
ఉత్తరకొరియా అణ్వాయుధాలను నిర్మూలించేందుకు ప్రయత్నిస్తే.. ఆ దేశం ప్రతిగా అమెరికాపై జీవ, రసాయన దాడులకు దిగే ప్రమాదముందని పెంటగాన్ హెచ్చరించింది. ఉత్తరకొరియా అణ్వాయుధాలను అత్యంత రహస్య ప్రదేశాల్లో దాచి పెట్టిందని, ఆ ప్రదేశానికి చేరుకోవాలంటే భూతల దాడి ఒక్కటే మార్గమని పెంటగాన్ అధికారులు అమెరికా శాసనకర్తలకు నివేదించారు. ఈ అణ్వాయుధాలను కనుగొనడం పదాతి దళానికి మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఒకవేళ అమెరికా పదాతి దళం ఉత్తరకొరియా అణుస్థావరాలను సమీపిస్తే జీవ, రసాయన దాడులకు దిగే ప్రమాదముందని తెలిపారు. ఉత్తరకొరియాతో యుద్ధంవస్తే ఎదుర్కోవాల్సిన పరిస్థితులపై నివేదిక తయారుచేసిన పెంటగాన్ ఆ నివేదికను అమెరికా చట్టసభ సభ్యులకు సమర్పించింది. భూమిలో రహస్య ప్రదేశాల్లో అణ్వాయుధాలను ఉత్తర కొరియా దాచిపెట్టిందని, వాటిని కాపాడుకోవడానికి జీవ, రసాయన ఆయుధాలతో దాడి చేసే అవకాశం ఉందని పేర్కొంది.
ఉద్రిక్త రేపుతున్న ట్రంప్ పర్యటన..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసియా పర్యటన ఉద్రిక్తత రేపుతోంది. ట్రంప్ ఆసియా పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉత్తర కొరియా మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. తమ అణ్వాయుధాలకు పదును పెడుతున్నామని ఉ. కొరియా వెల్లడించింది. మరోవైపు ఆసియా పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్‌కు చేరుకున్నారు. ఎయిర్ ఫోర్స్ ఒర్ విమానం టోక్యో విమానాశ్రయంలో దిగీదిగగానే.. ట్రంప్ ఆశ్చర్యకర ప్రకటన చేశారు. రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో తాను ప్రత్యేకంగా సమావేశమవుతానని తెలిపారు. ఉత్తర కొరియా సమస్యకు పరిష్కారం కోసమే పుతిన్‌తో సమావేశమవుతున్నానని చెప్పారు. 11 రోజుల పర్యటనలో భాగంగా ట్రంప్ జపాన్, దక్షిణ కొరియా, చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్‌లలో పర్యటిస్తారు. గత 25 ఏళ్లలో ఒక అమెరికా అధ్యక్షుడు చేపట్టిన సుదీర్ఘమైన ఆసియా పర్యటన ఇదే.
Comments
Please login to add a commentAdd a comment