూలినట్టుగా అక్కడి స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ కొండపై భారీగా మంటలు ఎగసిపడుతూ దట్టమైన పొగలు వస్తున్నట్టు సమాచారం.