
ఈయూ శిఖరాగ్రంలో ఫ్రాన్స్ ప్రతిపాదన
అత్యంత ప్రమాదకర చర్య కాగలదు: రష్యా
బ్రస్సెల్స్: ఉక్రెయిన్ భద్రత కోసం రష్యాను బెదిరించేందుకు అవసరమైతే తన అణ్వాయుధాలను నిరోధంగా వాడేందుకు సిద్ధమంటూ ఫ్రాన్స్ వివాదాస్పద ప్రతిపాదన చేసింది. గురువారం బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో యూరోపియన్ యూనియన్ దేశాల తాజా శిఖరాగ్ర సమావేశం ఇందుకు వేదికైంది. రష్యా బారినుంచి యూరప్‌కు రక్షణ కల్పించేందుకు ఫ్రాన్స్ అణుపాటవాన్ని ఆయుధంగా ఉపయోగించేందుకు సిద్ధమని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ సందర్భంగా ప్రకటించారు. సభ్య దేశాల నుంచి ఇందుకు భారీ స్పందన లభించింది.
పోలండ్‌తో పాటు లిథువేనియా, లాతి్వయా వంటి పలు బాలి్టక్ దేశాలు ఈ ప్రతిపాదనను గట్టిగా సమరి్థంచాయి. యూరోపియన్ యూనియన్‌లో అణ్వాయుధ పాటమున్న దేశం ఫ్రాన్స్ ఒక్కటే కావడం విశేషం. ఫ్రాన్స్‌కున్న ఈ సానుకూలతను యూరప్ భద్రత కోసం ఉపయోగించేందుకు సిద్ధమని బుధవారం జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కూడా మాక్రాన్ ప్రకటించారు. దీనిపై లోతుగా చర్చ జరగాలని ఈయూ భేటీలో ఆయన పునరుద్ఘాటించారు. దీనిపై రష్యా తీవ్రంగా స్పందించింది. మాక్రాన్ ప్రతిపాదన అత్యంత ప్రమాదకరమైనదని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ అన్నారు. ‘‘శాంతి యత్నాలకు బదులు యుద్ధానికే ఫ్రాన్స్ మొగ్గుతోంది. ఉక్రెయిన్‌తో మా యుద్ధం కొనసాగాలనే ఆశిస్తోంది. మాక్రాన్ వివాదాస్పద వ్యాఖ్యలే ఇందుకు రుజువు’’ అని ఆయన ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment