వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అమెరికు చెందిన ఆర్మీ హెలికాప్టర్ మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అమెరికాకు చెందిన ఐదుగురు సైనికులు మృతిచెందారు. ఇక, సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు.
వివరాల ప్రకారం.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రాంతీయంగా విస్తరించకుండా ఉండేందుకు మధ్యధార ప్రాంతంలో అమెరికా ఒక ఆర్మీ బృందాన్ని మోహరించింది. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత సమస్య తలెత్తడంతో మధ్యధార సముద్రంలో కుప్పకూలింది. దీంతో ఆ హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు సైనికులు మృతి చెందారు. కాగా, మిడిల్‌ఈస్ట్ దేశాల్లో ఘర్షణలను నివారించడం కోసం అమెరికా ఆయా దేశాల్లో సైనిక స్థావరాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
5 U.S. Army Special Operations troops were killed in a helicopter refueling accident off the southeastern coast of Cyprus on Saturday morning, according to U.S. officials familiar with the incident.🔽 pic.twitter.com/D0yVCmU8en
— Arthur Morgan (@ArthurM40330824) November 12, 2023
మరోవైపు.. హెలికాప్టర్ ప్రమాదంలో సైనికులపై జో బైడెన్ సంతాపం తెలిపారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండటం కోసం సైనికులు ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, మన దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవల్ని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment