బ్రస్సెల్స్ పోలీసులకు బాంబులు దొరికాయి!
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో భారీ ఎత్తున నరమేధం సృష్టించడానికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. బ్రస్సెల్స్లో బాంబు దాడులు జరిగిన అనంతరం ఉగ్రవాదుల కోసం గాలింపులు చేపట్టిన పోలీసులకు దాదాపు 15 కేజీల అత్యంత తీవ్రమైన పేలుడు పదార్థాలు లభించాయి.
బెల్జియంలోని స్కార్ బీక్ అనే ప్రాంతంలో ఈ పేలుడు పదార్థాలు లభించినట్లు వారు తెలిపారు. దీంతోపాటు బాంబులను తయారు చేసేందుకు ఉపయోగించే ఇతర సామాగ్రి కూడా లభించినట్లు చెప్పారు. 150 లీటర్ల ఎసిటోన్, డిటోనేటర్లు, నెయిల్ ప్లస్ లభ్యమైనట్లు వివరించారు.