‘పుతిన్‌ హత్యకు అమెరికా కుట్ర?’ | American Journalist Tucker Carlson Alleges Biden Administration Attempted To Assassinate Putin | Sakshi
Sakshi News home page

‘పుతిన్‌ హత్యకు అమెరికా కుట్ర?’

Published Tue, Jan 28 2025 9:11 PM | Last Updated on Wed, Jan 29 2025 11:36 AM

వాషింగ్టన్‌ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ (Vladimir Putin) ను హతమార్చేందుకు అమెరికా ప్రయత్నించింది. ఇప్పుడీ వ్యాఖ్యలు అంతర్జాతీయ మీడియాలో చర్చాంశనీయంగా మారింది. అయితే ఈ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. అందుకు కారణం
 
ప్రముఖ అమెరికన్ పండిట్, మాజీ ఫాక్స్ న్యూస్ యాంకర్ టక్కర్ కార్ల్‌సన్‌ (Tucker Carlson)..తన ‘ది టక్కర్ కార్లసన్‌ షో’ పాడ్‌కాస్ట్‌లో కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్ రచయిత మాట్ తైబీతో పాడ్‌కాస్ట్‌లో కార్ల్‌సన్‌ మాట్లాడుతూ.. పుతిన్‌ను హత్య చేసేందుకు అమెరికా మాజీ అధ్యక్షుడు జోబైడెన్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని ఆరోపణలు చేశారు. జోబైడెన్‌ ప్రభుత్వం పుతిన్‌ను చంపేందుకు ప్రయత్నించింది. ఇది పిచ్చి, మతిలేని చర్య అని అన్నారు.  

అయితే, కార్లసన్‌ వ్యాఖ్యల్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని జోబైడెన్‌ మద్దతు దారులు స్పష్టం చేస్తున్నారు. అందుకు ఊతం ఇచ్చేలా 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీ మోసం జరిగిందని, అందుకు అర్ధం పర్ధంలేని ఆధారాల్ని టెలికాస్ట్‌ చేసి ఫాక్స్‌ న్యూస్‌లో ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీనికితోడు పుతిన్‌ను హత్య చేసేందుకు జోబైడెన్‌ ప్రభుత్వం ప్రయత్నించిందని ఆరోపించిన కార్లసన్‌ అందుకు తగిన ఆధారాల్ని ఎందుకు చూపించలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు.  

ఈ ఆరోపణలపై జోబైడెన్‌ అడ్మినిస్ట్రేషన్ ఇంకా స్పందించలేదు, అయితే క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ఈ విషయంపై వ్యాఖ్యానించారు, పుతిన్ భద్రతను నిర్ధారించడానికి రష్యన్ ప్రత్యేక సేవలు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement