
ఉత్తర కొరియా అదుపులో బీబీసీ రిపోర్టర్
సియోల్: ప్రతిష్టాత్మక బ్రిటన్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ రిపోర్టర్ను ఉత్తర కొరియా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గత నాలుగు రోజులుగా తమ దేశంలో జరుగుతున్న పార్టీ సమావేశ కార్యక్రమం కవరేజికి వెళ్లిన అతడిని ఎయిర్ పోర్ట్ లోనే బంధించారు.
అతడిని అక్కడి నుంచి బహిష్కరిస్తారని కూడా సమాచారం. దాదాపు 36 ఏళ్ల తర్వాత తొలిసారి ఉత్తర కొరియా పార్టీ సమావేశాన్ని నిర్వహిస్తోంది. దీని కవరేజీకి ఏ మీడియాను ఆ దేశం అనుమతించకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగానే బీబీసీకి చెందిన రూపర్ట్ వింగ్ ఫీల్డ్ హేస్ అనే రిపోర్టర్ ను ప్యాంగ్ యాంగ్ విమానాశ్రయంలోనే అడ్డుకున్నట్లు తెలుస్తోంది.