candle
-
క్రేజీ క్యాండిల్ లైట్ కన్సర్ట్..
లైవ్ యువర్ సిటీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’ హైదరాబాద్ నగరానికి కూడా వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా నగరాల్లో ఊర్రూతలూగించిన ఈ సిరీస్ ‘ట్రిబ్యూట్ టు కోల్డ్ ప్లే’ పేరుతో హైదరాబద్లోనూ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15న బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ప్రీమియర్ షో ప్రారంభించనున్నారు. ఈ ‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’లో భాగంగా స్థానిక ఫేమస్ మ్యూజిక్ ఆర్టిస్టుల సంగీత స్వరాలతో పోడియం హోరెత్తనుంది. క్యాండిల్ లైట్స్ వెలుతురులో సంగీతాన్ని ఆస్వాదించే వినూత్న వేదికకు మన నగరం సాక్షిగా నిలవనుంది. ఈ వేడుక ప్రారంభం మాత్రమే.. రానున్న డిసెంబర్ నెలలో హయత్ హైదరాబాద్ గచ్చిబౌలి వేదికగా ‘క్వీన్ వర్సెస్ అబ్బా’ పేరుతో మరో కన్సర్ట్కు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మ్యూజిక్ కన్సర్ట్‌లో సారంగి, తబలా వంటి కాలాతీత శాస్త్రీయ వాయిద్యాలతో అలరించనున్నారు. పారిస్ టూ న్యూయార్క్..‘క్యాండిల్ లైట్ కన్సర్ట్’ సాధారణంగా నిర్వహించే కన్సర్ట్లాంటిది కాదు. పారిస్‌లోని చారిత్రాత్మక వేదికలు మొదలు న్యూయార్క్‌లోని మోడ్రన్ వేదికల వరకూ ప్రపంచ ప్రయాణం చేసి మిలియన్ల మ్యూజిక్ లవర్స్‌ను అలరించిన గ్లోబల్ షో. ఈ కన్సర్ట్కు అంతర్జాతీయంగా ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం. ప్రస్తుతం యావత్ ప్రపంచం అంతా హైదరాబాద్ వైపు చూస్తున్న వేళ లైవ్ యువర్ సిటీ అంటూ నగరానికి విచ్చేసింది. ప్రముఖ భారతీయ పియానిస్ట్ నిఖిత్ దోర్బలా సందడి చేయనున్న షో ఈ నెల 15న జరగనుండగా, డిసెంబర్ 6, 22, జనవరి 11 తేదీల్లో నగరంలోని విభిన్న వేదికల్లో ఈ సంగీత కచేరి జరగనుంది. (చదవండి: -
రోజుకి 20 నిమిషాలే పనిచేస్తాడు..కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు..!
చాలామంది గంటలకొద్ది పనిచేసిన సంపాదన మాత్రం అతంత మాత్రంగానే ఉంటుంది. ఇంకొందరూ పడే కష్టం చూస్తే బాధేస్తుంది. వాళ్ల సంపాదన కనీసం రోజు గడవడానికి కూడా సరిపోదు. కానీ ఈ వ్యక్తి రోజుకి మహా అయితే 20 నిమిషాలకు మించి పనిచేయడు. కానీ ఏడాదికి ఏకంగా రూ. 3.8 కోట్లు ఆర్జిస్తున్నాడు. ఎలా? అతడి విజయ రహస్యం ఏంటీ అంటే.. ఓర్లాండ్ నివాసి ప్రాన్సిస్కో రివెరా ఫిబ్రవరి 2023లో ఆన్‌లోన్ ట్యూటర్‌గా పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ, మరోవైపు పాఠశాలలో టీచర్‌గా పనిచేసేవాడు. అయితే అది అతనికి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. రోజంతా కష్టపడ్డా సంపాదిస్తుంది ఎంత అనే ఫీల్‌తో ఉండేవాడు. ఏదైన ప్రత్యామ్నాయ ఆదాయ మార్గం కోసం తెగ అన్వేషించేవాడు రివెరా. అలా యూట్యూబ్‌లో బిజినెస్‌కి సంబంధించిన ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్లర్ యూట్యూబ్ వీడియోలతో ప్రేరణ పొంది ఆర్గానిక్ క్యాండిల్స్ తయారు చేసి విక్రయించే ఎట్సీ((Eassiest Way To Start(Ety)) అనే దుకాణాన్ని పెట్టానలుకున్నాడు. ముదుగా ఆర్గానిక్ కొవ్వుత్తులు తయారు చేయడం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఆన్లైన్లో ఎలా విక్రయించాలి, ఎలా ప్రొడక్ట్లని డిజైన్ చేయడం అనేవి ఆ పీవోడీ వీడియోల ద్వారా పూర్తి పరిజ్ఞానాన్ని పొందాడు. ఆ తర్వాత ఆన్లైన్లో కూడా బిజినెస్ బాగా విస్తరించేలా చేశాడు. ఇలా అతడి ఎట్సీ దుకాణం గతేడాది సుమారు రూ. 3.8 కోట్లు లాభాలు అందుకుంది. ప్రతి అమ్మకంలో దాదాపు 30% నుంచి 50% లాభలను అందుకున్నామని రివెరా చెప్పుకొచ్చాడు. తాను కేవలం మార్కెటింగ్‌కి, ప్రింట్ఫై సేవల కోసమే ఖర్చు చేస్తున్నాని తెలిపారు. తాను కొన్ని రోజులు 20 నిమిషాలే పనిచేస్తానని, ఒక్కోసారి మాత్రం రెండు గంటల వరకు పని చేస్తానని అది కూడా కొత్త ట్రెండ్స్‌పై పరిశోధన చేయడం, లేబుల్స్ డిజైన్ చేయడానికి ఇంత టైం పడుతుందని చెప్పుకొచ్చారు. మిగిలిన సమయం అంతా సంగీతంపై దృష్టి పెడతానని అన్నారు. తానిప్పుడూ గతంలో కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, తక్కువే పనిచేస్తున్నానని ఆనందంగా చెప్పుకొచ్చారు రివెరా. అంతేగాదు మీరు 9 టు 5 జాబ్‌లో ఉండి సరైన సంపాదన లేనప్పుడూ మంచి ఆదాయమార్గం వైపు దృష్టిసారించడం ఓ స్టాండర్డ్‌ని తీసుకోవడం చేయాలి చెబుతున్నాడు రివెరా. కాగా ప్రింట్ ఆన్ డిమాండ్(పీవోడీ) సైడ్ హాస్టల్స్ కొత్తగా వ్యాపారం చేయాలనుకునేవాళ్లకు ఎలాంటి వ్యాపారాలు చేస్తే మంచిది, ఎలా ప్రారంభించాలి, ట్రైనింగ్ వంటివి అన్ని ఔత్సాహికులకు నేర్పించే యూట్యూబ్ ఛానెల్. ఆయా వ్యక్తులకు వ్యాపారానికి కావాల్సిన గైడన్స్ ఇవ్వడమే గాక మార్కెటింగ్ సంబంధించిన సహాయసహకారాలు కూడా అందిస్తుంది. దీని సాయంతో ఎంతో మంది ఈజీగా ఆదాయాన్ని గడించి బిజినెస్‌లతో దూసుకుపోయిన వారెందురో ఉన్నారు కూడా. (చదవండి: ఆ మూడు సమయాల్లో అస్సలు బ్రష్ చేయకూడదట..!) -
నెయిల్ పాలిష్ రిమూవర్ ఇంత డేంజరా? మంటల్లో చిక్కుకున్న చిన్నారి..
నెయిల్ రిమూవర్ గురించి మనందరికీ తెలుసు. మన వేలి గోళ్లపై నెయిల్ పాలిష్ సరిగ్గా లేకున్నా లేదా తొలగించాలనుకున్నా నెయిల్ రిమూవర్‌ని ఉపయోగిస్తాం. అలానే ఓ చిన్నారి తన వేలి గోళ్లకు నెయిల్ పాలిష్ సరిగా లేదని తొలగించేందుకు నెయిల్ రిమూవర్‌ని ఉపయోగించింది. అంతే అనూహ్యంగా మంటలు చెలరేగి తీవ్ర గాయాల బారినపడింది ఆ చిన్నారి. ఈ దిగ్బ్రాంతికర ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..యూఎస్‌లోని ఓహియోకు చెందిన 14 ఏళ్ల కెన్నడి అనే బాలిక కొవ్వొత్తి దగ్గర కూర్చొని నెయిల్ పాలిష్‌ని తొలగిస్తుంది. తన వేళ్లకు నెయిల్ పాలిష్ సంక్రమమైన రీతీలో లేదని తొలగించాలనుకుంటుంది. అయితే ఆ టైంలో తన మంచానికి సమీపంలో కొవ్వొత్తి కూడా ఉంటుంది. ఒక్కసారిగా ఆ నెయిల్ రిమూవర్ ఆవిరికి సమీపంలోనే కొవ్వొత్తి ఉండటంతో ఒక్కసారిగా భగ్గుమని మంటలు లేచిపోయాయి. దీంతో ఆ చిన్నారి చేతిలోని నెయిల్ పాలిష్ బాటిల్ డబ్ మని పగిలి మంటలు మరింతగా మంటలు వ్యాపించాయి. ఆమెతో సహా అక్కడ ఉన్న వస్తువులన్నీ అంటుకుపోతున్నాయి. ఈ హఠాత్పరిణామానికి బిగ్గరగా కేకలు పెట్టింది. అయితే ఆ టైంలో చిన్నారి తల్లిదండ్రులు వేరే పనిలో ఉన్నారు. కెన్నడీ అరుపుతో ఉలిక్కిపడ్డ తలిదండ్రులు ఆమె బెడ్ రూంలోకి హుటాహుటీనా వెళ్లి చూడగా..గదిఅంతా పొగలు కమ్మి చిన్నారి మంటల్లో చిక్కుకుని ఉంది. వెంటనే వారు స్పందించి..కెన్నడీని చుట్టుముట్టిన మంటలను ఆర్పేసి హుటాహుటీనా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ ఘటనతో తల్లిందండ్రలు గట్టి షాక్‌లోకి వెళ్లిపోయారు. పాపం ఆ చిన్నారి తీవ్రంగా గాయపడటంతో చర్మం చాలా వరకు కాలిపోయింది. పొత్తి కడుపు నుంచి, రెండు తొడలు, ఆమె కుడి చెయ్యికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయా భాగాల్లో ఎక్సిషన్ అనే శస్త్ర చికిత్స చేశారు. ప్రస్తుతానికి ఆమె చేతులు కొంతవరకు నయం అయ్యాయి. మిగతా భాగాలకు అయ్యిన గాయాలు తగ్గి కొత్త చర్మం రావడానికి కనీసం ఏడాదిపైన పడుతుందని వైద్యులు తెలిపారు. అంతేగాదు అవి తగ్గేందుకు కొద్దిపాటి చికిత్స కూడా తీసుకోవాల్సి ఉందని చెప్పారు. ఏదీఏమైనా పిల్లలను ఒంటరిగా వదిలేటప్పుడూ మధ్యమధ్యలో కాస్త గమనించండి. ఎల్లవేళల వారిపై ఓ కన్నేసి ఉంచండి. లేదంటే తెలిసి తెలియన పనులతో ప్రాణాలపైకి తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. (చదవండి: చికూ ఫెస్టివల్ గురించి విన్నారా? ఆ ఫ్రూట్ కోసమే ఈ పండుగ!) -
క్యాండిల్ సిస్టర్స్: చదువుకుంటూనే వ్యాపారవేత్తలుగా..!
వ్యాపారం చేయాలంటే లక్షల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటారు. కానీ, అహ్మదాబాద్ వాసులైన ప్రియాంషి, యశ్వి అక్కాచెల్లెళ్లు ఐదేళ్ల క్రితం తల్లి ఇచ్చిన పాకెట్‌మనీ 2,500 రూపాయలతో జార్ క్యాండిల్స్ తయారీని ప్రారంభించారు. నేడు ఏడాదికి 25 లక్షల టర్నోవర్‌ని సాధిస్తున్నారు. కాలేజీలో చదువుకుంటూనే జాయిస్ బీమ్ క్యాండిల్ వ్యవస్థాపకులుగా, వ్యాపారవేత్తలుగా మారిన ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ‘మా జీవితాల్లో మేమే వెలుగులను నింపుకుంటున్నాం’ అని తమ వెంచర్ గురించి ప్రస్తావిస్తూ ఎన్నో విషయాలను ఇలా మన ముందుంచుతున్నారు. అక్కా చెల్లెళ్లలో ముందుగా యశ్వి మాట్లాడుతూ – ‘అహ్మదాబాద్‌లోని సెయింట్ జేవియర్స్ కాలేజీలో ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ చదివాను. కోర్సులో పారిశ్రామిక శిక్షణా యూనిట్ అనే సబ్జెక్ట్ కూడా ఉంది. ఇందులో మెలకువలు నేర్చుకున్నాను. ఏడాది పొడవునా సీజన్‌కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే వాళ్లం. వీటి ద్వారా మొదట్లో నెలకు వెయ్యి రూపాయలే వచ్చేది. ఆ తర్వాత ఈ పనే ప్రధానంగా చేసుకున్నాం. దీపావళి సమయంలో కొవ్వొత్తులతో పాటు సోప్ సొల్యూషన్స్, లిప్ బామ్‌లు అమ్మేవాళ్లం. చాలా సార్లు పెద్ద కంపెనీలకు, ఇంటింటికీ వెళ్లి ఉత్పత్తులను డోర్ టు డోర్ మార్కెటింగ్ చేసేదానిని. ఈ సమయంలో మా స్వంత కలను గుర్తించాం. కాలేజీ సమయంలో మూడేళ్ల పాటు చేసిన ఈ ప్రయత్నానికి మా అక్క ఆలోచనలు కూడా తోడయ్యాయి. అమ్మ కూడా మాకు సపోర్ట్‌గా నిలిచింది. ఐదుగురితో క్యాండిల్స్ తయారీ ప్రారంభించి, 50 కొవ్వొత్తులను మాత్రమే తయారు చేశాం. వాటిని ఒక ఫెయిర్‌లో ప్రదర్శించాను. అన్ని ఖర్చులు తీసివేస్తే 700 రూపాయల లాభం వచ్చింది. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మా నాన్నకు నచ్చలేదు. ఇరవై ఏళ్లు దాటుతూనే అమ్మాయిలకు పెళ్లిళ్లు చేయడమే ప్రధానంగా భావించేవారు. ఆడపిల్లలు సొంతంగా ఆలోచించడానికి వీలు లేని చోటు. దీంతో నాన్న మమ్మల్ని ఆదుకోలేదు. కానీ, ఈ రోజు మమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. మొదట్లో మా బంధువుల్లో ఫలానా వాళ్ల కూతుళ్లు ఇంట్లో టైమ్ పాస్ చేస్తున్నారు అనుకునేవారు. కానీ, ఈ రోజు మా ఎదుగుదల చూసి బంధువులకు కూడా మా బలం ఏంటో అర్థమైంది. ఆంక్షలు ఉన్నప్పటికీ సాధించాలన్న మా తపనకు అవేవీ అడ్డంకి కాలేదు’ అని వివరిస్తుంది. నిశితంగా పరిశీలన ముడిపదార్థాలను కలపడం, మ్యాజికల్ ఫార్ములాను సెట్ చేయడం యశ్వి చూస్తుంటే, ఆన్లైన్–ఆఫ్‌లైన్ ప్రచారాల మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించే బాధ్యత అక్క ప్రియాంషి తీసుకుంది. తమ ఉత్పత్తుల గురించి ప్రియాంషి మాట్లాడుతూ – ‘మా చేతితో తయారుచేసిన జార్ కాండిల్స్ మాకో ప్రత్యేకతను తీసుకువచ్చాయి. ఆర్గానిక్, నాన్ టాక్సిక్ ముడి పదార్థాలను మాత్రమే ఈ తయారీలో ఉపయోగించడం వల్ల పర్యావరణ అనుకూలమైనవని మా అభిప్రాయం. ఇందుకు మేం గర్వపడుతున్నాం. తయారీ నుంచి ప్యాకేజ్, కస్టమర్లకు మా ఉత్పత్తులను చేర్చడం వరకు ప్రతి దశను నిశితంగా పర్యవేక్షిస్తాం. కచ్చితమైన నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా మా జాడీలను ఎనిమిదిసార్లు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. దీని వల్ల కస్టమర్లకు నాణ్యమైన జార్ క్యాండీలను అందించగలుగుతున్నాం. కొవ్వొత్తులు కేవలం కాంతిని మాత్రమే అందించవు. మేం తయారు చేసే క్యాండిళ్లలోని కంటికి ఇంపైన రంగులు, హాయి గొలిపే పరిమళాలు మనసును ఆనందానికి లోను చేస్తాయి. ఈ పనిలో శ్రద్ధ చాలా కీలకం. నమ్మి చేస్తాం కనుక ఫలితం కూడా చూస్తున్నాం’ అని ఆనందంగా వివరిస్తుంది. ఒక చిన్న ఆలోచనను అమలులో పెట్టి, దానికి సృజనాత్మకతను జోడించి అంచెలంచెలుగా ఎదుగుతున్న ఈ అక్కాచెల్లెళ్లు నవతరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. (చదవండి: కేరళ నుంచి ట్రినిటీ కాలేజీకి) -
Bhavesh Bhatia: చూపున్న విజయం
సంకల్పబలం ఉన్న వారికి ఏదీ అవరోధం కాదు. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్కు చెందిన భవేష్ భాటియాకు కంటి చూపు లేదు. ‘అయితే ఏంటీ’ అనే పట్టుదల తప్ప ‘అయ్యో!’ అని నిరాశ అతడి నోటి నుంచి ఎప్పుడూ వినిపించలేదు. ‘సన్‌రైజ్ క్యాండిల్స్’ పేరుతో క్యాండిల్స్ కంపెనీ ప్రారంభించాడు. ప్రస్తుతం ఇది 350 కోట్ల యాన్యువల్ టర్నోవర్ ఉన్న కంపెనీగా ఎదిగింది, 9,700 మంది అంధులకు ఉపాధి ఇస్తోంది. ‘నువ్వు ఈ లోకాన్ని చూడకపోతేనేం, ఒక విజయం సాధిస్తే ఈ లోకమే నిన్ను చూస్తుంది’ అనే మంచి మాట భవేష్ విజయాలకు ఇంధనంగా పనిచేసింది. భవేష్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ మాత్రమే కాదు మంచి ఆటగాడు కూడా. పారాలింపిక్స్ వివిధ విభాగాల్లో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. భవేష్ భాటియా స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో పోస్ట్ చేశారు. -
అమ్మ బాబోయ్.. ఒకేసారి నోట్లో 150 క్యాండిల్స్ మండించి..
‘లోకోభిన్న రుచి’ అని సామెత. యూఎస్ఏలోని ఇదాహోకు చెందిన డేవిడ్ రష్ అందుకు ఉదాహరణ. రికార్డులంటే పిచ్చి ఉన్న రష్... 250 గిన్నిస్ రికార్డులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అందులో భాగంగా 150 క్యాండిల్స్‌ను నోట్లో పెట్టుకుని మండించాడు. 30 సెకన్లపాటు హోల్డ్ చేసి వరల్డ్ రికార్డు సాధించాడు. గతంలో 105 క్యాండిల్స్‌తో ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. హౌ క్రేజీ అనుకుంటున్నారా! ఈ ఒక్కదానికే... ఇంకా ఇతనికి చాలా రికార్డులున్నాయి. గతంలో 111 టీషర్ట్లు ధరించి హాఫ్ మారథాన్ కూడా చేశాడు రష్. 111 టీషర్టులను ఒంటిపై ఉంచుకుని 2 గంటల 47 నిమిషాల 55 సెకన్లపాటు మారథాన్ చేసి హాఫ్ మారథాన్‌లో అత్యధిక టీషర్టులు ధరించిన వ్యక్తిగా రికార్డు సాధించాడు. అతనికి అన్ని టీషర్టులు తొడగడానికే 25 నిమిషాలు పట్టిందట. చదవండి: కనుగుడ్లను బయటకు పెట్టి చూస్తే గిన్నిస్ రికార్డు -
టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా ర్యాలీలు
సాక్షి, కృష్ణా: విజయవాడకు చెందిన 14 సంవత్సరాల మైనర్ బాలిక ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అఘాయిత్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు చేపట్టింది.టీడీపీ నేత వినోద్ జైన్ అఘాయిత్యానికి నిరసనగా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో మేయర్ భాగ్యలక్ష్మీ, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ ర్యాలీలో కొందరు.. బాలికలు, మహిళలపై టీడీపీ నాయకులు అరాచకాలు నశించాలని ప్లకార్డు పట్టుకుని తమ నిరసనను తెలియజేశారు. -
డియోడ్రెంట్ ఎఫెక్ట్.. బెడ్రూంలో భారీ పేలుడు
లండన్: సాధారణంగా గ్యాస్ లీక్ అవ్వడం, రసాయనాలు, మందుగుండు పదార్థాల వల్ల పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతాయని మనకు తెలుసు. కానీ మనం వాడే డియోడ్రెంట్ వల్ల కూడా పేలుడు సంభవిస్తుందని మీకు తెలుసా. నమ్మశక్యంగా లేకపోయినా ఇది వాస్తవం. చెమట వాసనకు అడ్డుకట్టవేయడం కోసం మనం వాడే డియోడ్రెంట్ వల్ల భారీ పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ వివారలు.. లండన్‌కు చెందిన అట్రిన్ బెమజాది(13) అనే కుర్రాడు లండన్‌లో తన తల్లితో కలసి నివసిస్తుండేవాడు. ఆమె డెంటిస్ట్‌గా పని చేసేది. ఈ క్రమంలో ఓ రోజు అట్రిన్ బయటకు వెళ్లడం కోసం రెడీ అవ్వసాగాడు. దానిలో భాగంగా డియోడ్రెంట్ స్ప్రే చేసుకున్నాడు. (చదవండి: ‘ప్రిన్స్ ఫిలిప్ వీలునామాను మరో 90 ఏళ్లు తెరవకూడదు’) అయితే పొరపాటున ఆ స్ప్రే పక్కనే ఉన్న క్యాండిల్‌ను తాకింది. దాంతో ఒక్కసారిగా పేలుడు సంభవించి.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే.. అక్కడి దృశ్యాలు చూసిన వారికి ఇక్కడేమైనా బాంబు పేలిందా.. ఏంటీ అనిపిస్తుంది. ప్రమాద ధాటికి బెడ్రూం కిటికీలు, తలుపు బద్దలయ్యాయి. (చదవండి: వైరల్ వీడియో : చిన్నారి అభిమానికి రాకెట్ బహుమానం..!) ఈ ప్రమాదంలో అట్రిన్ తీవ్రంగా గాయపడ్డాడు. పక్కరూమ్లో ఉన్న అట్రిన్ సోదరి ప్రమాదాన్ని గమనించి.. అగ్నిమాపక సిబ్బందికి కాల్ చేసింది. వారు సంఘటన స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రస్తుతం అట్రిన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. fire in battersea pic.twitter.com/9Qo8cPQAZf — a Deb (@AkashDe69028264) October 12, 2021 -
క్యాండిల్... ఓ ఎనర్జీ
మాధురీ దీక్షిత్లోని నటికి, డ్యాన్సర్‌కి ఇండియా మొత్తం ఫిదా అయింది. ఇప్పుడు తనలోని మరో ట్యాలెంట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేయడానికి సిద్ధమయ్యారు మాధురి. గాయనిగా తన ప్రతిభను చూపించబోతున్నారు. ‘క్యాండిల్’ పేరుతో ఓ పాట పాడారు మాధురి. ఈ పాటను శనివారం విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ పాట టీజర్‌ను విడుదల చేశారు. ‘‘ఇన్నేళ్లుగా ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు నా నుంచి ఓ చిన్న బహుమానం ఇది. అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ ఓ చిన్న ఆశలాగా, పాజిటివ్ ఎనర్జీలాగా ఈ పాట ఉంటుంది. మనందరం ఈ కష్టాన్ని (కరోనా) కలసి దాటేద్దాం’’ అని ట్వీట్ చేశారు మాధురీ దీక్షిత్. -
ఇంటిప్స్
బర్త్‌డే పార్టీల్లో కొవ్వొత్తులు వెలిగించిన తరవాత, అందరూ వచ్చి కేక్ కట్ చేసేలోపే కరిగిపోతుంటాయి. క్యాండిల్ ఎక్కువ సేపు వెలగాలంటే... ఒక రోజంతా కొవ్వొత్తులను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో గట్టిపడిపోయిన క్యాండిల్ మెల్లగా కరుగుతూ ఎక్కువ సేపు వెలుగుతుంది. మైనం కరిగి కేక్ మీద పడుతుందేమోననే ఆందోళన ఉండదు. బాత్రూమ్లోని అద్దం నీటి ఆవిరితో మసకబారుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే... వారానికోసారి అద్దాన్ని సబ్బు (డ్రై సోప్ బార్) తో రుద్ది ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. పట్టుచీరలకు నూనె మరకలంటితే... మరక మీద మొక్క జొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) చల్లి కొద్దిసేపు అలా ఉంచేయాలి. నూనెను పిండి పీల్చుకున్న తర్వాత పొడిరాలిపోయేటట్లు విదిలించాలి. స్నానానికి వాడిన సబ్బు అరిగి చిన్నదైన తర్వాత దానిని వేడినీటిలో వేసి కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఒక బాటిల్లో పోసి బాగా కదిలించాలి. ఈ లిక్విడ్‌ని హ్యాండ్వాష్గా వాడుకోవచ్చు. -
హోదా నినాదం
-
ప్రత్యేక హోదా కోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. తమిళనాడు ప్రజలు వారి సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏకమై కేంద్రాన్ని ఒప్పించుకున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి ప్రజలు పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపి.. కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
జల్లికట్టుకు ‘మెరీనా’... హోదాకు ‘ఆర్కే’
-
హోదాకోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
జల్లికట్టు ఉద్యమస్ఫూర్తితో ఉధృత పోరాటం వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: తమిళనాడు జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మరింత ఉధృత పోరాటాలకు సిద్ధం కావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పిలుపునిచ్చారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రిపబ్లిక్ డే జనవరి 26వ తేదీన విశాఖపట్నం బీచ్ ఒడ్డున వేలాదిమంది ప్రజలతో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్టు ఆయన వెల్లడించారు. తమిళనాడులోని సాంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును సవాల్ చేసి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగివచ్చి మూడు, నాలుగురోజుల్లో ఆర్డినెన్స్ తెచ్చేలా చేసిన అక్కడి ఉద్యమస్ఫూర్తి ఇక్కడ ప్రత్యేక హోదా కోసం రగలాలని ఆయన ఆకాంక్షించారు. పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ఏపీకి ప్రత్యేక హోదా హామీని అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా అటు బీజేపీ ఇటు టీడీపీ గాలికొదిలేశాయని ఆయన విమర్శించారు. హోదా అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు తనపై ఉన్న కేసుల మాఫీ కోసం కేంద్రం వద్ద సాగిలపడ్డారని ధ్వజమెత్తారు. -
సీపీఎస్ రద్దుకు కొవ్వొత్తుల ర్యాలీ
