
లండన్: సాధారణంగా గ్యాస్ లీక్ అవ్వడం, రసాయనాలు, మందుగుండు పదార్థాల వల్ల పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయని మనకు తెలుసు. కానీ మనం వాడే డియోడ్రెంట్ వల్ల కూడా పేలుడు సంభవిస్తుందని మీకు తెలుసా. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. చెమట వాసనకు అడ్డుకట్టవేయడం కోసం మనం వాడే డియోడ్రెంట్ వల్ల భారీ పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వివారలు..
లండన్‌కు చెందిన అట్రిన్ బెమజాది(13) అనే కుర్రాడు లండన్‌లో తన తల్లితో కలసి నివసిస్తుండేవాడు. ఆమె డెంటిస్ట్‌గా పని చేసేది. ఈ క్రమంలో ఓ రోజు అట్రిన్ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వసాగాడు. దానిలో భాగంగా డియోడ్రెంట్ స్ప్రే చేసుకున్నాడు.
(చదవండి: ‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’)
అయితే పొరపాటున ఆ స్ప్రే పక్కనే ఉన్న క్యాండిల్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి దృశ్యాలు చూసిన వారికి ఇక్కడేమైనా బాంబు పేలిందా.. ఏంటీ అనిపిస్తుంది. ప్రమాద ధాటికి బెడ్రూం కిటికీలు, తలుపు బద్దలయ్యాయి.
(చదవండి: వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!)
ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కరూమ్‌లో ఉన్న అట్రిన్ సోదరి ప్రమాదాన్ని గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రస్తుతం అట్రిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
fire in battersea pic.twitter.com/9Qo8cPQAZf
— a Deb (@AkashDe69028264) October 12, 2021
Comments
Please login to add a commentAdd a comment