తిరువనంతపురం: సీపీఎం పార్టీపై దేశ రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఫైర్ అయ్యారు. కేరళలోని కాసర్‌గాడ్‌లో బుధవారం(ఏప్రిల్17) జరిగిన ఎన్నికల ప్రచార సభలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. ‘సీపీఎం అధికారంలోకి వస్తే దేశంలోని న్యూక్లియర్ ఆయుధాల(అణు బాంబులు)ను ధ్వంసం చేస్తామని చెబుతోంది.
పొరుగు దేశాలు పాకిస్తాన్, చైనా న్యూక్లియర్ బాంబులను కలిగి ఉన్నప్పుడు మనం వాటిని వదులుకుంటే ఎలా. సీపీఎం తీరు దేశ భద్రతతో ఆటలాడినట్లుంది. సీపీఎం హామీపై కాంగ్రెస్ పార్టీ వెంటనే తన వైఖరి వెల్లడించాలి’అని రాజ్‌నాథ్ డిమాండ్ చేశారు.
సీపీఎం, కాంగ్రెస్ కలిసి కేంద్రంలో దోచుకోవాలని చూస్తున్నాయని, ఇది తాము జరగనివ్వబోమని రాజ్‌నాథ్ చెప్పారు. కాగా, కేరళలో ఏప్రిల్ 26న రెండో దశలో భాగంగా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చదవండి.. తృణమూల్ మేనిఫెస్టో రిలీజ్.. కీలక హామీలివే
Comments
Please login to add a commentAdd a comment