ఒక మొబైల్ ఫోన్‌ని రిపైర్ చేస్తుండగా ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో లలిత్‌పూర్‌లోని పాలీలో చోటు చేసుకుంది. ఒక కస్టమర్ తన ఫోన్‌ని లలిత్‌పూర్‌లో ఉన్న మొబైల్‌ఫోన్లు రిపైర్ చేసే షాపుకి తీసుకువచ్చాడు. ఫోన్‌లో ఛార్జింగ్ సమస్య ఉందని షాపు యజమానికి చెప్పాడు. దీంతో సదరు షాపు యజమాని మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తున్నాడు.
అంతే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తు త్రుటిలో సదరు షాపు యజమాని, కస్టమర్ ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అందుకు సంబంధించిన ఘటన మొత్తం షాపు వద్ద ఉన్న సీసీఫుటేజ్‌లో రికార్డు అవ్వడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఆ వీడియోలో... ఒక వ్యక్తి షాపు కౌంటర్ ముందు నిలబడి ఒక గ్లాస్‌పై తన మొబైల్‌ని పెట్టాడు. మరోవ్యక్తి ఒక టూల్ ఉపయోగించి బ్యాటరీ తీసేందుకు యత్నిస్తాడు. ఒక్కసారిగా పొగ వస్తూ పెద్దగా పేలుపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
उत्तर प्रदेश के ललितपुर में रिपेयरिंग के दौरान एक मोबाइल बम की तरह फट पड़ा pic.twitter.com/eBUCe9f4nL
— Bhadohi Wallah (@Mithileshdhar) October 23, 2022
(చదవండి: కొరడాతో కొట్టించుకున్న చత్తీస్‌గఢ్ సీఎం.. ఎందుకంటే?)
Comments
Please login to add a commentAdd a comment