
పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు
ఉ.కొరియా అధ్యక్షుడు కిమ్‌పై ట్రంప్
వాషింగ్టన్/వాటికన్ సిటీ: పిచ్చివాడి చేతిలో అణ్వాయుధాలు ఉన్నాయంటూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 29న ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో దుతర్తెతో ఫోన్‌లో మాట్లాడిన సందర్భంగా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంభాషణలను అమెరికా మీడి యా మంగళవారం విడుదల చేసింది. ఈ ఫోన్ మాట్లాడిన కొన్ని రోజులకే కిమ్‌ను కలవడం గౌరవంగా భావిస్తానని ట్రంప్ బహిరంగంగా చెప్పడం తెలిసిందే.
ట్రంప్ భారీ కాయంపై పోప్ జోక్
ట్రంప్ బుధవారం తన భార్య మెలానియా, కూతురు ఇవాంక సమేతంగా పోప్ ఫ్రాన్సిస్‌ను వాటికన్ సిటీలో కలిశారు. ప్రపంచమంతా శాంతిని వ్యాప్తి చేసేందుకు అధ్యక్ష పదవిని ఉపయోగించాలని పోప్ ఫ్రాన్సిస్ ట్రంప్‌కు సూచించారు. ట్రంప్ లావుగా ఉండటంపై భేటీ సమయంలో పోప్ మెలానియాతో ఒక జోక్ కూడా వేశారు. ‘మీరు ఆయనకు ఏం పెడతారు? పొటీజ్జా?’ అని మెలాని యాను పోప్ అడిగారు. మెలానియా సొంత దేశమైన స్లొవేనియాలో దొరికే పొటీజ్జా్జ అనేది కెలరీలు ఎక్కువగా లభించే ఓ వంటకం.
ట్రంప్‌తో చేయి కలపని మెలానియా
ఇటలీలో విమానం నుంచి దిగుతున్న సమయంలో మెలానియా చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నించగా ఆమె నిరాకరించింది. చేయి పట్టుకోడానికి ట్రంప్ యత్నిస్తుండగా ఆమె చేయి విదిలించుకుని తన చేతితో జుట్టు ను సరిచేసుకుంది. ఇది కెమెరాలకు చిక్కడంతో నెటిజన్లు ట్విటర్‌లో జోకులు పేల్చారు.