ఇస్లామాబాద్ : భారత్‌తో సంప్రదాయ యుద్ధమే గనుక వస్తే తాము నెగ్గలేమని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. సంప్రదాయ యుద్ధంలో ఓడిపోయినా.. అణు యుద్ధాన్ని మాత్రం కొట్టిపారేయలేమన్నారు. అల్ జజీరా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. రెండు అణ‍్వస్త్ర దేశాలు సంప్రదాయ యుద్ధంలోకి దిగినపుడు అది అణ్వస్త్రాలతోనే ముగుస్తుందన్నారు. అణు యుద్ధంతో తీవ్ర పరిణామాలు ఉండే అవకాశం ఉందన్నారు. తాము కచ్చితంగా అణు యుద్ధాన్ని ప్రోత్సహించమని తేల్చిచెప్పారు. సంప్రదాయ యుద్ధానికి దిగినపుడు చివరి సమయాల్లో ఓటమిని అంగీకరించటమా లేదా చచ్చేదాక స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయటమా అన్నది తేల్చుకోవాల్సి వస్తుందని, అటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కచ్చితంగా చచ్చేదాక స్వాతంత్ర్యం కోసం పోరాటం చేస్తుందని అన్నారు. తానెప్పుడూ యుద్ధానికి వ్యతిరేకినేనని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment