హెచ్చరించిన అమెరికా నిపుణులు
వాషింగ్టన్: భారతదేశంపై పాకిస్తాన్ అణు ఆయుధాలతో యుద్ధం చేసే ప్రమాదం పొంచి ఉందని అమెరికాకు చెందిన ఇద్దరు ప్రఖ్యాత నిపుణులు హెచ్చరించారు. దీనిని నివారించడానికి అమెరికా నడుంకట్టాలని, భారత్‌వైపు ఉగ్రవాదుల్ని ప్రోత్సహించకుండా పాకిస్తాన్‌ను కట్టడిచేస్తే ప్రమాదాన్ని నివారించవచ్చని తెలిపారు. భారత్‌లో పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో 26/11లాంటి దాడులు మళ్లీ జరగకుండా చూడాలని ఆ దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అది ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చని వారు అంచనా వేశారు.
ఆ ఒత్తిడితో సీమాంతర ఉగ్రవాదాన్ని అరికట్టడానికి భారత్ గట్టి చర్యలు తీసుకొని, పెద్ద ఎత్తున పాక్‌పై మిలటరీ దాడులు చేయవచ్చని పేర్కొన్నారు. ప్రతిదాడిగా పాక్ అణు ఆయుధాలతో దాడులకు తెగబడవచ్చని హెచ్చరించారు. జార్జ్ పెర్కోవిచ్, ఆష్లే టెల్లిస్ అనే ఆ ఇద్దరు నిపుణులు తమ అంచనాలను వ్యూహాత్మక దళాలపై ఏర్పాటైన సెనేట్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ సబ్‌కమిటీకి బుధవారం వినిపించారు. దక్షిణాసియాలో అణుయుద్ధ ప్రమాదం ఉందని, భారత్, పాక్‌ల మధ్య ఉన్న పోటీ కారణంగా ఇది ఉత్పన్నమయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు.
పాక్ నుంచి భారత్‌కు ‘అణు’ ముప్పు..
Published Fri, Feb 27 2015 4:14 AM | Last Updated on Thu, Apr 4 2019 5:12 PM
Advertisement