nuclear weapons
-
నా జోలికొస్తే.. ఇరాన్ సర్వ నాశనమవుతుంది: ట్రంప్
వాషింగ్టన్: అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తుందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని యోచిస్తున్నట్లు ప్రకటించారాయన. అందుకు సంబంధించిన ప్రతిపాదనపై ఆయన సంతకం కూడా చేశారు. అదే సమయంలో.. ఇరాన్ గనుక తనను చంపాలని చూస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన హెచ్చరించారు.గతంలో.. అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌పై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) గరిష్టంగా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే.. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రముఖంగా కథనాలు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీకి ముందు ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. తన తొలి హయాంలో టెహ్రాన్‌పై వాషింగ్టన్ అమలుచేసిన కఠిన విధానాన్ని పునరుద్ధరించే అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి.. ‘‘ఇరాన్(Iran) అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌తో డీల్‌కు నేను సానుకూలంగానే ఉన్నా. కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదు. ఆ దేశ నాయకుడితోనూ చర్చలు జరిపేందుకు సుముఖమే. అయితే, అణ్వాయుధాన్ని అందుకోవడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉంది. దాన్ని అడ్డుకోవాలి. ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండొద్దు.... ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ, నాకు అంతగా ఇష్టం లేదు. అధ్యక్షుడిగా నేను సంతకం చేసే సమయంలోనే అన్ని విభాగాల నుంచి ఆ విజ్ఞప్తులు వచ్చాయి. ప్రత్యేకించి.. అణ్వాయుధాల విషయంలో. తప్పనిసరిగా ఆ ఆదేశాలపై నేను సంతకాలు పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇరాన్‌కు విషయంలో అది మరింత కఠినంగా ఉండబోతోంది’’ అని అన్నారాయన. ఇక ఇరాన్ తనను హత్య చేయడానికి కుట్ర పన్నితే.. అ దేశం పూర్తిగా నాశనమవుతుంది. ఏమీ మిగలదు అని ట్రంప్ హెచ్చరించారు. ‘‘నన్ను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే..! నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా అడ్వైజర్లకు ఆదేశాలిచ్చా’’ అని తెలిపారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచే ఇరాన్ నుంచి ఆయనకు ప్రాణహాని ఉందని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ట్రంప్ తొలిసారి అధికారంలో ఉన్న సమయంలో 2020లో అప్పటి ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని మట్టుబెట్టేందుకు ఆదేశాలిచ్చారు. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలతోనే అమెరికా దళాలు వైమానిక దాడులు చేయగా.. అందులోనే సులేమానీ ప్రాణాలు కోల్పోయారు. ఆ ఘటనకు ప్రతీకారంగా టెహ్రాన్.. ట్రంప్‌పై దాడులకు కుట్రలు పన్నుతున్నట్లు ఇటీవల కథనాలు వచ్చాయి. కిందటి ఏడాది నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ఇరాన్ పాత్ర ఉన్నట్లు అమెరికా న్యాయవిభాగం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే ఇరాన్ ఆ ఆరోపణలను తోసిపుచ్చింది. -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
అటు డోమ్..ఇటు ఫతాహ్!
ప్రాచీన మత సంబంధ కట్టడాల్లోకి పాలస్తీనియన్లను అనుమతించకపోవడంతో ఇజ్రాయెల్, హమాస్ మధ్య మొదలైన యుద్ధం లెబనాన్ మీదుగా ఇప్పుడు ఇరాన్‌ను తాకింది. హమాస్, లెబనాన్ కంటే ఇరాన్ ఇప్పుడు ఇజ్రాయెల్‌కు ప్రధాన యుద్ధక్షేత్ర పోటీదారుగా నిలిచింది. ఫతాహ్–2 హైపర్సోనిక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థల సమర్థతను ప్రశ్నార్థకం చేసింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్‌ల సైనికసత్తాపై మరోమారు చర్చ మొదలైంది. అనూహ్యంగా దూసుకొచ్చే శత్రు క్షిపణులను గాల్లోనే తుత్తునియలు చేసే గగనతల రక్షణ వ్యవస్థలకు ఇజ్రాయెల్ పెట్టింది పేరు. అలాంటి వ్యవస్థలనూ ఇరాన్‌కు చెందిన ఫతాహ్ క్షిపణులు చేధించుకుని రావడం రక్షణ రంగ నిపుణులనూ ఒకింత ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ మొహరించిన భిన్న శ్రేణుల గగనతల రక్షణ వ్యవస్థలుసహా ఇరుదేశాల సైనికపాటవంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సైనిక బలగాల్లో ఇరాన్ పైచేయి ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్ సైనికబలం పెద్దది. ఇరాన్లో 3,50,000 మంది ఆర్మీ, 1,90,000 ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్, 18వేల మంది నేవీ, 37 వేల మంది వాయుసేన, 15వేల మంది ఎయిర్‌డిఫెన్స్ సైనికులున్నారు. మరో 3,50,000 మంది రిజర్వ్ బలగాలున్నారు. ఇజ్రాయెల్‌లో కేవలం 1,26,000 మంది ఆర్మీ, 9,500 మంది నేవీ, 34,000 మంది ఎయిర్‌ఫోర్స్, 4,65,000 మంది రిజర్వ్బలగాలున్నాయి. రక్షణ బడ్జెట్లో ఇజ్రాయెల్ ముందంజ ఇరాన్ 2023 ఏడాదిలో రక్షణ కోసం 10.3 బిలియన్ డాలర్లు ఖర్చుచేస్తే ఇజ్రాయెల్ గత ఏడాది ఏకంగా 27.5 బిలియన్ డాలర్లు ఖర్చుచేసింది. 2022తో పోలిస్తే ఈ బడ్జెట్ 24% అధికం కావడం విశేషం.పదాతిదళంలో ఇరాన్ మేటి 10,513 యుద్ధట్యాంకులు, 6798 శతఘ్నులు, 640 ఆయుధాల రవాణా వాహనాలు, 55 సైనిక హెలికాప్టర్లు ఇరాన్ సొంతం. ఇజ్రాయెల్ వద్ద 400 యుద్ధట్యాంకులు, 530 శతఘ్నులు, 1,190 ఆయుధాల రవాణా వాహనాలున్నాయి. ఎయిర్‌ఫోర్స్‌లో ఇజ్రాయెల్ హవా ఇజ్రాయెల్ వద్ద అమెరికా తయారీ అత్యాధునిక ఎఫ్రకం జెట్ యుద్ధవిమానాలున్నాయి. మొత్తంగా 345 యుద్ధవిమానాలున్నాయి. 43 ఆర్మీ హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద 312 యుద్ధవిమానాలు, 23 ఆర్మీ విమానాలు, 57 హెలికాప్టర్లున్నాయి. ఇరాన్ వద్ద అధిక జలాంతర్గాములు ఇరాన్ వద్ద 17 జలాంతర్గాములు, 69 గస్తీ, నిఘా నౌకలు, 7 యుద్ధనౌకలు, 23 విమానవాహక నౌకలున్నాయి. ఇజ్రాయెల్ వద్ద కేవలం ఐదు జలాంతర్గాములు, 49 గస్తీ/యుద్ధ నౌకలున్నాయి. విభిన్న గగనతల రక్షణ వ్యవస్థలు ఇజ్రాయెల్‌లో మొత్తంగా 10 ఐరన్‌డోమ్ వ్యవస్థలున్నాయి. ఇవిగాక డేవిడ్స్ స్లింగ్, ఆరో సిస్టమ్స్ మొహరించాయి. ఇరాన్ వద్ద ‘పరారుణ’గుర్తింపు వ్యవస్థ ఉంది. వీటి సాయంతో ఎస్–200, ఎస్–300, దేశీయ 373 క్షిపణి వ్యవస్థలను ప్రయోగించి శత్రు క్షిపణులను నేలకూలుస్తుంది. ఇదిగాక ఎంఐఎం–23 హాక్, హెచ్‌క్యూ–2జే, కోర్డాడ్–15, చైనా తయారీ సీహెచ్–ఎస్ఏ–4, 9కే331 టోర్ ఎం1 క్షిపణులున్నాయి. అణ్వాయుధాలుఇజ్రాయెల్ వద్ద దాదాపు 90 దాకా అణ్వా్రస్తాలున్నాయి. అయితే ఇరాన్ వద్ద అణ్వయుధాలు ఉన్నాయో లేదో ఎవరికీ తెలీదు. కానీ అణ్వాయుధాల్లోని వార్‌హెడ్‌లో వాడే యురేనియంను మిలటరీ గ్రేడ్‌కు తెచ్చేందుకు ఆ మూలకం శుద్ధి ప్రక్రియను ఇరాన్ వేగవంతంచేసింది. బాలిస్టిక్ క్షిపణులు ఇరాన్ వద్ద తాండార్ 69, ఖొరమ్షహర్, సెఝిల్ బాలిస్టిక్ క్షిపణులున్నాయి. ఇజ్రాయెల్ వద్ద లోరా, జెరికో పేర్లతో 150 కి.మీ.ల నుంచి 6,500 కి.మీ.లు దూసుకుపోయే విభిన్న బాలిస్టిక్ క్షిపణులున్నాయి.ఐరన్ డోమ్ (స్వల్పశ్రేణి)పరిధి4 నుంచి 70 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన క్షిపణులను ఈ వ్యవస్థ కూల్చేస్తుంది. స్వల్పదూర రాకెట్లు, బాంబులను తమిర్ క్షిపణులుఅడ్డుకుంటాయి. ఏమేం ఉంటాయి? ఐరన్‌డోమ్ వ్యవస్థలో తమిర్ క్షిపణులు, లాంఛర్, రాడార్, కంట్రోల్ సిస్టమ్ ఉంటాయి డేవిడ్స్ స్లింగ్ (మధ్య శ్రేణి)పరిధి40 నుంచి 300 కి.మీ.ల ఎత్తుదాకా దూసుకొచ్చిన స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు, పెద్ద రాకెట్లు, క్రూయిజ్ మిస్సైళ్లను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? స్టన్నర్ ఇంటర్సెప్టార్ క్షిపణులు, నిట్టనిలువుగా ప్రయోగించే వేదిక, రాడార్, నియంత్రణ వ్యవస్థ ఇందులో ఉంటాయి ఆరో సిస్టమ్ (దీర్ఘ శ్రేణి)పరిధిఇజ్రాయెల్ నుంచి 2,400 కి.మీ.ల దూరంలో ఉండగానే శత్రువులకు చెందిన మధ్య శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఈ వ్యవస్థ అడ్డుకుంటుంది. ఏమేం ఉంటాయి? తక్కువ ఎత్తులో సమాంతరంగా వస్తే ఆరో–2 మిస్సైళ్లు, ఎక్కువ ఎత్తులో వస్తే ఆరో–3 మిస్సైళ్లు అడ్డుకుంటాయి. లాంఛర్, కంట్రోల్ సెంటర్ ఉంటాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
అణుబాంబుల సామర్థ్యం భారీగా పెంచుకుంటాం: కిమ్
ప్యాంగ్యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం. ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు. ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ -
వినాశనపు ఒడ్డున ప్రపంచం
2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల(ఎన్9) దగ్గర 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని ‘స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టి ట్యూట్’ నివేదిక చెబుతోంది. ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు ఈ దేశాలు (భారత్ సహా) గత ఏడాది ఏకంగా 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. రష్యా, అమెరికా వద్ద ఉన్నన్ని ఖండాంతర క్షిపణులను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోందని కూడా ఈ నివేదిక తెలియజేస్తోంది. ఇది దక్షిణాసియాకు క్షేమకరం కాకపోగా, పరోక్షంగా భారత్‌కు కూడా ముప్పే. శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం జరగకపోవడం ఈ పరిస్థితికి కారణం. కనుచూపు మేరలో ఇది మెరుగుపడే సూచనలూ లేకపోవడం ఆందోళనకరం.ప్రపంచ వినాశనానికి హేతువు కాగల అణ్వస్త్రాలు మరోసారి పడగ విప్పుతున్నాయి. గత నెల పదిహేడున విడుదలైన రెండు అంతర్జాతీయ స్థాయి నివేదికలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ భద్రతను సవాలు చేస్తున్నాయి. మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ టు అబాలిష్ న్యూక్లియర్ వెపన్స్(ఐసీఏఎన్ ) విడుదల చేయగా... రెండోదాన్ని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్(ఎస్ఐపీఆర్ఐ–సిప్రి) విడుదల చేసింది. రెండింటిలోని సమాచారం మానవాళిని హెచ్చరించేది మాత్రమే కాదు... భయపెట్టేది కూడా.ఆకలి కంటే అణ్వాయుధాలే మిన్నా?ఐసీఏఎన్ రిపోర్టు ప్రకారం, ప్రపంచం మొత్తమ్మీద అణ్వాయుధ సామర్థ్యమున్న తొమ్మిది దేశాలు (అమెరికా, యూకే, రష్యా, చైనా, ఫ్రాన్ ్స, ఇండియా, ఇజ్రాయెల్, పాకిస్తాన్ , ఉత్తర కొరియా) తమ ఆయుధ సంపత్తిని పెంచుకునేందుకు, ఆధునికీకరించుకునేందుకు గత ఏడాది ఎకాఎకి 9,100 కోట్ల డాలర్లు ఖర్చు పెట్టాయి. అన్ని దేశాల సమర్థింపు ఒక్కటే... ‘ఇతరుల’ నుంచి ముప్పు ఉందని! 2023లో అందరూ ఊహించినట్టుగానే అమెరికా అత్యధికంగా 5,150 కోట్ల డాలర్లు అణ్వాయుధాలపై ఖర్చు చేయగా... చైనా (1,180 కోట్ల డాలర్లు), రష్యా (830 కోట్ల డాలర్లు) ఖర్చు చేసినట్లు ఐసీఏఎన్ నివేదిక తెలిపింది. ‘‘గత ఏడాది ఈ తొమ్మిది దేశాలు కలిసికట్టుగా ప్రతి సెకనుకు సుమారు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టాయి’’ అని ఐసీఏఎన్ డైరెక్టర్ మెలిస్సా పార్క్ తెలిపారు. ఈ మొత్తం ప్రపంచం మొత్తమ్మీద ఆకలిని అంతం చేసేందుకు అవసరమయ్యే నిధులకంటే చాలా ఎక్కువని ఆమె వివరించారు. ఇంత మొత్తాన్ని మొక్కలు నాటేందుకు ఉపయోగించి ఉంటే ఒక్కో నిమిషానికి కనీసం పది లక్షల మొక్కలు నాటి ఉండవచ్చు అని మెలిస్సా అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావం కారణంగా భూమ్మీద మనిషి మనుగడే ప్రశ్నార్థకమవుతున్న ఈ తరుణంలో ఇంత పెద్ద ఎత్తున మొక్కలు నాటే అంశాన్ని ఎత్తడం ఎంతైనా మంచి విషయమే కదా? ఈ ఏడాది వేసవి ఎంత మంట పుట్టించిందో, వడగాడ్పులకు ఎంతమంది మరణించారో మనకు తెలియంది కాదు. మనుషుల నిష్పత్తితో పోల్చినప్పుడు ఉండాల్సినన్ని వృక్షాలు లేకపోవడం వల్ల చాలా దేశాలు అనేక వాతావరణ సంబంధ సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ అంశంలో పెద్ద దేశాల్లోకీ ఇండియా అత్యంత ఎక్కువగా ప్రభావితం అవుతోంది.సిప్రి ఇయర్‌బుక్–2024 అంతర్జాతీయంగా భద్రత విషయంలో వస్తున్న మార్పులేమిటి? ఆయుధాలు, టెక్నాలజీ రంగాల్లోని ముఖ్య పరిణామాలు ఏమిటి? అనేది సమగ్రంగా వివరిస్తుంది. దేశాల మిలిటరీ పెడుతున్న ఖర్చులు, ఆయుధాల ఉత్పత్తి, వ్యాపారాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా సాగుతున్న ఘర్షణలను కూడా ఈ ఇయర్ బుక్ వివరిస్తుంది. సంప్రదాయ ఆయుధాలతోపాటు అణ్వస్త్రాలు, జీవ, రసాయన ఆయుధాలపై కూడా ఇది దృష్టి పెడుతుంది. అణ్వాయుధాలకు సంబంధించి ఇందులో దాదాపు వంద పేజీల విలువైన సమాచారాన్ని పొందుపరిచారు. పెరిగిన చైనా అణ్వాయుధాలు...సిప్రి నివేదిక ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాల సంఖ్య మాత్రమే కాదు... అందులో రకాలు కూడా పెరిగాయి. మొత్తం తొమ్మిది దేశాలు అణ్వాయుధాల ద్వారా మాత్రమే తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవచ్చునని అనుకుంటున్నాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధాన్నే తీసుకోండి. హద్దులు దాటొద్దని నాటోను హెచ్చరించేందుకు రష్యా అణ్వాయుధాలను వాడేందుకు వెనుకాడమని చెబితే... బదులుగా నాటో, అమెరికా కూడా అణ్వాస్త్రాలతో యుద్ధానికి సిద్ధమన్నట్టు కాలు దువ్వుతున్నాయి.2024 జనవరి నాటికి తొమ్మిది అణ్వాయుధ దేశాల(ఎన్9) దగ్గర దాదాపు 12,121 అణ్వాస్త్రాలు ఉన్నాయని సిప్రి నివేదిక చెబుతోంది. ఇందులో 9,585... వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు... వీటిల్లో 3,904 అణ్వాస్త్రాలు ఇప్పటికే నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేశారనీ, 2,100 అణ్వస్త్రాలను ఆపరేషనల్ అలర్ట్‌తో ఉంచారనీ కూడా సిప్రి ఇయర్ బుక్ చెబుతోంది. గత ఏడాదితో పోలిస్తే ఆపరేషనల్ అలర్ట్‌తో ఉన్న అణ్వాయుధాలు ఈ ఏడాది దాదాపు వంద ఎక్కువ కావడం గమనార్హం. ప్రపంచం మొత్తమ్మీద ఉన్న అణ్వాయుధాల్లో 88 శాతం అమెరికా, రష్యాల వద్దే ఉండటం గమనార్హం. అయితే చైనా అణ్వాయుధ సంపత్తి 2023 నాటి 410 నుంచి ఈ ఏడాది జనవరి నాటికి 500కు చేరడం ఆందోళన కలిగించే అంశమని సిప్రి నివేదిక తెలిపింది. చైనా తన అణ్వాయుధాలను ఆధునికీకరించుకుంటోందనీ, రానున్న దశాబ్ద కాలంలో ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచుకునే ప్రయత్నాల్లో ఉందనీ సిప్రి నివేదిక తెలియజేస్తోంది. ‘‘రష్యా, అమెరికాల వద్ద ఉన్నన్ని ఐసీబీఎం(ఖండాంతర క్షిపణు)లను సిద్ధం చేసేందుకు చైనా ప్రయత్నిస్తోంది’’ అని ఈ నివేదిక రచయితలు తెలిపారు. చైనా తననితాను అమెరికాకు ప్రత్యర్థిగా భావించవచ్చు కానీ... చైనా ఈ మధ్యకాలంలో అణ్వాయుధాలను సిద్ధం చేయడం ఎక్కువ కావడం దక్షిణాసియా ప్రాంత భద్రతకు ఏమంత మంచిది కాదు. ఇంకోలా చెప్పాలంటే భారతదేశానికి కూడా పరోక్ష ముప్పు పొంచి ఉందన్నమాట! కనబడని కాంతిప్రచ్ఛన్న యుద్ధ కాలంలో, 1945 –1991 మధ్యన అమెరికా, ఆ దేశాన్ని బలపరిచే యూకే, ఫ్రాన్ ్సలు ఒక పక్క... ఒకప్పటి సోవియట్ రష్యా మరో పక్క అన్నట్టుగా అణ్వాయుధ పోటీ నడిచింది. 1962 నాటి క్యూబన్ మిస్సైల్ ఉదంతం తరువాత ఇరు పక్షాలు కూడా అణ్వస్త్ర నిరోధకతకు అనుకూలంగా కొంత తగ్గాయి. ఆయుధాల నియంత్రణ, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ వంటి అంశాల ఆధారంగా ఈ సంయమనం సాధ్యమైంది. 2022లో ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసింది మొదలు ప్రపంచం అణ్వస్త్రాల విషయంలో రెండుగా విడిపోయింది. ఒకటేమో అమెరికా నేతృత్వంలోని మిలిటరీ భాగస్వాములుగా మారితే... రెండోదేమో రష్యా– చైనా, జూనియర్ పార్ట్నర్గా ఉత్తర కొరియా కూటమిగా నిలిచాయి. భారత్, పాకిస్తాన్ , ఇజ్రాయెల్ ఏ కూటమిలోనూ చేరలేదు. కాకపోతే వాటి భౌగోళిక స్థితిని బట్టి ఎవరు ఎటువైపు అన్నది స్పష్టమే. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఒకసారి ఆలోచిస్తే 2022 నాటి నుంచి ప్రపంచం మొత్తమ్మీద శక్తిమంతమైన దేశాల మధ్య వ్యూహాత్మక అంశాల విషయంలో సమాచార వినిమయం పెద్దగా జరగడం లేదని చెప్పాలి. అమెరికా దేశీయంగా ఎన్నో ఆర్థిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటోంది. డోనాల్డ్ ట్రంప్ మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంకోపక్క ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని కొనసాగించాలనే నిశ్చయాభిప్రాయంతో రష్యా ఉంది. చైనా కూడా తన సరిహద్దుల విషయంలో దుందుడుకుగా వ్యవహరిస్తోంది. నిజంగానే ఇది ప్రపంచం ఎదుర్కొంటున్న ముప్పు అని చెప్పాలి. ఐసీఏఎన్ , సిప్రి నివేదికలు ఈ ముప్పునే సవివరంగా వివరిస్తున్నాయి. కనుచూపు మేరలో పరిస్థితి మెరుగుపడే సూచనలూ లేవని చెబుతూండటం కఠోర సత్యం.సి. ఉదయ్ భాస్కర్ వ్యాసకర్త ఢిల్లీలోని సొసైటీ ఫర్ పాలసీ స్టడీస్ డైరెక్టర్(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
‘అణు బాంబుల ధ్వంసం.. సీపీఎంపై రాజ్‌నాథ్ ఫైర్
తిరువనంతపురం: సీపీఎం పార్టీపై దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. కేరళలోని కాసర్గాడ్లో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ‘సీపీఎం అధికారంలోకి వస్తే దేశంలోని న్యూక్లియర్ ఆయుధాల(అణు బాంబులు)ను ధ్వంసం చేస్తామని చెబుతోంది. పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా న్యూక్లియర్ బాంబులను కలిగి ఉన్నప్పుడు మనం వాటిని వదులుకుంటే ఎలా. సీపీఎం తీరు దేశ భద్రతతో ఆటలాడినట్లుంది. సీపీఎం హామీపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తన వైఖరి వెల్లడించాలి’అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు. సీపీఎం, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో దోచుకోవాలని చూస్తున్నాయని, ఇది తాము జరగనివ్వబోమని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 26న రెండో దశలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి.. తృణమూల్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే -
మరిన్ని శాటిలైట్లు, అణ్వస్త్రాలు: కిమ్
సియోల్(దక్షిణ కొరియా): కొరియా ద్వీపకల్పంలో అమెరికా, దక్షిణాకొరియా యుద్ధ వాతావరణాన్ని సృష్టించాయని ఉత్తరకొరియా నియంత కిమ్ జాన్ మండిపడ్డారు. బదులుగా తామూ ఆయుధ సంపత్తిని పెంచుకుంటామని ప్రకటించారు. కొత్త ఏడాదిలో అదనంగా మూడు నిఘా ఉపగ్రహాల ప్రయోగాలు చేపడతామని ప్రకటించారు. అలాగే మరిన్ని అణ్వస్త్రాలనూ తయారు చేస్తామన్నారు. ఉత్తర కొరియా అధికారిక కేసీఎన్ఏ వార్తాసంస్థ ఈ మేరకు వెల్లడించింది. ట్రంప్ హయాంలో అమెరికాతో చర్చలు విఫలమయ్యాక అగ్రరాజ్యం నుంచి ఆక్రమణ, దాడి ముప్పు పొంచి ఉందన్న అనుమానంతో కిమ్ ఆయుధ సంపత్తి విస్తరణకు తెర తీశారు. ‘‘అమెరికా, దక్షిణకొరియా కవి్వంపు చర్యలు కొరియా ద్వీపకల్పాన్ని అణుయుద్ధం అంచుకు తీసుకెళ్లాయి. వాటి మెరుపుదాడులను తట్టుకుని నిలబడాలంటే మా సాయుధ, శక్తి సామర్థ్యాలను మరింత పటిష్టం చేసుకోవడం అత్యవసరం’’ అన్నారు. -
కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ రెచ్చగొట్టింది. ఈసారి క్షిపణి పరీక్షతో కాదు.. అంతకు మించిన చర్యతో. అణ్వాయుధ బలగాలను విపరీతంగా పెంచుకునేలా ఏకంగా ఓ ప్రత్యేక చట్టాన్ని రూపొందించుకుంది. తద్వారా ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోసింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నిరాయుధీకరణ పిలుపు తుంగలో తొక్కి.. అణు ఆయుధాలను అపరిమితంగా తయారు చేసుకునే చట్టాన్ని రూపొందించారు. తద్వారా.. ప్యాంగ్యాంగ్తో ఆర్థిక సాయం విషయంలో నిలిచిపోయిన చర్చల పునరుద్దరణకు అమెరికా చేసిన అభ్యర్థనను ఆయన తేలికగా తీసుకున్నట్లు అయ్యింది. గురువారం ఉత్తర కొరియా పార్లమెంట్ ప్రత్యేక సెషన్ జరిగింది. ఈ సమావేశంలో.. కిమ్ జోంగ్ ఉన్ అమెరికా, దాని మిత్ర పక్షాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్యాంగ్యాంగ్ అణు ఆశయాలను అణిచివేసేందుకు, దాని వ్యవస్థను నాశనం చేసేందుకు అమెరికా, దాని భాగస్వాముల నుంచి వచ్చే బెదిరింపులను ఎదుర్కోవడానికి తాను ఈ చర్య తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు డీపీఆర్కే న్యూక్లియర్ ఫోర్స్ బిల్డింగ్ పాలసీ చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త చట్టం ద్వారా ఉత్తర కొరియా అపరిమితంగా అణ్వాయుధాల్ని తయారు చేసుకోవచ్చని ఆయన వెల్లడించారు. అణ్వాయుధాల ఉత్పత్తిని విపరీతంగా పెంచడం, వాటిని వివిధ సేవల్లో ఉపయోగించుకోవడం లాంటి అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మరోవైపు ఈ చర్యపై అమెరికా స్పందన తెలియాల్సి ఉంది. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేస్తా.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
వాషింగ్టన్: దాదాపు 11 నెలలుగా ఉక్రెయిన్, రష్యా మధ్య భీకర యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇంకా ఉద్రిక్తతలు చల్లారడంలేదు. రష్యా క్షిపణులతో విరుచుకుపడుతుండగా.. ఉక్రెయిన్ దీటుగా బదులిస్తోంది. ఈ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు కోరినా ఫలితం లేకుండాపోయింది. అయితే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాన్ని 24 గంటల్లోనే ఆపేవాడినని పేర్కొన్నారు. చర్చల ద్వారా సమస్యను వెంటనే పరిష్కరించేవాడినని చెప్పుకొచ్చారు. ఇప్పటికి కూడా తాను అధ్యక్షుడినైతే చర్చల ద్వారా ఈ భయానక యుద్ధాన్ని 24 గంటల్లో ఆపేలా చేస్తానని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫాం 'ట్రుత్ సోషల్'లో రాసుకొచ్చారు. గతేడాది ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రకు దిగింది. అప్పటినుంచి బాంబులు, క్షిపణులుతో కీవ్‌పై విరుచుకుపడుతోంది. మొదట్లో రష్యా దాడులకు తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్.. ఆ తర్వాత ధీటుగా బదులిస్తూ శత్రు దేశానికి సవాళ్లు విసురుతోంది. ప్రపంచదేశాలు కూడా ఉక్రెయిన్‌కు సంఘీభావంగా నిలిచి ఆర్థికంగా, ఆయుధాలపరంగా అండగా నిలుస్తున్నాయి. అమెరికా, జర్మనీ వంటి దేశాలు కీవ్‌కు అధునాతన యుద్ధ ట్యాంకులు, ఆయుధ వ్యవస్థలను సమకూరుస్తున్నాయి. ఈ పరిణామాల కారణంగా రష్యా అణ్వాయుధాలతో దాడులు చేసే ప్రమాదం ఉందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. తానుంటే 24 గంటల్లోనే యుద్ధాన్ని ఆపే వాడినని చెబుతున్నారు. -
తెలివిగా యూ టర్న్ తీసుకున్న చైనా!... రష్యాకి షాక్
తొలిసారిగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ రష్యాని యుద్ధం మరింత తీవ్రతరం చేయవద్దని అణ్వాయుధాలు ఉపయోగించందంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌తో బీజింగ్ సందర్శించి రష్యా అణ్వయుధ దాడిని వ్యతిరేకించాలని కోరిన నేపథ్యంలో జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో 20వ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా జాతీయ కాంగ్రెస్ ముగిసిన తర్వాత చైనా అధ్యక్షుడుని కలిసిన తొలి యూరోపియన్ నాయకుడు స్కోల్జ్. ఆయన బీజింగ్ గ్రేట్ హాల్ ఆప్ పీపుల్‌లో జరిగిన సమావేశంలో ఉక్రెయిన్‌పై రష్యా అణు బెదిరింపును నిరోధించడం, వ్యతిరేకించడం వంటివి చేయాలని జిన్‌పింగ్‌కి చెప్పారు స్కోల్జ్. ఐతే చైనా ఫిబ్రవరిలో రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగడానికి ముందు నుంచి రష్యాతో తమకు హద్దులు లేని స్నేహం ఉందని ప్రకటించడంతో యూరోపియన్‌తో సహా పాశ్చాత్య దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అదీగాక యుద్ధం మొదలయ్యాక కూడా రష్యాకి మద్దతిస్తూ.. ప్రేరేపించింది యూఎస్ నేతృత్వంలోని నాటో అంటూ నిందించింది చైనా. ఐతే ఇప్పుడూ చైనా తన యూరోపియన్లతో ఉన్న సంబంధాలను తిరిగే పెంపొందించే క్రమంలో అనుహ్యంగా రష్యాకి వ్యతిరేకంగా యూటర్న్ తీసుకుంది. అంతేగాదు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా యూరోపియన్, పాశ్చాత్య దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో చైనా జర్మనీలు మార్పు, అస్తిరత దృష్ట్యా సహకరించుకోవాల్సిన అవసరాన్ని గురించి జిన్‌పింగ్ నొక్కి చెప్పారు. అంతేగాక చైనా, జర్మనీలు ఒకరినొకరు గౌరవించుకోవడం, ప్రధాన ప్రయోజనాలకు అనుగుణంగా ఉండటం చాలా ముఖ్యం అని జిన్‌పింగ్ అన్నారు. అంతేగాదు జీ7 దేశాలనికి చెందిన నాయకుడు స్కోల్జ్ చైనా కంపెనీ వాటాను కొనుగోలు చేయబోతున్నట్లు తేలడంతో, భద్రత దృష్ట్యా ఆయనకు స్వదేశంలో గణనీయమైన వ్యతిరేకత వెల్లువెత్తింది. స్కోల్జ్ బీజింగ్‌తో ఒక ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఈ మేరకు స్కోల్జ్ చైనాలోని ప్రవాసులు జర్మనీ బయోఎన్టెక్కి సంబంధించిన కోవిడ్ -19 వ్యాక్సిన్‌ను ఉపయోగించడానికి అనుమతించడమే కాకుండా చైనా పౌరులకు ఉచితంగా అందుబాటులో ఉంచేలా బీజింగ్‌ను ఒత్తిడి చేసినట్లు అధికారిక వర్గాల సమాచారం. (చదవండి: చైనా ఎంత పనిచేసింది.. పలు దేశాల్లో విమానాశ్రయాలు బంద్!) -
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్
అణ్వాయుధాలు ప్రయోగించం-పుతిన్ -
Ukraine-russia war: అణ్వాయుధాలు ప్రయోగించం: పుతిన్
మాస్కో: ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించే ఉద్దేశం తమకు లేనేలేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. రాజకీయంగా, సైనికపరంగా కూడా తమకు అలాంటి అవసరం లేదన్నారు. ప్రపంచంపై పెత్తనం కోసం పశ్చిమ దేశాలు చేస్తున్న ప్రయత్నాల వల్లనే ప్రస్తుత సంక్షోభం తలెత్తిందని అన్నారు. ఇతర దేశాలపై తమ పెత్తనం సాగించేందుకు ప్రమాదకరమైన, క్రూరమైన క్రీడ ఆడుతున్నాయంటూ అమెరికా, మిత్ర పక్షాలపై ఆయన విరుచుకుపడ్డారు. కాగా, ఖేర్సన్ను తిరిగి తమ వశం చేసుకోవడమే లక్ష్యంగా ముందుకొస్తున్న ఉక్రెయిన్ సేనల ధాటికి ఖేర్సన్‌లోని రష్యా అనుకూల ఉన్నతాధికారులు పారిపోయారు. వీరితోపాటు వేలాది మంది స్థానికులు దాడుల భయంతో స్వస్థలాలను వదిలి వెళ్లిపోయారు. ‘తాజాగా అమెరికా, పశ్చిమ దేశాలకు చెందిన వాణిజ్య ఉపగ్రహాలను యుద్ధంకోసం ఉక్రెయిన్ వాడుతోంది. ఇది అత్యంత ప్రమాదకరం’ అని ఐరాసలో ఆయుధాల నియంత్రణ ప్యానెల్లో రష్యా ప్రతినిధి కాన్స్టాంటిన్ ఆరోపించారు. యుద్ధం కారణంగా శిలాజ ఇంధనాలకు ఎవరూ ఊహించనంతగా డిమాండ్ పెరిగే ప్రమాదముందని పారిస్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఇంధన ఏజెన్సీ తన నివేదికలో హెచ్చరించింది. -
బైడెన్ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని ఫైర్
ఇస్లామాబాద్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్ అణ్వాయుధాల సామర్థ్యంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చాలా ఘాటుగా స్పందించారు. గత దశాబ్దాలుగా అణ్వాయుధాల విషయంలో పాక్ అత్యంత బాధ్యతాయుతమైన అణు రాజ్యంగా నిరూపించుకుంది. తమ అణు కార్యక్రమాలను ఫూల్ ఫ్రుఫ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్‌తో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు షెహబాజ్ ట్విట్టర్లో... అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. పాక్ బాధ్యతయుతమైన అణుదేశం. అంతర్జాతీయ అణుశక్తి(ఐఏఈఏ) అవసరాలకు అణుగుణంగా మా అణ్వాయుధాలకు అత్యుత్తమ రక్షణ వ్యవస్థ ఉంది. దీనికి మేము గర్విస్తున్నాం. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ...జాతీయ ప్రయోజనాలను పరిరక్షించగల బాధ్యతాయుతమైన అణుదేశం పాక్. అన్ని స్వతంత్ర దేశాల మాదిరిగా మా అణుకార్యక్రమాల వల్ల ఏ దేశానికి ముప్పు వాటిల్లదు. మేము ప్రాంతీయ శాంతి భద్రతలను పెంపొందించడంలో యూఎస్‌కి సహకరించాలన్నదే మా కోరిక. దయచేసి అణు సామర్థ్యం విషయంలో లేనిపోని సందేహాలకు తావివ్వద్దు. అలాగే పాకిస్తాన్ తన స్వయంప్రతిపత్తి సార్వభౌమ రాజ్యాధికారం తోపాటు ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే హక్కును కలిగి ఉంది అని షెహబాజ్ ట్వీట్ చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) చీఫ్ ఇమ్రాన్ ఖాన్ కూడా స్పందిస్తూ...బైడెన్ దేన్ని ఆధారం చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారంటూ నిలదీశారు. ముఖ్యంగా అణ్వాయుధీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలలో పాల్గొన్న యూఎస్‌లా పాకిస్తాన్ ఎప్పుడు దూకుడుగా వ్యవహరించింది అని ప్రశ్నించారు. (చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు... ఆ దేశాలతో ముప్పు) -
ఆ దేశాలకు సహాయం చేయడం ఇంకా ప్రమాదకరం సార్!
ఆ దేశాలకు సహాయం చేయడం ఇంకా ప్రమాదకరం సార్! -
మేము డేంజరా? మరి అణ్వాయుధాలున్న భారత్ ప్రమాదం కాదా?
ఇస్లామాబాద్: అణ్వాయుధ సమన్వయం లేని పాకిస్థాన్ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన దేశమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై పాక్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బైడెన్ వాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఇస్లామాబాద్‌లోని అమెరికా రాయబారి డొనాల్డ్ బ్లోమ్కు సమన్లు పంపింది. పాకిస్థాన్ తన సమగ్రత, భద్రత విషయంలో మొండిగా ఉంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అన్నారు. ఒకవేళ ప్రశ్నలు లేవనెత్తాల్సి వస్తే భారత్‌లో అణ్వాయుధాలపై కూడా ప్రశ్నించాలని పేర్కొన్నారు. బైడెన్ కామెంట్లు తనను షాక్‌కు గురిచేశాయని భుట్టో అన్నారు. సమన్వయ లోపం వల్లే బైడెన్ పొరబడి ఉంటారని చెప్పారు. లాస్ ఏంజెల్స్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పాకిస్థాన్ అత్యంత ప్రమాదకర దేశమని బైడెన్ అన్నారు. పాక్ ప్రధాని అమెరికాతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. చదవండి: పాకిస్తాన్‌పై బైడెన్ సంచలన వ్యాఖ్యలు -
పుతిన్ సంచలన నిర్ణయం.. ప్రపంచానికి పెను సవాల్?
ప్రపంచానికే పెద్ద తలనొప్పిగా తయారైంది రష్యా. చిన్నదేశం ఉక్రెయిన్‌పై ఏకపక్ష యుద్ధానికి కాలు దువ్వింది. పెను విధ్వంసం సృష్టించినా ఉక్రెయిన్ ఆర్మీ ధీటుగా నిలబడటంతో తడబడుతోంది వ్లాదిమిర్ పుతిన్ సేన. దీంతో, ఇప్పుడు అణుబాంబును అటక మీద నుంచి దింపి.. ప్రయోగిస్తానంటూ పుతిన్ బెదిరిస్తున్నాడు. మరోవైపు రష్యాలో సైన్యంలోకి పనికొచ్చే వయసున్న అందరినీ బలవంతంగా ఆర్మీలో చేర్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో లక్షలాది మంది మాకొద్దీ ఆర్మీ జాబ్ అంటూ దేశం విడిచి పోతున్నారు. ప్రపంచానికి పెనుముప్పు.. రష్యా బాధ్యతారహితంగా అణ్వాయుధాలను ప్రయోగిస్తే మాత్రం ప్రపంచం పెను ముప్పులోకి జారిపోవడం ఖాయం. ప్రపంచాన్ని అశాంతిలోకి నెట్టేసేలా అణ్వాయుధాలతో భూమండలాన్ని హింస పెట్టేలా రష్యా అధ్యక్షుడు పుతిన్ బాధ్యతారహిత వ్యాఖ్యలు, నిర్ణయాలతో దుర్మార్గంగా దూసుకుపోతున్నాడు. ఉక్రెయిన్‌లో లక్షలాది మంది ఉసురు పోసుకున్న పుతిన్.. హింస అక్కడితో ఆపేదేలే అంటున్నారు. రష్యా ఆయుధాగారంలో అణ్వాయుధాలు కూడా ఉన్నాయి తెలుసా? అని బెదిరిస్తున్నారు. అవసరమైతే అణుబాంబు ప్రయోగించడానికి కూడా ఏమాత్రం వెనుకాడబోమని భయపెడుతున్నాడు. పుతిన్ ఆలోచనలను వ్యతిరేకిస్తోన్న లక్షలాది మంది రష్యన్లు దేశానికి గుడ్ బై చెప్పి పొరుగు దేశాల్లో తలదాచుకోవడానికి పారిపోతున్నారు. పారిపోదాం బ్రదర్..! రష్యా సరిహద్దుల్లో ప్రత్యేకించి జార్జియా, ఫిన్లాండ్ దేశాల వైపు సరిహద్దుల్లో నిత్యం ఇలా జనం పోటాపోటీగా తమ కార్లలో, బస్సుల్లోనూ దేశం విడిచిపోతున్న దృశ్యాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్ది రోజులు అయితే దేశం నుండి ఎవరూ పారిపోకుండా ఉండేందుకు వీలుగా సరిహద్దులను మూసివేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు నిపుణులు. రష్యా అధినేత పుతిన్ మనసులో పుట్టిన యుద్ధ కాంక్ష నెలల తరబడి రగులుతూనే ఉంది. అది రేపిన సెగలు ఉక్రెయిన్‌పై విధ్వంస సంతకాలు చేస్తూనే ఉన్నాయి. పెరుగుతున్న అసహనం.. నెలలు గడిచే కొద్దీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో అసహనం పెరిగిపోతోంది. ఉక్రెయిన్ ఇంత ప్రతిఘటన ఇవ్వగలగడానికి కారణం దానికి నాటో దేశాల ఆయుధ సరఫరానే అని పుతిన్ భావిస్తున్నారు. అందుకే నాటో దేశాలనూ, మిగతా ప్రపంచ దేశాలనూ భయపెట్టేలా పుతిన్ ఓ ప్రకటన చేశారు. అవసరమనుకుంటే అణుబాంబులు పేల్చడానికి కూడా వెనకాడేదిలేదని పుతిన్ అల్టిమేటం జారీ చేశారు. ఈ బెదిరింపు ఉక్రెయిన్ ప్రభుత్వానికా? నాటో కూటమికా? లేక పెద్దన్న అమెరికాకా? అన్నది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కాగా, తేలికపాటి అణ్వాయుధాలను ప్రయోగించడం ద్వారా ఉక్రెయిన్ ఆర్మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని పుతిన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే అణుబాంబు పేలుస్తా అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
‘పుతిన్ ‘అణు’ బెదిరింపులు జోక్ కాదు’.. బైడెన్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై సైనిక చర్యకు దిగిన రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ను కొద్ది వారాల్లోనే తన వశం చేసుకుంటుందనుకున్నప్పటికీ రష్యాకు ఊహించని విధంగా ఎదురుదెబ్బలు తగిలాయి. ఈ క్రమంలో పలు సందర్భాల్లో అణు బాంబుల అంశాన్ని తెరపైకి తెచ్చారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఈ యుద్ధంలో పశ్చిమ దేశాలు కలుగజేసుకుంటే.. న్యూక్లియర్ వార్ తప్పదని హెచ్చరించారు. తాజాగా.. పుతిన్ అణు హెచ్చరికలు జోక్ కాదని, న్యూక్లియర్ బాంబులు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. 1962లో క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తాము ఈ స్థాయి తీవ్రమైన అణు ముప్పును చూడలేదని పేర్కొన్నారు. మాన్‌హట్టన్‌లో గురువారం నిర్వహించిన డెమొక్రాటిక్ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో మాట్లాడారు బైడెన్. ఉక్రెయిన్ను ఆక్రమించాలనే లక్ష్యం కోసం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేస్తున్న అణు బెదిరంపులు ఏమాత్రం జోక్ కాదని వివరించారు. పరిస్థితులు ఇలాగే కొనసాగితే క్యూబా మిసైల్ సంక్షోభం తర్వాత తొలిసారి అమెరికా ప్రత్యక్షంగా అణుదాడి ముప్పును ఎదుర్కొంటుందని బైడెన్ పేర్కొన్నారు. అణు దాడిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. ఉక్రెయిన్ విలీన భూభాగాలను కాపాడుకొనేందుకు దారులు మూసుకుపోతే అణుదాడి చేస్తానని పుతిన్ హెచ్చరికలు జారీ చేశారు. అయితే.. ఇది కేవలం టాక్టికల్ అణ్వాయుధాలను దృష్టిలో పెట్టుకొని చేసిన హెచ్చరికగా నిపుణులు భావిస్తున్నారు. కానీ, ఇటువంటి అణ్వాయుధాలు కూడా తీవ్రస్థాయి సంక్షోభానికి కారణమవుతాయని బైడెన్ హెచ్చరించారు. ‘పుతిన్ జోక్ చేయడంలేదు. అతడు టాక్టికల్ అణ్వాయుధాలు లేదా జీవాయుధాలు లేదా రసాయన ఆయుధాల వినియోగం గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వారి సైన్యం ఆశించిన స్థాయిలో పోరాడటంలేదు. ఇది కేవలం అణ్వాయుధ వినియోగంతోనే ముగియదు. పుతిన్‌ను ఆ మార్గం నుంచి ఎలా తప్పించాలనే అంశంపై మేం కసరత్తు చేస్తున్నాం. కేవలం పుతిన్‌ను ఆ స్థానం నుంచి తప్పించడమే కాదు.. అతణ్ని ఓడించడం, రష్యాలో ఆయన్ను బలహీన పర్చడంపై కూడా పనిచేస్తున్నాం’ అని అధ్యక్షుడు బైడెన్ పేర్కొన్నారు. ఇదీ చదవండి: Ukraine Russia War: ఉక్రెయిన్‌లో మళ్లీ రష్యా క్షిపణి దాడులు -
Sakshi Cartoon: ...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్!
...మీకు నాశనం చేయడమంటే ఎంతిష్టమో మాకు తెలుసు సార్! -
అదే జరిగితే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం
కొరియా దేశాల మధ్య ఆయుధ సంపత్తి-సత్తా విషయంలో మాటల తుటాలు పేలుతున్నాయి. వాస్తవానికి యుద్ధానికి తాము వ్యతిరేకమని, ఒకవేళ దక్షిణ కొరియా గనుక దాడులకు తెగపడితే మాత్రం అణ్వాయుధాలు ప్రయోగించడానికి సైతం వెనకాడబోమని హెచ్చరించారు కిమ్ యో జోంగ్. ఉత్తర కొరియా నియంతాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సోదరి అయిన కిమ్ యో జోంగ్.. ప్రస్తుతం అక్కడి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా దక్షిణ కొరియా రక్షణ మంత్రి చేసిన వ్యాఖ్యలు.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అత్యాధునిక క్షిపణులు, అణ్వాయుధాలు తమ వద్ద ఉన్నాయని, అవి నేరుగా లక్ష్యంగా భావిస్తున్న ఉత్తర కొరియాను సర్వనాశనం చేస్తాయంటూ దక్షిణ కొరియా రక్షణ మంత్రి షూ వుక్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ నేపథ్యంలో కిమ్ యో తీవ్రంగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలను భారీ తప్పిదంగా పేర్కొన్న కిమ్ యో.. అలాంటి పరిస్థితి ఎదురైతే చూస్తూ ఊరుకోబోమని, అవసరమైతే అణ్వాయుధాల్ని దక్షిణ కొరియాపై ప్రయోగిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘ప్యాంగ్యాంగ్(నార్త్ కొరియా రాజధాని) యుద్ధానికి వ్యతిరేకం. అలాగే దక్షిణ కొరియాను మేం ప్రధాన శత్రువుగా భావించడం లేదు. మమ్మల్ని కవ్వించనంత వరకు మేం మౌనంగానే ఉంటాం. ఒకవేళ ఎలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడితే మాత్రం.. సహించం. సౌత్‌కొరియా ఆర్మీ ఇంచు సరిహద్దులోకి వచ్చినా పెనువినాశనాన్ని దక్షిణ కొరియా చవిచూడాల్సి వస్తుంది’’ అని మంగళవారం నాటి ప్రకటనలో ఆమె వెల్లడించారు. ఇది మేం జారీ చేసే హెచ్చరిక కాదు. జరగబోయే పరిణామాలకు మా ముందస్తు వివరణ అని స్పష్టం చేశారామె. ఇదిలా ఉండగా.. ఆదివారం సైతం ఆమె ఈ వ్యాఖ్యలపై స్పందించారు కూడా. ప్రమాదకరమైన సైనిక చర్యలకు సైతం సిద్ధమంటూ కిమ్ యో జోంగ్ వ్యాఖ్యానించారు కూడా. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది మొదటి నుంచి క్షిపణులను విజయవంతంగా ప్రయోగిస్తూ అగ్రరాజ్యం సహా పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్‌లకు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది ఉత్తర కొరియా. -
అదుపు తప్పితే అణుముప్పే!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచానికి కొత్త అస్థిరతల్ని తెచ్చిపెట్టింది. యుద్ధం ఏ విధంగా ముగింపునకు వచ్చినా ఒకటి మాత్రం స్పష్టం. అణ్వాయుధ నియంత్రణ అవకాశాలు, అణు నిరాయుధీకరణ అన్నవి ఇకపై మరింతగా వెనక్కు మళ్లుతాయి. 1991లో సోవియెట్ యూనియన్ విచ్ఛిన్నమై 15 స్వతంత్ర దేశాలుగా ఏర్పడ్డాక సోవియెట్ యూనియన్‌కు తనే వారసత్వ రాజ్యం అని రష్యా భావిస్తుండటం, స్వతంత్ర రాజ్యాలుగా అవతరించిన బెలారస్, కజఖ్‌స్థాన్, ఉక్రెయిన్లు రష్యాతో పాటుగా తమ భూభాగాలలో అణ్వాయుధాలను కలిగి ఉండటం ఇప్పుడు మానవాళి ఎదుర్కోక తప్పని ఒక కీలకమైన సవాలుగా మారింది. ఉక్రెయిన్ పెద్ద సంఖ్యలో అణ్వస్త్ర కేంద్రాలను, క్షిపణి కార్మాగాలను, అణ్వాయుధ నౌకాశ్రయాలను, 5000 యుద్ధ విధ్వంస శతఘ్నులను కలిగి ఉంది. కజఖ్‌స్థాన్‌లోని సెమిపలంటిన్సక్ అణ్వా యుధ పరీక్షా కేంద్రం ఉన్నప్పటికీ వాటిని ఎక్కుపెట్టి సంధించే ‘లాంచ్ కోడ్’లు మాత్రం రష్యాలో ఉన్నాయి. అణ్యాయుధ ప్రయోగాల నైపుణ్యం రష్యాలో ఉండటమే అందుకు కారణం. అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్, రష్యా అధ్యక్షుడిగా బోరిల్ ఎల్త్సిన్ ఉన్నప్పటి నుంచే అణ్వస్త్రాలను కుప్పలుగా పేర్చుకుని కూర్చున్న ఈ మూడు దేశాలూ ప్రపంచానికి పీడకలలు తెప్పిస్తున్నాయి. 1970లో అగ్రరాజ్యాలు 25 ఏళ్ల వ్యవధికి కుదుర్చుకున్న ఎన్పీటీ (అణ్వస్త్రవ్యాప్తి నిరోధక ఒప్పందం) గడువు 1995లో ముగిసిన తర్వాత, తిరిగి ఒప్పందాన్ని నిరవధికంగా కొనసాగించాలన్న నిర్ణయమైతే జరిగింది. ఎన్పీటీతో సమస్య ఏమిటంటే 1967 జనవరి 1కి ముందు అణుపరీక్షలను నిర్వహించిన 5 దేశాలు మాత్రమే ఈ ఒప్పందం పరిధిలో ఉండటం. ఎన్పీటీలో ఉన్న అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, రష్యాలకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘వీటో’ హక్కు కలిగిఉండటం ఒక సౌలభ్యాంశం అయింది. ఈ ఐదుదేశాలూ ఆరో దేశాన్ని వీటో పవర్లోకి రానివ్వవు. రష్యా, చైనా అణు ఇరుగు పొరుగులను సహించవు. బెలారస్, కజఖ్‌స్థాన్, ఉక్రెయన్ల చేత అణ్వా యుధాలను త్యజింపజేసి, ఎన్పీటీ పరిధిలోకి వాటిని తీసుకు వచ్చేందుకు అమెరికా, రష్యా, ఐరోపా దేశాలు రాజకీయ, దౌత్య పరమైన ప్రయత్నాలెన్నో చేశాయి. బెలారస్, కజఖ్‌స్థాన్ దారికి వచ్చాయి కానీ, ఉక్రెయిన్ మాత్రం తన దారి తనదే అన్నట్లుగా ఉండిపోయింది. అంతేకాదు, 10,000 కి.మీ. దూరం ప్రయోగించగల ఎస్.ఎస్.–24 అనే పది తలల క్షిపణిని వృద్ధి చేసింది. చివరికి సామ, దాన, భేద, దండోపాయాలతో ఉక్రెయిన్ ఎన్పీటీకి తలొగ్గింది. హంగేరి రాజధాని బుడాపెస్ట్‌లో 1994 డిసెంబరులో జరిగిన సమావేశంలో ఇరుపక్షాలు..బెలారస్– కజఖ్‌స్థాన్–ఉక్రెయిన్; అమెరికా, బ్రిటన్, రష్యా.. కూర్చొని అణ్వాయుధాల ప్రయోగం విషయమై భద్రత హామీలను ఇచ్చి పుచ్చుకున్నాయి. ఫ్రాన్స్, చైనా కూడా ఇదే రకమైన పూచీకత్తును ఇచ్చాయి. సార్వ భౌమత్వాన్ని గౌరవించడం, జోక్యం చేసుకోకపోవడం, బలప్రయోగం చేస్తామని బెదరించకపోవడం వంటివి ఆ హామీలలో భాగంగా ఉన్నాయి. అలాగే దాడికి గురైన దేశం ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిని ఆశ్రయించవచ్చన్నది మరొక అంశం. ఆ నేపథ్యంలో 2014లో క్రిమియాను రష్యా ఆక్రమించడంతో బుడాపెస్ట్ మెమోరాండమ్‌ను రష్యా ఉల్లంఘించినట్లయింది. ఇప్పుడు మళ్లీ ఉక్రెయిన్‌పై దాడితో మరోసారి రష్యా మాట తప్పినట్లయింది. 2017లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియాను బెదిరిస్తూ, ప్రపంచం మునుపెన్నడూ చూడని ఆగ్రహజ్వాలల్ని చూడబోతోందని అన్నారు. అందుకు ఉత్తర కొరియా ట్రంప్‌ని ‘మతిస్థిమితం తప్పిన ముదుసలి’గా అభివర్ణిస్తూ, అమెరికా కనుక దాడికి తెగిస్తే, పశ్చిమ పసిఫిక్ సముద్రలోని యు.ఎస్. ద్వీపం గ్వామ్‌ను భస్మం చేస్తామని హెచ్చరించింది. ఆ తర్వాత కిమ్‌ను ట్రంప్ ‘తన దేశాన్ని తనే పేల్చేసుకునే’ ఆత్మాహుతి దళ సభ్యుడిగా అభివర్ణించారు. గత ఫిబ్రవరి 27న జపాన్ మాజీ ప్రధాని షింజో అబే.. యూఎస్ అణ్వస్త్రాలకు జపాన్‌లో స్థావరాలను ఏర్పరచడం అనే ఒక అనూహ్యమైన ఆలోచనను పైకి తెచ్చారు. తైవాన్‌పై చైనా దురాక్రమణకు ఉన్న అవకాశాల నేపథ్యంలో.. జపాన్ భూభా గంపై అణ్వాయుధాలను.. ‘వృద్ధి చేయరాదు, కలిగి ఉండరాదు, చోటు కల్పించరాదు’ అని జపాన్ విధించుకున్న స్వీయ నియంత్రణకు విరుద్ధమైన ఆలోచన అది. ఏమైనా అణ్వాయుధ ప్రయోగాలను సమర్థించుకునే కొత్తకొత్త సిద్ధాంతాలు అణు భయాలను పెంచుతున్నాయి. – రాకేశ్ సూద్, భారత మాజీ దౌత్యవేత్త (హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో) -
అణుయుద్ధం వస్తే.. అంతా నాశనం: ఆ దేశాల వద్దే అణ్వాయుధాలు!
ఒక్కసారిగా ప్రపంచాన్ని ‘అణు’ భయాలు ఆవరించాయి. చిన్నపాటి యుద్ధంగా మొదలైన ఉక్రెయిన్ సంక్షోభం చివరకు అణుయుద్ధానికి దారితీసేలా పరిణామాలు మారుతున్నాయి. ఉక్రెయిన్ ప్రతిఘటనను, అంతర్జాతీయ ఆంక్షలను భరించలేని పుతిన్ అణు వార్నింగ్ ఇచ్చారు. దీంతో న్యూక్లియర్ వార్ వాకిట్లోకి వచ్చినట్లయింది. కోల్డ్‌వార్ ముగిసినప్పటినుంచి మానవాళి అణు వార్నింగ్‌లను మర్చిపోయింది. కేవలం ఎన్నికల సమయంలో దేశీయులను ఆకట్టుకోవడానికి పాక్ లాంటి కొన్ని దేశాలు అణుయుద్ధాల ప్రసక్తి తీసుకురావడం తప్ప ఒక దేశం మరో దేశాన్ని న్యూక్లియర్ ఆయుధాలు చూపి నేరుగా హెచ్చరించడం ఇటీవల కాలంలో జరగలేదు. అంతా మర్చిపోయిన ఈ అణుయుద్ధం జరిగితే అది చేసే చేటు అంతా ఇంతా కాదని, సమస్త జీవజాలంపై దీని ప్రభావం ఉంటుందని అణు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రాణాంతక స్థాయిలో విడుదలయ్యే రేడియేషన్ జీవరాసులను చంపడమే కాకుండా గాలి, నీరు, నేలను విషపూరితం చేస్తుందంటున్నారు. అణ్వాయుధాలతో జరిగే యుద్ధ ప్రభావం అనేక తరాలు వెంటాడుతూనే ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి అణుయుద్ధం జరిగితే ప్రపంచంలోని ఎలక్ట్రికల్ వ్యవస్థలు దెబ్బతింటాయని, దీంతో ప్రజలు బతకడానికి ఆదిమ మార్గాలు అనుసరించే పరిస్థితులు దాపురిస్తాయని ఆయన హెచ్చరించారు. కరోనా కన్నా తీవ్రం కోవిడ్ వైరస్ కారణంగా ప్రపంచమంతా కరోనా వ్యాపించి పలు దేశాలు అల్లకల్లోలమయ్యాయి. అణుయుద్ధం జరిగితే ఇంతకు మించి అల్లకల్లోలాలు చెలరేగే అవకాశాలు అధికమని నిపుణుల హెచ్చరిక. చిన్నపాటి అణు పేలుడు సైతం లక్షలాది ప్రాణాలు తీయగలదు. వీటి దెబ్బకు అలముకునే ధూళి మేఘాలు సూర్యరశ్మిని అడ్డుకోవడంతో న్యూక్లియర్ వింటర్ వస్తుంది. ఇది పంటలను నాశనం చేసి తీవ్ర దుర్భిక్షానికి కారణమవుతుంది. న్యూక్లియర్ స్మోక్ వల్ల ఉత్తరార్థ గోళంలో ఓజోన్ పొర కరిగి ప్రమాదకరమైన అతినీలలోహిత కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. దీనివల్ల జీవజాలం తీవ్రమైన వ్యాధులకు గురవుతుంది. దక్షిణార్థ గోళంలో కూడా ఇలాంటి సంక్షోభాలే కనిపిస్తాయి. కేవలం కోట్లాది ప్రాణాలు పోవడమే కాకుండా కిలోమీటర్ల మేర రేడియోయాక్టివిటీ వల్ల పర్యావరణం కలుషితమవుతుందని అణు శాస్త్రవేత్త క్రిస్టిన్సన్ హెచ్చరించారు. ఆ దేశాల వద్దే అణ్వాయుధాలు 1945లో హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత అణ్వాయుధాల బలం, విస్తృతి చాలా అధికం. వీటిలో ఏ ఒక్కటి ప్రయోగించినా లేదా భూమిపై ఏ కొద్ది ప్రాంతంలో ప్రయోగించినా చివరకు అన్ని దేశాలు దుష్పరిణామాల బారిన పడడం ఖాయం. దీన్ని దృష్టిలో ఉంచుకొని దేశాలు సంయమనం పాటించాలని నిపుణులు కోరుతున్నారు. భవిష్యత్‌లో అణుయుద్ధ భయం లేకుండా ఉండేందుకు ప్రపంచ న్యూక్లియర్ పవర్ దేశాలు తమ అణ్వాయుధాలను నాశనం చేయాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్, పాకిస్తాన్, బ్రిటన్, ఉత్తరకొరియా వద్ద అణ్వాయుధాలున్నాయి. ఉక్రెయిన్ యుద్ధం అణుయుద్ధంగా పరిణమిస్తే వీటిలో చాలా దేశాలు తమ అస్త్రాలను బయటకు తీసే ప్రమాదం ఉంది. అన్ని దేశాలు యుద్ధానికి దిగకపోయినా, ఒక ప్రాంతానికే అణ్వాయుధాల యుద్ధం పరిమితమైనా ప్రభావం మాత్రం ప్రపంచమంతా ఉంటుందని అణు శాస్త్రవేత్త విల్సన్ హెచ్చరించారు. ఏ స్థాయిలోనైనా అణ్వాయుధ ప్రయోగం కూడదన్నారు. అయితే ఉక్రెయిన్ తరఫున ఏ దేశం నేరుగా పోరాటంలోకి దిగనందున రష్యా హెచ్చరికలకే పరిమితం కావచ్చని పలువురి అంచనా. – నేషనల్ డెస్క్, సాక్షి భయపెట్టే పరిణామం రష్యా అణు వార్నింగ్‌పై గుటెరస్ న్యూయార్క్: దేశంలోని అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆదేశాలివ్వడంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఉక్రెయిన్ యుద్ధం క్రమంగా అణ్వాయుధ యుద్ధంగా మారుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ప్రకటన భయపెట్టే పరిణామంగా ఐరాస కార్యదర్శి గుటెరస్ వ్యాఖ్యానించారు. అణు యుద్ధమనే ఆలోచనే ఊహించరానిదన్నారు. ఇరు పక్షాల చర్చలతో తక్షణం యుద్ధ విరమణ ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యుద్ధం వల్ల ఉక్రెయిన్ నాశనమవుతోందని సోమవారం జనరల్ అసెంబ్లీ సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ సంక్షోభం అందరిపై తీవ్ర పరిణామం చూపుతుందని హెచ్చరించారు. చర్చలకు ఎప్పుడూ దారులు తెరిచే ఉంచాలని, శాంతియుత పరిష్కారమే అందరికీ అవసరమని చెప్పారు. జరిగిందేదో జరిగిందని, ఇకనైనా సైనికులు వెనక్కు మరలి నేతలు చర్చలకు రావాలని ఆకాంక్షించారు. తాజా దాడి ఐరాస మౌలిక భావనలను ప్రశ్నిస్తోందన్నారు. -
ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఏమయ్యాయి?
Russia-Ukraine: 1991లో సోవియెట్ యూనియన్ పతనమైన తర్వాత ఆ దేశానికి సంబంధించిన అణ్వాయుధాలన్నీ బెలారస్, కజకస్తాన్, ఉక్రెయిన్‌లో ఉండేవి. అందులోనూ ఉక్రెయిన్ అతి పెద్ద అణు భాండాగారంగా నిలిచింది. ప్రపంచంలోనే అణ్వాయుధాలు ఎక్కువగా ఉన్న మూడో దేశంగా అవతరించింది. సైనిక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం కలిగిన 3 వేలకు పైగా టాక్టికల్ అణ్వాయుధాలు, యుద్ధ నౌకలు, సాయుధ వాహనాలు, నగరాలను లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేసే అణ్వాయుధాలు ఉక్రెయిన్ దగ్గరే ఉండేవి. వీటిలో ఎస్ఎస్–19, ఎస్ఎస్–24 ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు 176 వరకు ఉంటే, మరో వెయ్యి వరకు గగన తలం మీదుగా దాడి చేసే క్షిపణి వ్యవస్థలన్నీ ఉక్రెయిన్ దగ్గరే ఉన్నాయి. చదవండి: (Vladimir Putin: అదే పుతిన్ బలమా..?) 60 వరకు టీయూ–22 బాంబర్లు కూడా ఉండేవి. ఆ తర్వాత కాలంలో అతి పెద్ద ఆయుధాగారాన్ని నిర్వహించే ఆర్థిక శక్తి లేక ఉక్రెయిన్ అల్లాడిపోయింది. అంతే కాకుండా ఆ అణ్వాయుధాలను వాడడానికి అవసరమైన కేంద్రీకృత ఫైరింగ్ కంట్రోల్స్ అన్నీ రష్యా రాజధాని మాస్కోలో ఉన్నాయి. దీంతో అమెరికా సహా ఇతర పశ్చిమ దేశాలకు ఉక్రెయిన్ అణ్వాయుధాలు ఒక తలనొప్పిగా మారాయి. చర్చోపచర్చల తర్వాత ఆ ఆయుధాలను నాశనం చేయడానికి వీలుగా 1994లో రష్యా, యూకే, అమెరికాలతో ఉక్రెయిన్ బుడాపెస్ట్ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. చదవండి: (ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం) ఆయుధాలను విధ్వంసం చేసినప్పటికీ ఆ దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వాన్ని గుర్తిస్తామని అమెరికా, యూకే, రష్యాలు హామీ ఇచ్చాయి. దీంతో ఎన్నో వార్హెడ్లు, ఇతర క్షిపణుల్ని ధ్వంసం చేసింది. టీయూ–160 బాంబర్లు, ఇతర అణుసామాగ్రిని రష్యాతో వస్తుమార్పిడి విధానం కుదుర్చుకొని ఆ దేశానికి బదలాయించింది. బదులుగా రష్యా చమురు, గ్యాస్‌లను సరఫరా చేసింది. 2001 మేలో చివరి యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ ధ్వంసం చేసింది. అంతర్జాతీయ ఆయుధ నియంత్రణ అసోసియేషన్ నివేదిక ప్రకారం ఉక్రెయిన్ 11టీయూ–160 వ్యూహాత్మక బాంబులు, 27 వ్యూహాత్మక టీయూ–95 బాంబులు, 483 కేహెచ్–55 గగన తలం మీదుగా ప్రయోగించే క్రూయిజ్ క్షిపణుల్ని ధ్వంసం చేసిందని, మరో 11 భారీ బాంబులు 582 వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల్ని రష్యాకు అప్పగించిందని వెల్లడించింది. -
‘అణు’ సమాచారం పంచుకున్న భారత్–పాక్
న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌లు తమ దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలు, అణు ఇంధనశుద్ధికి సంబంధించిన ఇతర సదుపాయాల సమాచారాన్ని వరుసగా 31వ సంవత్సరం ఇచ్చిపుచ్చుకున్నాయి. ఒకరి అణు సదుపాయాలపై మరొకరు దాడి చేయకుండా నివారించే లక్ష్యంతో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం శనివారం రెండు దేశాలు దౌత్యమార్గాల ద్వారా న్యూఢిల్లీ, ఇస్లామాబాద్‌లలో ఈ సమాచార మార్పిడి చోటుచేసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది. జనవరి ఒకటిన తమ అణు కేంద్రాలు, ఇతర సదుపాయాల సమాచారం ఇచ్చిపుచ్చుకోవాలంటూ రెండు దేశాలు 1991లో ఒప్పందం చేసుకున్నాయి. సీమాంతర ఉగ్రవాదం, కశ్మీర్ అంశంపై రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలోనూ ఈ ఒప్పందం అమలు యథావిథిగా కొనసాగడం గమనార్హం. చదవండి: (వైష్ణోదేవి మందిరంలో విషాదం.. అసలేం జరిగింది?) -
ఉ.కొరియాలో మళ్లీ అణు కార్యకలాపాలు
సియోల్: ఉత్తరకొరియా తన ప్రధాన అణు రియాక్టర్‌ను అణ్వస్త్ర ఇంధన ఉత్పత్తి కోసం తిరిగి ప్రారంభించినట్లు కనిపిస్తోందని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ(ఐఏఈఏ) తెలిపింది. తమ దేశంపై విధించిన ఆంక్షల తొలగింపు, ద.కొరియాతో సైనిక విన్యాసాలను అమెరికా నిలిపివేయకుంటే అణ్వస్త్ర తయారీని తిరిగి ప్రారంభిస్తామంటూ ఉ.కొరియా బెదిరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐఏఈఏ ఈ మేరకు తన వార్షిక నివేదికలో పేర్కొంది. యాంగ్బియోన్లోని ప్రధాన అణు సముదా యంలో ఉన్న 5 మెగావాట్ల రియాక్టర్‌ను ఈ ఏడాది జూలై నుంచి పనిచేస్తున్నట్లు శాటిలైట్ చిత్రాలు, వివిధ వర్గాల నుంచి అందిన సమాచారం విశ్లేషించి ఈ మేరకు అంచనాకు వచ్చినట్లు తెలిపింది. ఇదే సముదాయంలో ఉన్న రేడియో కెమికల్ లేబొరేటరీ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూలై వరకు పని చేసినట్లు సూచనలు కనిపించాయని పేర్కొంది. అణ్వా యుధాల తయారీలో వినియోగించే ప్లుటోనియం ఈ సముదాయంలో ఉత్పత్తవుతుంది. రియాక్టర్ల నుంచి తొలగించిన ఇంధన కడ్డీలను తిరిగి ప్రాసెసింగ్ చేయడం ద్వారా ఇక్కడ ప్లుటోనియంను వేరు చేస్తారు. ‘ఉ.కొరియా అణు కార్యకలాపాలను తిరిగి కొనసాగించడం తీవ్రంగా ఆందోళన కలిగించే అంశం. 5 మెగావాట్ల రియాక్టర్తోపాటు రేడియో కెమికల్ లేబొరేటరీ తిరిగి పనిచేయించడం ఇబ్బందికరమైన విషయం’అని ఐఏఈఏ పేర్కొంది. తమ దేశంలోని అణు సముదాయాలను ఐఏఈఏ బృందాలు తనిఖీ చేయడాన్ని 2009 నుంచి ఉ.కొరియా నిలిపివేసింది. -
చైనా కావరం.. అణు బాంబులేస్తామని బెదిరింపులు
డ్రాగన్ కంట్రీ మరోసారి తన తలపొగరును ప్రదర్శించింది. సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే న్యూక్లియర్ వార్ తప్పదని జపాన్ను గట్టిగానే హెచ్చరించింది. ఈ మేరకు ఏకంగా కమ్యూనిస్ట్ పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే గనుక ఊరుకునేది లేదని చెబుతూ.. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్ను హెచ్చరించింది చైనా. ‘‘తైవాన్ విషయంలో కలుగజేసుకున్నందుకు జపాన్‌పై మేం బాంబులు వేస్తాం. ఆ తర్వాత లొంగిపోయామని జపాన్ మమ్మల్ని బతిమాలుకునేదాకా రెండోసారి బాంబులేస్తాం. తైవాన్ విముక్తి మా చేతుల్లో ఉన్న అంశం. జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదు. జపాన్‌కు సంబంధించి ఒక్క యుద్ధ విమానం, ఒక్క సైనికుడు తైవాన్ సరిహద్దులో కనిపించినా ఆ దేశాన్ని(జపాన్) నామరూపాల్లేకుండా సర్వనాశం చేస్తామని’ని ఆ వీడియోలో కొందరు సైనికులు మాట్లాడినట్లు ఉంది. #CCP Vows to Nuke #Japan if Japan defends #Taiwan. As Japan is the only country that has been nuked, so nuking Japan "will get twice the result with half the effort." 中共軍事頻道威脅對日本實施連續核打擊,直到日本第二次無條件投降。 pic.twitter.com/dp45R2LXtD — Jennifer Zeng 曾錚 (@jenniferatntd) July 13, 2021 పైగా చైనా అధికారిక ఛానెల్ సీసీపీకి సంబంధించిన ఓ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లోనే ఈ వీడియో ప్రదర్శితం కావడం విశేషం. అయితే 2 మిలియన్ల వ్యూస్ తర్వాత ఆ వీడియోను ఛానెల్ డిలీట్ చేయగా.. యూట్యూబ్, ట్విటర్లో మాత్రం అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే తైవాన్ సార్వభౌమాధికారం-సౌభ్రాతృత్వం కాపాడేందుకు తాము ముందు ఉంటామని జపాన్ రెండు వారాల కిందట ప్రకటన చేసింది. బయటి శక్తులు తైవాన్‌పై ఆధిపత్యం చెలాయించాలని ప్రయత్నిస్తే.. అండగా నిలబడతామని జపాన్ డిప్యూటీ పీఎం తారో అసో ప్రకటించారు కూడా. ఈ పరిణామాల నేపథ్యంలో మిలిటరీ ఫ్యాన్ బాయ్స్ పేరిట చైనా నుంచి ఈ వీడియో రిలీజ్ అయ్యింది. -
అణు ఆయుధాలను నిషేధించండి: జపాన్
టోక్యో: అణుఆయుధాలను నిషేధించాలని జపాన్‌దేశం మరోసారి ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేసింది. అగ్రరాజ్యం అమెరికా జపాన్‌లోని రెండు ముఖ్య నగరాలైన హిరోషిమా, నాగాసాకిలపై అణుబాంబుతో దాడి చేసిన సంగతి తెలిసిందే. నాగసాకి నగరంపై దాడి జరిగి ఆదివారం నాటికి(ఆగస్టు 9) 75 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆదివారం నాగసాకి పీస్ పార్క్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార యంత్రాంగంతో పాటు పౌరులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాగసాకి నగర మేయర్ టొమిహిమ టావ్ శాంతి సందేశాన్ని ఇచ్చారు. అణుఆయుధాలను నిషేధించాలని మేము విజ్ఞప్తి చేస్తుంటే.. అమెరికా, రష్యాలు మాత్రం అణుఆయుధాల శక్తిని పెంచుకుంటున్నాయని ఆరోపించారు. (లిటిల్ బాయ్ విధ్వంసం.. టార్గెట్ హిరోషిమానే ఎందుకు?) 2017లో ఏర్పాటు చేసిన అణుఆయుధాల నిషేధ ఒప్పందంపై సంతకాలు చేయాలని ఆయన ప్రపంచ దేశాలతోపాటు, జపాన్ ప్రభుత్వఅధికారులను కోరారు. జపాన్ ప్రధాని షింజో అబే మాట్లాడుతూ.. అణుఆయుధాల ట్రీటీ ఒప్పందాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. అణుఆయుధాలు తయారు చేస్తున్న రాష్ట్రాలు, అణురహిత రాష్ట్రాలు కూడా దీనికి మద్దతు ఇవ్వవని ఆయన అన్నారు. రష్యా, అమెరికా దేశాలు తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను తగ్గించుకోవాలని కోరారు. న్యూక్లియర్ ప్రొలిఫిరేషన్ ట్రీటీ అమల్లోకి వచ్చి 50 ఏళ్లు గడిచినా దానిని ఎవరూ పాటించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా 1945 ఆగస్టు 6,9 తేదీలలో జరిగిన అణుబాంబు దాడిలో 1,40,000 మంది చనిపోయారు. మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు అణుబాంబుల దాడితో ఆగస్టు 15న జపాన్ యుద్ధం నుంచి వెనక్కి తగ్గడంతో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది. (అణుబాంబు విలయానికి 75 ఏళ్లు) -
అదే జరిగితే గంటల్లోనే 3.41 కోట్ల మంది మరణిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ : కశ్మీర్ విషయమై భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారితీస్తాయా? ఆ పరిస్థితే వస్తే సంప్రదాయక యుద్ధంలో గెలవలేని పాకిస్థాన్, భారత్‌పైకి అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా ? అదే జరిగితే ఏమవుతుంది ? అని ప్రశ్నిస్తున్న వారు, చర్చిస్తున్నవారు లేకపోలేదు. అదే విధంగా ప్రపంచ అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యాల మధ్య యుద్ధం జరిగితే, అది అణు యుద్ధానికి దారితీస్తే ఇరువైపుల జరిగే నష్టమెంత ? అన్న అంశంపై అనాదిగా ఊహాగానాలు వినిపిస్తూనే ఉన్నాయి. ఈ ఊహాగానాలే నిజమై నిజంగా అమెరికా, రష్యా దేశాల మధ్య అణు యుద్ధం జరిగితే నష్టం ఎంతో తేల్చడానికి ‘కంప్యూటర్ సిములేషన్’ విధానాన్ని నిపుణులు అనుసరించారు. అంటే ఏ దేశం వద్ద ఎన్ని అణ్వాయుధాలు ఉన్నాయి ? అవి ఎక్కడెక్కడ ఉన్నాయి ? అవి ఎంత దూరం ప్రయాణించగలవు? లక్ష్యాలను కచ్చితంగా పేల్చగలవా ? పేలిస్తే వాటి ప్రభావం ఎంత ? అన్న నిజమైన లెక్కలు తీసుకొని యుద్ధం జరిగితే ఎంత నష్టం వాటిల్లుతుందనే విషయాన్ని నిపుణులు తేల్చి చెప్పారు. ‘ప్రిన్సిటన్ యూనివర్శిటీ ఆఫ్ కాలేజెస్’కు చెందిన ‘ఇంజనీరింగ్ అండ్ ఇంటర్నేషనల్ అఫేర్స్’ నిపుణుడు అలెక్స్ గ్లాసర్ సిములేషన్ (అనుకరణ) విధానంలో ప్రయోగం జరిపి నాలుగు నిమిషాల నిడివిగల వీడియోను రూపొందించారు. ఆ ప్రయోగం ప్రకారం కొన్ని గంటల్లోనే ఇరుదేశాల మధ్య 3.41 కోట్ల మంది ప్రజలు మరణిస్తారు. 5.59 కోట్ల మంది గాయపడతారు. మొదటి మూడు గంటల్లోనే 26 లక్షల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ఆ తర్వాత 90 నిమిషాల్లోగా ఇరు దేశాల్లోని కీలక నగరాలపై ఒకరికొకరు ఐదు నుంచి పది అణ్వాయుధాలు ప్రయోగించుకుంటారు. వీటి వల్ల 8.87 కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. ముందుగా వ్యూహాత్మక లక్ష్యాలపైనే ఇరు దేశాలు అణ్వాయుధాల దాడులను ప్రారంభించినా ఆ తర్వాత అనతి కాలంలోనే ప్రధాన నగరాల లక్ష్యంగా దాడులకు దిగుతాయి. అణ్వాయుధాల వల్ల అప్పటికప్పుడే జరిగే ప్రాణ నష్టాన్ని మాత్రమే ఇక్కడ పరిగణలోకి తీసుకున్నారు. ఆ తర్వాత అణ్వాయుధాల పేలుడు ప్రభావం వల్ల ఎంత మంది ప్రజలు చనిపోతారు, భూవాతావరణంపై దాని ప్రభావం ఎలా ఉంటుందన్న అంశాలను ఇక్కడ నిపుణులు పరిగణలోకి తీసుకోలేదు. ఇక అణ్వాయుధాల ప్రభావం ఒక్క మనుషులపైనే కాకుండా సమస్త జీవజాలంపై ఉంటుంది. కొన్ని తరాల వరకు పంటలు కాదుగదా, గడ్డి కూడా నేలపై మొలవదు. ప్రయోగించిన అణ్వాయుధాన్ని ఎలా డిజైన్ చేశారు ? అప్పుడు వాతావరణం ఎలా ఉంది ? పేలుడు జరిగిన చోట ప్రకృతి ఎలా ఉంది ? అన్న అంశాలపై కూడా నష్టం ఆధారపడి ఉంటుంది. సాధారణంగా అణు బాంబు పేలినప్పడు దానిలో 35 శాతం శక్తి ‘హీట్’గా బయటకు వస్తుంది. ఒక మెగా టన్ను అణు బాంబు పేలితే అది పగలు 13 మైళ్ల వరకు, అదే రాత్రిపూట అయితే 50 మైళ్ల వరకు కనిపిస్తుంది. పేలుడు వల్ల పరిసర వాయువుల్లో ఏర్పడే ఒత్తిడి వల్లనే పరిసరాల్లోని అనేక భవనాలు కూలిపోతాయి. పేలుడు స్థలానికి 3.7 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు గాలులు గంటకు 158 మీటర్ల వేగంతో వీస్తాయి. మధ్యలో వచ్చే ఇళ్లు, భవనాలే కాకుండా వాహనాలు, చెట్లు చేమలు పల్లాల్లా గాలిలో తిరుగుతాయి. ఈ విషయాలను పక్కన పెడితే అమెరికాను హెచ్చరించడంలో భాగంగా రష్యా తన తొలి అణ్వాయుధాన్ని నల్ల సముద్రం సమీపంలోని కలినిన్‌గ్రాడ్ వద్ద అణ్వాయుధ కేంద్రం నుంచి వార్నింగ్ షాట్ విడుదల చేస్తుంది. అందుకు ప్రతీకారంగా అమెరికా లేదా నాటో ఏకైక వ్యూహాత్మక అణ్వాయుధాన్ని ప్రయోగిస్తుంది. అంతే యూరప్ అంతట అణ్వాయుధ యుద్ధ మేఘాలు కమ్ముకుంటాయి. ఆ వెంటనే అన్ని నాటో అణ్వాస్త్రాలు లక్ష్యంగా రష్యా విమానాల ద్వారా గానీ, క్షిపణుల ద్వారాగానీ దాదాపు 300 అణుబాంబులను ప్రయోగిస్తుంది. అప్పుడు అంతర్జాతీయ సైనిక కూటమి స్పందిస్తుంది. అప్పుడు రష్యా అణ్వాయుధ కేంద్రాలను లక్ష్యంగా పెట్టుకొని నాటో కూటమి దాదాపు 600 అణు బాంబులను ప్రయోగిస్తుంది. ఆ తర్వాత ఇరు దేశాలు చెరి 30 నగరాలు లక్ష్యంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తాయి. దీంతో 3.41 లక్షల మంది ప్రజలు మరణిస్తారు. తొలిదశ యుద్ధం ముగిసేప్పటికీ ఇరు దేశాల మధ్య దాదాపు పది కోట్ల మంది మరణిస్తారు లేదా గాయపడతారు. భారత్, పాక్ వద్ద ఉన్న అణ్వాయుధాలను, వాటి సామర్థ్యాన్ని అంచనా వేసి ఇదే ‘సిములేషన్’ విధానం ద్వారా ఇరు దేశాల మధ్య యుద్ధం జరిగితే జరిగే నష్టం ఎంతో కూడా అంచనా వేయవచ్చు. ఇరుదేశాల అణ్వాయుధాలకు సంబంధించి ఇప్పటి వరకు వెలువడిన పలు అంతర్జాతీయ నివేదికల ప్రకారం భారత్ వద్ద దాదాపు వంద అణ్వాయుధాలు ఉంటే పాకిస్థాన్ వద్ద 125 వరకు అణ్వాయుధాలు ఉన్నాయి. అంటే మనకన్నా పాతిక ఆయుధాలు ఎక్కువ. సామర్థ్యం విషయంలో భారత అణ్వాయుధాలకు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. -
10 రోజుల్లో ‘అణు’ పరిమితిని దాటేస్తాం
టెహ్రాన్: అమెరికా ఆర్థిక ఆంక్షలు కుంగదీస్తున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అణుఒప్పందం ప్రకారం 300 కేజీలకు మించి యురేనియంను శుద్ధి చేయరాదన్న పరిమితిని ఉల్లంఘిస్తామని యూరప్ దేశాలను హెచ్చరించింది. రాబోయే 10 రోజుల్లో ఈ లక్ష్యాన్ని దాటేస్తామని ఇరాన్ అణుశక్తి సంస్థ అధికార ప్రతినిధి బెహ్రౌజ్ కమల్వాండీ తెలిపారు. యూరప్ దేశాలు మౌనం వహిస్తే, ఇదే పరిస్థితి కొనసాగితే అసలు అణు ఒప్పందం అనేదే ఉండదని తేల్చిచెప్పారు. ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించిన నేపథ్యంలో పరిష్కారం కనుగొనకుండా యూరప్ దేశాలు మౌనం వహించడంపై ఆయన అసహనం వ్యక్తంచేశారు. సాధారణంగా అణుఇంధన రియాక్టర్లలో 20 శాతం వరకూ శుద్ధిచేసిన యురేనియంను వాడతారు. 85 శాతం, అంతకంటే ఎక్కువగా శుద్ధిచేసిన యురేనియంను అణ్వాయుధాల తయారీకి వినియోగిస్తారు. 2015లో అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఇరాన్‌తో అణు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిప్రకారం ఇరాన్‌పై ఆంక్షలను ఎత్తివేశారు. ప్రతిగా 3.67 శాతం శుద్ధిచేసిన 300 కేజీల యురేనియంను మాత్రమే ఇరాన్ నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. -
భారత్ వద్ద పెరుగుతున్న అణ్వాయుధాలు
స్టాక్‌హోమ్: భారత్ వద్ద అణ్వాయుధాలు ఏటికేటికీ పెరుగుతున్నాయి. చైనా, పాకిస్తాన్‌లు కూడా అణ్వాయుధాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాలపై స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం చేసి సోమవారం నివేదిక విడుదల చేసింది. ప్రపంచ దేశాల వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్య గతేడాది తగ్గిందని, అయితే వాటిని ఆయా దేశాలు ఆధునీకరిస్తున్నాయని తాజా నివేదికలో వెల్లడైంది. 2019 సంవత్సరాదిలో అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా, భారత్, పాకిస్తాన్, ఇజ్రాయెల్, ఉత్తర కొరియాల వద్ద మొత్తం 13,865 అణ్వాయుధాలు ఉన్నాయని పేర్కొంది. 2018తో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 600 అణ్వాయుధాలు తగ్గాయని తెలిపింది. అదే సమయంలో చైనా, భారత్, పాకిస్తాన్‌లు ఆయుధాల సంఖ్యను పెంచుకుంటున్నాయని పేర్కొంది. ‘తక్కువే కానీ.. కొత్త ఆయుధాలను ప్రపంచం ఇప్పుడు చూస్తోంది’అని ఆ సంస్థ డైరెక్టర్ షానన్ కైల్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధాలు తగ్గడానికి కారణం అమెరికా, రష్యాలే అని చెప్పారు. ఈ రెండు దేశాలు ‘న్యూ స్టార్ట్’(స్ట్రాటెజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ) ఒప్పందంపై 2010లో సంతకం చేశాయి. దీని ప్రకారం అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాల్సి ఉంది. అంతేకాకుండా ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి నుంచి ఉన్న పాత ఆయుధాలను ఈ రెండు దేశాలు వదిలించుకుంటున్నాయి. న్యూ స్టార్ట్ ఒప్పందం గడువు 2021 నాటికి ముగిసిపోతుందని, దీని పొడిగింపుపై ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరగట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1980లలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక అణ్వాయుధాలు ఉండేవని, దాదాపు అప్పుడు 70 వేల ఆయుధాలు ప్రపంచ దేశాల వద్ద ఉండేవని.. అప్పటి నుంచి ఆయుధాల సంఖ్య తగ్గుతూ వస్తోందని కైల్ వివరించారు. -
అణు యుద్ధం వస్తే..?
భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో అణ్వాయుధాల ప్రయోగంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. రెండు దేశాలు అణ్వాయుధాలు కలిగివుండటంతో యుద్ధం వస్తే వీటిని ప్రయోగించే అవకాశం ఉందన్న భయాందోళన వ్యక్తమవుతోంది. యుద్ధం వద్దని రెండు దేశాల ప్రజలు కోరుకుంటున్నారు. ‘సే నో టు వార్’ అంటూ సోషల్ మీడియాలో నినదిస్తున్నారు. అణు యుద్ధం వస్తే సర్వనాశనం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్, పాకిస్థాన్ అణు యుద్ధానికి దిగితే ఆ ప్రభావం మొత్తం ప్రపంచం మీద ఉంటుందని అమెరికాలోని కొలరాడొ బౌల్డర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రియాన్ టూన్ వెల్లడించారు. అణు యుద్ధం ప్రభావంపై 35 ఏళ్లు అధ్యయనం చేసి గతేడాది డెన్వర్‌లో ‘టెడ్ఎక్స్ టాక్’లో ఆయన ప్రసంగించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అణ్వాయుధాలు ప్రయోగించడానికి ఒక్క అపార్థం చాలని అన్నారు. భారత్-పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం వస్తే 200 కోట్ల మంది ఆకలితో మరణిస్తారని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత ఇరా హెల్ఫాండ్ అంచనా వేసినట్టు వెల్లడించారు. పూర్తిస్థాయిలో అణు యుద్ధం వస్తే పంటలు పండని పరిస్థితులు దాపురిస్తాయని, 90 శాతం మంది ప్రజలు ఆకలితో చనిపోతారని వివరించారు. ఈ వీడియో ట్విటర్లో విస్తృతంగా షేర్ అవుతోంది. అణ్వాయుధాల దుష్ప్రరిణామాలపై రెడ్‌క్రాస్ సొసైటీ అంతర్జాతీయ కమిటీ కూడా ఒక వీడియో రూపొందించింది. నిమిషం నిడివివున్న ఈ వీడియోలో నిర్ఘాంతపరిచే వాస్తవాలను కళ్లకు కట్టింది. అణ్వాయుధాలను నిషేధించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. If a nuclear bomb dropped tomorrow, this is what could happen to you. pic.twitter.com/F3d4B2Pztn — ICRC (@ICRC) February 27, 2019 -
విడిచిపెడితే విధ్వంసమే... !
బీజింగ్: పొరుగుదేశమైన చైనా పెను విధ్వంసం సృష్టించే బాంబును అభివృద్ధి చేసింది. ఇది అమెరికా ఇప్పటికే తయారుచేసిన మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ కంటే శక్తిమంతమైనది గమనార్హం. ఈ బాంబు అత్యంత శక్తిమంతమైనదని డ్రాగన్ అధికారిక మీడియా శుక్రవారం పేర్కొంది. ఈ అణుఇంధనేతర బాంబును చైనా రక్షణ ఉత్పత్తుల్లో అగ్రగామి సంస్థ అయిన నొరిన్కో తొలిసారిగా ప్రదర్శించింది. దీనిని చైనీస్ వర్షన్ ఆఫ్ మదర్ బాంబ్‌గా అధికార గ్లోబల్ టైమ్స్ పత్రిక తన సంపాదకీయంలో పేర్కొంది. ఇది నిమిషాల వ్యవధిలో సర్వం నాశనం చేయగల సామర్థ్యం దీని సొంతం. అణ్వాయుధాల తర్వాతి స్థానం దీనికే దక్కుతుంది. హెచ్–6కే బాంబర్ సహాయంతో దీనిని గగనతలం నుంచి ప్రయోగాత్మకంగా విడిచిపెట్టారు. దీంతో అది భారీ విధ్వంసం సృష్టించింది. ఇందుకు సంబంధించిన ప్రమోషనల్ వీడియోని నొరిన్కో మీడియాకు విడుదల చేసింది. గత నెలలో ఈ బాంబును పరీక్షించినట్టు నొరిన్కో తన వెబ్సైట్లో పేర్కొంది. బాంబు సృష్టించిన విధ్వంసం తాలూకు దృశ్యాలను బహిరంగం చేయడం మాత్రం ఇదే తొలిసారని చైనా అధికార వార్తాసంస్థ జిన్హువా తెలిపింది. ఉగ్రవాదులపై ప్రయోగించిన అమెరికా మాసివ్ ఆర్డినెన్స్ ఎయిర్ బ్లాస్ట్ (ఎంఓఏబీ) ఆయుధంగా పిలుచుకునే జీబీయూ–43 బీ బాంబుతో అమెరికా సైన్యం గత సంవత్సరం అఫ్ఘనిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలను సమూలంగా నాశనం చేసింది. అఫ్ఘనిస్థాన్‌లో కొన్నేళ్లుగా ఉగ్రవాద కార్యకలాపాల అంతమే లక్ష్యంగా అమెరికా ముందుకు సాగుతుండడం తెలిసిందే. ఇది మదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని అందరికీ తెలిసిన విషయమే. చైనా కూడా అదే ముద్దుపేరును తన బాంబుకు వాడుకుంటోంది. ఈ బాంబు అనేక టన్నుల బరువు ఉంటుందని, అమెరికా వద్ద ఉన్న బాంబుతో పోలిస్తే చైనా తయారుచేసిన బాంబు చిన్నదిగానే, తేలికగాను ఉంటుంది. ఇది ఐదు నుంచి ఆరు మీటర్ల పొడవు ఉంటుంది. ఎంత అధునాతనంగా నిర్మించిన కోటలుగాని, భూఉపరితల లక్ష్యాలనుగానీ, రక్షణ స్థావరాలనుగానీ ఈ బాంబు సమూలంగా తుడిచిపెడుతుంది. అయితే అమెరికా తయారుచేసిన బాంబు చైనా బాంబు కంటే పెద్దది కావడంతో దానిని తరలించడానికి భారీ రవాణా విమానాలే తప్ప మరో మార్గం లేదు. హెచ్–6కే జెట్ విమానాలు మాత్రమే దీనిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించగలుగుతాయి. ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ మరోవైపు అమెరికా దాడులకు పాల్పడితే ధీటుగా తిప్పికొట్టేందుకు రష్యా కూడా మరో భారీ బాంబును తయారుచేసింది. దీనిని అది ఫాదర్ ఆఫ్ ఆల్ బాంబ్స్ అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఇది చైనా, అమెరికా బాంబుల కంటే ఇంకా పెద్దగా ఉంటుంది. -
మా అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని కాపాడుకుంటాం
టెహ్రాన్: అణ్వస్త్రాలను త్యజిస్తామని ఉత్తర కొరియా అమెరికాకు మాట ఇచ్చినప్పటికీ, తమ అణ్వస్త్ర పరిజ్ఞానాన్ని భద్రంగా కాపాడుకుంటామని ఆ దేశ విదేశాంగ మంత్రి యోంగ్ హో అన్నారు. ప్రస్తుతం ఇరాన్ పర్యటనలో ఉన్న ఆయన.. ‘ఉత్తర కొరియాతో శత్రుత్వానికి అమెరికన్లు అంతం పలకరని మాకు తెలుసు. అందుకే మా అణ్వాయుధ పరిజ్ఞానాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని భద్రపరచుకుంటాం’ అని అన్నట్లు ఇరాన్ వార్తా సంస్థ మెహ్ర్ వెల్లడించింది. ఇటీవల భేటీ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్‌లు కొరియా ద్వీపకల్పాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ఒప్పందం చేసుకోవడం తెల్సిందే. అణ్వాయుధాలకు సంబంధించి 2015లో ఇరాన్‌తో ఆరు దేశాలు కలిసి చేసుకున్న ఒప్పందం నుంచి తాజాగా అమెరికా వైదొలిగి, ఇరాన్‌పై పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు ప్రాధాన్యమేర్పడింది. -
పొఖ్రాన్ అణుపరీక్షలు సాధించిందేమిటి?
తాను అభివృద్ధి చేసిన అణ్వాయుధాల సంఖ్య రీత్యా చూస్తే ఈరోజు పాకిస్తాన్ వాస్తవంగా మనకంటే ముందంజలో ఉంది. నిస్సందేహంగా 1998లో పొఖ్రాన్‌లో మనం నిర్వహించిన అణు పరీక్షలు పాకిస్తాన్‌ను అణ్వాయధ పోటీలోకి నెట్టాయి. మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్నలు ఇవే. కానీ 1998లో మనం పర్యవసానాల గురించి ప్రశ్నించుకోలేదు. ఊహించని పర్యవసానాలకు దారి తీసే చర్యకు పూనుకోబోయే ముందు ఏ పరిణత సమాజమైనా, ప్రత్యేకించి ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఆ చర్యపై కూలంకషంగా చర్చలు జరపాలి. కానీ మనం అంతటి ప్రాధాన్యత కలిగిన అంశాన్ని పటాసులు పేల్చి ఆనందించుకునే సంబరాల లెక్కకు తగ్గించేశాం. 1998 మార్చి 11, 13 తేదీల్లో రాజస్థాన్‌లోని పొఖ్రాన్ ప్రాంతంలో భారత్ ఐదు అణుపరీక్షలు నిర్వహించింది. 1974లో పొఖ్రాన్‌లోనే తొలి అణుపరీక్ష జరిగిన 24 ఏళ్ల తర్వాత రెండో దఫా అణుపరీక్షలు జరిగాయి. కెనడా నుంచి దిగుమతి చేసుకున్న అణు సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన నిబంధనలను నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఉల్లం ఘించి మరీ అణుపరీక్షలు జరపడంతో భారత్ ఆంక్షలను ఎదుర్కొంది. అత్యంత అస్థిర పరిస్థితులలో భారత్ తొలి అణుపరీక్ష జరిపింది. అంతకు పదేళ్లక్రితమే అంటే 1960ల మధ్యలో చైనా అణు శక్తి దేశంగా ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితిలో వీటో శక్తి కలిగిన అయిదు దేశాల్లో అణుబాంబును సాధించిన చివరి దేశంగా చైనా చరిత్రకెక్కింది. అవి ప్రపంచం మళ్లీ యుద్ధంలో చిక్కుకున్న క్షణాలు. అమెరికా అప్పుడే వియత్నాం సైనిక ఘర్షణను ముగించింది. ఇందిర అణు పరీక్ష జరిపిన కొన్నేళ్ల తర్వాత సోవియట్ యూనియన్ ఆప్ఘనిస్తాన్‌పై దాడికి దిగింది. 1970లలో ప్రపంచం ఘర్షణల్లో కూరుకుపోయి ఉండింది. కొరియన్ యుద్ధ కాలంలో చైనాపై, ఉత్తరకొరియాపై అణుదాడులు చేస్తామని అమెరికా అత్యున్నత సైనిక జనరల్ మెకార్థర్ హెచ్చరించాడు. ఇందిరా గాంధీ 48 ఏళ్లక్రితం అణుపరీక్షలు నిర్వహించిన నేపథ్యం విశిష్టమైనది. అయితే అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న కాలంలో 1998లో భారత్‌పై ఎలాంటి ఒత్తిళ్లూ లేవు. అది ప్రచ్ఛన్నయుద్ధం ముగిసిన తర్వాతి కాలం. సోవియట్ యూనియన్ కుప్పగూలింది. సమాచార సాంకేతిక విప్లవం అప్పుడే పురివిప్పుతోంది. సేవల ప్రాతిపదికన కొత్త ఆర్థిక భవిష్యత్తు వైపుగా భారత్‌కు బెంగళూరు దిశానిర్దేశం కల్పిస్తున్న రోజులవి. అదే సమయంలో ఆయుధాలు కాకుండా సంపదలోనే అధికారం ఉందని తైవాన్, సింగపూర్, దక్షిణ కొరియా ఇతర ఆసియన్ టైగర్ దేశాలు నిరూపిస్తూ ఆర్థిక శక్తులుగా ఎదిగిన కాలమది. 1998 నాటి అణుపరీక్షలపై మనం ఎలాంటి ముందస్తు చర్చలూ జరపలేదు. వాజ్‌పేయి ప్రభుత్వం తన 13 రోజుల తొలి పాలనా కాలంలోనే అణ్వాయుధాలను పరీక్షించాలని తలచింది. కానీ ఉన్నతాధికార బృందం అందుకు అంగీకరించనని తెలిపింది. ఎంత సాదా సీదాగా అణుపరీక్షలను చేపట్టారో దీన్నిబట్టి తెలుస్తుంది. రెండో దఫా అణుపరీక్షలు నిర్వహించిన తర్వాత సర్వత్రా ఉత్సవాలు, పటాసులు పేల్చడాలు, స్వీట్లు పంచడాలతో దేశం సంబరాలు జరుపుకుంది తప్పితే ఆ పరీక్షలపై నిశిత చర్చ కానీ, మౌలిక ప్రశ్నలను సంధించడం కానీ జరగలేదు. ఆనాటి భావోద్వేగ క్షణాలు ముగిసిపోయి 20 ఏళ్లు గడిచిన తర్వాత అణుపరీక్షలు ఇప్పుడు విసుగు తెప్పించే అంశం కావచ్చు. ఆ మౌలిక ప్రశ్నలను ఇప్పుడు చూద్దాం. తొలిప్రశ్న.. ఆ అణుపరీక్షలు భారత్‌ను అణుశక్తి దేశంగా మార్చాయా? అంటే సమాధానం లేదనే వస్తుంది. 1974లో తొలి అణు పరీక్షల తర్వాత ఇండియాను, ఇందిరను ప్రపంచం శిక్షించింది. అణు సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌కు అందివ్వకుండా తృణీకరించింది. అణుశక్తిని శాంతియుత ప్రయోజనాలకోసమే ఉపయోగిస్తామన్న నిబంధనలను ఉల్లంఘించి మనం అణుకార్యక్రమాన్ని ఆయుధీకరించాం మరి. 1998 అణు పరీక్షలు దాన్నే పునరావృతం చేశాయి. రెండు.. ఈ అణుపరీక్షలు భారత్‌ను సురక్షిత స్థానంలో నిలిపాయా? పొఖ్రాన్–2 పరీక్షలు జరిగిన సంవత్సరం తర్వాత 1999లో కార్గిల్ యుద్ధం ద్వారా పాకిస్తాన్ మనల్ని రెచ్చగొట్టింది. ఆ యుద్ధంలో మనం 500 మంది సైనికులను కోల్పోయాం. పదేళ్ల తర్వాత ముంబైలో దాడులను చవి చూశాం. పొఖ్రాన్ అణుపరీక్షల తర్వాత కశ్మీర్ ఘర్షణలో అత్యంత హింసాత్మక ఘటన 2001లో జరిగింది. నాటి ఘర్షణల్లో 4,500 మంది ప్రజలు చనిపోయారు. మూడు.. ఆనాటి అణుపరీక్షలు మన అణు టెక్నాలజీని మెరుగుపర్చాయా? దీనికి కూడా లేదనే సమాధానం వస్తుంది. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అమెరికాతో అణు ఒప్పందం కుదుర్చుకుంది కానీ మరే దేశంతోనూ అలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయాం. నాలుగు.. అణుపరీక్షలు భారత్ స్థాయిని అంతర్జాతీ యంగా పెంచాయా? లేదనే సమాధానం. ఐక్యరాజ్యసమితి భద్రతాసమితిలో సభ్యత్వం కావాలని భారత్ చాలా కాలంగా పోరాడుతోంది. కానీ మనం నిర్వహించిన అణుపరీక్షలు మనల్ని అక్కడికి తీసుకుపోలేదు. పైగా మనకు హాని జరిగింది. అణు సరఫరా దేశాల బృందంలో భారత్‌కు సభ్యత్వం కావాలని ప్రధాని మోదీ నిర్ణయించారు. కానీ ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు. ఐదు.. అణుపరీక్షల వల్ల సాధించిన అణు సాంకేతికతతో మనం మరింత విద్యుత్తును ఉత్పత్తి చేయగలిగామా? లేదనే సమాధానం. ఈరోజు భారత్ అణువిద్యుత్ కంటే సౌర విద్యుత్‌పైనే దృష్టి పెట్టింది. ఆరు.. దక్షిణాసియా ప్రాంత దేశాల బలాబలాలను మన అణుపరీక్షలు మార్చాయా? దీనికీ లేదనే సమాధానం. పొఖ్రాన్‌లో భారత్ రెండో దఫా అణుపరీక్షలు నిర్వహించిన కొద్ది రోజులకే పాకిస్తాన్ బలూచిస్తాన్‌లోని చాగై ప్రాంతంలో అణుపరీక్షలు జరిపింది. ఉపఖండంలో నేడు ఎలాంటి అణు ప్రతిష్టంభనా లేదు. మన సాంప్రదాయిక ఆధిక్యతను మనం ఇకపై ఉపయోగించలేం కూడా. చైనా మన ప్రాంతంలో ఆర్థిక చొరవను చాలా బలంగా ముందుకు తీసుకొస్తోంది. ఈరోజు మనం చైనా సైనిక బలాన్ని కాకుండా మన అవకాశాలన్నింటినీ కొల్లగొట్టుకుపోయే దాని సామర్థ్యతను చూసి భయపడుతున్నాం. తాను అభివృద్ధి చేసిన అణ్వాయుధాల సంఖ్య రీత్యా చూస్తే ఈరోజు పాకిస్తాన్ వాస్తవంగా మనకంటే ముందంజలో ఉంది. నిస్సందేహంగా 1998లో పొఖ్రాన్‌లో మనం నిర్వహించిన అణు పరీక్షలు పాక్‌ను అణ్వాయధ పోటీలోకి నెట్టాయి. మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్నలు ఇవే. కానీ 1998లో మనం పర్యవసానాల గురించి ప్రశ్నించుకోలేదు. ఊహించని పర్యవసానాలకు దారి తీసే చర్యకు పూనుకోబోయే ముందు ఏ పరిణత సమాజమైనా, ప్రత్యేకించి ఏ ప్రజాస్వామ్య దేశమైనా ఆ చర్యపై కూలంకషంగా చర్చలు జరపాలి. కానీ మనం అంతటి కీలకమైన అంశాన్ని పటాసులు పేల్చి ఆనందించుకునే సంబరాల లెక్కకు తగ్గించేశాం. జరిగిన పరిణామాలన్నింటినీ గ్రహిస్తూనే మనం ఇప్పటికీ అణు సంబంధ పరీక్షలకు, ఆయుధ పోటీకి బరిలో ముందు నిలుస్తూనే ఉన్నాం. ఈ అంశాన్ని పాఠకులకే వది లిపెడతాను. కానీ అణుపరీక్షల వల్ల మనం సాధించిన ఒక్కటంటే ఒక్క ప్రయోజనాన్ని కూడా నేను లెక్కించలేకున్నాను. అదేసమయంలో ఒక ముఖ్యమైన నష్టాన్ని చెబుతాను. 1998–99 సంవత్సరంలో భారత్‌కు విదేశీ పెట్టుబడులు ఆగిపోయాయి. గత శతాబ్ది చివరి పాతికేళ్లలో భారత్‌కు పెట్టుబడులు రాకుండా నిలిచిపోయిన సంవత్సరం అదొక్కటి మాత్రమే. విదేశీ పెట్టుబడులు దేశం నుంచి శరవేగంగా తరలిపోయాయి. ఎందుకంటే పెట్టుబడి చాలా పిరికిది. విధ్వం సకర సాంకేతికతను తేలిగ్గా పరిగణించడం ద్వారా జనించే అనిశ్చితిని అది అస్సలు ఇష్టపడదు. ఆ ఘటనతో భారత్‌కు కలిగిన ఆర్థిక నష్టాన్ని ఎవరూ చర్చించినట్లు లేదు. పొఖ్రాన్ –2 ఘటన జరిగి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎలాంటి వేడుకలూ మనం జరుపుకోవడం లేదు. అంటే అప్పుడు ఏమీ జరగలేదన్నట్లుగా మనం వ్యవహరిస్తున్నాం మరి. వ్యాసకర్త: ఆకార్ పటేల్, కాలమిస్టు, రచయిత ఈ–మెయిల్ : aakar.patel@icloud.com -
ట్రంప్–కిమ్ ఒప్పందం ఏయే అంశాలపై ?
వచ్చే నెల 12న సింగపూర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ భేటీలో కుదిరే ఒప్పందంపై రెండు దేశాలకు అవగాహన ఉందని తెలుస్తోంది. ఉత్తర కొరియా అణ్వాయుధాల కార్యక్రమంపై ఏ నిర్ణయం తీసుకోవాలనే అంశంపై ఇరు దేశాలకు మధ్య స్పష్టత ఏర్పడిందని శుక్రవారం అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో మాటలు సూచిస్తున్నాయి. సింగపూర్ శిఖరాగ్ర సమావేశం అంతిమ లక్ష్యాలపై రెండు దేశాలూ సంపూర్ణ అంగీకారంతో ఉన్నాయని ఆయన చెప్పారు. ఉత్తర కొరియాతో ఏ ఒప్పందం కుదిరినాగాని తర్వాత ఆ దేశంలోని అణ్వాయుధాలు ఎన్ని ఉన్నాయో కట్టుదిట్టంగా లెక్కగట్టే తనిఖీ కార్యక్రమం ఉండాలని అమెరికా భావిస్తోంది. అప్పుడే తన అణు కార్యక్రమానికి ముగింపు పలకడానికి ఉత్తర కొరియా సిద్ధంగా ఉన్నట్టు తేలుతుందని కూడా అగ్రరాజ్యం చెబుతోంది. ఇద్దరు నేతల చర్చల ఫలితంపై ఉభయపక్షాలూ పూర్తి అవగాహనతో ఉండడం అత్యంత కీలకాంశంగా భావిస్తున్నారు. కిందటి నెలాఖరులో ట్రంప్ ట్విటర్లో కోరినట్టే అణ్వాయుధాలు తొలగించడానికి ఉత్తర కొరియా సంసిద్ధత వ్యక్తం చేస్తోంది. అయితే, తమ భూభాగం నుంచి అణ్వాస్త్రాల తొలగింపు అనే మాటలను అమెరికా, ఉత్తర కొరియా భిన్న అర్థాలతో వాడుతున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో మోహరించి ఉన్న 28,500 మంది సైనికులను అమెరికా ఉపసంహరించుకుంటే తన అణ్వాయుధాలను వదులుకోవడానికి సిద్ధమని సింగపూర్ భేటీ ప్రతిపాదనకు ముందు ఎప్పటి నుంచో ఉత్తర కొరియా చెబుతోంది. కాని, ఉత్తర కొరియా అణ్వాయుధాల తొలగింపునకు ఇలాంటి షరతు పెడితే అంగీకరించడానికి అమెరికా, దక్షిణ కొరియా సిద్దంగా లేవు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమానికి పూర్తిగా స్వస్తి పలకాలని అవి కోరుకుంటున్నాయి. అణ్వాయుధాల తొలగింపునకు ’టైంటేబుల్’ తన అణ్వాయుధాలు తొలగించడానికి, తనిఖీదారులొచ్చి ఆయుధాలు లెక్కించడానికి ఉత్తర కొరియా ఓ సమయ ప్రణాళికకు అంగీకరించవచ్చని ఈ చర్చల వ్యవహారంతో సంబంధం ఉన్న అమెరికా ఉన్నతాధికారి వెల్లడించారు. ’’ ఆయుధాల తనిఖీదారులు మొదట ఉత్తర కొరియా ఆణుపాటవంపై నివేదిక రూపొందిస్తారు. ఆయుధాలెన్నో లెక్కగడతారు. తర్వాత కొన్ని అణ్వాయుధాలను ఉత్తర కొరియా తొలగించాక, అమెరికా కొన్ని ఆంక్షలు ఎత్తేస్తుంది. మరి కొన్ని అణుబాంబులను ధ్వంసం చేశాక ఉత్తర కొరియాకు మరిన్ని రాయితీలు ప్రకటిస్తారు. తర్వాత దశలో అణు రియాక్టర్లను ఉత్తర కొరియా మూసేస్తుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. వెంటనే ఉత్తర కొరియాకు అమెరికా నుంచి మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయి. ఇలా దశవారీగా కిమ్ తన దేశ అణ్వాయుధ కార్యక్రమానికి ముగింపు పలికే విధంగా ఇద్దరు నేతల మధ్య ఒప్పందం కుదురుతుంది,’’ అని ఈ దౌత్యాధికారి వివరించారు. అయితే, సింగపూర్‌లో కుదిరే ఒప్పందం వివరాలు వెల్లడించడానికి అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి నిరాకరించారు. ఉత్తర కొరియా తన అణ్వాయుధ కార్యక్రమాన్ని ఆపేయడానికి అన్ని చర్యలు తీసుకునేలా ఈ దేశంపై గరిష్ట స్థాయిలో ఒత్తిడి కొనసాగుతుందని అమెరికా స్పష్టంచేసింది. ట్రంప్, కిమ్ భేటీ జరగడానికి నెల రోజుల సమయం ఉన్న కారణంగా ఈ లోగా రెండు దేశాల ఆలోచనల్లో మార్పులొచ్చే అవకాశాలు లేకపోలేదు. ఒప్పందం కుదరకపోయే అవకాశమూ ఉంది! సింగపూర్‌లో ట్రంప్, కిమ్ కలిశాక ఏం జరగవచ్చనే విషయంలో రకరకాల ఊహాగానాలు సాగున్నాయి. మొదట నేతలిద్దరూ కలిసి కరచాలనం చేసి ఎవరి దారిన వారు వెళ్లిపోవచ్చు. సంప్రదింపుల తర్వాత సంతకాలు చేసిన ఒప్పందం తమకు మేలు చేసేదిగా లేదంటూ కిమ్ దాన్ని అమలు చేయకుండా బుట్టదాఖలు చేసే ప్రమాదం కూడా ఉందని దౌత్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 1950ల నుంచీ కొరియా ద్వీపకల్పంలో పరిణామాలు గమనిస్తే ఉత్తర కొరియాను ఒప్పించి ఒడంబడిక చేసుకోవడం చాలా కష్టమైన పని. ఒప్పందాలను అలవోకగా ఉల్లంఘించడం ఈ కొరియా నేతలకు కొట్టిన పిండి. ఉత్తర కొరియా అణుకార్యక్రమంపై ఆ దేశ పాలకులతో సంప్రదింపులు జరిపి ఒప్పందానికి రావడానికి 1985 నుంచీ అమెరికా ప్రయత్నిస్తూనే ఉంది. కమ్యూనిస్ట్ కొరియా నేతలు అనేకసార్లు తమ మాట నిలబెట్టుకోలేదు. అణ్వాయుధాల తొలగింపుపై అమెరికాతో 2009లో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కూడా ఉత్తర కొరియా గాలికి వదిలేసింది. ఈ నేపథ్యంలో సింగపూర్ సమావేశంలో ఏఏ అంశాలు చర్చించాలనే విషయంపైనే రెండు దేశాలకు అవగాహన కుదిరి ఉండవచ్చుగాని అసలు ఒప్పందంలోని అంశాల ప్రస్తావన జరిగి ఉండకపోవచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
‘కొత్త రకం అణ్వస్త్రాలను అభివృద్ధి చేస్తున్న పాక్’
వాషింగ్టన్: పాకిస్తాన్ కొత్త రకం అణ్వాయుధాలను తయారుచేస్తోందని అమెరికా ఇంటెలిజెన్స్ చీఫ్ మంగళవారం హెచ్చరించారు. వాటిలో స్వల్ప శ్రేణి ఆయుధాలు కూడా ఉండటంతో ఆ ప్రాంతంలో ప్రమాద తీవ్రత పెరుగుతోందని డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ డ్యాన్ కోట్స్ కాంగ్రెస్‌కు చెప్పారు. సముద్రం నుంచి, ఆకాశం నుంచి ప్రయోగించగలిగే క్షిపణులు, దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులు కూడా పాక్ తయారుచేస్తున్న వాటిలో ఉన్నాయన్నారు. అమెరికాకు ఉత్తర కొరియా తలనొప్పిగా మారనుందని కోట్స్ పేర్కొన్నారు. ఇరాన్, సిరియా తదితర దేశాలకు కూడా ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి సాంకేతికతను ఇవ్వడం ద్వారా ఈ ప్రమాదకర టెక్నాలజీలను వ్యాప్తి చేయాలని అనుకుంటోందని స్పష్టమవుతోందని కోట్స్ అన్నారు. 2016, 17ల్లో ఉత్తర కొరియా వరుసగా అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించడం తెలిసిందే. ఉత్తర కొరియా జీవ ఆయుధాలు, రసాయనిక ఆయుధాలను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తాము అంచనావేస్తున్నామని కోట్స్ పేర్కొన్నారు. -
మానవాళికి అది పెనుముప్పే: ఆర్మీ చీఫ్ రావత్
సాక్షి, న్యూఢిల్లీ: అణ్వాయుధాలు, రసాయనిక ఆయుధాలు ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉండటం మానవాళికి పెనుముప్పుగా పరిణమించే అవకాశముందని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉగ్రవాదులు అత్యాధునిక సాంకేతిక వ్యవస్థలను ఉపయోగించుకుంటూ అంతర్జాతీయ సరిహద్దులను అధిగమించి చొచ్చుకువస్తున్నారని అన్నారు. ఉగ్రవాదులనే కాదు.. వారిని ప్రోత్సాహిస్తూ స్పాన్సర్లుగా ఉన్న వారిని సైతం చెదరగొట్టాల్సిన అవసరముందని, ఉగ్రవాదులకు స్పాన్సర్లుగా ఉన్న దేశాలను గుర్తించాలని సూచించారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో బుధవారం జరిగిన ‘రైజినా2018’ సదస్సులో ఆర్మీ చీఫ్ రావత్ మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రవాదులకు, మిలిటెంట్లకు ఉన్న లింకులను తొలగించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ఉగ్రవాద సంస్థలు తరచూ ఉపయోగించే ఇంటర్నెట్, సోషల్ మీడియాపై కొంతమేరకు ఆంక్షలు విధించాల్సిన అవసరముందని, ప్రజాస్వామిక దేశాల ప్రజలు దీనిని అంగీకరించకపోయినా.. భద్రమైన వాతావరణం కోసం ఇలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరముంటుందని రావత్ అన్నారు. -
అమెరికా బ్లాక్మెయిల్ చేసినంత కాలం..
సియోల్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమను భయపెడుతూ సైనిక విన్యాసాలు నిర్వహించినంత కాలం అణు కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఉత్తర కొరియా జరిపిన అణు, క్షిపణి పరీక్షలను సమీక్షించిన ఆ దేశ అధికారిక వార్తా సంస్థ కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ) శనివారం ఈ విషయాన్ని వెల్లడించింది. అమెరికా, దాని మిత్ర పక్షాల బ్లాక్మెయిల్, సైనిక విన్యాసాల నేపథ్యంలోనే నార్త్ కొరియా స్వీయ రక్షణకు అణు సామర్థ్యాలను పెంచుకుందని పేర్కొంది. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విద్వేషపూరిత విధానాలను అవలంబిస్తూ, దాడులకు పాల్పడతామని బెదిరిస్తున్నారని ఆరోపించింది. ‘ఉత్తర కొరియా కొత్త వ్యూహాత్మక, అణుశక్తిగా ఎదిగిందనడంలో సందేహం అక్కర్లేదు. మా విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదు. అజేయ శక్తిగా మారిన ఉత్తర కొరియాను బలహీనపరచలేరు, అణగదొక్కలేర’ ని కేసీఎన్ఏ వ్యాఖ్యానించింది. -
అమెరికాపై జీవ, రసాయన దాడులు!?
ఉత్తరకొరియా అణ్వాయుధాలను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే.. ఆ దేశం ప్రతిగా అమెరికాపై జీవ, రసాయన దాడులకు దిగే ప్రమాదముందని పెంటగాన్ హెచ్చరించింది. ఉత్తరకొరియా అణ్వాయుధాలను అత్యంత రహస్య ప్రదేశాల్లో దాచి పెట్టిందని, ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే భూతల దాడి ఒక్కటే మార్గమని పెంటగాన్ అధికారులు అమెరికా శాసనకర్తలకు నివేదించారు. ఈ అణ్వాయుధాలను కనుగొనడం పదాతి దళానికి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా పదాతి దళం ఉత్తరకొరియా అణుస్థావరాలను సమీపిస్తే జీవ, రసాయన దాడులకు దిగే ప్రమాదముందని తెలిపారు. ఉత్తరకొరియాతో యుద్ధంవస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై నివేదిక తయారుచేసిన పెంటగాన్ ఆ నివేదికను అమెరికా చట్టసభ సభ్యులకు సమర్పించింది. భూమిలో రహస్య ప్రదేశాల్లో అణ్వాయుధాలను ఉత్తర కొరియా దాచిపెట్టిందని, వాటిని కాపాడుకోవడానికి జీవ, రసాయన ఆయుధాలతో దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఉద్రిక్త రేపుతున్న ట్రంప్ పర్యటన..! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ఉద్రిక్తత రేపుతోంది. ట్రంప్ ఆసియా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తర కొరియా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ అణ్వాయుధాలకు పదును పెడుతున్నామని ఉ. కొరియా వెల్లడించింది. మరోవైపు ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్‌కు చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ ఒర్ విమానం టోక్యో విమానాశ్రయంలో దిగీదిగగానే.. ట్రంప్ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని తెలిపారు. ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం కోసమే పుతిన్‌తో సమావేశమవుతున్నానని చెప్పారు. 11 రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్లలో పర్యటిస్తారు. గత 25 ఏళ్లలో ఒక అమెరికా అధ్యక్షుడు చేపట్టిన సుదీర్ఘమైన ఆసియా పర్యటన ఇదే. -
ఉత్తర కొరియా.. అయితే ఏంటి?
సియోల్ : వరుస అణు ప్రయోగాలతో ప్రపంచాన్ని భయపెడుతున్న ఉత్తర కొరియా అంటే.. భయపడాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా ప్రకటించింది. అంతేకాక ఉత్తర కొరియాను చూసి భయపడి కొత్తగా తాము అణుబాంబులను రూపొందించుకోవాల్సిన అవసరం తమకు లేదని దక్షిణ కొరియా తేల్చి చెప్పింది. ప్రపంచాన్ని భయపెట్టే దిశలో ఉత్తర కొరియా చేస్తున్న అణ్వాయుధ ప్రయోగాలను సహించేది లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే స్పష్టం చేశారు. ఉత్తర కొరియాలా తామూ అణ్వాయుధాలను సమకూర్చుకోవాల్సిన అవసరం లేదని దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే.. ఆ దేశ పార్లమెంట్‌కు స్పష్టం చేశారు. అమెరికాను సైతం మొత్తం ధ్వంసం చేసే అణుబాంబులు.. వాటిని మోసుకెళ్లే క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా భద్రతపై ఆ దేశ పార్లమెంట్లో చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు మూన్ జే పార్లమెంట్లో మాట్లాడుతూ.. దక్షిణ కొరియా భద్రతపై అమెరికాతో ఒప్పందాలున్నాయని ఆయన స్పష్టం చేశారు. అణ్వాయుధాల ఉపసంహారంపై 1990లో చేసుకున్న ఒప్పందాలకు దక్షిణ కొరియా కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. -
అణ్వస్త్ర వ్యతిరేక ప్రచారానికి నోబెల్
స్టాక్‌హోమ్ : అణ్వాయుధ వ్యతిరేక ప్రచారానికి 2017 నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. మానవ మనుగడకు పెను సవాలుగా తయారైన అణ్వాయుధ వ్యాప్తిని అరికట్టాలని, దేశాలు తమ దగ్గరున్న అణునిల్వలను నిర్మూలించాలని ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తోన్న ‘అంతర్జాతీయ అణ్వాయుధ వ్యతిరేక ఉద్యమం(International Campaign to Abolish Nuclear Weapons-ICAN)కు ఈ ఏడాది నోబెల్ శాంతి దక్కినట్లు నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది. 2007లో ప్రారంభమైన అణ్వస్త్ర వ్యతిరేక ప్రచార ఉద్యమం (ICAN).. గడిచిన దశాబ్ధ కాలంగా 101 దేశాల్లో అణ్వస్త్రవ్యతిరేక ఉద్యమాలను నిర్వహిస్తోంది. ఐకెన్‌కు అనుబంధంగా ప్రపంవ్యాప్తంగా 468 సంస్థలు పనిచేస్తున్నాయి. వ్యక్తులకు కాకుండా ఒక ఉద్యమ సంస్థకు నోబెల్ శాంతి పురస్కారం దక్కడం ఈ దశాబ్ధిలో ఇది నాలుగోసారి కావడం గమనార్హం. -
పాకిస్తాన్ గొయ్యి తీస్తోందా?
పాకిస్తాన్ మరో ఉత్తర కొరియా కానుందా? అణ్వాయుధ సంపత్తిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోందా? ఆసియాలో మరోసారి అణుపోటీకి తెరతీస్తోందా? ఉత్తర కొరియా, చైనాలను పాకిస్తాన్‌కు సహకారం అందిస్తున్నాయా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. న్యూఢిల్లీ : ఆసియాలో మరోసారి అణ్వాయుధ పోటీకి పాకిస్తాన్ తెరతీస్తోందని అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఒకేసారి తొమ్మిది కేంద్రాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాల తయారీ చేస్తోందని అమెరికన్ సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఉగ్రవాదులకు స్థావరంగా మరిన పాక్.. మరిన్ని న్యూక్లియర్ వెపన్స్ రూపొందిస్తే పరిస్థితులు భయానకంగా ఉంటాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు అంచనా ప్రకారం.. పాకిస్తాన్ 130-140 న్యూక్లియర్ వార్హెడ్లను రూపొందించే పనిలో పడింది. వీటిని వీలైనంత త్వరగా తయారు చేసి.. సైన్యానికి అప్పగించాలని ప్రయత్నాలు చేస్తోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎక్కడెక్కడ? పాకిస్తాన్ అణ్వాయుధాలను.. మొత్తం తొమ్మది కేంద్రాల్లో తయారు చేస్తోందని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇందులో పంజాబ్ ప్రావిన్స్‌లో 4, సింధ్ ప్రావిన్స్‌లో 3, బలూచిస్తాన్‌లో 2 కేంద్రాల్లో ఆయుధాలు రూపొందుతున్నాయని ఎఫ్ఏఎస్ ప్రకటించింది. ఇవే కేంద్రాలు సైంటిస్టులు ఎం. కిర్‌స్టన్, రాబర్ట్ ఎస్. నోరిస్ల అంచనా మేరకు పాకిస్తాన్ ఆయుధ తయారీ కేంద్రాలు ఇవే. ఆక్రో గారిసన్, సింధ్ (ఇక్కడ ఆయుధాలను అండర్‌గ్రౌండ్‌లో దాచేందుకు అవకాశం ఉంది) గుజ్రన్‌వాలా గారిసన్, పంజాబ్ (ఆయుధాలను నిల్వ చేసుకోవచ్చు) ఖుజ్దార్ గారిసన్, బలూచిస్తాన్ (భూగర్భంలో ఆయుధాలను నిల్వ చేసుకునే అవకాశం ఉంది) మస్రూర్ డిపార్ట్మెంట్, కరాచీ (సింధ్) (ఇక్కడ శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చు) నేషనల్ డెవలప్మెంట్ కాంప్లెక్స్, పంజాబ్ (ఎస్‌ఎస్‌ఎమ లాంచర్ అసెంబ్లీ, వార్హెడ్ల తయారీ,న నిల్వ) పానో అకిల్ గారిసన్, సింధ్ (ఆయుధాలను నిల్వ చేసుకోవచ్చు) సర్గోదా డిపార్ట్మెంట్, పంజాబ్ (శక్తివంతమైన బాంబులను నిల్వ చేసుకోవచ్చు, ఎఫ్-16 యుద్ధవిమానాలు దగ్గరలోనే ఉంటాయి) తర్బాలా అండర్‌గ్రౌండ్ డిపార్ట్మెంట్, ఖైబర్ (శక్తివంతమైన వార్‌మెడ్లను నిల్వ చేస్తారు) వాహ్ ఆర్డినెన్స్ ఫెసిలిటి, పంజాబ్ (వార్హెడ్ల తయారీ, నిల్వ) ఎలా గుర్తించారు? పాకిస్తాన్లో అణ్వాయుధాల తయారీ జరుగుతోందన్న అనుమానాలు కొద్దిగా కాలంగా ఉన్నట్లు ఎఫ్ఏసీ సైంటిస్టులు తెలిపారు. కమర్షియల్ శాటిలైట్లు అందించిన ఛాయాచిత్రాలు, నిపుణుల పరిశోధనలు, స్థానిక పత్రికల్లో ఇచ్చే వార్తల అధారంగా వీటిని గుర్తించనట్లు చెప్పారు. అంతేకాక భారత్‌లోని ఏ నగరాన్ని అయినా మేం చేరుకోగలమని సెప్టెంబర్ 20న పాకిస్తాన్ ప్రధాని షాహిద్ ఖాన్ అబ్బాసీ చేసిన ప్రకటన కూడా నమ్మకానికి బలాన్ని చేకూర్చిందని వారు తెలిపారు. -
'జపాన్ను సముద్రంలో ముంచేస్తాం'
సియోల్: జపాన్ సముద్రంలో ముంచెస్తామని జగడాల మారి ఉత్తర కొరియా హెచ్చరించింది. అమెరికాతో కలిసి తమపై కుట్ర చేస్తున్న ఆ దేశాన్ని ఇక ఎంతో కాలం తమకు సమీపంగా ఉంచబోమంటూ వార్నింగ్ ఇచ్చింది. జపాన్‌కు చెందిన ఆర్చిపిలాగో నాలుగు ద్వీపాలను ఒక అణుబాంబు వేయడం ద్వారా చిత్తు చేసి సముద్రంలో ముంచేస్తామని, దాంతో ఇక జపాన్ తమ దరి చేరలేదంటూ బెదిరించింది. ఐక్యరాజ్యసమితిపై కూడా ఉత్తర కొరియా తీవ్ర విమర్శలు చేసింది. లంచాలు తీసుకునే కొన్ని దేశాలు అన్ని కలిసి తమకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నాయని, అందులో భాగంగానే తాజాగా ఐరాసలో అమెరికా పెట్టిన తీర్మానం అని అభివర్ణించింది. ఇక ఏమాత్రం అణు పరీక్షలు చేయడానికి వీల్లేదని చెప్పడంతోపాటు ఉత్తర కొరియాకు బొగ్గు, ఖనిజాలు, ఇంధన ఎగుమతులు ఆపేయాలని, ఉత్తర కొరియాకు చెందిన టెక్స్‌టైల్స్‌ను ఎవరూ దిగుమతి చేసుకోవద్దనే పేరిటీ తీర్మానం రూపొందించి భద్రతామండలిలో అమెరికా ప్రవేశపెట్టింది. దీనిని సభ్యత్వ దేశాలన్ని కూడా ఆమోదించాయి. జపాన్, అమెరికా ఆఖరికి చైనా కూడా ఆ తీర్మానానికి ఆమోదం చెప్పడంతో ఉత్తర కొరియా మండిపడింది. అసలు భద్రతా మండలి అనేదే ఒక దుష్టశక్తి అని, దానిని బద్ధలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అందులో ఉన్నసభ్యత్వ దేశాలన్ని కూడా లంచం తీసుకొని పనిచేసే అవినీతి దేశాలు అంటూ తిట్టిపోసింది. అందుకే, ముందుగా తాము జపాన్ను టార్గెట్ చేసుకొని దాని భూభాగాలను సముద్రంలో ముంచివేస్తామని, దాని ద్వారా అమెరికాలో మరింత భయాన్ని సృష్టించిన అక్కడ కూడా చీకట్లు నిండేలా చేస్తామంటూ హెచ్చరించింది. ఈ నెల(సెప్టెంబర్) 3న ఉత్తర కొరియా అణు పరీక్షలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. -
అణ్వస్త్రాలే పెను సవాలు
వాషింగ్టన్: ప్రస్తుతం ప్రపంచానికి అణ్వాయుధాలే పెను సవాలుగా మారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘అణ్వస్త్ర రహిత ప్రపంచానికి నేను అనుకూలం. ప్రపంచానికి గ్లోబల్ వార్మింగ్ అతిపెద్ద ముప్పని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చెప్పారు. కాని వాస్తవానికి అణ్వాయుధాలే ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా పరిణమించాయి’ అని ట్రంప్ న్యూజెర్సీలో మీడియాతో అన్నారు. అణ్వాయుధాలు ఉన్న రష్యా, చైనా, పాకిస్తాన్ తదితర దేశాలు వాటిని వదిలించుకోవాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ తెలిపారు. ఉత్తర కొరియాపై సైనిక చర్యకు తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని, ఆ దేశాధినేత కిమ్ ఏమాత్రం అనాలోచితంగా వ్యవహరించినా తీవ్ర పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌పై ట్రంప్ వాషింగ్టన్/వాటికన్ సిటీ: పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 29న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తెతో ఫోన్లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంభాషణలను అమెరికా మీడి యా మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ మాట్లాడిన కొన్ని రోజులకే కిమ్‌ను కలవడం గౌరవంగా భావిస్తానని ట్రంప్ బహిరంగంగా చెప్పడం తెలిసిందే. ట్రంప్ భారీ కాయంపై పోప్ జోక్ ట్రంప్ బుధవారం తన భార్య మెలానియా, కూతురు ఇవాంక సమేతంగా పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ సిటీలో కలిశారు. ప్రపంచమంతా శాంతిని వ్యాప్తి చేసేందుకు అధ్యక్ష పదవిని ఉపయోగించాలని పోప్ ఫ్రాన్సిస్ ట్రంప్‌కు సూచించారు. ట్రంప్ లావుగా ఉండటంపై భేటీ సమయంలో పోప్ మెలానియాతో ఒక జోక్ కూడా వేశారు. ‘మీరు ఆయనకు ఏం పెడతారు? పొటీజ్జా?’ అని మెలాని యాను పోప్ అడిగారు. మెలానియా సొంత దేశమైన స్లొవేనియాలో దొరికే పొటీజ్జా్జ అనేది కెలరీలు ఎక్కువగా లభించే ఓ వంటకం. ట్రంప్‌తో చేయి కలపని మెలానియా ఇటలీలో విమానం నుంచి దిగుతున్న సమయంలో మెలానియా చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నించగా ఆమె నిరాకరించింది. చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నిస్తుండగా ఆమె చేయి విదిలించుకుని తన చేతితో జుట్టు ను సరిచేసుకుంది. ఇది కెమెరాలకు చిక్కడంతో నెటిజన్లు ట్విటర్లో జోకులు పేల్చారు. -
పిచ్చోడి చేతిలో ఆటంబాంబులు..
- కిమ్ జాంగ్‌పై ట్రంప్ యూటర్న్ - అమెరికా అధ్యక్షుడి ‘ఫోన్ సంభాషణ’ రట్టు.. సంచలనం వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి మాట మార్చారు. మొన్నటిదాకా ఏ నోటితోనైతే ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ను పొగిడారో.. అదేనోటితో మళ్లీ తిట్లపురాణం మొదలెట్టారు. ‘కిమ్.. అణుబాంబులు చేతపట్టుకున్న పిచ్చోడు..’ అని దూషించారు. ఈ మేరకు ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డుటెర్తీతో ట్రంప్ జరిపిన ఫోన్ సభాషణను అమెరికన్ వార్తాపత్రికలు రట్టుచేయడం సంచలనంగా మారింది. కొద్దిరోజుల కిందటే ‘కిమ్‌ను కలవడాన్ని గౌరవంగా భావిస్తా’నన్న ట్రంప్.. ఒక దశలో ఉత్తరకొయా నేతతో చర్చలు జరపబోతున్నట్లు చెప్పారు. అందుకు విరుద్ధంగా ఇప్పుడు కిమ్‌పై విమర్శలు గుప్పించారు. ఉత్తరకొరియా దగ్గరున్న అణ్వాయుధాలకంటే 20రెట్లు ఎక్కువ ఆయుధాలు తమ దగ్గరున్నాయని, కిమ్‌ను క్షణాల్లో అంతం చేయగల సత్తా ఉన్నా అమెరికా ఆ పని చేయబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ‘కిమ్ గురించి మీరేమనుకుంటున్నారు?’ అని ట్రంప్ ప్రశ్నించగా, ‘అతనికి మతిచెడింది. ఏక్షణంలోనైనా ప్రమాదకారిగా మారే అవకాశం ఉంది’ అని రొడ్రిగో బదులిచ్చినట్లు పత్రికలు పేర్కొన్నాయి. కాగా, కిమ్‌ను కట్టడిచేసేలా చైనాపై ఒత్తిడి తేవాలని (ఫిలిప్పీన్స్)రొడ్రిగోను ట్రంప్ కోరడం గమనార్హం. ‘చైనా గనుక ఉత్తరకొరియాకు మద్దతు ఉపసంహరించుకుంటే, కిమ్ పని అయిపోయినట్లే. మీరు ఒకసారి చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ తో మాట్లాడిచూడండి. మాట వింటే పని సులువైనట్లే. వినకపోతే మేమే(అమెరికానే) కిమ్ మెడలు వంచుతాం’ అని రొడ్రిగోతో ట్రంప్ అన్నట్లు పత్రికలు తెలిపాయి. అప్పటికీ వినకపోతే చిట్టచివరి ప్రయత్నంగా కొరియాపై అణుబాంబులు వేస్తాం. కానీ అది ఏ ఒక్కరికీ మంచిదికాదు’ అని ట్రంప్ ఫోన్ ఫోన్ సంభాషణను ముగించారట. -
ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి!
-
ఎంత బలమైన దేశమైనా వణికిపోవాలి!
ప్యొంగ్ యాంగ్: తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా ఉత్తరకొరియా అడుగులు వేస్తోంది. ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి రూపకల్పణలో తాము ఫైనల్ స్టేజీలో ఉన్నామని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వెల్లడించారు. 2016లో అణు పరీక్షలు నిర్వహించామని, ప్రస్తుతం బాలిస్టిక్ మిస్సైల్ చివరిదశకు చేరుకున్నామని న్యూ ఇయర్ స్పీచ్ ఇస్తూ ఆదివారం స్వయంగా ఆయనే తెలిపారు. ప్యొంగ్ యాంగ్ అణు సామర్థ్యాన్ని మెరుచుపరుచుకుందని, బలమైన ప్రత్యర్ధులు సైతం తమ దేశంపై యుద్ధానికి రావాలంటే వణికిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. 'గత ఏడాది తాము రెండు అణు పరీక్షలు, క్షిపణిని విజయవంతంగా టెస్ట్ చేశాం. ఎటుంటి పరిస్థితులు ఎదురైనా తమ అణ్వస్త్రాలతో ఢీకొనేందుకు సిద్దంగా ఉంటాం. ఖండాంతర క్షిపణి త్వరలోనే పరీక్షించి మా స్థాయిని పెంచుకుంటాం. అప్పుడు తమ ఆర్మీకి బలమైన అస్త్రాలు అందిస్తాం' అని కిమ్ జోంగ్ పేర్కొన్నారు. అణ్వాయుధాలన్నీ కేవలం తమ ఆత్మ రక్షణ కోసమేనని పేర్కొంటూనే అమెరికా లాంటి దేశాలను ఢీకొట్టాలంటే అణ్వాయుధాలు సమకూర్చుకోవాల్సందేనని మరోసారి ప్రస్తావించారు. -
పాక్ వద్ద 140 అణ్వాయుధాలు
అణు శాస్త్రవేత్తల బులెటిన్ వెల్లడి వాషింగ్టన్: పాకిస్తాన్ తన ఆణ్వాయుధాలను విస్తరించుకుంటూ 130-140 వార్హెడ్లను అభివృద్ధి చేసుకుందని అణు శాస్త్రవేత్తల బులిటెన్ తాజా నివేదికలో బహిర్గతమైంది. అణ్వాయుధాలను తరలించేలా ఎఫ్-16 సహా కొన్ని యుద్ధ విమానాలను తీర్చిదిద్దుకుంటోందని కూడా తెలిసింది. పాకిస్తాన్ సైన్యం ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలించి హాన్స క్రిస్టెన్సేన్, రాబర్ట్ ఎస్ నారిస్ తయారుచేసిన ఈ నివేదికలో.. అణ్వాయుధాలకు సంబంధించిన మొబైల్ లాంచర్లు, అండర్‌గ్రౌండ్ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. -
భారత్ కు దీటుగా పాక్ అణ్వాయుధాలు
పాకిస్తాన్ పెద్ద ఎత్తున అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నట్లు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇప్పటికే దాదాపు 130 నుంచి 140 వార్ హెడ్ లను పాక్ తయారుచేసినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా అమెరికా జారీచేసిన మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ ఎఫ్-16 ఫైటర్ల ద్వారా న్యూక్లియర్ వార్ హెడ్ లను, మిరాజ్ ఫైటర్ల ద్వారా రాడ్ ఎయిర్ లాంచ్ క్రూస్ మిస్సైల్ ను మోసుకెళ్లే సామర్ధ్యాలను జోడించిందని తెలిపారు. గూగుల్ మ్యాప్స్ ద్వారా పది పాకిస్తానీ న్యూక్లియర్ బేస్ లను పరిశీలించిన అమెరికా శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. కరాచీకి పశ్చిమంగా ఉన్న మస్రూర్ ఎయిర్ బేస్ లో ఎఫ్-16 జెట్లకు అణు వార్ హెడ్ లను మోసుకెళ్లే శక్తి సామర్ధ్యాలను పెంపొందిస్తున్నారని చెప్పారు. అమెరికన్ శాస్త్రవేత్తలు పరిశీలించిన పది బేస్ లలో ఐదు గ్యారిసన్లు(సైనిక స్ధావరాలు), రెండు ఎయిర్ బేస్ లు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. ఎయిర్ బేస్ లలో అణ్వాయుధాల తయారీతో పాటు ఫైటర్ జెట్లకు వాటిని మోసుకెళ్లే సామర్ధ్యాన్ని పెంపొందిస్తున్నారు. ఎఫ్ఏఎస్ కు చెందిన హన్స్ ఎమ్ క్రిస్టెన్సన్ మాట్లాడుతూ.. అక్రో(సింధ్), గుజ్రన్ వాలా(పంజాబ్), ఖుజ్దర్(బలూచిస్తాన్), పనో అక్విల్(సింధ్), సర్గోధాల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలను తయారుచేస్తుందని చెప్పారు. బహవాల్పూర్ లో గల ఆరో బేస్ ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్నట్లు పేర్కొన్నారు. దెరా ఘాజి ఖాన్ లో గల బేస్ ఉన్న నిర్మాణతీరు చూస్తుంటే అది న్యూక్లియర్ బేస్ కాదనే అనుమానాలు రేకత్తుతున్నట్లు చెప్పారు. ఈ బేస్ లలో గల అణ్వాయుధాలను ఉపయోగించి 100 కిలోమీటర్ల లోపల గల టార్గెట్లను పాకిస్తాన్ ఛేదించగలదని తెలిపారు. పాకిస్తాన్ వినియోగిస్తున్న టెక్నాలజీ మొత్తం చైనాకు చెందినదేనని పేర్కొన్నారు. పశ్చిమ ఇస్లామాబాద్ లో గల పాకిస్తానీ నేషనల్ డెవలప్ మెంట్ కాంప్లెక్స్ లో షాహీన్-2, బాబర్ మిస్సైల్స్ ను తయారు చేస్తున్నట్లు చెప్పారు. పాకిస్తాన్ క్రమంగా భారత్ కు దీటుగా ఆయుధాలను తయారుచేసుకుంటుందని తెలిపారు. -
అణ్వస్త్రాలపై రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం వద్ద అణ్వస్త్రాలు ఉన్నా.. వాటిని ముందుగా తాము ఎవరిపైనా ఉపయోగించబోమంటూ ఇన్నాళ్లూ ఒక స్వీయ నియంత్రణ పాటిస్తున్నాం. కానీ అసలు అలా ఎందుకు చేతులు కట్టుకుని కూర్చోవాలని ప్రశ్నించి.. రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సంచలనం రేపారు. ఒకవైపు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్న సమయంలో రక్షణ మంత్రి ఈ తరహా వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ''మనం చేతులు కట్టుకుని ఎందుకు కూర్చోవాలి? బాధ్యాయుతమైన అణ్వస్త్ర దేశంగా ఉంటామని, దాన్ని బాధ్యతారహితంగా ఉపయోగించబోమని మాత్రమే చెప్పాలన్నది నా ఉద్దేశం. ఇది నా ఆలోచన'' అని పరిక్కర్ వ్యాఖ్యానించారు. అయితే, ఈ అంశంపై ఇవన్నీ కేవలం తన వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని, ప్రభుత్వ అభిప్రాయం కాదని ఆ తర్వాత ఆయన స్పష్టం చేశారు. రక్షణ శాఖ కూడా ఆ తర్వాత చేసిన ఒక ప్రకటనలో.. పారిక్కర్ చేసినవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలు మాత్రమే తప్ప అధికారికం కాదని తెలిపింది. ముందుగా అణ్వస్త్రాలు ఉపయోగించకూడదన్న విధానానికే భారతదేశం కట్టుబడిందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఒకరు అన్నారు. 1998లో నిర్వహించిన అణు పరీక్షల తర్వాత.. ముందుగా తాము అణ్వస్త్రాలను ఉపయోగించబోమన్నది తన విధానంగా భారతదేశం ప్రకటించింది. తాను చేసిన ఈ వ్యాఖ్యలపై తర్వాత ఎలా ప్రచారం జరుగుతుందో కూడా పరికర్ నవ్వుతూ చెప్పారు. భారతదేశం తన అణు విధానాన్ని మార్చేసుకుందని మీడియాలో వచ్చినా వస్తుందని ఆయన అన్నారు. ఇది ప్రభుత్వ విధానంలో మార్పు కాదని, ఒక వ్యక్తిగా తాను మాత్రమే అలా భావిస్తున్నానని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్‌కు ముందువరకు పాకిస్థానీ రక్షణ మంత్రి తరచు భారతదేశం మీద అవసరమైతే అణు దాడికి కూడా వెనుకాడేది లేదని బెదిరించేవారని, కానీ సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన రోజు నుంచి ఇప్పటివరకు అలాంటి బెదిరింపు ఒక్కటి కూడా రాలేదని.. దాన్ని బట్టి చూస్తే మనం ఏమైనా చేయగలమని అర్థమవుతోందని కూడా పారికర్ అన్నారు. -
భారత్, పాక్ మధ్య యుద్ధమే వస్తే...?
-
భారత్, పాక్ మధ్య యుద్ధమే వస్తే...?
న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో యుద్ధం తప్పకపోవచ్చని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దసరా పండుగ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ పరిస్థితే తలెత్తితే ఇరువైపుల ఎలాంటి నష్టం వాటిల్లుతుందో ఓసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. పాకిస్థాన్, భారత్‌కు మధ్య ఇప్పటివరకు 1948, 1965, 1971, 1999 సంవత్సరాల్లో జరిగిన నాలుగు యుద్ధాల్లో ఇరువైపులు దాదాపు 23 వేల మంది సైనికులు మరణించగా, లక్ష పౌర కుటుంబాల్లో కనీసం ఒకరు మరణించారు. ఈ నాలుగు యుద్ధాల కారణంగా భారత ఆర్థిక సామర్థ్యం మూడు శాతం దెబ్బతిన్నదని ‘స్ట్రాటజిక్ ఫోర్‌సైట్ గ్రూప్’ అంచనా వేసింది. ప్రస్తుతం భారత్, పాక్ దేశాలు అణ్వస్త్రాలు కలిగి ఉన్నందున ఈసారి యుద్ధం జరిగితే ఇరు దేశాల్లో అపార ఆస్తి, ప్రాణ నష్టాలతోపాటు ప్రకృతికి తద్వారా ప్రపంచానికి ఊహించని నష్టం వాటిల్లుతుంది. ఇరు దేశాల మధ్య 200లకుపైగా అణ్వస్త్రాలు ఉన్నాయి. అవి ఒక్కొక్కటి 15 కిలోటన్ హిరోషిమా బాంబుకు సమానం. వీటిలో ఇరు దేశాలు వంద అణ్వస్త్రాలను ప్రయోగిస్తే ఇరువైపుల 2.10 కోట్ల మంది పౌరులు మరణిస్తారని అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీ, కొలరాడో బౌల్డర్ యూనివర్శిటీ, రటగర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అంటే రెండవ ప్రపంచ యుద్ధంలో చనిపోయిన వారిలో దాదాపు సగం మంది చనిపోతారన్న మాట. ఇక అణ్వస్త్రాల వల్ల ప్రకృతిపరంగా నష్టం అపారం. ప్రపంచవ్యాప్తంగా సగం ఓజోన్ పొర దెబ్బతింటుంది. అతి రేడియేషన్ కారణంగా భూ వాతావరణంలో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి. రుతుపవనాలు దెబ్బతింటాయి. తీవ్ర కరవు పరిస్థితులు ఏర్పడతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల మంది ప్రజలు తీవ్ర కరవు పరిస్థితులలో అలమటిస్తారని ‘ఇంటర్నేషనల్ ఫిజిషియన్స్ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ న్యూక్లియర్ వార్’ అనే అంతర్జాతీయ సంస్థ 2013లో అంచనా వేసింది. ఆటమిక్ సైంటిస్ట్‌ల బులిటెన్ వెల్లడించిన నివేదిక ప్రకారం పాకిస్థాన్ వద్ద 110 నుంచి 130 వరకు, భారత్ వద్ద 110 నుంచి 120 వరకు అణ్వస్త్రాలు ఉన్నాయి. పాకిస్థాన్ వద్దనున్న అణ్వస్త్రాల్లో 66 శాతం అణు శీర్షాలను 86 భూ ఉపరితలం నుంచి ప్రయోగించే ఖండాంతర క్షిపణులు మోసుకెళ్లగలవు. వాటిలో హతాఫ్ సిరీస్ ఒకటి ముఖ్యమైనది. ప్రవక్త మొహమ్మద్ పేరును సూచించేలాగానే హతాఫ్ అని దానికి పేరు పెట్టారు. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని అభివృద్ధి చేస్తున్న హతాఫ్ సిరీస్ ఇంకా ప్రయోగాల దశల్లోనే ఉంది. పాకిస్థాన్ వద్దనున్న మధ్యశ్రేణి ఖండాంతర క్షిపణులు భారత దేశంలోని న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై లక్ష్యాలను ఛేదించగలవని ముంబైలోని ‘నేషనల్ సెక్యురిటీ, ఎత్నిక్ కాన్ఫ్లిక్ట్ అండ్ టైజమ్’ ఫెల్లో సమీర్ పాటిల్ తెలిపారు. 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించే మొహమ్మద్ ఘోరి పేరిట నిర్మించిన ఖండాంతర క్షిపణులు పాక్ వద్ద 40 ఉన్నాయని, అవి ఢిల్లీ, జైపూర్, అహ్మదాబాద్, ముంబై, నాగపూర్, భోపాల్, లక్నో లక్ష్యాలను ఛేదించగలవని బెంగళూరులోని ‘నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీస్’కు చెందిన నిపుణులు గతంలో ఓ నివేదికలో వెల్లడించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే 2,500 కిలోమీటర్లు ప్రయాణించే శక్తి గల దూర శ్రేణి షహీన్ ఖండాంతర క్షిపణుల కూడా పాక్ వద్ద ఎనిమిది ఉన్నాయని, ఇవి కోల్‌కతా సహా భారత్‌లోని అన్ని నగరాల లక్ష్యాలను ఛేదించగలవని వారు తెలిపారు. ఇక పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచి, రావల్పిండి, ముల్తాన్, పెషావర్, క్వెట్టా, గ్వాడర్ సహా అన్ని నగరాల లక్ష్యాలను ఛేదించే అణు క్షిపణలు భారత్ వద్ద కూడా భారీగానే ఉన్నాయి. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే స్వల్పశ్రేణితోపాటు 2000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే పుధ్వీ, అగ్ని సిరీస్ క్షిపణులు భారత్ వద్ద ఉన్నాయని ఆటమిక్ సైంటిస్ట్స్ బులిటెన్ వెల్లడిస్తోంది. అణ్వాస్త్రాలను ప్రయోగించే సాగరిక జలాంతర్గామితోపాటు అణు శీర్షాలను ప్రయోగించి జాగ్వార్ ఫైటర్ బాంబర్ విమానాలు మనవద్ద ఉన్నాయి. పాకిస్థాన్‌కు జలాంతర్గామి లేకపోవడం గమనార్హం. -
పాక్‌కు యూఎస్ సందేశం
వాషింగ్టన్: అణ్వాయుధాల వాడకం విషయంలో పాకిస్తాన్ నిగ్రహాన్ని పాటించాని అమెరికా సందేశాన్ని పంపింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థల మీద చర్యలు తీసుకోవాలని పాక్‌కు సూచించింది. అణ్వాయుధాలు కలిగిన దేశాలు, వాటి వాడకం విషయంలో నిగ్రహంతో ఉండాల్సిన బాధ్యత ఉందని యూఎస్ ఉప అధికార ప్రతినిధి మార్క్ టోనర్ అన్నారు. పాక్ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అణ్వాయుధాలను సైతం వాడడానికి సిధ్దంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో మార్క్ టోనర్ విలేకరులు అడిగిన ప్రశ్నకు పై విధంగా బదులిచ్చారు. భారత్, పాకిస్తాన్ మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను అమెరికా నిశితంగా పరిశీలిస్తోందన్నారు. ఉడీ ఉగ్రదాడుల అనంతరం జరుగుతున్న పరిణామాల తర్వాత తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతున్న విషయం తెలిసిందే. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని ఆసిఫ్ చెప్పారు. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. హిల్లరీ ఆందోళన పాకిస్తాన్లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భారత్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. -
పాక్ నుంచి అణు ఆత్మాహుతి బాంబులు
హిల్లరీ ఆందోళన వాషింగ్టన్: పాకిస్తాన్లో అణ్వాయుధాలు జీహాదీల చేతుల్లోకి వెళితే పెను ప్రమాదం తప్పదని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ భయాందోళనలు వ్యక్తం చేశారు. తద్వారా అణుఆత్మాహుతి దాడులు జరిగే అవకాశం ఉందన్నారు. ‘జీహాదీలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారన్న భయంతో జీవిస్తున్నాం. వారు అణ్వాయుధాలు హస్తగతం చేసుకుంటారు. ఫలితంగా అణు ఆత్మాహుతి దాడులకు అవకాశం ఏర్పడుతుంది’ అని ఆందోళన వ్యక్తం చేసినట్టు ‘న్యూయార్క్ టైమ్స్’ పేర్కొంది. డెమోక్రటిక్ పార్టీ కంప్యూటర్ల హ్యాకింగ్ ద్వారా హిల్లరీ మాట్లాడిన ఆడియో సారాంశాన్ని పత్రిక వెల్లడించింది.గత ఫిబ్రవరిలో వర్జీనియాలో నిధుల సేకరణ సందర్భంగా ఆమె సన్నిహితులతో ఈ వ్యాఖ్యలు చేశారంది. భారత్‌తో ఉన్న శత్రుత్వంతో పాక్ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని హిల్ల రీ పేర్కొన్నారు. రష్యా, చైనాతో పాటు పాక్, భార త్ అణ్వాయుధాల్లో పోటీపడుతున్నాయని... ఇది అత్యంత ప్రమాదకర పరిణామమని అన్నారు. -
మా అణ్వస్త్రాలు.. ఆటబొమ్మలు కావు
తమ వద్ద అణ్వస్త్రాలు ఉన్న విషయాన్ని పాకిస్థాన్ పదే పదే బయటకు చెబుతోంది. భారతదేశంతో ఒకవేళ యుద్ధం అంటూ వస్తే వాటిని ఉపయోగించడానికి ఏ మాత్రం వెనకాడేది లేదని అంటోంది. ఈ విషయాన్ని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తమ వద్ద ఉన్న అణ్వస్త్రాలు ఆటబొమ్మలేవీ కావని ఆయన అన్నారు. ''మా దగ్గర ఉన్న వ్యూహాత్మక ఆయుధాలను మా రక్షణ కోసమే తయారు చేశాం. ఈ ఆయుధాలు ఆటబొమ్మలు ఏమీ కావు. మా క్షేమానికి ఏమైనా ముప్పు ఉందనుకుంటే వాటిని వెంటనే ఉపయోగంలోకి తీసుకొస్తాం'' అని జియో టీవీకి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆసిఫ్ చెప్పారు. ఈ ఇంటర్వ్యూ సెప్టెంబర్ 26వ తేదీన ప్రసారమైంది. ఉడీ ఉగ్రదాడి జరగడానికి ఒక్కరోజు ముందు.. అంటే సెప్టెంబర్ 17వ తేదీన కూడా ఇలాంటిదే మరో ఇంటర్వ్యూ ప్రసారమైంది. ఇప్పటికిప్పుడు యుద్ధం వస్తుందన్న భయం ఏమీ లేదని.. కానీ ఖురాన్లో అల్లా చెప్పినట్లు, 'గుర్రాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి' అని ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. పాకిస్థాన్ మీద ఎప్పుడూ ఒత్తిడి ఉంటూనే ఉందని, అందువల్ల అవసరమైన వాటి కంటే ఎక్కువగా తమదగ్గర వ్యూహాత్మక ఆయుధాలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయంలో తమదే ఆధిక్యం అన్న విషయానికి అంతర్జాతయంగా కూడా గుర్తింపు ఉందని చెబుతూ.. ఎవరైనా తమ గడ్డమీద అడుగుపెట్టినా, తమ అంతర్గత భద్రతకు ముప్పు తేవాలని చూసినా తమ రక్షణ కోసం ఆ ఆయుధాలను ఉపయోగించడానికి వెనుకాడబోమని అన్నారు. భారతదేశంతో యుద్ధం వస్తే పాకిస్థాన్ అణ్వాయుధాలు ఉపయోగిస్తుందా అన్న ప్రశ్నకు.. అది పరిస్థితులను బట్టి ఆధారపడుతుందని, తమ ఉనికి ప్రమాదంలో పడితే తాము అన్నింటినీ ఉపయోగిస్తామని స్పష్టం చేశారు. అందులో భయపడాల్సింది ఏముందని ఎదురు ప్రశ్నించారు. -
అణ్వాయుధాల విషయంలో భారత్ బాధ్యతాయుత దేశం
-
ఆత్మరక్షణ కోసమే మా అణ్వాయుధాలు
తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటామని ఉత్తరకొరియా మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే అణ్వాయుధాలున్న దేశాలు ఎంత బెదిరించినా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలు విధిస్తామని తెలిపినా తాము మాత్రం వాటిని వదిలిపెట్టేది లేదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశంలో ఉత్తరకొరియా విదేశాంగ శాఖ మంత్రి రి యాంగ్ హో ఈ విషయం తెలిపారు. తమ దేశంలో ఉన్న అణ్వాయుధాలన్నీ కేవలం ఆత్మరక్షణ కోసమేనని, తమకు అమెరికా నుంచి అణ్వాయుధాల ముప్పు ఉంది కాబట్టే వీటిని అభివృద్ధి చేసుకున్నామని చెప్పారు. అణ్వాయుధాలు కలిగి ఉండాలన్నది తమ దేశ విధానమని తెలిపారు. ఇతర దేశాలతో తమ సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో జాతీయ భద్రత, కొరియన్ ద్వీపకల్పంలో శాంతి దృష్ట్యా తమకు ఈ ఆయుధాలు ఉండాలన్నారు. తమ అణ్వాయుధాలను రాశి, వాసి పరంగా మరింత బలోపేతం చేసుకుంటామని కూడా ఉత్తరకొరియా విదేశాంగ మంత్రి రి యాంగ్ హో స్పష్టం చేశారు. కొరియన్ ద్వీపకల్పం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ప్రదేశమని.. ఇక్కడ ఏ క్షణంలోనైనా అణు యుద్ధం మొదలయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. దక్షిణ కొరియా, అమెరికా కలిసి తరచు పెద్ద ఎత్తున అణ్వాయుధ విన్యాసాలు చేస్తున్నాయని, ఉత్తరకొరియా నాయకత్వాన్ని అస్థిరత పాలుచేయాలని, రాజధాని ప్యాంగ్యాంగ్ను స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నాయని ఆరోపించారు. గత సంవత్సరం తమ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కొత్త శాంతి ఒప్పందం చేసుకుందామని ప్రతిపాదించినా వాళ్లు పట్టించుకోలేదని ఆయన అన్నారు. -
ఆ అణుదాడిపై క్షమాపణ చెప్పబోను: ఒబామా
టోక్యో: జపాన్‌లోని హిరోషిమాలో అమెరికా అణుదాడిపై క్షమాపణ చెప్పబోనని శ్వేతసౌధం అధిపతి బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఈ వారంలో జపాన్ పర్యటనలో భాగంగా ఆయన హిరోషిమాను సందర్శించనున్నారు. ఈ సందర్భంగా చేయబోయే వ్యాఖ్యల్లో క్షమాపణ కూడా ఉంటుందా? అని జపాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ఎన్‌హెచ్‌కే అడుగగా.. 'లేదు. యుద్ధ సమయాల్లో నేతలు అన్ని రకాల నిర్ణయాలు తీసుకుంటారని గుర్తించాల్సిన అవసరముంది' అని అమెరికా అధ్యక్షుడు ఒబామా పేర్కొన్నారు. 'ఆ నిర్ణయాలను పరిశీలించి ప్రశ్నలు అడగాల్సిన బాధ్యత చరిత్రకారులది. గత ఏడున్నర దశాబ్దాలుగా దీనిపై కృషి చేస్తున్న చరిత్రకారులు యుద్ధం సమయంలో కష్టమైన నిర్ణయాలు తీసుకోక తప్పదని అభిప్రాయపడుతున్నారు' అని ఒబామా అన్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిపి దాదాపు 71 ఏళ్లు. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాలో పర్యటించబోతున్నారు. హిరోషిమాను సందర్శిస్తున్న తొలి అమెరికా అధ్యక్షుడు ఆయనే కావడంతో.. ఆనాటి బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు ఒబామా నుంచి పశ్చాత్తాపం ఆశిస్తున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించింది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్న జపాన్‌పై ఈ అణుబాంబు దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జపనీయులు భావిస్తున్నారు. -
ఏ అధ్యక్షుడు చేయని సాహసం..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్ లో పర్యటించనున్నారు. జపాన్ లోని హిరోషిమా పట్టణాన్ని మే నెల చివర్లో ఆయన సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అధ్యక్ష భవనం వైట్ హౌస్ అధికారులు వెల్లడించారు. ఒబామా పర్యటనకు విశేషం ఏముందనుకుంటున్నారా... అయితే ఓ విషయాన్ని కచ్చితంగా చెప్పాలి. హిరోషిమాలో పర్యటించనున్న తొలి అమెరికా ప్రధానిగా ఒబామా చరిత్ర సృష్టించనున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అగ్రదేశం అమెరికా అణుబాంబు దాడి జరిపిన విషయం ప్రపంచదేశాలకు తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో ఆ దారుణ ఘటన జరిగి 71 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ పర్యటనపై జపాన్ (హిరోషిమా) నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నా సరే ఒబామా మాత్రం ఈ పర్యటన విషయంలో తగ్గడం లేదట. జపాన్ ప్రధాని షింజో అబెతో అమెరికా అగ్రనేత భేటీ అవుతారు. శాంతి, సెక్యూరిటీ అంశాలపై వీరు చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. అణు ప్రమాదాలు, అణ్వాయుధాలు లాంటివి మానవాళికి విపత్తు అనే అంశంపై వారు చర్చిస్తారు. మరోవైపు ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా హిరోషిమాలో పర్యటించేందుకు సాహసించలేదు. పెను విధ్వంసం సృష్టించిన అణుబాంబు దాడి ఘటనపై ప్రస్తుత అధ్యక్షుడు ఒబామా తమకు క్షమాపణ చెబితే సరిపోదని, ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరోధానికి కృషి చేయాలని ఆ విషాధ ఘటన బాధితులు కోరుతున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించి బీభత్సం సృష్టించింది. -
ఉత్తర కొరియా అదుపులో బీబీసీ రిపోర్టర్
సియోల్: ప్రతిష్టాత్మక బ్రిటన్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ రిపోర్టర్‌ను ఉత్తర కొరియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా తమ దేశంలో జరుగుతున్న పార్టీ సమావేశ కార్యక్రమం కవరేజికి వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ లోనే బంధించారు. అతడిని అక్కడి నుంచి బహిష్కరిస్తారని కూడా సమాచారం. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీని కవరేజీకి ఏ మీడియాను ఆ దేశం అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే బీబీసీకి చెందిన రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేస్ అనే రిపోర్టర్ ను ప్యాంగ్ యాంగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది. -
'మా జోలికొస్తే మాత్రం అణ్వాయుధాలతో దాడి'
ప్యాంగ్ యాంగ్: తమ జోలికి రాందే తాము ఎవరి జోలికి వెళ్లబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని టచ్ చేస్తే మాత్రం అణ్వాయుధాలు ఉపయోగిస్తామని చెప్పింది. ఆ దేశ వివాదాస్పద అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ దాదాపు పది హేను నిమిషాలపాటు ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు తమ దేశం ఉత్పత్తి చేస్తున్న అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. అంతసామాన్యంగా తమ దేశం అణ్వాయుధాలను ఉపయోగించబోదని, ఎవరైన భారీగా దండెత్తి వచ్చి తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అలా చేయబోమని అన్నారు. పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో విశ్వసనీయతతో తన అణుకార్యక్రమాన్ని ఉత్తర కొరియా ముందుకు తీసుకెళ్తుందని, అణ్వాయుధ రహిత ప్రపంచంగా అవతరించేందుకు తమ వంతు కృషి కూడా చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని తమ శత్రు దేశలపై కూడా తమకు గౌరవం ఉంటుందని అన్నారు. -
ఒబామా.. మీ సారీ సరిపోదు!
రెండో ప్రపంచ యుద్ధంలో భాగంగా జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిపి దాదాపు 71 ఏళ్లు. అణుబాంబు బీభత్సం మానవాళి మనుగడపై, భూ పర్యావరణంపై ఎంతటి తీవ్రమైన ప్రభావం చూపుతుందో.. ఈ దాడితో స్పష్టమైనా.. ప్రపంచమంతటా అణ్వాయుధాల కోసం దేశాల మధ్య పోటాపోటీ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హిరోషిమాలో పర్యటించాలనుకుంటున్నారట. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ సోమవారం హిరోషిమాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒబామా కూడా హిరోషిమాలో పర్యటించాలనుకుంటున్నారని, వచ్చే మే నెలలో గ్రూప్ ఆఫ్ సెవన్ సదస్సు కోసం జపాన్ రానున్న ఆయన షెడ్యూల్లో హిరోషిమా పర్యటన ఉందా? లేదా? అన్న విషయం తెలియదని కెర్రీ చెప్పారు. నిజానికి ఇంతవరకు ఏ అమెరికా అధ్యక్షుడు కూడా హిరోషిమాలో పర్యటించేందుకు సాహసించలేదు. ఈ నేపథ్యంలో ఒబామా హిరోషిమాను సందర్శించాలని కోరుకుంటున్నారనడంపై అనాటి బీభత్సం నుంచి ప్రాణాలతో బయటపడిన బాధితులు భిన్నంగా స్పందిస్తున్నారు. పెను విధ్వంసం సృష్టించిన అణుబాంబు దాడిపై ఒబామా క్షమాపణలు చెబితే సరిపోదని, అగ్రరాజ్యంగా ప్రపంచవ్యాప్తంగా అణ్వాయుధ నిరోధానికి ఆయన కృషి చేయాలని హిరోషిమా అణుబాంబు దాడి బాధితులు కోరుతున్నారు. 1945 ఆగస్టు 6న హిరోషిమాపై అమెరికా అణుబాంబు వేసింది. ఆ తర్వాత మూడు రోజులకు నాగసాకిలోనూ అణుబాంబులు కురిపించింది. అప్పటికే రెండో ప్రపంచయుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్న జపాన్‌పై ఈ అణుబాంబు దాడులు ఎంతమాత్రం సమర్థనీయం కాదని జపనీయులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఓ చిన్న సారీ చెప్పడం వల్ల.. ఈ తప్పు మన్నించేది కాదని వారు అంటున్నారు. మరోవైపు అమెరికన్లు ఈ అణుబాంబు దాడులను సమర్థిస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు క్షమాపణ చెప్పాల్సిన పనే లేదని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒబామా హిరోషిమాలో పర్యటిస్తారా? పర్యటిస్తే.. అక్కడి ప్రజలకు ఏం చెప్తారు? ఇది తప్పని ఒప్పుకొంటారా? అన్నది ప్రాధాన్యం సంతరించుకుంది. -
'అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచండి'
ప్యాంగ్యాంగ్: శత్రు దేశాల నుండి పెరుగుతున్న ముప్పు దృష్ట్యా.. అణ్వాయుధాలను సిద్ధంగా ఉంచాలని, ఏ సమయంలో నైనా దాడి చేయడానికి వీలుగా సన్నాహకాలు చేసుకోవాలని ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర కొరియా నూతనంగా తయారుచేసిన రాకెట్ లాంచర్లను పర్యవేక్షించిన సందర్భంగా కిమ్ అధికారులతో మాట్లాడుతూ.. అణ్వాయుధాల సంఖ్య, నాణ్యతను పెంచాలని, ఇది దేశ రక్షణకు అత్యవసరమని చెప్పినట్లు ఆ దేశ అధికార వార్తా సంస్థ కేసీఎన్ఏ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి బుధవారం ఉత్తర కొరియా దుందుడుకు చర్యలపై మరిన్ని ఆంక్షలు విధించిన నేపథ్యంలో కిమ్ ఈ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆదేశాలతో కొరియా ద్వీపకల్పంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ కథనాలపై స్పందించిన అమెరికా రక్షణ శాఖ అధికారి బిల్ అర్బన్.. ఉద్రిక్త పరిస్థితులలో రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటానికి బదులుగా అంతర్జాతీయ ఒప్పందాలు, బాధ్యతలకు కట్టుబడి ఉండాల్సిందిగా ఉత్తర కొరియాను కోరారు. -
భారత్ పై అణ్వాయుధాలు వేయాలనుకుంది!
వాషింగ్టన్: 1999 నాటి కార్గిల్ యుద్ధంలో భారత్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన పాకిస్థాన్ అణు ఘాతుకానికి తెగబడాలని ప్రయత్నించిందట! భారత్ పై ప్రయోగించేందుకు పాకిస్థాన్ అణ్వాయుధాలు సిద్ధం చేసుకుంటున్నదని, వాటిని భారత్ పై వేసే అవకాశం కూడా ఉందని సీఐఏ అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్‌ను హెచ్చరించినట్టు వైట్ హౌస్ మాజీ టాప్ అధికారి ఒకరు తెలిపారు. 1999 జులై 4 న అమెరికా పర్యటనకు వచ్చిన అప్పటి-ఇప్పటి పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తో క్లింటన్ సమావేశం కానున్న నేపథ్యంలో ఆయనకు సీఐఏ ఈ విషయాన్ని తెలిపింది. రోజువారీ రహస్య సమాచారాన్ని నివేదించడంలో భాగంగా పాక్ అణు సన్నాహాల గురించి వివరించింది. అప్పటి పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ దుస్సాహసానికి తెగబడి..కార్గిల్ ముట్టడికి ప్రయత్నించడం.. భారత్ సైన్యాలు పాక్ ఆర్మీ దాడిని తిప్పికొడుతున్న నేపథ్యంలో షరీఫ్ యుద్ధాన్ని ఆపడంలో అమెరికా మద్దతు కోరేందుకు ఆ దేశ పర్యటనకు వెళ్లారు. కార్గిల్ యుద్ధంలో ఓడిపోతే అంతర్జాతీయంగా అప్రతిష్టపాలవుతామనే ఉద్దేశంతో ఆయన సామరస్యంగా ఈ యుద్ధాన్ని ముగించాలని భావించారు. ఈ నేపథ్యంలో అప్పటి క్లింటన్-షరీఫ్ భేటీలో పాల్గొన్న అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ జాతీయ భద్రత మండలి సభ్యుడు బ్రూస్ రీడెల్ అప్పటి విషయాలను వెల్లడించారు. 'పాకిస్థాన్ తన అణ్వాయుధాలను సిద్ధం చేసుకుంటున్నది. వాటిని వాడే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించి కచ్చితమైన నిఘా సమాచారముంది. ఇందుకు సంబంధించి ఓవల్ ఆఫీస్ లో గంభీర వాతావరణముంది' అని సీఐఏ క్లింటన్ కు చెప్పిందని బ్రూస్ వివరించారు. క్లింటన్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు సాండీ బెర్జర్ బుధవారం క్యాన్సర్ తో మృతిచెందిన నేపథ్యంలో ఆయనకు స్మృతిలో రాసిన వ్యాసంలో బ్రూస్ ఈ విషయాలు తెలిపారు. పాకిస్థానే ఈ యుద్దం ప్రారంభించిన నేపథ్యంలో అదే యుద్ధాన్ని ఎలాంటి పరిహరం కోరకుండా ఆపేయాలని, అప్పుడే మరింత ఉద్రిక్తతలు రేకెత్తబోవని షరీఫ్ కు చెప్పాలని క్లింటన్ కు సాండీ బెర్జర్ సూచించినట్టు ఆయన వివరించారు. -
'మా అణ్వాయుధాలు భారత్‌తో యుద్ధానికే!'
కరాచీ: భారత్‌తో యుద్ధం తలెత్తితే.. దానిని ఎదుర్కోవడానికి తాము స్వల్పస్థాయి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్టు పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి మంగళవారం స్పష్టం చేశారు. పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ఎదుర్కోవడానికే భారత సైన్యం కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్‌ను అభివృద్ధి చేసిందని, ఈ కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్‌ను ఎదుర్కోవడానికి తాము వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీపై పాక్ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇదే పాక్ ప్రధాన వ్యూహాత్మక ఎత్తుగడ అని డాన్ పత్రిక తెలిపింది. పాక్ విదేశాంగ కార్యదర్శి చౌదరి మాట్లాడుతూ అమెరికా-పాకిస్థాన్ అణుఒప్పందంపై అగ్రరాజ్యం పర్యటనలో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంతకం చేయబోరని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి షరీఫ్ అమెరికాలో పర్యటించనున్నారు. తమతో అణు ఒప్పందం చేసుకోవడానికి పాకిస్థాన్‌ను ఒప్పించేందుకు ఒబామా సర్కారు ప్రయత్నిస్తున్నదని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అణు ఒప్పందం వల్ల అంతర్జాతీయ అణు సరఫరాదారుల బృందంలో పాక్ చేరుతుంది. ఇందుకు తమ అణు కార్యక్రమంపై ఆ దేశం కొన్ని ఆంక్షలను అంగీకరించాల్సి ఉంటుంది. -
సమరానికి సై..
ఇస్లామాబాద్: భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ కయ్యానికి కాలు దువ్వుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ సమరానికి సై అన్న సంకేతాలను పంపుతోంది. తమ దగ్గర అణ్వాయుధాలున్నాయి జాగ్రత్త అంటూ భారత్‌ను బెదిరిస్తోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే న్లూక్లియర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం లేనప్పటికీ ఆ భయం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయుధాలున్నది షో కేస్‌లో ఉంచి ప్రదర్శించడానికి కాదని వ్యాఖ్యలు చేశారు. పొరుగుదేశంతో యుద్ధం రాకూడదనుకుంటున్నామని, అణ్వాయుధాల వాడే అవసరం రాకూడదనే గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే దేశ భద్రత కోసం అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్ధ్యాలు తమకున్నాయని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. తెహ్రిక్-ఇ-తాలిబన్, బలూచి ఉగ్రవాదులకు భారతదేశం సహకరిస్తుందన్న సాక్ష్యాధారాలను ప్రపంచ సంస్థలకు అందజేశామని ఆయన తెలిపారు. త్వరలో జరగబోతున్న ఇరుదేశాల ప్రధానుల భేటి సందర్భంగా రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆరు దేశాల పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను జూలై 10న రష్యాలో కలవనున్నారు. -
సమరానికి సై..
ఇస్లామాబాద్: భారత సరిహద్దులో కాల్పులకు తెగబడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్న పొరుగు దేశం పాకిస్తాన్ సమరానికి సై అన్న సంకేతాలను పంపుతోంది. మా దగ్గర అణ్వాయుధాలున్నాయి.. జాగ్రత్త అని భారతదేశాన్ని బెదిరిస్తోంది. ఇరుదేశాల మధ్య యుద్ధం వస్తే న్లూక్లియర్ ఆయుధాలతో దాడికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకటించారు. . ప్రస్తుతానికి యుద్ధ వాతావరణం లేనప్పటికీ ఆ భయం ఎప్పటికీ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆయుధాలున్నది షో కేస్‌లో ఉంచి ప్రదర్శించడానికి కాదంటూ సవాల్ విసురుతున్నారు. పొరుగుదేశంతో యుద్ధం రాకూడదనే తాము కూడా కోరుకుంటున్నామని , అణ్వాయుధాల వాడే అవసరం రాకూడదనే గట్టిగా విశ్వసిస్తున్నామన్నారు. ఒకవేళ అలాంటి పరిస్థితే వస్తే దేశ భద్రతకోసం అణ్వాయుధాలను ప్రయోగించే శక్తి సామర్ధ్యాలు తమకున్నాయని పేర్కొన్నారు. తెహ్రిక్-ఇ-తాలిబన్, బలూచి ఉగ్రవాదులకు భారతదేశం సహకరిస్తుందన్న సాక్ష్యాధారాలను ప్రపంచ సంస్థలకు అందజేశామని ఆయన తెలిపారు. త్వరలో జరగబోతున్న ఇరుదేశాల ప్రధానుల భేటి సందర్భంగా పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆరుదేశాల పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను జూలై 10 న రష్యాలో కలవనున్నారు. -
పాక్ నుంచి భారత్‌కు ‘అణు’ ముప్పు..
హెచ్చరించిన అమెరికా నిపుణులు వాషింగ్టన్: భారతదేశంపై పాకిస్తాన్ అణు ఆయుధాలతో యుద్ధం చేసే ప్రమాదం పొంచి ఉందని అమెరికాకు చెందిన ఇద్దరు ప్రఖ్యాత నిపుణులు హెచ్చరించారు. దీనిని నివారించడానికి అమెరికా నడుంకట్టాలని, భారత్‌వైపు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించకుండా పాకిస్తాన్‌ను కట్టడిచేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. భారత్‌లో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో 26/11లాంటి దాడులు మళ్లీ జరగకుండా చూడాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు అంచనా వేశారు. ఆ ఒత్తిడితో సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ గట్టి చర్యలు తీసుకొని, పెద్ద ఎత్తున పాక్‌పై మిలటరీ దాడులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతిదాడిగా పాక్ అణు ఆయుధాలతో దాడులకు తెగబడవచ్చని హెచ్చరించారు. జార్జ్ పెర్కోవిచ్, ఆష్లే టెల్లిస్ అనే ఆ ఇద్దరు నిపుణులు తమ అంచనాలను వ్యూహాత్మక దళాలపై ఏర్పాటైన సెనేట్ ఆర్మ్డ్ సర్వీసెస్ సబ్‌కమిటీకి బుధవారం వినిపించారు. దక్షిణాసియాలో అణుయుద్ధ ప్రమాదం ఉందని, భారత్, పాక్‌ల మధ్య ఉన్న పోటీ కారణంగా ఇది ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.