
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై యుద్ధ నేరాల విచారణ జరపాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ డిమాండ్ చేశారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను యుద్ధ నేరస్థుడని మరోసారి ఉద్ఘాటించారు. ఈ దురాగతాలు చూసిన తరువాత రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించనున్నట్లు బైడెన్ హెచ్చరించారు. బుచా ఘటనపై స్పందించిన బైడెన్.. "బుచాలో ఏమి జరిగిందో మీరు చూశారు. పుతిన్ ఓ యుద్ధ నేరస్థుడు" అని అన్నారు. పుతిన్ యుద్ధ నేరుస్థుడని అన్నందుకు గతంలో తనపై విమర్శలు చేశారని, కానీ ఈ దారుణాలు చూస్తే అతను నిజంగా యుద్ధ నేరస్థుడే అని అర్థమవుతోందని చెప్పారు.
తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు: జెలెన్ స్కీ
కాగా రష్యా సైనికులు నరమేధం సృష్టించిన కీవ్ సమీపంలోని పట్టణాలలో ఒకటైన బుచాను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ సందర్శించారు. రష్యా మారణహోమాన్ని సృష్టిస్తుందని.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రష్యాను హెచ్చరించారు. అలాగే క్రెమ్లిన్‌పై వెంటనే కఠిన ఆంక్షలు విధించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు.
చదవండి: ఉక్రెనియన్ తల్లుల ఆవేదన...తమ పిల్లలైన బతికి ఉండాలని..
రాజధాని కీవ్ శివారు ప్రాంతాలను ఇటీవలే రష్యా సేనల నుంచి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు.. కీవ్ పరిసర ప్రాంతాల్లో 410 పౌరుల మృతదేహాలు లభ్యమైనట్లు తెలిపాయి. కీవ్ సమీప ప్రాంతం బుచాలో 21 మృతదేహాలను చూసినట్లు అసోసియేటెడ్ ప్రెస్ పాత్రికేయులు తెలిపారు. ఉక్రెయిన్కు సహాయం చేసేందుకు పరిశోధకులను పంపుతామని యూరోపియన్ కమిషన్ అధ్యక్షులు వాండర్ లియెన్ తెలిపారు.
చదవండి: Sri Lanka Crisis: వైదొలగిన మిత్రపక్షాలు.. మైనార్టీలో రాజపక్స ప్రభుత్వం
Comments
Please login to add a commentAdd a comment