మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.
తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.
తాము అందజేసే లాంగ్‌రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment