'మా అణ్వాయుధాలు భారత్తో యుద్ధానికే!' | Pak develops nuclear weapons to combat possible war with India | Sakshi
Sakshi News home page

'మా అణ్వాయుధాలు భారత్తో యుద్ధానికే!'

Published Tue, Oct 20 2015 3:54 PM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM

'మా అణ్వాయుధాలు భారత్తో యుద్ధానికే!'

'మా అణ్వాయుధాలు భారత్తో యుద్ధానికే!'

కరాచీ: భారత్తో యుద్ధం తలెత్తితే.. దానిని ఎదుర్కోవడానికి తాము స్వల్పస్థాయి అణ్వాయుధాలను అభివృద్ధి చేసినట్టు పాకిస్థాన్ విదేశాంగ కార్యదర్శి ఐజాజ్ చౌదరి మంగళవారం స్పష్టం చేశారు. పాకిస్థాన్తో యుద్ధాన్ని ఎదుర్కోవడానికే భారత సైన్యం కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ను అభివృద్ధి చేసిందని, ఈ కోల్డ్-స్టార్ట్ డాక్ట్రిన్ను ఎదుర్కోవడానికి తాము వ్యూహాత్మకంగా అణ్వాయుధాలను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. వ్యూహాత్మక అణ్వాయుధాల తయారీపై పాక్ సీనియర్ అధికారి ఒకరు ఈ మేరకు వివరణ ఇవ్వడం ఇదే తొలిసారి. ఇదే పాక్ ప్రధాన వ్యూహాత్మక ఎత్తుగడ అని డాన్ పత్రిక తెలిపింది.

పాక్ విదేశాంగ కార్యదర్శి చౌదరి మాట్లాడుతూ అమెరికా-పాకిస్థాన్ అణుఒప్పందంపై అగ్రరాజ్యం పర్యటనలో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ సంతకం చేయబోరని పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి షరీఫ్ అమెరికాలో పర్యటించనున్నారు. తమతో అణు ఒప్పందం చేసుకోవడానికి పాకిస్థాన్ను ఒప్పించేందుకు ఒబామా సర్కారు ప్రయత్నిస్తున్నదని అమెరికా మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ అణు ఒప్పందం వల్ల అంతర్జాతీయ అణు సరఫరాదారుల బృందంలో పాక్ చేరుతుంది. ఇందుకు తమ అణు కార్యక్రమంపై ఆ దేశం కొన్ని ఆంక్షలను అంగీకరించాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement