Explode
-
అంబులెన్స్‌లో భారీ పేలుడు.. తృటిలో తప్పించుకున్న గర్భిణి
ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక గర్భిణీ, ఆమె కుటుంబం అంబులెన్స్‌లో భారీ పేలుడు ఘటన నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం జరిగిన ఈ పేలుడు ధాటికి సమీపంలోని ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. అయితే.. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. అంబులెన్స్ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాలం ప్రకారం.. జల్గావ్లోని దాదావాడి ప్రాంతానికి సమీపంలోని జాతీయ రహదారిపై అంబులెన్స్ పేలుడు ఘటన జరిగింది. అంబులెన్స్‌లో గర్భిణీ, ఆమె కుటుంబాన్ని ఎరండోల్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి జలగావ్ జిల్లా ఆసుపత్రికి తీసుకువెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేకుంది. అంబులెన్స్ డ్రైవర్ తన వాహనం ఇంజిన్ నుంచి పొగలు రావడం గమనించి వెంటనే దిగిపోయాడు. అప్రమత్తమైన డ్రైవర్.. అంబులెన్స్‌లో ఉన్నవారిని సైతం వెంటనే దిగాల్సిదిగా కోరాడు.Pregnant Woman Has Narrow Escape As Oxygen Cylinder In Ambulance Explodes in Jalgaon of Maharashtra. pic.twitter.com/PvQPkQZJEY— Aditya Raj Kaul (@AdityaRajKaul) November 13, 2024అదేవిధంగా వాహనం నుంచి దూరంగా ఉండమని సమీపంలోని ప్రజలను కూడా అప్రమత్తం చేశాడు. వాహనం మొత్తం మంటల్లో చిక్కుకొని.. కొన్ని నిమిషాల తర్వాత అంబులెన్స్‌లో ఉన్న ఆక్సిజన్ ట్యాంక్‌కు వ్యాపించింది. దీంతో భారీ శద్ధంతో పేలుడుకు సంభవించింది. అయితే ప్రమాదంలో డైవర్‌తో సహా.. గర్భిణీ,ఆమె కుటుంబం సురక్షింతంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.గత నెలలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్గ్రా జిల్లాలో ఇలాంటి సంఘటనే జరిగింది. పెట్రోల్ పంపు దగ్గర పార్క్ చేసిన అంబులెన్స్‌లో మంటలు చెలరేగడంతో నిమిషాల తర్వాత ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో కూడా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. -
లండన్ బ్రిడ్జిపై పేలిన ఆయిల్ ట్యాంకర్.. వీడియో వైరల్..
లండన్‌లో ఓ బ్రిడ్జిపై ఆయిల్ ట్యాంకర్ పేలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. పేలుడు ధాటికి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ చుట్టుపక్కల భయానక వాతావరణం నెలకొంది. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. అగ్నిమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటనలు అదుపుచేశారు. అయితే కారు టైరు పేలిపోయి అదుపుతప్పి ఆయిల్ ట్యాంక్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం అనంతర దృశ్యాలను అటువైపుగా వెళ్తున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. కాసేపట్లోనే అవి వైరల్‌గా మారాయి. Fire on the gold star bridge in groton Ct😳 pic.twitter.com/pxbAMKWWec — chrisstevens7 (@Moneymakerzzz91) April 21, 2023 Firefighters battle a blaze on the Goldstar Memorial Highway, l- 95 south #newlondon #groton pic.twitter.com/SQdDvmiitV — Greg Smith (@SmittyDay) April 21, 2023 Kayaker Matt Stone of Chester caught this footage from the water near the Gold Star Bridge boat launch @thedayct pic.twitter.com/EyGqSU5Cit — Elizabeth Regan (@eregan_ct) April 21, 2023 చదవండి: సొంత నగరంపైనే రష్యా బాంబింగ్ -
పేలిన బ్యాటరీ స్కూటర్
మండ్య(బెంగళూరు): మండ్య జిల్లా మళవళ్లి తాలూకా కిరుగావలు గ్రామంలో ఎలక్ట్రిక్ స్కూటర్ పేలి కాలిపోయింది. శుక్రవారం నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కాగా, స్థానిక పరీక్షా కేంద్రానికి ప్రకాశ్ అనే ఉపాధ్యాయుడు తన బ్యాటరీ స్కూటర్లో వచ్చాడు. దానిని బయట పార్కు చేసి ఉంచాడు. సుమారు 12 గంటల సమయంలో బ్యాటరీ స్కూటర్ పెద్ద శబ్ధంతో పేలిపోయి మంటల్లో చిక్కుకుంది. పక్కనున్న మరో నాలుగు పెట్రోల్ బైక్‌లకు మంటలు వ్యాపించి పూర్తిగా కాలిపోయాయి. అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదు. పోలీసులు కేసు నమోదు చేశారు. బూడిదగా మారిన తమ వాహనాలను చూసి యజమానులు లబోదిబోమన్నారు. -
ఫోన్ రిపైర్ చేసేలోపే ఒక్కసారిగా బ్లాస్ట్: వీడియో వైరల్
ఒక మొబైల్ ఫోన్‌ని రిపైర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్‌లోని పాలీలో చోటు చేసుకుంది. ఒక కస్టమర్ తన ఫోన్‌ని లలిత్‌పూర్‌లో ఉన్న మొబైల్ఫోన్లు రిపైర్ చేసే షాపుకి తీసుకువచ్చాడు. ఫోన్లో ఛార్జింగ్ సమస్య ఉందని షాపు యజమానికి చెప్పాడు. దీంతో సదరు షాపు యజమాని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తున్నాడు. అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు త్రుటిలో సదరు షాపు యజమాని, కస్టమర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం షాపు వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో... ఒక వ్యక్తి షాపు కౌంటర్ ముందు నిలబడి ఒక గ్లాస్‌పై తన మొబైల్‌ని పెట్టాడు. మరోవ్యక్తి ఒక టూల్ ఉపయోగించి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తాడు. ఒక్కసారిగా పొగ వస్తూ పెద్దగా పేలుపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. उत्तर प्रदेश के ललितपुर में रिपेयरिंग के दौरान एक मोबाइल बम की तरह फट पड़ा pic.twitter.com/eBUCe9f4nL — Bhadohi Wallah (@Mithileshdhar) October 23, 2022 (చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?) -
స్టోన్ క్రషర్లో భారీ పేలుడు
మాలూరు / కోలారు: మాలూరు తాలూకాలోని టీకల్ ఫిర్కా కొమ్మనహళ్లి గ్రామం వద్ద మంజునాథ్‌కు చెందిన స్టోన్ క్రషర్లో గురువారం రాత్రి భారీ పేలుడు సంభవించింది. ఘటనలో బిహార్‌కు చెందిన కార్మికుడు రాకేష్ సాణి(34) దుర్మరణం పాలయ్యాడు. అయితే మాస్తి సీఐ వసంత్ రాత్రికి రాత్రే రాకేష్ సాణి మృతదేహాన్ని మాలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయించి టిప్పర్ ఢీకొని మరణించినట్లుగా ప్రాథమిక నివేదికను సిద్ధం చేసినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. మృతుడి శరీరం కాలిపోయి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. శుక్రవారం ఉదయం కేంద్ర వలయ ఐజీపీ చంద్రశేఖర్, కోలారు ఎస్పీ దేవరాజ్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఉన్నతాధికారుల దృష్టికి తేకుండా పోస్టుమార్టం ఎందుకు చేయించారనే ప్రశ్నలు తలెత్తాయి. ఘటనపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో మాస్తి సీఐ వసంత్‌ను సస్పెండు చేశారు. మృతదేహాన్ని కోలారు జిల్లా ఆస్పత్రికి తరలించారు. రీ పోస్టుమార్టం చేయిస్తాం– మంత్రి మునిరత్న మంత్రి మునిరత్న శుక్రవారం కోలారు జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్టోన్ క్రషర్ బ్లాస్ట్‌కు సంబంధించి పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉందని పేర్కొన్నారు. కార్మికుడి మృతదేహాన్ని బెంగుళూరు విక్టోరియా ఆస్పత్రికి పంపి రీ పోస్టుమార్టం చేయిస్తామన్నారు. మృతదేహాన్ని విక్టోరియా ఆస్పత్రికి తరలించాలని కలెక్టర్‌కు సూచించానన్నారు. పోలీసుల తప్పు కనిపిస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. (చదవండి: లేడీ రజనీకాంత్.. సూపర్ టాలెంట్.. ‘వైరస్’ను గుర్తు చేసింది!) -
భారీ అగ్నిప్రమాదం...ఆరు సిలండర్లు వరుసగా పేలడంతో...
రాజస్తాన్: ఆరు గ్యాస్ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఐతే ఈ ఘటనలో వరసగా ఆరు సిలిండర్లలో పేలుడు సంభవించిందని, దీంతో పలు వాహనాలు దారుణంగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం సంభవించిన వెంటనే స్థానికులు సకాలంలో స్పందించి క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటన జోథ్‌పూర్‌లో మంగ్రా పుంజ్లా ప్రాంతంలోని రెసిడెన్షియల్ కాలనీలో చోటుచేసుకున్నట్లు వెల్లడించారు. ఈ ప్రమాదంలో పలువురు సజీవ దహనమయ్యారని, దాదాపు 16 మంది తీవ్ర గాయాల పాలయ్యారని పేర్కొన్నారు. ఐతే దర్యాప్తులో ఒక సిలిండర్ నుంచి మరో సిలిండర్‌కి అక్రమంగా రీఫిల్ చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తేలింది. ప్రస్తుతం క్షతగాత్రులు జోథ్‌పూర్‌లోని మహాత్మగాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగిన సిలిండర్ ప్రమాదం మరువక మునుపే ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం. (చదవండి: బస్సులో చెలరేగిన మంటలు.. 11 మంది సజీవ దహనం) -
మరికొద్ది గంటల్లో తెల్లారుతుందనంగా... తెల్లారిన బతుకులు
శెట్టూరు: రోజంతా పనులతో అలసిన శరీరాలు రాత్రి గాఢనిద్రలో ఉన్నాయి. తెల్లారితే మళ్లీ బతుకు పోరుకు సిద్ధమవ్వాలి. మరి కొన్ని గంటల్లో ఊరంతా నిద్ర లేస్తుందనగా.. ఒక్కసారిగా భారీ పేలుడు. రెండిళ్లు పూర్తిగా నేలమట్టం. ఏం జరిగింది? ఎలా జరిగింది? అర్థం కాని అయోమయం. ఇళ్ల నుంచి పరుగున రోడ్డుపైకి చేరుకున్న జనం. నేలమట్టమైన ఇంటి శిథిలాల కింద నాలుగు మృతదేహాలు! అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం ములకలేడులో చోటు చేసుకున్న పేలుడు తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏం జరిగిందంటే.. ములకలేడుకు చెందిన కొలిమి దాదాపీరా అలియాస్ దాదు (35), షర్ఫూనా (30) దంపతులకు ఆరేళ్ల కుమార్తె నిదా ఫిర్దోషి ఉంది. తల్లి జైనూబీ (65)తో కలిసి దాదు కుటుంబం నివసిస్తోంది. అదే గ్రామంలోని ఓ చికెన్ సెంటర్లో దాదు దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వీరి ఇంటి పక్కనే మరో ఇంటిలో చిన్నాన్న రజాక్ సాహెబ్ నివాసముంటున్నారు. శనివారం తెల్లవారుజామున 4 గంటలకు రజాక్ సాహెబ్ నిద్రలేచాడు. అప్పటికే సిలిండర్ లీకేజీ కారణంగా ఇళ్లంతా లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) నిండుకుని ఉంది. అవగాహన రాహిత్యం కారణంగా రజాక్ ఇంట్లో లైట్లు ఆన్ చేయడంతో భారీ పేలుడు సంభవించింది. మంటలు చెలరేగడంతో రజాక్‌తో పాటు అతని కుమారుడు అబ్దుల్ సాహెబ్ తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి పక్కపక్కనే ఉన్న రెండిళ్లు కుప్పకూలాయి. మరో నాలుగు ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఉలిక్కిపడిన గ్రామం.. శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకూ వ్యవసాయ పనులతో అలసిన ములకలేడు వాసులు రాత్రి గాఢ నిద్రలో ఉన్నారు. శనివారం తెల్లవారు జామున 4 గంటలకు పేలుడు ధాటికి ఒక్కసారిగా ఆ గ్రామం ఉలిక్కిపడింది. ఎక్కడో.. ఏదో జరిగిందనుకుంటూ నిద్రలోనే ఇళ్ల నుంచి పరుగున బయటకు వచ్చారు. దాదు, రజాక్ ఇళ్లు నేలమట్టమయ్యాయని తెలుసుకుని గ్రామం మొత్తం అక్కడికి చేరుకుంది. శిథిలాల కింద కాలిన గాయాలతో కొట్టుమిట్టాడుతున్న రజాక్, అబ్దుల్‌ను సురక్షిత ప్రాంతానికి చేర్చారు. పక్క ఇంటి శిథిలాలను తొలగిస్తుండగా నిద్రలోనే మృత్యుఒడికి చేరుకున్న దాదు, షర్ఫూనా, నిదా ఫిర్దోషి, జైనూబీ మృతదేహాలు బయటపడ్డాయి. ఒక్కొక్కటిగా మృతదేహాలను తొలగిస్తుంటే పలువురు అయ్యో దేవుడా? అంటూ కంటతడిపెట్టారు. విషయం తెలుసుకున్న కళ్యాణదుర్గం రూరల్ సీఐ శ్రీనివాసులు, శెట్టూరు ఎస్ఐ యువరాజ్, రాష్ట్ర విపత్తుల స్పందన/అగ్నిమాపక సేవల శాఖ అధికారి నజీర్ అహమ్మద్, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన రజాక్, ఆయన కుమారుడు అబ్దుల్ని కళ్యాణదుర్గంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తరలించారు. అంత్యక్రియలకు వెళ్లివచ్చి... దాదు భార్య షర్ఫూనా పుట్టినిల్లు కనుకూరు గ్రామం. వీరి సమీప బంధువు అనారోగ్యంతో గురువారం మృతి చెందడంతో అంత్యక్రియలను శుక్రవారం కనుకూరులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దాదు కుటుంబం హాజరైంది. సాయంత్రం తిరిగి గ్రామానికి చేరుకున్నారు. తెల్లారితే ఉపాధి పనుల్లో పాలు పంచుకోవాల్సి ఉంది. ఇంతలో దారుణం చోటు చేసుకోవడంతో ములకలేడు, కనుకూరు గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మంత్రి దిగ్భ్రాంతి.. ములకలేడు ఘటనపై రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో ఉన్న ఆమెకు విషయాన్ని స్థానిక పార్టీ నేతలు ఫోన్ ద్వారా చేరవేశారు. విషయం తెలుసుకున్న మంత్రి భర్త శ్రీచరణ్‌రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శివన్న, నాయకులు జయం ఫణి, బాబు రెడ్డి, సోమనాథరెడ్డి, తిమ్మరాజు, హరినాథరెడ్డి, ముత్యాలు, రమేష్, షేక్షావలి, అప్జల్, సర్పంచ్ నాగరాజు, మన్సూర్ తదితరులు ములకలేడుకు చేరుకుని ఘటనపై ఆరా తీశారు. బాధిత కుటుంబానికి శ్రీచరణ్‌రెడ్డి రూ.50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. సర్పంచ్ నాగరాజు, ఎస్ఐ యువరాజ్ సమక్షంలో వైఎస్సార్ బీమా పథకం కింద తక్షణ సాయంగా రూ.20 వేలను సచివాలయ సిబ్బంది అందించారు. అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ రంగయ్య.. ములకలేడులో జరిగిన ఘోరాన్ని తెలుసుకున్న అనంతపురం ఎంపీ తలారి రంగయ్య వెంటనే స్పందించారు. గ్రామానికి చేరుకున్న ఆయన స్థానికులతో కలిసి మృతుల అంత్యక్రియల్లో పాల్గొన్నారు. వారి సమాధుల వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ తలారి రాజు, వ్యవసాయ మిషన్ సభ్యుడు రాజారాం తదితరులు ఉన్నారు. పెద్ద శబ్దంతో ఉలిక్కిపడ్డాం తెల్లవారుజామున 4 గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. మా ఇంటి గోడలు చీలసాగాయి. భయంతో బయటకు పరుగు తీశాం. బయటికి వచ్చి చూస్తే దాదు, రజాక్ ఇళ్ల వద్ద పెద్ద ఎత్తున పొగలు వ్యాపించి ఉన్నాయి. కాసేపటి వరకూ ఏమీ కనబడలేదు. ఆ తర్వాత చూస్తే రెండిళ్లు పూర్తిగా నేలమట్టమై కనిపించాయి. నా ఇల్లు కూడా ఎప్పుడు కూలుతుందో తెలియడం లేదు. – అబ్దుల్ రహమాన్, ములకలేడు (చదవండి: 2019లోనే చంద్రబాబును ప్రజలు క్విట్ చేశారు) -
డియోడ్రెంట్ ఎఫెక్ట్.. బెడ్రూంలో భారీ పేలుడు
లండన్: సాధారణంగా గ్యాస్ లీక్ అవ్వడం, రసాయనాలు, మందుగుండు పదార్థాల వల్ల పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయని మనకు తెలుసు. కానీ మనం వాడే డియోడ్రెంట్ వల్ల కూడా పేలుడు సంభవిస్తుందని మీకు తెలుసా. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. చెమట వాసనకు అడ్డుకట్టవేయడం కోసం మనం వాడే డియోడ్రెంట్ వల్ల భారీ పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వివారలు.. లండన్‌కు చెందిన అట్రిన్ బెమజాది(13) అనే కుర్రాడు లండన్‌లో తన తల్లితో కలసి నివసిస్తుండేవాడు. ఆమె డెంటిస్ట్‌గా పని చేసేది. ఈ క్రమంలో ఓ రోజు అట్రిన్ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వసాగాడు. దానిలో భాగంగా డియోడ్రెంట్ స్ప్రే చేసుకున్నాడు. (చదవండి: ‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’) అయితే పొరపాటున ఆ స్ప్రే పక్కనే ఉన్న క్యాండిల్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి దృశ్యాలు చూసిన వారికి ఇక్కడేమైనా బాంబు పేలిందా.. ఏంటీ అనిపిస్తుంది. ప్రమాద ధాటికి బెడ్రూం కిటికీలు, తలుపు బద్దలయ్యాయి. (చదవండి: వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!) ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కరూమ్లో ఉన్న అట్రిన్ సోదరి ప్రమాదాన్ని గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రస్తుతం అట్రిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. fire in battersea pic.twitter.com/9Qo8cPQAZf — a Deb (@AkashDe69028264) October 12, 2021 -
ఆలయం వద్ద పేలుడు
-
సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో స్థానికులు భయాందోళనలకు లోనయ్యారు. ముత్యాలమ్మ దేవాలయం వద్ద ఉన్న చెత్త కుప్పలో పెయింట్ డబ్బాను చెత్త ఎత్తుకునే వ్యక్తి ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా, ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో అతడు గాయాలపాలయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి, దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం అక్కడకు చేరుకున్న బాంబు స్క్వాడ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి టిన్నర్ డబ్బాగా తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. (గ్రేటర్లో తీరొక్క దసరా) -
ఆర్కే 5బి గనిలో పేలుడు
సాక్షి, శ్రీరాంపూర్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే 5బి గనిలో బుధవారం రాత్రి పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వివరాలు.. రోజువారీ పనుల్లో భాగంగా కోల్ కట్టర్లు రత్నం లింగయ్య, పల్లె రాజయ్య, గాదె శివయ్య, బదిలీ వర్కర్ సుమన్‌కుమార్, షాట్ ఫైరర్ శ్రీకాంత్ విధులకు హాజరయ్యారు. రెండో షిఫ్ట్ విధుల్లో భాగంగా వీరికి భూగర్భంలో కోల్æకట్టింగ్ పనులు అప్పగించారు. వారు బ్లాస్టింగ్ హో ల్స్ చేస్తుండగా.. ఒక్కసారి పేలుడు సంభవించింది. బొగ్గు పొరల్లో ఉన్న మందుగుండు పేలడంతో పొరల్ని చీల్చుకుంటూ వచ్చిన పెల్లలు.. కార్మికుల చేతులు, ముఖాలకు బలంగా తాకాయి. ఈ ప్రమాదంలో రత్నం లింగయ్య తల, చేతులకు, శివయ్య ఎడమ చేతికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వా రూ గాయపడ్డారు. క్షతగాత్రులను తోటి కార్మికులు ఉపరితలానికి తీసుకొచ్చి.. అక్కడి నుంచి రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. (వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ) అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో రత్నం లింగయ్య మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని అదే అంబులెన్సులో తిరిగి ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లింగయ్యకు ఆసుపత్రిలో కనీస ప్రాథమిక చికిత్స చేయకుండానే హైదరాబాద్‌కు రెఫర్ చేయడంతోనే మృతి చెందాడని కార్మిక సం ఘాల నేతలు, కార్మికులు ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగారు. ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ఎస్కే బాజీసైదా, బీఎంఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు పేరం రమేశ్ వైద్య అధికారులను నిలదీశారు. గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, కేంద్ర కమిటీ నాయ కులు ఏనుగు రవీందర్‌రెడ్డి, కె.వీరభద్రయ్య ఏరియా ఆసుపత్రి వద్ద మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మొదటి షిఫ్ట్‌లో బ్లాస్ట్ కానిదే.. ప్రమాదానికి మొదటి షిఫ్ట్‌లో బ్లాస్టింగ్ కాకుండా మిగిలిన మందుగుండే కారణమని, మొదటి షిఫ్ట్‌లో పేలకుండా.. రెండో షిఫ్ట్‌లో పేలిందని తెలిసింది. సాధారణంగా బ్లాస్టింగ్ జరిగిన తర్వాత ఎన్ని మందుగుండ్లు పెట్టారు..? ఎన్ని పేలాయి..? పేలనివి ఎన్ని..? అని లెక్క చేసుకుంటారు. పేలనివి ఉంటే గుర్తించి తగిన చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మొదటి షిఫ్ట్‌లో పేలని దాన్ని గుర్తించకుండా అధికారులు రెండో షిఫ్ట్‌లో కార్మికులను పనులకు పంపడంతో ప్రమాదం జరిగిందని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. -
హైదరాబాద్ ముషీరాబాద్‌లో బాంబు కలకలం
-
జియో ఫోన్ కూడా పేలిందట..!
కశ్మీర్: దీపావళి పండుగకు జియో కస్టమర్ల చేతుల్లో మెరిసిన రిలయన్స్ జియో ఫీచర్ ఫోన్‌కు సంబంధించి షాకింగ్ న్యూస్ ఒకటి వెలుగులోకి వచ్చింది. కశ్మీర్ లో ఒక జియోఫోన్ యూనిట్ పేలిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. గతంలో శాంసంగ్, షావోమీ, ఆపిల్ స్మార్ట్‌ఫోన్ పేలుళ్ల ఉదంతాలు సంచలనం సృష్టించగా ఇపుడు జియో ఫీచర్ ఫోన్ పేలుడు ఘటన మరింత కలకలం రేపింది ఫోన్ రాడార్ అందించిన నివేదిక ప్రకారం చార్జింగ్ లో ఉండగా జియో ఫీచర్ పోన్ వెనుక భాగంలో పేలింది. దీంతో ఈ హ్యాండ్సెట్ వెనుగ భాగం పూర్తిగా మండి, కరిపోయినట్టు రిపోర్ట్ చేసింది. అయితే ముందుభాగం, బ్యాటరీ మాత్రం చెక్కుచెదరలేదని నివేదించింది. ఈ ప్రమాదం తమ దృష్టికి వచ్చిందని, అయితే జియో ఫీచర్ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించినట్టు రిలయన్స్ రీటైల్ ఒక ప్రకటనలో తెలిపింది. విడుదలకు ముందు ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరీక్షించినట్టు తెలిపింది. కావాలని సృష్టించిన వివాదంగా తమ ప్రాధమిక దర్యాప్తులో తేలిందని వాదించింది. దీనిపై తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని తెలిపింది. మరోవైపు తప్పు బ్యాటరీది కాదని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ పేర్కొంది. పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తుందని, ఈ సంఘటన ఉద్దేశపూర్వక ప్రయత్నమని వ్యాఖ్యానించిందని కూడా ఈ నివేదిక పేర్కొంది. -
శాంసంగ్‌ను వీడని పేలుడు కష్టాలు
సాక్షి, న్యూఢిల్లీ: కొరియా మొబైల్‌దిగ్గజం శాంసంగ్‌ను స్మార్ట్‌ఫోన్ పేలుడు కష్టాలు వీడడం లేదు. తాజాగా ఢిల్లీనుంచి ఇండోర్‌కు బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిన మొబైల్ శాంసంగ్ గెలాక్సీ జె 7 గా తేలింది. శాంసంగ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించింది. హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, శాంసంగ్ గెలాక్సీ జె7 డివైస్ ఢిల్లీ- ఇండోర్ జెట్ ఎయిర్వేస్ విమానంలో పేలిపోయింది. ఈ ప్రమాదంపై శాంసంగ్ ఇండియా అధికార ప్రతినిధి స్పందిస్తూ మరింత సమాచారం కోసం సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామనీ, కస్టమర్ భద్రతే తమ ప్రధాన ప్రాధాన్యత అని ప్రకటించారు. 120 మంది ప్రయాణీకులతో విమానం బయలుదేరిన 15 నిమిషాలకే ఈ పేలుడు సంభవించింది. ఒక ప్రయాణికురాలి హ్యాండ్‌బ్యాగులో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా అకస్మాత్తుగా మంటలంటుకొని, పొగలు వ్యాపించడంతో ప్రయాణీకులు భయాందోళనలకు లోనయ్యారు. అయితే సిబ్బంది అప్రమత్తమై పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు విమానంలో ఉన్న అగ్నిమాపక పరికరం చేయకపోవడంతో.. నీళ్లు చల్లి మంటల్ని అదుపు చేయడం మరో వివాదానికి దారి తీసింది. అటు డీజీసీఎస్ మార్గదర్శకాలన్నింటినీ తాము పాటిస్తున్నామని ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. కాగా గత ఏడాది శాంసంగ్ నోట్ 7 పేలుళ్లతో కంపెనీ తీవ్ర నష్టాలను మూటగట్టుకుంది. ఈ క్రమంలో చాలా గ్యాప్ తరువాత ఇటీవల శాంసంగ్ ఎస్ 8, గెలాక్సీ్ నోట్ 8 ను లాంచ్ చేసింది. ఈ నేపథ్యంలో మళ్లీ విమానంలో శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ పేలడం కలకలం రేపింది. -
పేలిన స్మార్ట్‌ఫోన్..బెంబేలెత్తిన ప్రయాణికులు
న్యూడిల్లీ: ఢిల్లీనుంచి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానంలో సడెన్‌గా కలకలం రేగింది. 80 మంది ప్రయాణికులతో ఇండోర్ వెళుతున్న విమానంలో ఉన్నట్టుండి దట్టమైన పొగ అలుముకోవడంతో ప్రయాణీకుల పై ప్రాణాలు పైనే పోయాయి. అయితే వెంటనే అప్రమత్తమైన సిబ్బంది,కారణాలను కనుక్కొని ప్రయాణికులను శాంతింప చేశారు. ఒక ప్రయాణీకురాలి హ్యాండ్‌బ్యాగ్‌లో ఉన్న మొబైల్ ఫోన్ పేలడంతో ప్రయాణీకులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ నుంచి ఇండోర్ వెడుతున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో శుక్రవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలో ప్యాకేజింగ్ బిజినెస్ చేస్తున్న , ఢిల్లీలో మాయూర్ విహార్-ఐకి చెందిన అతుల్ ధాల్ , భార్య అర్పితా ధాల్, 18 నెలల వయసున్న కుమారుడు , తండ్రితో కలిసి దీపావళి పండుగకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. స్నాక్స్ ఇస్తుండగా పొగ అలుముకోవడాన్ని విమాన సిబ్బంది గమనించారు. వెంటనే సీటు కిందనుంచి బ్యాగును బయటకుతీసి, ఇతర ప్రయాణీకుల సాయంతో మంటల్ని ఆర్పారు. తమ సీటు కిందనుంచి శబ్దం రావడంతోపాటు, బాగా పొగరావడాన్ని గమనించామని అతుల్ ధాల్ తెలిపారు. బ్యాగులో ఉన్న మొత్తం మూడు సెల్ఫోన్లు ఉండగా, అందులో ఒకటి పేలిదంటూ వివరించారు. ఈ సంఘటనను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌కు నివేదించామని జెట్ ఎయిర్వేస్ ప్రకటించింది. డీజీసీఏ సూచించిన మార్గదర్శకాల ప్రకారం అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నామనీ, మొబైల్ పరికరాన్ని తదుపరి దర్యాప్తు కోసం కస్టడీలోకి తీసుకున్నామని . మరోవైపు పేలిన స్మార్ట్‌ఫోన్ ఏ కంపెనీది తదితర వివరాలను మాత్రం వెల్లడించలేదు. -
ఆర్టీసీ బస్సులో పేలిన టికెటింగ్ మెషిన్
సాక్షి, లక్నో : ఓ ఆర్టీసీ బస్సులో ఎలక్ట్రానిక్ టికెటింగ్ మెషిన్(ఈటీఎమ్) పేలిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మథురలో సోమవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో యూపీ ఆర్టీసీ కండక్టర్ నేత్రాపాల్ తీవ్రంగా గాయపడ్డారు. అతని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించారు. అయితే ఈటీఎమ్ పేలడానికి గల కారణాలు తెలియరాలేదని, బస్సులో ప్రయాణీకులున్నప్పటికీ కండక్టర్‌కు మాత్రమే గాయలైనట్లు పోలీసులు తెలిపారు. ఈటీఎమ్ మాత్రం పూర్తిగా ధ్వంసమైందని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నోట్7 మాదిరిగా.. రెడ్మి నోట్4 బ్లాస్ట్
శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 ఫోన్ల పేలుడు ఘటనలు ఇంకా పూర్తిగా మరవనలేదు. తాజాగా మరో ఫేమస్ కంపెనీ స్మార్ట్‌ఫోన్ కూడా పేలిపోయింది. బెంగళూరులోని ఓ షాపులో షావోమి రెడ్మి నోట్4కు పేలుడు ప్రమాదం సంభవించింది. కస్టమర్‌కు చెందిన రెడ్మి నోట్ 4 ఫోన్లో షాప్కీపర్ సిమ్‌ను ఇన్సర్ట్ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఒక్కసారిగా ఈ పేలుడు ప్రమాదం సంభవించడంతో ఫోనంతా కాలిపోయింది. అయితే రెడ్మి నోట్ 4 పేలిన సమయంలో ఆ ఫోన్ ఛార్జింగ్‌లో కానీ లేదా మరే ఇతర యాక్ససరీస్‌ను కానీ దానికి కనెక్ట్ చేయలేదు. రిటైలర్ దాన్ని హ్యాండిల్ చేస్తున్న క్రమంలోనే మంటల సంభవించాయి. చాలా కేసుల్లో హ్యాండ్‌సెట్‌కు ఛార్జింగ్ పెట్టి ఉన్న సమయంలో బ్యాటరీ ఓవర్‌హీట్ అయి, పేలుడు ఘటనలు జరిగేవి. కానీ ఇలా పేలుడు ఘటన జరగడం చాలా అరుదని తెలుస్తోంది. అయితే దీనిపై స్పందించిన షావోమి కంపెనీ.. తమకు వినియోగదారుడి భద్రతే అత్యంత ముఖ్యమని, ఈ విషయంపై వినియోగదారుడిని సంప్రదించి విచారణ చేపడతామని చెప్పింది. ఆ ఫోన్‌కు బదులు మరో షావోమి రెడ్మి నోట్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కస్టమర్‌కి అందించింది. ఈ ఘటనల్లో ఎవరూ గాయపడలేదని షావోమి తెలిపింది. ఒకవేళ ఫోన్‌ను మాట్లాడుతున్న క్రమంలో పేలుడు సంభవిస్తే, తీవ్రమైన గాయాలే అయ్యేవని, ఇది చాలా అదృష్టమని తెలిపింది. అంతకముందు గెలాక్సీ నోట్ 7 పేలుడు ఘటనలతో శాంసంగ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ ఫోన్ తరుచు పేలుడు ఘటనలకు ప్రభావితం కావడంతో, శాంసంగ్ భారీ మూల్యాన్నే చెల్లించుకుంది. ఓ వైపు కంపెనీ రెవెన్యూలు, మరోవైపు కంపెనీ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేలుడు ఘటనలు అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు భారీ నష్టాలనే మిగులుస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో షావోమి ఈ విషయాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది. -
శాంసంగ్ కు మరో షాక్
న్యూయార్క్: శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 మంటలు చల్లారకముందే మరో షాక్ తగిలింది. అదే కంపెనీకి చెందిన మరో స్మార్ట్ ఫోన్ కూడా పేలిపోయింది. అమెరికాలోని ఓ వ్యక్తి దగ్గరున్న శాంసంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ పేలిందని స్థానిక మీడియా వెల్లడించింది. చార్జింగ్ పెడుతుండగా ఫోన్ పేలిపోయిందని 'ఫోన్ ఎరినా' పేర్కొంది. ఒరిజినల్ చార్జర్ తో రాత్రంతా పెట్టడంతో ఫోన్ పేలిందని, ఈ ఘటనలో బాధితుడికి స్వల్పంగా కాలిన గాయాలయ్యాలని తెలిపింది. రెండు వారాల క్రితమే శాంసంగ్ నోట్ 7కు బదులుగా గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ స్మార్ట్ ఫోన్ తీసుకున్నాడని వెల్లడించింది. ఇందులో బ్యాటరీ సురక్షితమైందని కంపెనీ తనకు భరోసాయిచ్చిందని బాధితుడు చెప్పాడు. కాగా, శాంసంగ్ నోట్ 7 వినియోగదారులు అమెరికాలో పలుచోట్ల కోర్టుల్లో దావాలు వేశారు. శాంసంగ్ నోట్ 7 మోడల్ ను నిలిపివేయడం.. ఈ ఫోన్లను మార్చుకోవాలని కోరడంతో తాము ఇబ్బందులకు, మానసిక కుంగుబాటుకు గురయ్యామని న్యాయస్థానాలను ఆశ్రయించారు. తమకు శాంసంగ్ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. గెలాక్సీ నోట్ 7 రేపిన మంటలతో శాంసంగ్ కు వచ్చ ఆరు నెలల్లో 3 బిలియన్ డాలర్లుపైగా నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా. -
వణికిస్తున్న 'గెలాక్సీ నోట్ 7' బాంబు
స్మార్ట్ ఫోన్ అమ్మకాల్లో రారాజులా వెలిగిన శాంసంగ్ కు 'గెలాక్సీ నోట్ 7' రూపంలో కోలుకోలేని దెబ్బతగిలింది. అటు ప్రధాన ప్రత్యర్థి ఆపిల్ మార్కెట్లోకి శరవేగంగా దూసుకొస్తోంటే.. అనూహ్యపరిణామాలు సంస్థకు అశనిపాతంలా చుట్టుకున్నాయి. ఒక్కసారిగా పేలుడు వార్తలు రావడం, కొన్ని అంతర్జాతీయ విమానాల్లో నిషేధం తదితర పరిణామాలు చకచకా జరిగిపోయాయి. అమెరికా కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ తాజాగా జారీ చేసిన ఆదేశాలు సంస్థను కృంగదీసేలా ఉన్నాయి. వినియోగదారులు గెలాక్సీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని లేదా స్విచ్ ఆఫ్ చేయాలని తెలిపింది. దీని వినియోగా చాలా ప్రమాదకరమైనదని ప్రకటించింది. ఈ వ్యవహారంలో శాంసంగ్ సంస్థతో అధికారిక రీకాల్ కోసం పనిచేస్తున్నట్టు సంస్థ శుక్రవారం వెల్లడించింది. అలాగే సంస్థ ప్రకటించిన రీప్లేస్ మెంట్ ఆఫర్ సరియైనదా కాదా అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపింది. ఇటీవలే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లాంచ్ చేసిన ఈ తాజా ఫోన్ బ్యాటరీలు పేలుతున్న సంఘటనలు సంస్థను వణికించాయి. మరోవైపు యూజర్లకు చెమటలు పట్టించాయి. ఈ నేపథ్యంలో భారత విమానాల్లో ఈ ఫోన్లు వాడొద్దంటూ అధికార డిజీసీఏ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. భారత ఎయిర్ లైన్స్, ఆస్ట్రేలియాకు చెందిన క్వాంటాస్ అలాగే అమెరికాకు చెందిన అమెరికన్ ఎయిర్ లైన్ రెగ్యులేటర్ ,ది ఫెడరల్ ఏవియేషన్ అధారిటీ ( ఎఫ్ఎఎ)లు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దీంతోపాటు తాజాగా గురువారం అమెరికా విమానయాన భద్రతా అధికారులు కూడా ప్రయాణికులకు నిషేధాజ్ఞలు జారీ చేశారు. లాంచ్ అయిన కొద్ది రోజులకే హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన ఈఫోన్లను దాదాపు 2.5మిలియన్ ఫోన్లను రీకాల్ చేయాలని శాంసంగ్ నిర్ణయించింది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా 35ప్రమాదాలు సంభవించినట్టు ధృవీకరించింది. నష్టపోయిన కష్టమర్లకు ప్రత్యామ్నాయంగా గెలాక్సీ ఎస్7, ఎస్7ఎడ్జ్ ఫోన్లను రీప్లేస్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
బ్రసెల్స్‌లో బాంబు దాడి కలకలం
బ్రసెల్స్: బెల్జియం రాజధాని బ్రసెల్స్‌లో బాంబు దాడి కలకలం సృష్టించింది. బ్రసెల్స్ ఉత్తర ప్రాంతంలోని 'బ్రసెల్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ'ని లక్ష్యంగా చేసుకొని దుండగులు బాంబు దాడికి పాల్పడ్డారు. అయితే ఆ సమయంలో అందులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సోమవారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో దుండగుల కారు రోడ్డుపై ఏర్పాటు చేసిన అడ్డంకులను దాటుకొని ఇనిస్టిట్యూట్‌లోకి ప్రవేశించిందని అధికారులు వెల్లడించారు. వారు నేరుగా క్రిమినాలజీ ఇనిస్టిట్యూట్ లాబొరేటరీపైకి బాంబులు విసరడంతో అక్కడ మంటలు చెలరేగాయి. ఘటనలో ఎంతమంది వ్యక్తులు పాల్గొన్నారన్న విషయం తెలియరాలేదు. దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇది ఉగ్రవాదుల చర్యనా లేక మరెవరైన ఈ దాడికి పాల్పడి ఉంటారా అన్న కోణంలో విచారణ జరుతుతున్నారు. -
'పుచ్చ' పేలిపోయింది
న్యూయార్క్: ఇద్దరు రిపోర్టర్లు చేసిన చిలిపి సరదా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. రబ్బరు బ్యాండ్లతో పుచ్చకాయను వారు పేల్చి వేసిన తీరు ఫేస్ బుక్‌లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది వీక్షించారు. ఓ మీడియా సంస్థకు చెందిన ఇద్దరు రిపోర్టర్లు ఒక ప్రయోగం చేద్దామనుకున్నారు. అనుకుందే తడవుగా తెల్లని వస్త్రాలు నిండుగా ధరించి ఒక పుచ్చకాయను తెచ్చి టేబుల్‌పై పెట్టారు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 500 రబ్బర్లు బ్యాండ్లు ఒకదాని తర్వాత మరకొకటి వేశారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు ఈ కార్యక్రమం నిర్వహించారు. వారు చేస్తున్న ఈ ప్రయోగాన్ని తొలుత చూసినవారు కాస్తంతా ఓపిక కోల్పోయి చిరాకుగా కనిపించారు. ఆ తర్వాత సరిగ్గా 500 రబ్బరు బ్యాండ్లు దాటిన తర్వాత బూమ్ అని ఒక్కసారిగా పుచ్చకాయ పేలిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను వారు ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశారు.