Russia Ukraine War: Biden Says Putin Not Joking About Using Nuclear Weapons In Ukraine - Sakshi
Sakshi News home page

Russia Ukraine War: పుతిన్‌ అణ్వాయుధ బెదిరింపులపై బైడెన్‌ సంచలన వ్యాఖ‍్యలు

Published Fri, Oct 7 2022 2:41 PM | Last Updated on Fri, Oct 7 2022 3:25 PM

Biden Says Putin Not Joking About Using Nuclear Weapons In Ukraine - Sakshi

ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం జోక్‌ కాదని వివరించారు.

వాషింగ్టన్‌: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్‌ను కొద్ది వారాల్లోనే తన వశం చేసుకుంటుందనుకున్నప్పటికీ రష్యాకు ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో అణు బాంబుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌. ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు కలుగజేసుకుంటే.. న్యూక్లియర్‌ వార్‌ తప్పదని హెచ్చరించారు. తాజాగా.. పుతిన్‌ అణు హెచ్చరికలు జోక్‌ కాదని, న్యూక‍్లియర్‌ బాంబులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌. 1962లో క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు ముప్పును చూడలేదని పేర్కొన్నారు. 

మాన్‌హట్టన్‌లో గురువారం నిర్వహించిన డెమొక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు బైడెన్‌. ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం జోక్‌ కాదని వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్యూబా మిసైల్‌ సంక్షోభం తర్వాత తొలిసారి అమెరికా ప్రత్యక్షంగా అణుదాడి ముప్పును ఎదుర్కొంటుందని బైడెన్‌ పేర్కొన్నారు. అణు దాడిపై బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. 

ఉక్రెయిన్‌ విలీన భూభాగాలను కాపాడుకొనేందుకు దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్‌ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఇది కేవలం టాక్టికల్‌ అణ్వాయుధాలను దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇటువంటి అణ్వాయుధాలు కూడా తీవ్రస్థాయి సంక్షోభానికి కారణమవుతాయని బైడెన్‌ హెచ్చరించారు. ‘పుతిన్‌ జోక్‌ చేయడంలేదు. అతడు టాక్టికల్‌ అణ్వాయుధాలు లేదా జీవాయుధాలు లేదా రసాయన ఆయుధాల వినియోగం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి సైన‍్యం ఆశించిన స్థాయిలో పోరాడటంలేదు. ఇది కేవలం అణ్వాయుధ వినియోగంతోనే ముగియదు. పుతిన్‌ను ఆ మార్గం నుంచి ఎలా తప్పించాలనే అంశంపై మేం కసరత్తు చేస్తున్నాం. కేవలం పుతిన్‌ను ఆ స్థానం నుంచి తప్పించడమే కాదు.. అతణ్ని ఓడించడం, రష్యాలో ఆయన్ను బలహీన పర్చడంపై కూడా పనిచేస్తున్నాం’ అని అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement