
'మా జోలికొస్తే మాత్రం అణ్వాయుధాలతో దాడి'
ప్యాంగ్ యాంగ్: తమ జోలికి రాందే తాము ఎవరి జోలికి వెళ్లబోమని ఉత్తర కొరియా స్పష్టం చేసింది. తమ దేశ సార్వభౌమాధికారాన్ని టచ్ చేస్తే మాత్రం అణ్వాయుధాలు ఉపయోగిస్తామని చెప్పింది. ఆ దేశ వివాదాస్పద అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ దాదాపు పది హేను నిమిషాలపాటు ఓ బహిరంగ సభలో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు తమ దేశం ఉత్పత్తి చేస్తున్న అణ్వాయుధాలపై ఆందోళన వ్యక్తం చేస్తుండటాన్ని ప్రస్తావిస్తూ.. అంతసామాన్యంగా తమ దేశం అణ్వాయుధాలను ఉపయోగించబోదని, ఎవరైన భారీగా దండెత్తి వచ్చి తమ దేశ సార్వభౌమాధికారాన్ని ఆక్రమించే ప్రయత్నం చేస్తే తప్ప అలా చేయబోమని అన్నారు.
పార్టీ ఆఫ్ కొరియా ఏడో సమావేశం సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు. ఎంతో విశ్వసనీయతతో తన అణుకార్యక్రమాన్ని ఉత్తర కొరియా ముందుకు తీసుకెళ్తుందని, అణ్వాయుధ రహిత ప్రపంచంగా అవతరించేందుకు తమ వంతు కృషి కూడా చేస్తామని చెప్పారు. ప్రపంచంలోని తమ శత్రు దేశలపై కూడా తమకు గౌరవం ఉంటుందని అన్నారు.