ప్యాంగ్‌యాంగ్: భవిష్యత్తులో తమ అణ్వాయుధ సామర్థ్యాన్ని భారీగా పెంచుకోనున్నట్లు ఉత్తరకొరియా నియంత కిమ్‌జోంగ్‌ఉన్ తెలిపారు. దేశ 76వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కిమ్ మాట్లాడారు. ‘యుద్ధంలో వాడేందుకు వీలుగా దేశ అణ్వాయుధ సామర్థ్యాన్ని పెంచుకుంటాం. ఎంత పెంచాలనేదానికి హద్దే లేదు. దీనికి సంబంధించి పాలసీ రూపొందిస్తున్నాం.
ఉనికిని కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’అని కిమ్ చెప్పారు. కొరియా ద్వీపకల్పంలో ఇటీవలి కాలంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్ మధ్య సంబంధాలు బలపడుతున్న నేపథ్యంలో కిమ్ అణుబాంబుల పెంపు నిర్ణయం తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్‌లో అమెరికా ఎన్నికలు జరగనున్న వేళ ఉత్తరకొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష జరిపే ఛాన్సుందని దక్షిణకొరియా అధ్యక్షుని భద్రతాసలహాదారు ఇటీవలే వెల్లడించారు.
ఇదీ చదవండి.. ట్రంప్ వర్సెస్ కమల..హోరాహోరీ
Comments
Please login to add a commentAdd a comment