Brussels
-
కేంద్రం వైఖరిని సమర్థిస్తున్నాం
లండన్: రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న వైఖరిని పూర్తిగా సమర్థిస్తున్నామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చెప్పారు. విశాలమైన దేశం అయినందున ప్రపంచదేశాలతో ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాల్సిన అవసరం భారత్‌కు సహజంగానే ఉంటుందని చెప్పారు. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ మాట్లాడారు. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న వైఖరికి రష్యా నుంచి చమురు సరఫరాయే కారణమా అన్న మీడియా ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ‘రష్యాతో మాకు సంబంధాలున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ విషయంలో ప్రభుత్వ, ప్రతిపక్షం వైఖరి భిన్నంగా ఉంటుందని నేను భావించడం లేదు’అని వివరించారు. రష్యా నుంచి దూరంగా తమవైపు భారత్‌ను లాక్కునేందుకు పశ్చిమ దేశాల నేతలు ప్రయత్నించారా అన్న ప్రశ్నకు రాహుల్ గాంధీ.. ‘‘వాస్తవానికి భారత్‌కు రష్యాతో సత్సంబంధాలున్నాయి. అదేవిధంగా అమెరికాతోనూ సంబంధాలు న్నాయి. భారత్ విశాల దేశం. పెద్ద దేశం కావడం వల్ల అనేక ఇతర దేశాలతో వివిధ స్థాయిల్లో సంబంధాలు కొనసాగుతున్నాయి. ఎవ్వరితోనైనా సంబంధాలు కొనసాగించే హక్కు భారత్‌కు ఉంది’అని రాహుల్ చెప్పారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 ద్వారా కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు విషయంలో ప్రతిపక్షం వైఖరిపై ఆయన..కశ్మీర్ అభివృద్ధిని కాంగ్రెస్ గట్టిగా కోరుతోంది. అక్కడ శాంతి నెలకొనాలని ఆకాంక్షిస్తోంది’అని రాహుల్ వివరించారు. కశ్మీర్ అంశం పరిష్కారానికి అంతర్జాతీయ దౌత్యం అవసరమని భావిస్తున్నారా అన్న ప్రశ్నకు రాహుల్ సూటిగా సమాధానమిచ్చారు. వాస్తవానికి కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం. కశ్మీర్ మా సొంత విషయం. అందులో భారత్‌కు తప్ప మరెవ్వరి జోక్యం అవసరం లేదు’అని కుండబద్దలు కొట్టారు. -
యూరప్ పర్యటనలో రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ యూరప్‌లో వారంపాటు పర్యటించనున్నారు. మంగళవారమే ఆయన భారత్ నుంచి బయల్దేరారు. సెప్టెంబర్ ఏడున బ్రస్సెల్స్‌లో యురోపియన్ యూనియన్ పార్లమెంటేరియన్లతో రాహుల్ భేటీ అవుతారు. ఆ తర్వాత అక్కడే కొందరు ప్రవాస భారతీయులతో సమావేశమవుతారు. తర్వాతి రోజు ఉదయం కొందరు భారతీయ పారిశ్రామికవేత్తలతో భేటీ జరగనుంది. మధ్యా హ్నం పత్రికా సమావేశంలో పాల్గొంటారు. తర్వాత ఆయన పారిస్‌కు చేరుకుని సెపె్టంబర్ ఎనిమిదో తేదీన మరో పత్రికా సమావేశంలో పాల్గొంటారు. సెపె్టంబర్ తొమ్మిదో తేదీన ఫ్రాన్స్ పార్లమెంటేరియన్లతో ముచ్చటిస్తారు. తర్వాత అక్కడి సైన్స్ పొ విశ్వవిద్యాలయం విద్యార్థులతో మాట్లాడతారు. సెపె్టంబర్ పదో తేదీన రాహుల్ నెదర్లాండ్స్‌కు వెళ్తారు. 400 ఏళ్ల నాటి లీడెన్ యూనివర్సిటీలో పర్యటించి అక్కడి విద్యార్థులతో మాట్లాడతారు. సెప్టెంబర్ 11వ తేదీన నార్వేకు వెళ్తారు. ఓస్లోలో ఆ దేశ పార్లమెంటేరియన్లతో సమావేశమవుతారు. తర్వాత అక్కడి ప్రవాస భారతీయులతో, ఓస్లో వర్సిటీ విద్యార్థులతోనూ మాట్లాడతారు. సెప్టెంబర్ 12వ తేదీన రాత్రి రాహుల్ భారత్‌కు తిరుగుపయనమవుతారు. -
Ukraine-Russia war: మాకు మరిన్ని ఆయుధాలు కావాలి
బ్రస్సెల్స్: రష్యాను ఎదుర్కొనేందుకు తమకు మరింత సైనిక సాయం కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొమిదిర్ జెలెన్స్కీ కోరారు. ఉక్రెయిన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) కలిసి యూరప్ బద్దవ్యతిరేకి అయిన రష్యాతో తలపడుతున్నాయని చెప్పారు. గురువారం ఆయన బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లోని ఈయూ పార్లమెంట్‌నుద్దేశించి ప్రసంగించారు. ‘మనం కలిసి ఉన్నంత కాలం, మన యూరప్‌ను కాపాడుకున్నంత కాలం, మన యూరప్ జీవన విధానాన్ని పరిరక్షించుకున్నంత కాలం యూరప్ యూరప్‌గానే నిలిచి ఉంటుంది’అని జెలెన్స్కీ చెప్పారు. యూరప్ జీవన విధానాన్ని నాశనం చేయాలని రష్యా కోరుకుంటోంది. కానీ, మనం అలా జరగనివ్వరాదు’అని చెప్పారు. అంతకుముందు ఈయూ ప్రతినిధులు ఆయనకు పార్లమెంట్ భవనంలోకి ఘనంగా స్వాగతం పలికారు. ప్రసంగం పూర్తయిన అనంతరం, ప్రొటోకాల్ ప్రకారం ఉక్రెయిన్ జాతీయ గీతం, యూరోపియన్ గీతం వినిపించారు. ఆ సమయంలో జెలెన్స్కీ ఈయూ జెండాను చేబూనారు. అనంతరం యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడు రొబెర్టా మెట్సోలా మాట్లాడుతూ.. లాంగ్ రేంజ్ క్షిపణి వ్యవస్థలను, యుద్ధవిమానాలను సాధ్యమైనంత త్వరగా ఉక్రెయిన్‌కు అందించే విషయం పరిశీలించాలని సభ్య దేశాలను కోరారు. ఉక్రెయిన్‌కు రష్యాతో ఉన్న ముప్పునకు తగ్గట్లే చర్యలుండాలని సూచించారు. ఇది ఉక్రెయిన్ అస్తిత్వానికి సంబంధించిన విషయమన్నారు. ఈనెల 24వ తేదీతో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించి ఏడాదవుతోంది. ఈ సందర్భంగా దాడులను మరో విడత తీవ్రతరం చేసేందుకు రష్యా ప్రయత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే అదనపు సైనిక సాయం కోసం జెలెన్స్కీ మిత్ర దేశాల్లో పర్యటనలు చేస్తున్నారు. అంతకుముందు ఫ్రాన్సు పర్యటనలో ఆ దేశాధ్యక్షుడు మేక్రాన్ ఆయన్ను లీజియన్ ఆఫ్ హానర్‌తో సన్మానించారు. బ్రస్సెల్స్‌లో ఈయూకు చెందిన 27 దేశాల నేతలతో జెలెన్స్కీ సమావేశమయ్యారు. -
టికెట్ అడిగేసరికి బిడ్డనే వదిలేశారు!
టెల్అవీవ్: బెల్జియం పాస్‌పోర్టులున్న ఆ దంపతులిద్దరూ ఏడాది వయస్సున్న బిడ్డను తీసుకుని ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరికాసేపట్లో బయలుదేరే బ్రస్సెల్స్ విమానంలో వారు ఎక్కాల్సి ఉంది. ఆలస్యంగా వచ్చిన వారిని ఒకటో నంబర్ టెర్మినల్ వద్ద సిబ్బంది ఆపి టికెట్లడిగారు. రెండు టికెట్లే చూపారు. చిన్నారికి కూడా టికెట్ కావాలనే సరికి ఇదేమిటంటూ ప్రశ్నించారు. సిబ్బందితో వాదనకు దిగారు. మరో టికెట్ కొనడానికి నిరాకరించారు. పైపెచ్చు, ష్ట్రోలర్పైన చిన్నారిని అక్కడే సెక్యూరిటీ విభాగం వద్ద వదిలేసి హడావుడిగా విమానం వైపు వెళ్లిపోబోయారు. ఇది చూసి సిబ్బంది అప్రమత్తమయ్యారు. సిబ్బంది అలెర్ట్ చేయడంతో సెక్యూరిటీ అధికారులు వారిని అడ్డుకుని, పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన జనవరి 31వ తేదీన ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్లో ఉన్న బెన్ గురియన్ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది. టికెట్ అడిగారనే కారణంతో ఏకంగా బిడ్డనే వదిలేసిన తల్లిదండ్రులను ఇప్పుడే చూస్తున్నామని అక్కడి సిబ్బంది వ్యాఖ్యానించారు. ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ ఘటన తమకు షాక్ కలిగించిందని సిబ్బంది తెలిపారని రియాన్ఎయిర్ విమానయాన సంస్థ అధికారి ఒకరు అన్నారు. -
FIFA WC 2022: మొరాకో చేతిలో పరాభవం.. బెల్జియంలో చెలరేగిన అల్లర్లు
ఫిఫా ప్రపంచకప్‌లో మొరాకో జట్టు బెల్జియంపై సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఖతర్‌లో అల్ థుమమ స్టేడియం వేదికగా ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 2-0 తేడాతో ప్రపంచ రెండో ర్యాంకర్ అయిన బెల్జియంను మొరాకో మట్టికరిపించింది. ఈ విజయంతో మొరాకో గ్రూప్-ఎఫ్‌లో అగ్రస్థానానికి దూసుకెళ్లగా.. బెల్జియం రెండో స్థానానికి పడిపోయింది. అయితే ఈ మ్యాచ్ బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. బ్రెజిల్ పరాజయాన్ని జీర్జించుకోలేని పలువురు ఫుట్‌బాల్ అభిమానులు మొరాకో జెండాలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి అల్లర్లు సృష్టించారు. కొందరు కర్రలతో దాడి చేస్తూ వాహనాలపై రాళ్లు రువ్వారు. కారుతో సహా పలు ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పంటించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిరసనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దాదాపు 12 మందిని అదుపులోకి తీసుకోగా ఒకరిని అరెస్ట్ చేశారు. ఆ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. బెల్జియం రాజధాని అంతటా అనేక చోట్ల ఈ ఘర్షణలు చోటుచేసుకున్నాయని, సాయంత్రం 7 గంటల వరకు పరిస్థితి అదుపులోకి వచ్చిందని బెల్జియం పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పబ్లిక్ హైవేపై అల్లరి మూకలు పైరోటెక్నిక్ మెటీరియల్, కర్రలతో దాడి చేశారని, వాహనాలకు నిప్పంటించారని పోలీసులు తెలిపారు. బాణా సంచా పేల్చడంతో ఓ జర్నలిస్టు ముఖానికి గాయమైనట్లు పేర్కొన్నారు. ఈ కారణాల వల్ల తాము జోక్యం చేసుకొని జల ఫిరంగులను, టియర్ గ్యాస్ ఉపయోగించినట్లు తెలిపారు. చదవండి: Ju Ae: కిమ్ వారసురాలు ఆమే? వయసు కేవలం పదేళ్లు మాత్రమే! 🚨BREAKING NEWS🚨 Brussels, home of the EU parliament, ERUPTS in street riots as Moroccans 'celebrate' their victory over their now home country. Are we feeling enriched? pic.twitter.com/YI0h6nXSxt — UNN (@UnityNewsNet) November 27, 2022 Meanwhile, in Brussels, Moroccans celebrate their win over Belgium. The cultural enrichment is paying dividends, right? pic.twitter.com/yakNCjTSSN — David Vance (@DVATW) November 27, 2022 -
పోలండ్‌పైకి క్షిపణులు... రష్యా దాడి కాదు
షెవాడో (పోలండ్): పోలండ్ సరిహద్దుల్లోని పంట పొలాల్లో మంగళవారం ఇద్దరిని బలిగొన్న క్షిపణి దాడులు రష్యా పనేనంటూ వచ్చిన వార్తలు తీవ్ర కలకలానికి దారితీశాయి. దీని ఫలితంగా ఉక్రెయిన్‌కు బాసటగా నాటో రంగంలోకి దిగొచ్చని, దాంతో రష్యా 9 నెలలుగా చేస్తున్న యుద్ధం రూపురేఖలే మారిపోవచ్చని ఒక దశలో ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఈ దాడితో రష్యాకు సంబంధం లేదని పోలండ్‌తో పాటు నాటో కూటమి కూడా బుధవారం ప్రకటించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘అది ఉద్దేశపూర్వక దాడి ఎంతమాత్రమూ కాదనిపిస్తోంది. బహుశా తమ విద్యుత్ కేంద్రాలపై రష్యా సైన్యం చేస్తున్న భారీ దాడులను అడ్డుకునేందుకు ఉక్రెయిన్ ప్రయోగించిన క్షిపణులు దురదృష్టవశాత్తూ సరిహద్దులు దాటి ఉండొచ్చు’’ అని పోలండ్ అధ్యక్షుడు ఆంద్రే డూడ అభిప్రాయపడ్డారు. నాటో సెక్రెటరీ జనరల్ జెన్స్ స్టోటెన్‌బర్గ్ కూడా బ్రసెల్స్‌లో జరిగిన నాటో భేటీలో అదే అన్నారు. అయితే, ‘‘ఉక్రెయిన్ను తప్పుబట్టలేం. యుద్ధానికి కారణమైన రష్యాయే ఈ క్షిపణి దాడులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అంటూ నిందించారు. ఈ ఉదంతంలో కచ్చితంగా ఏం జరిగిందో త్వరలోనే తేలుస్తామన్నారు. రష్యా క్షిపణిని అడ్డుకునేందుకు ఉక్రెయిన్ బలగాలు ఈ క్షిపణులను ప్రయోగించినట్టు ప్రాథమికంగా తేలిందని అమెరికా అధికారులు చెబుతున్నారు. -
వచ్చే ఆర్నెల్లలో 90 శాతం... రష్యా చమురుపై నిషేధం
బ్రసెల్స్: రష్యాపై ఆంక్షలకు కొనసాగింపుగా యూరోపియన్ యూనియన్ కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతులను వచ్చే ఆర్నెల్లలో ఏకంగా 90 శాతం తగ్గించుకునేందుకు యూరప్ దేశాలన్నీ అంగీకరించాయి. మంగళవారం జరిగిన ఈయూ కీలక భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఇతర సరఫరా మార్గాలను వెదుక్కోవడం, వీలైనంత త్వరగా సంప్రదాయేతర ఇంధన వనరులకు మళ్లడం తదితరాల ద్వారా కొరతను అధిగమించాలని నిర్ణయించాయి. ఈ నిర్ణయంతో రష్యా నుంచి సముద్ర మార్గాన జరిగే యూరప్‌కు ఇంధన సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది. హంగరీ వంటి మధ్య, తూర్పు యూరప్ దేశాలకు పైప్‌లైన్ ద్వారా జరుగుతున్న సరఫరాలు మాత్రం కొనసాగుతాయి. తాజా నిర్ణయానికి ఈయూ త్వరలో తుది రూపు ఇవ్వనుంది. దీంతోపాటు రష్యాలోని మరో అతి పెద్ద బ్యాంకుపైనా, ఆ దేశ మీడియాపైనా ఈయూ ఆంక్షలు విధించింది. యూరప్ తన చమురు అవసరాల్లో 25 శాతం, గ్యాస్ అవసరాల్లో ఏకంగా 40 శాతం రష్యాపైనే ఆధారపడ్డ విషయం తెలిసిందే. అందుకే ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగినప్పటి నుంచీ ఆ దేశం నుంచి చమురు, గ్యాస్ దిగుమతుల్ని పూర్తిగా నిలిపేయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నా చాలా యూరప్ దేశాలు సమ్మతించలేదు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం విశేషమనే చెప్పాలి. అయితే తమ ఇంధన భద్రతకు హామీ ఇస్తేనే నిషేధానికి మద్దతిస్తామని రష్యా నుంచి 60 శాతానికి పైగా చమురు దిగుమతి చేసుకుంటున్న హంగరీ ప్రకటించింది. ఈయూ నిర్ణయాన్ని రష్యా తేలిగ్గా తీసుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు డిమాండ్‌కు కొదవ లేదని, ఇతర దిగుమతిదారులను చూసుకుంటామని చెప్పింది. బల్గేరియా, పోలండ్, ఫిన్లండ్లకు చమురు ఎగుమతులను రష్యా ఇప్పటికే నిలిపేసింది. డెన్మార్క్‌కు కూడా మంగళవారం నుంచి సరఫరాలు ఆపేస్తున్నట్టు రష్యా ప్రభుత్వ రంగ ఇంధన దిగ్గజం గజ్ప్రోమ్ ప్రకటించింది. తమ పట్ల విద్వేషమే ఏకైక ప్రాతిపదికగా ఈయూ ఈ నిర్ణయం తీసుకుందని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదెవ్ దుయ్యబట్టారు. మరోవైపు ఉక్రెయిన్ నుంచి ఆహార ఎగుమతులు ఆగిపోవడంపై ఆఫ్రికన్ యూనియన్ ఆందోళన వెలిబుచ్చింది. ఆఫ్రికా దేశాలు తీవ్ర కొరతతో అల్లాడుతున్నాయని యూనియన్ చీఫ్, సెనెగల్ అధ్యక్షుడు మెకీ సల్ చెప్పారు. పశ్చిమ దేశాల మొండి వైఖరే ఇందుకు కారణమని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఆరోపించారు. ఉక్రెయిన్ తన తీర జలాలను మందుపాతరలతో నింపేసిందన్నారు. -
ఉక్రెయిన్ రష్యా యుద్ధం.. నాటోలో కీలక పరిణామం
నాటో(నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) సెక్రటరీ జనరల్‌గా జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ పదవీకాలాన్ని ఒక సంవత్సరంపాటు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. నాటో సెక్రటరీ జనరల్ జెన్స్ స్టోలెన్బర్గ్ను 2023 సెప్టెంబర్ 30 వరకు పదవీలో కొనసాగించనున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రస్సెల్స్‌లో జరిగిన నాటో సదస్సు అనంతరం సభ్య దేశాల నేతలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నార్వే మాజీ ప్రధాని అయిన స్టోలెన్‌బర్గ్.. నాటో సెక్రటరీ జనరల్‌గా 2014 అక్టోబర్‌లో నియమితులయ్యారు. కాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తోపాటు నాటో సభ్యత్వ దేశాల అధికారులు బ్రెజిల్ రాజధాని బ్రస్సెల్స్‌లో సమావేశమయ్యారు. ఉక్రెయిన్- రష్యా యుద్ధం ప్రారంభమై నెల రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కీలక చర్చ జరిగింది. ఈ భేటీలోనే స్టోలెన్‌బర్గ్ పదవీ కాలాన్ని పెంచేందుకు నాటో దేశాల నేతలు అంగీకారం తెలపడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పదవీ కాలాన్ని పెంచడం గౌరవంగా భావిస్తున్నట్లు ఈ సందర్భంగా స్టోలెన్‌బర్గ్ హర్షం వ్యక్తం చేశారు. చదవండి: Russia-Ukraine war: కలకలానికి నెల! ‘నాటో సెక్రటరీ జనరల్‌గా నా పదవీకాలాన్ని 30 సెప్టెంబర్ 2023 వరకు పొడిగించాలని నాటో దేశాధినేతలు నిర్ణయం తీసుకోవడం గౌరవంగా భావిస్తున్నా. ప్రస్తుతం మేము అతిపెద్ద భద్రతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున, మా కూటమిని బలంగా, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మేమంతా కలిసి ఐక్యంగా పోరాడతాం’ అని స్టోల్టెన్‌బర్గ్ ట్వీట్ చేశారు. కాగా రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, బెల్జియం, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్ వంటి 12 దేశాలతో ఏర్పాటైన సైనిక కూటమి నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. ఇప్పుడు నాటో సభ్య దేశాల సంఖ్య 30కి పెరిగింది. సభ్య దేశాల్లో ఏ ఒక్క దేశంపైన అయినా సాయుధ దాడి జరిగితే.. ఆ దేశానికి మిగతా దేశాలన్నీ సహాయంగా రావాలన్నది ఈ కూటమి ఒప్పందం. ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న దాడిని నాటో పలుమార్లు ఖండించిన సంగతి తెలిసిందే. Honoured by the decision of #NATO Heads of State and Government to extend my term as Secretary General until 30 September 2023. As we face the biggest security crisis in a generation, we stand united to keep our Alliance strong and our people safe. https://t.co/06YkRkmX8J — Jens Stoltenberg (@jensstoltenberg) March 24, 2022 -
జాంబీ ఎనర్జీ.. ఇంకెన్నాళ్లు!
రూ. 1.08 లక్షల కోట్లు శిలాజ ఇంధనాల విద్యుత్ ఉత్పత్తికి ఏటా సబ్సిడీలు రూ. 9.02 లక్షల కోట్లు ఉద్గారాల వల్ల ప్రజారోగ్యానికి కలుగుతున్న నష్టం 64.5% సబ్సిడీలు రద్దు చేస్తే వాయు కాలుష్య అకాల మరణాల్లో తగ్గుదల బ్రస్సెల్స్కు హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్ అలయెన్స్(హీల్) అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో వెల్లడించిన అంశాలివీ. ప్రభుత్వ సబ్సిడీల వల్ల ప్రజారోగ్యానికి జరుగుతున్న నష్టం గురించి ఈ నివేదిక విశ్లేషించింది. శిలాజ ఇంధనాల ద్వారా ఉత్పత్తి చేసే విద్యుత్‌నే పరిశోధకులు ‘జాంబీ ఎనర్జీ’ అంటుంటారు. కోల్, ఆయిల్, గ్యాస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలతో ప్రజారోగ్యానికి నష్టం కలుగుతుండటమే దీనికి కారణం. 2012లో ఇండోర్, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవించిన మరణాల సంఖ్య 65 లక్షలు. మొత్తం మరణాల్లో ఇది 11.6 శాతం. – సాక్షి, తెలంగాణ డెస్క్ సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత లేదు.. 2014లో జీ20 దేశాలు శిలాజ ఇంధన కంపెనీలకు సబ్సిడీల కోసం వెచ్చించిన మొత్తం రూ.28.47 లక్షల కోట్లు. ఇదే సమయంలో శిలాజ ఇంధనాల వల్ల తలెత్తుతున్న ఆరోగ్య ఖర్చులు రూ.176.93 లక్షల కోట్లు. సబ్సిడీలకు ఇది ఆరు రెట్లు ఎక్కువ. వాయు కాలుష్యం వల్ల జీ20 దేశాల్లో సంభవిస్తున్న అకాల మరణాలు 32 లక్షలకు పైనే. 2009లో జీ20 దేశాలు శిలాజ ఇంధన సబ్సిడీలను దశలవారీగా తగ్గిస్తామని ప్రకటించాయి. 2016 నాటికి అంటే ఏడేళ్ల తర్వాత కూడా దశలవారీగా సబ్సిడీల ఎత్తివేతపై స్పష్టత రాలేదు. ఇప్పటికీ జీ20 దేశాలు 2013–2015 మధ్య ఏటా రూ.4.60 లక్షల కోట్లను సబ్సిడీలుగా చెల్లిస్తున్నాయి. 75 శాతం విద్యుత్ బొగ్గు నుంచే.. 2014 నాటికి 75 శాతం దేశ విద్యుత్ అవసరాలను తీర్చేది థర్మల్ పవర్ ప్లాంట్లే. 2016 నాటికి ప్రపంచంలో రెండో అతి పెద్ద థర్మల్ పవర్ ఉత్పత్తిదారు, వినియోగదారు భారతే. ఈ విషయంలో చైనా మొదటి స్థానంలో ఉంది. బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల వల్ల వెలువడే ఉద్గారాల్లో నలుసు పదార్థం(పర్టిక్యులేట్ మ్యాటర్–పీఎం), సల్ఫర్ డయా క్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్ కీలకం. తలవెంట్రుక కంటే 30 రెట్లు చిన్నగా ఉండే నలుసు పదార్థం(పీఎం 2.5) పీల్చడం వల్ల శ్వాసకోశ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయి. 2015లో పీఎం 2.5 వల్లే భారత్, చైనాలో 50% మరణాలు సంభవించాయి. చైనాలో 11,08,100 మంది పీఎం 2.5 వల్ల మృత్యువాత పడ్డారు. ► 2013–2014లో శిలాజ ఇంధనాల(ఫాసిల్ ఫ్యూయెల్స్) ద్వారా విద్యుత్ ఉత్పత్తి కోసం భారతదేశం సబ్సిడీగా చెల్లించిన మొత్తం రూ. 1.08 లక్షల కోట్లు/ఒక ఏడాదికి. ► ఇదే సమయంలో శిలాజ ఇంధనాలను కరిగించడం వల్ల ఆరోగ్యపరంగా ఏటా జరుగుతున్న నష్టం రూ. 9.02 లక్షల కోట్లు. సబ్సిడీల కంటే ఇది 8 రెట్లు ఎక్కువ. ► రూ.1.08 లక్షల కోట్లతో 37.5 కోట్ల గృహాలకు సోలార్ బల్బులను ఇవ్వవచ్చు. 32 వేల మంది వైద్యులకు ఎయిమ్స్‌లో శిక్షణ ఇవ్వవచ్చు. శిలాజ ఇంధన సబ్సిడీలను రద్దు చేసి.. ఆయిల్, బొగ్గు, గ్యాస్‌పై పన్నులను సవరిస్తే.. వాయు కాలుష్యం వల్ల ఏటా సంభవిస్తున్న 14 లక్షల అకాల మరణాల్లో 64.5 శాతాన్ని తగ్గించవచ్చట. -
పాత ఫ్యాక్టరీపై పచ్చని స్వర్గం
కాలుష్యం తెస్తున్న సమస్యలకు నగరాలు ఠారెత్తి పోతున్నాయి. ఒక్కటొక్కటిగానైనా పచ్చదనంవైపు అడుగులేస్తున్నాయి. మొన్న చైనాలోని నాన్జింగ్ నగరం పొగ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఓ భారీ భవంతిని పచ్చటి అడవిగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తే... ఆ తరువాత ఇటలీ... స్విట్జర్లాండ్‌లలోనూ ఇలాంటి పచ్చటి భవనాలకు అంకురార్పణ జరిగింది. తాజాగా ఫొటోలో కనిపిస్తున్న విధంగా భారీ ‘పచ్చ’ భవనాన్ని కట్టేందుకు సంకల్పించింది బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరం. అయితే దీనికో ప్రత్యేకత ఉంది. మిగిలినవి సాధారణ భవనాల్లో చెట్లు పెంచే ప్రయత్నాలు చేస్తూంటే.. బ్రస్సెల్స్‌లో ఒక పాత ఫ్యాక్టరీపై పూర్తిగా వాడిపారేసిన వస్తువులు, పదార్థాలతో ఎత్తైన పచ్చ నిర్మాణాలు చేపట్టేందుకు నిర్ణయించింది. ఒకప్పుడు నౌకాశ్రయంగా ఆ తరువాత గోడౌన్‌గా ఉపయోగపడిన ఈ భవనంపై కొన్నేళ్ల క్రితం వరకూ టూర్ అండ్ ట్యాక్సీ సెంటర్‌గా ఉపయోగపడింది. తరువాతి కాలంలో దీన్ని వాడటం మానేశారు. ఖాళీగా ఉన్న ఈ భవనంపై దాదాపు 14 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో, 300 అడుగుల ఎత్తైన నిర్మాణం ఏర్పాటవుతోంది. ఇందులో కొంత భాగం పూర్తిగా సోలార్ ప్యానెల్స్‌తో కప్పి ఉంచారు. నిర్మాణంలో భాగంగా నాటే మొక్కల ద్వారా ఏడాదికి దాదాపు 175 టన్నుల కార్బన్ డయాక్సైడ్ వాయువు వాతావరణంలో చేరకుండా అడ్డుకోవచ్చునని అంచనా. విన్సెంట్ కాల్బోట్ అర్కిటెక్చర్ సంస్థ డిజైన్ చేసి ఈ నిర్మాణంలో 750 అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాలు కూడా ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ బాల్కనీలో చిన్నపాటి ఉద్యానవనాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ భవనం పక్కనే ఓ భారీ గ్రీన్‌హౌస్‌ను ఏర్పాటు చేసి అక్కడే కాయగూరలు, పండ్లు పండించేందుకూ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దీంతోపాటు పక్కనే ఉన్న చిన్నపాటి సరస్సును చిత్తడినేలగా అభివృద్ధి చేసి, జీవవైవిధ్యాన్ని పెంపొందించేందుకు ప్రయత్నిస్తామని విన్సెంట్ కాల్బోట్ అంటోంది. ప్రస్తుతానికి ఈ భవన నిర్మాణం ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూసే స్థితిలో ఉంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఫ్లవర్ కార్పెట్
మనిషన్నాక కూసింత కళాపోషణ ఉండాలట! ‘ముత్యాలముగ్గు’ సినిమాలో రావుగోపాలరావు ఫేమస్ డైలాగిది. ఫొటో చూస్తే నిజమే సుమా అనిపించక మానదు. వావ్... ఎంత అందంగా ఉందీ అనకుండా ఉండలేము. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో ఇటీవల ఈ భారీ పూల తివాచీని అమర్చారు. బెల్జియం, జపాన్ దేశాల 150 ఏళ్ల స్నేహానికి గుర్తుగా బ్రస్సెల్స్‌లోని గ్రాండ్ ప్లేస్‌లో వెయ్యి చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు . ‘టాపిస్ డీ ఫ్లూర్స్’ అనే స్వచ్ఛంద సంస్థ డిజైన్ చేయగా గ్రాఫిక్ డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు, ఇల్లస్ట్రేటర్లు, కార్యకర్తలు కలసి సిద్ధం చేశారు. వేర్వేరు రంగుల్లో ఉండే దాదాపు 6,00,000 పూల గుత్తులతో ఏర్పాటు చేసిన ఈ పూల తివాచీపై పక్షులు, పూలు, చెట్లు, మొక్కల ఆకారాలు ఉన్నాయి. డిజైనింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత 120 మంది కార్యకర్తలు కేవలం నాలుగు గంటల్లో దీన్ని సిద్ధం చేయడం విశేషం. దాదాపు 77 మీటర్ల పొడవు, 24 మీటర్ల వెడల్పు ఉన్న ఈ తివాచీలో రుతువుల గమనాన్ని సూచించే విధంగా పూల ఆకారాలు ఉన్నాయి. 1971 నుంచి రెండేళ్లకు ఒకసారి ఇలాంటి పూల తివాచీని ఏర్పాటు చేస్తున్నారు బెల్జియం వాసులు. పూలు వాడిపోయేంత వరకూ కొన్నిరోజులపాటు ఈ ప్రాంతంలోనే సంగీత కచేరీలు, లైట్‌షోలు కూడా ఏర్పాటు చేస్తారు. ఈ ఏడాదికి ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశమెలాగూ లేదుకాబట్టి.. 2018 నాటికైనా బ్రస్సెల్స్ సందర్శించేలా ప్లాన్ చేసుకోండి మరి! -
బాంబుదాడితో ఉలిక్కిపడిన బ్రస్సెల్స్
బ్రస్సెల్స్: బెల్జియం ఉలిక్కిపడింది. రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ ల్యాబ్ వద్ద బాంబు పేల్చి ఇద్దరు అగంతకులు లోపలికి చొరబడినట్లు తెలుస్తోంది. బెల్జియం వార్తా కథనాల ప్రకారం తెల్లవారు జామున ఉదయం 2.3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ కారు ఇన్ స్టిట్యూట్ కు ఉన్న మూడు ఫెన్సింగ్ లను ఢీకొంటూ నేరుగా లోపలికి దూసుకెళ్లిందని అందులో ఉన్న ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు లేబోరేటరీలకు సమీపంలో బాంబులు పేల్చారని సమాచారం. ఈ బాంబు దాడితో బ్రస్సెల్స్‌లో ఇప్పటికే ఉన్న అప్రమత్తత పరిస్థితిని మరింత జఠిలం చేసింది. ప్రస్తుతానికి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, ఎలాంటి నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. -
బ్రసెల్స్‌లో బాంబు దాడి కలకలం
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో బాంబు దాడి కలకలం సృష్టించింది. బ్రసెల్స్ ఉత్తర ప్రాంతంలోని 'బ్రసెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో దుండగుల కారు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాటుకొని ఇనిస్టిట్యూట్‌లోకి ప్రవేశించిందని అధికారులు వెల్లడించారు. వారు నేరుగా క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసరడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఘటనలో ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారన్న విషయం తెలియరాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్యనా లేక మరెవరైన ఈ దాడికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో విచారణ జరుతుతున్నారు. -
బ్రెగ్జిట్‌పై బ్రెసెల్స్‌లో రచ్చరచ్చ
- 'నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?' అని బ్రెగ్జిట్ ఉద్యమ నేత నెగెల్కు ఈసీ అధ్యక్షుడి ప్రశ్న - పార్లమెంట్‌లోనే ఈయూపై విమర్శలు కురిపించిన నెగెల్ - విడిపోయినా కలిసే సాగుదామంటూ ప్రధాని కామెరూన్ వేడుకోలు - ఈయూలో బ్రిటన్ జాతీయ జెండా తొలిగింపు.. ప్రధాని బృందం రాకకు ముందే మళ్లీ ఏర్పాటు బ్రెసెల్స్: పరస్పర దూషణలు, విమర్శలతో బ్రెగ్జిట్ పై యురోపియన్ పార్లమెంట్ లో జరిగిన చర్చ ఆసాంతం ఆసక్తికరంగా సాగింది. రెఫరెండం ద్వారా యురోపియన్ నుంచి విడిపోవాలని బ్రిటన్ నిర్ణయించుకున్న నేపథ్యంలో 751 మంది సభ్యుల యురోపియన్ పార్లమెంట్ అత్యవసరంగా సమావేశమైంది. మంగళవారం ప్రారంభమైన ఈ సమావేశాలకు బ్రిటన్ ప్రతినిధులుగా(మొత్తం 73 మంది ప్రతినిధులుంటారు) ప్రధాని డేవిడ్ కామెరూన్, యూకే ఇండిపెండెంట్ పార్టీ(యూకేఐపీ) నేత నెగెల్ ఫరాగ్, మరి కొందరు నేతలు హాజరయ్యారు. ఈయూ సభ్యదేశంగా బ్రెసెల్స్ లోని ఈయూ పార్లమెంట్ భవనంలో బ్రిటన్ జాతీయ జెండా తప్పక ఉండాలి. కానీ బ్రెగ్జిట్ నిర్ణయం దృష్ట్యా అధికారులు ఆ జెండాను తొలిగించారు. అయితే బ్రిటన్ నేతలు రావడానికి కొద్ది నిమిషాల ముందే మళ్లీ బ్రిటన్ జాతీయ జెండాను ప్రదర్శించారు. ఈ చర్య ద్వారా ఈయూ నేతలు బ్రిటన్ పట్ల వ్యతిరేక భావనతో ఉన్నామని చెప్పకనే చెప్పారు. సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు యురోపియన్ కమిషన్ అధ్యక్షుడు జేన్ క్లాడ్ జంకర్, యూకేఐపీ నేత నెగెల్ ను తిట్టిపోశారు. బ్రెగ్జిట్ ఉద్యమనేతగా పేరు తెచ్చుకున్న నెగెల్ ను.. 'విడిపోవాలనుకున్నవాడివి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావ్?'అని జేన్ క్లాడ్ ప్రశ్నించారు. దీంతో అక్కడ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. జేన్ ను ఆయన సహచరులు లోపలికి తీసుకెళ్లడంతో వివాదం తాత్కాలికంగా సర్దుమణిగింది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే నెగెల్ కు మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్ మార్టిన్ షుల్ట్జ్. ప్రసంగం మొదట్లో ఈయూకు ధన్యవాదాలు తెలిపిన నెగెల్.. తర్వాత విమర్శలు గుప్పించారు. జేన్ క్లాడ్ తనను అవమానించిన తీరును సభలో వివరించారు. దానికి స్పీకర్.. జేన్ ను గట్టిగా మందలించారు. కాగా, సెషన్ పూర్తయిన తర్వాత నెగెల్, జేన్ లు ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడం విశేషం. అడకత్తెరలో కామెరూన్ రెఫరెండం నిర్వహించి బ్రెగ్జిట్, ఊహించని ఫలితాన్ని చవిచూసిన ప్రధాని డేవిడ్ కామెరూన్ బ్రెసెల్స్ లో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నారు. ఒవైపు ఈయూ నుంచి బ్రిటన్ విడిపోయే ప్రక్రియను కొనసాగిస్తూనే భవిష్యత్ అవసరాల దృష్యా ఈయూ నేతల మెప్పుకోసం పాకులాడినట్లు కనిపించారు. పలువురు ఈయూ కీలక నేతలు కామెరూన్ రెఫరెండం నిర్వహించడంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్లు సమాచారం. సభ వాయిదా అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈయూ నుంచి బయటికి వచ్చినప్పటికీ సత్పంబంధాలు కొనసాగేలా కృషిచేస్తానని చెప్పారు. -
బ్రస్సెల్స్‌లో ఉగ్రవాది కలకలం
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్‌లో మరోసారి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పోలీసులు ఓ అనుమానిత ఉగ్రవాదిని అరెస్టు చేశారు. అతడు బెల్ట్ బాంబు ధరించి ఉన్నట్లు సమాచారం. బ్రస్సెల్స్ నడిబొడ్డున ఓ అతిపెద్ద షాపింగ్ మాల్ వద్ద ఇతడిని అరెస్టు చేసినట్లు బ్రస్సెల్స్ మీడియా వెల్లడించింది. ఓ పక్క గతంలో జరిగిన దాడులకు సంబంధించి ఇప్పటికే ముమ్మరంగా ఉగ్రవాదులను ఏరిపారేసే చర్యల్లో నిమగ్నమైన పోలీసులకు సిటీ 2 అనే ఓ రిటెయిల్ షాపింగ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి తారసపడ్డాడు. అతడిని ఎంతో చాకచక్యంగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పదుల సంఖ్యలో పోలీసులు తిరుగుతున్నా ఓ ఉగ్రవాది బయటకు రావడం ఎక్కడో బాంబుదాడి జరగవచ్చనే అనుమానానికి తావిస్తోందని, ఈ విషయాన్ని అంత తేలికగా తీసుకోకూడదని బ్రసెల్స్ ప్రధాని చార్లెస్ మైఖెల్ చెప్పారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. -
ముంబైకి చేరిన బ్రస్సెల్స్ దాడి బాధితురాలు
ముంబైః బ్రసెల్స్ ఎయిర్ పోర్టులో జరిగిన టెర్రర్ దాడిలో గాయపడ్డ జెట్ ఎయిర్ వేస్ ఉద్యోగిని నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. గాయాలనుంచి కొంతశాతం కోలుకోవడంతో ఆమె శుక్రవారం ఉదయం ముంబైకి తిరిగి వచ్చారు. చీలమండ విరిగి, 15 శాతం గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందిన నిధి.. స్కిన్ గ్రాఫ్టింగ్ చికిత్స చేయించుకున్నారు. ఆమెతోపాటు జెట్ ఎయిర్ వేస్ సిబ్బంది అమిత మోత్వానీ ఇంకా బ్రస్సెల్స్ ఆస్పత్రిలో కోలుకుంటున్నారు. మార్చి నెలలో బ్రసెల్స్ విమానాశ్రయంలో జరిగిన ఉగ్రదాడిలో తీవ్రంగా గాయపడి, అక్కడే ఆస్పత్రిలో చికిత్స పొందిన జెట్ ఎయిర్ వేస్ క్రూ మెంబర్ నిధి ఛాపేకర్ ముంబై చేరుకున్నారు. 42 ఏళ్ళ నిధి ఇంకా కొంతశాతం గాయాలనుంచీ కోలుకోవాల్సిన అవసరం ఉండటంతో పారిస్ నుంచి జెట్ ఎయిర్ వేస్ విమానంలో ముంబై చేరగానే, ఎయిర్ పోర్టునుంచే ఆమెను ముంబై బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి తరలించారు. ఆమె కొంత రక్తహీనతతో బాధపడుతున్నారని, ఇంకా కొన్ని రోజులు ఆమె విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందని, ఎక్కువగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉండటం మంచిదని డాక్టర్లు తెలిపారు. 1996 ఆగస్టు నుంచి జెట్ ఎయిర్ వేస్ లో పనిచేస్తున్న నిధి ఛాపేకర్... మార్చి 22న బ్రసెల్స్ ఎయిర్ పోర్టునుంచి జెట్ ఎయిర్ వేస్ ఫ్లైట్ లో న్యూయార్క్ వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నారు. అదే సమయంలో జరిగిన దాడితో ఆమె శరీరానికి 15 శాతం గాయాలు అవ్వడంతోపాటు, చీలమండ విరిగిపోయింది. అప్పట్నుంచీ బ్రసెల్స్ కు దగ్గరలోని గ్రాండె హాస్పిటల్ డి చెలేరియోలో 25 రోజులపాటు చికిత్స పొందిన ఆమె... గురువారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి, అక్కడినుంచి పారిస్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. శుక్రవారం ఉదయం పారిస్ నుంచి ముంబైకి చేరారు. నిధి.. ఇప్పటికీ వీల్ ఛైర్ ఆధారంగానే కదలాల్సిన పరిస్థితి ఉండటంతో ఆమె భర్త రూపేష్ ఛాపేకర్, అతని సోదరుడు నీలేష్ ఛాపేకర్ ఎయిర్ పోర్టునుంచి, ఎయిర్ లైన్స్ సిబ్బంది, వైద్యాధికారుల సహాయంతో బ్రీచ్ క్యాండీ ఆస్పత్రికి చేర్చారు. -
ఆ మెట్రో స్టేషన్ మళ్లీ సిద్ధమైంది!
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ లో ఉగ్రమూకల దాడికి పాల్పడ్డ అనంతరం మూతపడిన రైల్వే స్టేషన్ మళ్లీ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. గత నెల 22న ఉగ్రవాదులు బ్రస్సెల్స్ లోని మాల్ బీక్ మెట్రో రైల్వే స్టేషన్, జవెంటమ్ ఎయిర్ పోర్ట్, ఇతర ప్రాంతాల్లో బాంబు దాడులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ దాడులలో దాదాపు 34 మందికి పైగా మృత్యువాతపడగా, మరికొంతమంది గాయపపడ్డారు. మాల్ బీక్ మెట్రో స్టేషన్ ను ఈ నెల 25న రీ-ఓపెన్ చేయనున్నట్లు బ్రస్సెల్స్ ఇంటర్ మునిసిపల్ ట్రాన్స్ పోర్ట్ కంపెనీ అధికారులు శుక్రవారం వెల్లడించారు. మెట్రో రైలు ప్రాంతంలో బాంబులు పేలడంతో స్టేషన్ తో పాటు రైలు బోగీ కొంతమేరకు ధ్వంసమవ్వడం తెలిసిందే. స్టేషన్ పరిసరాల్లో అధికారులు భద్రతను మరింత పటిష్టంచేశారు. స్థానికులు ఇప్పటికీ ఉగ్రదాడుల షాక్ నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. -
ఆ ఉగ్రవాదుల అసలు టార్గెట్ అది కాదు!
బ్రసెల్స్: బ్రసెల్స్ విమానాశ్రయంలో బాంబు దాడులకు పాల్పడి 34 మంది మృతికి కారణమైన ఉగ్రవాదుల అసలు టార్గెట్ వేరే ఉందని, చివరి నిమిషంలో వారు తమ ప్రణాలికను మార్చుకోవటంతో బ్రసెల్స్ దాడి జరిగిందని తాజా విచారణలో తేలింది. బ్రసెల్స్ ఉగ్రదాడుల్లో పాల్గొన్న ఉగ్రవాది మహమ్మద్ అబ్రిని విచారణ సందర్భంగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. మరోసారి పారిస్ తరహా దాడులను ఫ్రాన్స్‌లో చేయాలని ఉగ్రవాదులు తొలుత భావించినా సెక్యురిటీ టైట్‌గా ఉండటంతో అప్పటికప్పుడు అత్యవసరంగా బ్రసెల్స్ విమానాశ్రయంలో దాడులకు పాల్పడినట్లు విచారణ అధికారులకు అబ్రిని వెల్లడించినట్లు మీడియా సంస్థ జిన్హువా తెలిపింది. ఉగ్రదాడులకు పాల్పడిన ఇస్లామిక్ స్టేట్ గ్రూపులో మెంబర్ అయిన అబ్రినిని శుక్రవారం బ్రసెల్స్‌లో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. -
'ఓడిపోలేదు.. గుణపాఠం నేర్చుకుంటాం'
బ్రస్సెల్స్: ఉగ్రవాదుల దాడిని ముందుగానే పసిగట్టి తిప్పిగొట్టడంలో విఫలమయ్యారని వస్తున్న ఆరోపణలను బెల్జియం ప్రధాని చార్లెస్ మైఖెల్ తిప్పికొట్టారు. ఈ దాడి తర్వాత తాము ఏ కోశాన భయపడలేదని, అంతే వేగంగా స్పందించామని అన్నారు. 'ఒక నిజం మాట్లాడే విషయంలో ఎప్పటికీ భయపడవద్దు. మేం ఏది సరిగా చేశాం.. ఏది తప్పుగా చేశాం, ఎక్కడ వైఫల్యం చెందాం అనే అంశాలను తెలుసుకోవాల్సి ఉంది. అవి తెలుసుకుని వాటి ద్వారా భవిష్యత్తు కోసం పాఠాలు నేర్చుకుంటాం. బెల్జియం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో విఫలమైందని అనే మాటలను అంగీకరించను. ఎందుకంటే వారిపై సమర్థంగా పోరాడిన దేశం మాది. కానీ, ఇప్పుడొక వైఫల్యం కనిపించింది. అది ఎలాంటిదంటే అమెరికా 9/11 దాడుల్లాంటిది, లండన్ గతంలో ఎదుర్కొన్న సమస్య లాంటిది. మేం కూడా ఈ ఘటనతో గుణపాఠం నేర్చుకుంటాం' అని ఆయన చెప్పారు. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్ట్ పై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దాడి చేసి 32మందికి పైగా ప్రాణాలు బలితీసుకున్న విషయం తెలిసిందే. -
ఇప్పుడిప్పుడే ఆ దుర్ఘటనను మరుస్తూ..
బ్రస్సెల్స్: దాదాపు పది రోజుల అనంతరం తిరిగి బ్రస్సెల్స్ విమానాశ్రయం తెరుచుకుంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు వరుసగా రెండు శక్తిమంతమైన బాంబులు పేల్చిన అనంతరం తాత్కాలికంగా మూతవేసిన ఈ విమానాశ్రయాన్ని బెల్జియం అధికారులు ఆదివారం పదిగంటల ప్రాంతంలో తిరిగి ప్రారంభించారు. గతంలో లేనంత భద్రతను ఈ విమానాశ్రయానికి కల్పించారు. ప్రస్తుతానికి మూడు విమానాలతో సర్వీసులు ప్రారంభించినట్లు తెలిపారు. గత నెల మార్చి 22న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు బాంబు దాడులు చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 32 మంది ప్రాణాలు కోల్పోయారు. విమానాశ్రయాన్ని ప్రారంభించినా దాడి సన్ని వేశాలు తమ కళ్లముందే కదలుతుండటంతో తక్కువమందే తొలిరోజు విమానాశ్రయానికి వస్తున్నట్లు తెలుస్తోంది. -
బెల్జియం చేరుకున్న ప్రధాని మోదీ
బ్రసెల్స్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా బుధవారం బెల్జియం రాజధాని బ్రసెల్స్ చేరుకున్నారు. బెల్జియం ప్రధానమంత్రి ఛార్లెస్ మిషెల్‌తో జరిపే ద్వైపాక్షిక చర్చల్లో నరేంద్ర మోదీ పాల్గొనున్నారు. అలాగే బ్రసెల్స్‌లో జరగనున్న 13వ ఇండియన్ - యూరోపియన్ యూనియన్ సదస్సుకు కూడా మోదీ హాజరుకానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ పలు కీలక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. మార్చి 31వ తేదీన ప్రధాని మోదీ బెల్జియం నుంచి వాషింగ్టన్ చేరుకుంటారు. రెండు రోజుల పాటు జరగనున్న నాలుగో అణు భద్రత సదస్సు (న్యూక్లియర్ సెక్యూరిటీ సమిట్)లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అధ్యక్షత వహించనున్న సంగతి తెలిసిందే. వాషింగ్టన్ నుంచి తిరుగు ప్రయాణంలో మోదీ ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా సౌదీ అరేబియాలో పర్యటించనున్నారు. అందులోభాగంగా ఏప్రిల్ 1వ తేదీన రియాద్‌లో దిగుతారు. పలు కీలక చర్చల్లో మోదీ పాల్గొన్నున్నారు. ఏప్రిల్ 3వ తేదీన భారత్‌కు మోదీ తిరుగు ప్రయాణం అవుతారు. -
బ్రస్సెల్స్ పేలుళ్లలో 35కు చేరిన మృతుల సంఖ్య
బ్రస్సెల్స్ : బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో గత వారంలో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సోమవారానికి మృతుల సంఖ్య 35కు చేరుకుంది.బాంబు పేలుళ్ల ఘటనకు తమదే బాధ్యతని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రస్సెల్స్ ఎయిర్ పోర్టు, మెట్రోస్టేషన్ లో వరుస పేలుళ్ల ఘటనలో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులు పాల్గొనగా, ఇద్దరు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్టు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు.మూడో అనుమానితుడి ఊహా చిత్రాన్ని పోలీసులు సోమవారం విడుదల చేశారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది, ప్యారిస్ లో బాంబుదాడులకు పాల్పడిన సలాహ్ అబ్దెస్లామ్ను అరెస్టు చేసిన నాలుగు రోజుల్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. సలాహ్ అబ్దెస్లామ్ సోదరులే ఘటనకు కారణమని అధికారులు భావిస్తున్నారు. కాగా ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాల ముమ్మర వేట కొనసాగుతుంది. -
యూరప్‌లో టెర్రరిస్టుల అరెస్టు పర్వం
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో బాంబు పేలుళ్ల అనంతరం యూరప్ అంతటా అరెస్టుల పర్వం మొదలైంది. ఇప్పటికే ఉగ్రవాదులతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధాలు ఉన్నట్లు భావిస్తున్న అనుమానితులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో ఇసుమంత సంబంధమున్నా వారిని నిర్భందిస్తున్నారు. ఈ మంగళవారం బ్రస్సెల్స్‌లోని ఎయిర్ పోర్ట్ పై బాంబు దాడులకు పాల్పడి ఇద్దరు అమెరికన్లతో సహా 31మందిని బలితీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించే ఇప్పటికే బ్రస్సెల్స్ లో ఏడుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఎయిర్ పోర్ట్ లో ఇద్దరు ఆత్మహుతి దళ సభ్యుల వెనుక లగేజ్ నెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి కూడా ఉన్నట్లు సమాచారం. దీంతోపాటు నెయిబ్ అల్ హమీద్ అనే మరో వ్యక్తికి, రీదీ క్రికెట్ అనే వ్యక్తి కోసం వాంటెడ్ నోటీసులు కూడా జారీ చేశారు. అలాగే, ఫ్రాన్స్, బ్రిటన్, బెల్జియం అంతటా అనుమానిత ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. -
ఆ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతులు!
బ్రస్సెల్స్: ఇటీవల బెల్జియం రాజధాని బ్రస్సెల్స్ నగరంలో మెట్రో రైల్వే స్టేషన్ వద్ద జరిగిన బాంబు పేలుళ్లలో కేవలం ఇద్దరు మాత్రమే ఈ ఘటన నుంచి బయటపడ్డారు. రొమేనియాకు చెందిన రొక్సానా స్టేఫాంకా, ఆమె రెండేళ్ల కూతురు ఇద్దరు మెట్రో స్టేషన్ బాంబు పేలుళ్ల ఘటనలో స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. రొక్సానా ముఖంపై కాలిన గాయలయ్యాయని, అయితే చిన్నారికి మాత్రం స్వల్ప గాయాలైనట్టు వారి కుటుంబసభ్యులు కూడా వెల్లడించారు. మెట్రో రైలులో బాంబులు పేలిన ఘటనలో మొత్తంగా 20 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. రొక్సానా, తన భర్తతో కలిసి గత ఐదేళ్ల నుంచి బ్రస్సెల్స్ లో ఉంటున్నట్లు తెలిపారు. ఆమె భర్త కంట్రక్షన్ కంపెనీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో గత మంగవారం స్కూలుకు వెళ్లిన తన పెద్ద కూతురు(5)ను ఇంటికి తీసుకురావడానికి మెట్రో రైలులో ఆమె వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు బాధితురాలు వివరించింది. చివరగా తాను ప్రయాణిస్తోన్న ప్రదేశం చుట్టుపక్కల రక్తం ప్రవాహంలా కనిపించిందని, తన చిన్న కూతురు ఏడుస్తుండగా తాను స్పృహ కోల్పోయినట్లు రొక్సానా స్టేఫాంకా గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఆ తల్లీకూతురు ఇద్దరు చికిత్స పొందుతున్నారు. -
బ్రస్సెల్స్‌లో మరోసారి పేలుడు శబ్దాలు
బ్రస్సెల్స్: బ్రస్సెల్స్‌లో మరోసారి భారీ బాంబు పేలుడు శబ్దం వినిపించింది. స్కార్ బీక్ జిల్లాలో పోలీసులు ఉగ్రవాదుల కోసం వేటాడుతుండగా తాజాగా బాంబు పేలుడు సంభవించిందని రాయిటర్స్ తెలిపింది. ఈ సందర్భంగా ఓ వ్యక్తిని కూడా పోలీసులు నిర్భంధించినట్లు సమాచారం. పోలీసుల తనిఖీల వల్ల గంభీరంగా మారినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్రస్సెల్స్ లోని జావెంటమ్ ఎయిర్ పోర్ట్ టర్మినల్ బిల్డింగ్ వద్ద రెండు బాంబు పేలుళ్లు చోటుచేసుకొని దాదాపు 30మందికి పైగా చనిపోగా మరో 40మందికి పైగా గాయాలపాలయిన విషయం తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన వారికోసం ప్రస్తుతం బ్రస్సెల్స్‌లో పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు జరుపుతున్న దాడుల్లో ఒకరు మృతిచెందినట్లు కూడా తెలుస్తోంది.