బ్రసెల్స్లో బాంబు దాడి కలకలం
Published Mon, Aug 29 2016 12:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్లో బాంబు దాడి కలకలం సృష్టించింది. బ్రసెల్స్ ఉత్తర ప్రాంతంలోని 'బ్రసెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో దుండగుల కారు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాటుకొని ఇనిస్టిట్యూట్లోకి ప్రవేశించిందని అధికారులు వెల్లడించారు. వారు నేరుగా క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసరడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఘటనలో ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారన్న విషయం తెలియరాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్యనా లేక మరెవరైన ఈ దాడికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో విచారణ జరుతుతున్నారు.
Advertisement
Advertisement