Joe Biden said Putin May Be Isolated: ఉక్రెయిన్ పై గత నెలరోజులకు పైగా దాడులు కొనసాగిస్తునే ఉంది. టర్కీలో శాంతి చర్చల్లో పురోగతి లభించిందనేది కూడా అవాస్తవం అని తెలుస్తోంది. మాస్కో బలగాలను ఉపసంహరించుకుంటామని హామీ ఇచ్చి మరీ దాడులు కొనసాగించిన సంగతి తెలిసిందే. అయితే మాస్కో మాత్రం కొన్ని ప్రాంతాల్లో సైనిక కార్యకలాపాలను తగ్గించినట్లు చెబుతుంది. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం నాయకుడు జో బైడెన్ మాస్కో వాదన చాలా అనుమానస్పదంగా ఉందన్నారు.
రష్యా నాయకుడు వ్లాదిమిర్ పుతిన్ ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తోందన్నారు. బహుశా ఆయన తన సలహదారులను తొలగించారేమో లేక గృహనిర్బంధంలో ఉంచారో అని వ్యగ్యంగా మాట్లాడారు. అదీగాక యూఎస్ ఇంటిలిజెన్స్ వర్గాలు కూడా పుతిన్‌కి తన సైనిక బలగాల నుంచి సరైన సమాచారం అందడంలేదని పేర్కొంది. ఏదీఏమైన మాస్కో చెబుతున్నదానికి ఉక్రెయిన్‌లో జరుగుతున్నాదానికి పొంతన లేకుండా ఉంది. మరోవైపు రష్యా అధ్యక్షుడుకి భయపడే బలగాలు అతనికి సరైన సమాచారం అందించడం లేదని రకరకాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు యూఎస్ అధ్యక్షుడు జోబైడెన్ ఈ విషయమై మాట్లాడుతూ...ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ఏం చేస్తుందో కచ్చితంగా నాకు తెలియదు. కానీ రష్యా తన బలగాలను ఉపసంహరించుకున్నట్లు సంకేతాలు ఇచ్చింది. కానీ అందుకు విరుద్ధంగా బలగాలు ఉక్రెయిన్ రాజధాని కైవ్‌కి సమీప నగరాలపై భయంకరమైన దాడులు నిర్వహించింది. అంతేకాదు డాన్‌బాస్ నగరంలపై రష్యా బలగాలు బాంబు దాడులతో విరుచుకుపడింది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. నిజానికి పుతిన్ సైనిక దాడిని తగ్గిస్తున్నాడా అనేదానిపై నాకు కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పారు.
(చదవండి: కీలక దశలో దేశ రక్షణ!)
Comments
Please login to add a commentAdd a comment