కాకినాడ సిటీ : రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేయాలని కోరుతూ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నుంచి బాలాజీ చెరువు సెంటర్ వరకు అన్ని శాఖల సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి చింతా నారాయణమూర్తి మాట్లాడుతూ అతి దారుణమైన సామాజిక, ఆర్థిక భరోసా లేని లోపభూయిష్టమైన సీపీఎస్ విధానం వల్ల ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడే పరిస్థితి దాపురించిందన్నారు. 2004 సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమైన ఈ సీపీఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులలో ఇప్పటి వరకూ రాష్ట్రంలో 109 మంది చనిపోయారని, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు అందలేదన్నారు. ప్రభుత్వం వెంటనే వారందరి కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలు అందజేయాలని, కుటుంబ పెన్షన్ వర్తింప చేయాలని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రాట్యుటీ సదుపాయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు తూతిక విశ్వనా«థ్, జిల్లా కమిటీ ఆర్థిక కార్యదర్శి రత్నాకర్, ఉపాధ్యక్షుడు అలీమ్, సత్తిరాజు, భాస్కర్, కార్యదర్శి రమణమూర్తి, కాకినాడ నగర కమిటీఅధ్యక్షుడు జాన్ పాల్ పాల్గొన్నారు. -
స్మార్ట్ కొవ్వొత్తులే ఉద్యమ కాగడాలు
స్మార్ట్ ఫోన్! ప్రపంచాన్ని ఫాస్ట్‌గా నడిపిస్తోంది. మంచికీ, చెడుకు కూడా! ఆ చెడును కడిగేయడానికి కూడా మళ్లీ స్మార్ట్ ఫోనే ఉపయోగపడుతోంది. ఒకప్పుడు.. అన్యాయం జరిగిన చోట అక్రందన ఒక్కటే వినిపించేది. ఇప్పుడు ఆ ఆక్రందనకు ప్రతిధ్వనిగా నిరసన గళం విశ్వమంతా వెలుగెత్తుతోంది. ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ఆ ప్రతిధ్వని, ఆ నిరసన గళం, ఆ ఉద్యమ గమనం యువతవి. దేశ భవితవి! యువత చేతిలోని ‘స్మార్ట్’ కొవ్వొత్తి.. ఉద్యమ కాగడాలను వెలిగిస్తోంది. సమాజంలోని అవకతవకలను, అవకరాలను, అక్రమాలను, అరాచకాలను, దగాలను, దౌర్జన్యాలను, మిహ ళలపై జరిగే లైంగిక దాడులను, అఘాయిత్యాలను బట్టబయలు చేసి, చట్టసభలను షేక్ చేస్తోంది. టచ్ స్క్రీన్‌పై పైపైన కదిలే చేతి వేలు.. వ్యవస్థలోని లోలోపలి లొసుగుల్ని సైతం చీల్చి చెండాడి, దోషుల మెడలో వేసి, గుండు కొట్టి, సున్నం వేసి ఊరేగిస్తోంది. ఇదంతా యూత్ పవర్. యూత్ చేతిలోని ‘స్మార్ట్’ వెపన్ పవర్. జాస్మిన్ విప్లవం ఫేస్బుక్ సంచలనాల్లో జాస్మిన్ విప్లవం ఒకటి. ట్యునీషియాలో పురుడు పోసుకుంది. ట్యునీషియాలోని సిది బౌజిద్ అనే ఊళ్లో బౌజిజి అనే 26 ఏళ్ల కుర్రాడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఓ రోజు దారిలో పోలీసులు అడ్డగించారు. అతడిని వేధించారు. అవమాన భారంతో అప్పటికప్పుడే ప్రభుత్వ అధికార భవనం దగ్గరకు వెళ్లి పెట్రోల్‌తో ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ వార్త రాత్రికిరాత్రే ఫేస్బుక్ ద్వారా ట్యునీషియా యువతకు చేరింది. తెల్లవారే సరికల్లా వేలల్లో జనం ట్యునీషియా వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జైన్ ఎల్ అబిదిన్ బెన్ అలీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఆ ర్యాలీలు, ధర్నాలు దాదాపు 28 రోజుల పాటు కొనసాగాయి. చివరకు అధ్యక్షుడు గద్దెదిగక తప్పని పరిస్థితిని కల్పించాయి. ఈజిప్టు ఉద్యమం వేల్ గోనిమ్ 29 ఏళ్ల కుర్రాడు. గూగుల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి. అనుకోకుండా 2010 జూన్ 8వ తేదీన ఫేస్బుక్లో ఒక ఫొటో అతడి దృష్టిని కట్టిపడేసింది. అది దవడ ఎముక విరిగి, రక్తమోడుతున్న యువకుడు ఖలేద్ మహమ్మద్ సయ్యద్ ఫొటో. అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు వచ్చిన ఖలేద్‌ను ఈజిప్టు పోలీసులు కొట్టి కొట్టి చంపేశారు. హృదయాన్ని పిండేసే ఆ చిత్రాన్ని చూసిన గోనిమ్ ఊరుకోలేకపోయాడు. ఫేస్బుక్ పేజీ ఓపెన్ చేసి ఖలేద్ ఫొటో పెట్టి, పోలీసుల అమానుషం మీద కామెంట్ పోస్ట్ చేశాడు. రెండు నిమిషాల్లో 300 మంది తోడయ్యారు. మూడు నెలల్లో ఆ సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. అందరూ కలిసి ఈజిప్టు డౌన్‌టౌన్‌లోని తెహ్రిర్ స్క్వేర్‌లో ర్యాలీ చేశారు. అదో చారిత్రక విప్లవ ప్రదర్శన. దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్ పదవికి రాజీనామా చేసే వరకు అది చల్లారలేదు. విప్లవస్థాయి గల ఈ రెండు ఉద్యమాలకు; మనదేశంలోని నిర్భయ, వేముల రోహిత్ ఘటనల్లోని నిరసన ధ్వనులకు ఊపిరి యువశక్తి, ఆ యువత అందిపుచ్చుకున్న స్మార్ట్ టెక్నాలజీ. ఒకప్పుడు ఉద్యమం ఒకరి నుంచి వంద మందికి.. వంద నుంచి వేలకు.. వేల నుంచి లక్షకు చేరాలంటే కొన్ని వారాలు నెలలు పట్టేది. ఇప్పుడు... స్మార్ట్ ఫోన్లో క్షణాల్లో లక్షల మందిని చేరుతోంది. మొన్నటి వికీలీక్స్, నిన్నటి పనామా సమాచారం.. ఆలోచన, ఆవేశం కలగలిసిన యువకుల వల్ల, ఆయుధం లాంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచాన్ని కదిలించిన ఉద్యమాలే. యువ ప్రపంచం ప్రపంచంలో ఇప్పుడు పాతికేళ్ల వయసులో ఎంత మంది ఉన్నారో తెలుసా? సుమారు 43 శాతం. వీరంతా డిజిటల్ వరల్డ్‌లో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలను నూటికి నూరు శాతం వాడుతున్నారు. ఈ వాడకంతో సమాజానికి ఎంతో మేలు జరుగుతోంది. ఫిలిప్పీన్స్‌లో యువకులు స్కూళ్లలో సమస్యల మీద స్మార్ట్‌గా ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘చెక్ మై స్కూల్ ఓఆర్‌జి’ వెబ్సైట్ తెరిచారు. తమ తమ స్కూళ్లలో కొరవడిన సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ వివరాలను ఫేస్బుక్, ట్విట్టర్లలో విశేషంగా వ్యాప్తిలోకి తెచ్చారు. ఇతర స్కూళ్లలో ఏయే వసతులున్నాయి, తమ స్కూల్లో ఏం లేవనేది కూడా తెలుసుకున్నారు. వాటి కోసం ఉద్యమించి సాధించుకుంటున్నారు. తాము చదివి వచ్చిన పాఠశాలల కోసం వారు చేస్తున్న సేవా ఉద్యమం అది. ఇదే స్మార్ట్ స్ఫూర్తిని.. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా యువత కొనసాగించాలి. చట్టాలకన్నా, అధికారాల కన్నా, ప్రజా ప్రతినిధులకన్నా శక్తిమంతమైనది యువతరం. ఆ యువతరం అనుక్షణం మహిళలకు, బాలికలకు అండగా ఉండాలి. -
నక్షత్రాలను పూచిన క్షిపణులు
‘‘యుద్ధంలో తుపాకీ పేల్చడం కంటే, ఒక క్రిస్మస్ చెట్టు దగ్గర కొవ్వొత్తి వెలిగించడమే ముఖ్యం’’. - కెప్టెన్ నిమానీ, సాగ్జన్ (జర్మనీ పదాతిదళం) భూగోళం మీద ఎన్నో యుద్ధాలు జరిగాయి. కానీ మొదటి ప్రపంచయుద్ధం అన్ని యుద్ధాల వంటిది కాదు. క్రైస్తవం రూపుదిద్దుకున్న తరువాత ఎన్నో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. కానీ మహాయుద్ధం వేళ, రణభూమిలో జరిగిన ఆ ఒక్క క్రిస్మస్ పండుగను చరిత్ర మరచిపోలేదు. అందుకే, డిసెంబర్ 25, 1914 న జరిగిన ఆ మహోన్నత ఉత్సవం గురించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రపంచం మొత్తం స్మరించుకుంటోంది. ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్. రక్తాన్ని గడ్డకట్టించే చలిలో, మసక వెన్నెట్లో పుప్పొడిలా కురుస్తోంది మంచు. క్రిస్మస్ రాత్రికి సరైన వాతావరణం. అంతటి యుద్ధంలోనూ బెల్జియం శివారు ప్రాంతంలో ధ్వంసం కాకుండా మిగిలిన ఆ చర్చి నుంచి హఠాత్తుగా గంటల మోత లీలగా వినిపించింది. దాని కోసమే ఎదురు చూస్తున్న ఆ చుట్టుపక్కల కందకాలలోని మిత్రరాజ్యాల (ఇంగ్లండ్, దాని మిత్రులు)సైనికులు ఒక్కసారిగా మోకాళ్ల మీద వంగి ప్రార్థించారు, ఆ చిమ్మ చీకట్లోనే. అప్పుడే, త్రిరాజ్య కూటమి కందకాలలో అంటే జర్మన్లు, వాళ్ల మద్దతుదారుల కందకాలలో ఏదో కలకలం. ఒళ్లు ఝల్లుమంది, ఇంగ్లిష్ వారి సేనలకీ మిత్ర దేశాల సేనలకీ. మనసు కీడును శంకిస్తున్నా ఆయుధం అందుకోవడానికి చేయి రావడం లేదు. ట్రెంచ్కోటు జేబులో ఉన్న ‘కొత్త నిబంధనలు’ పుస్తకం మీద చేయి వేసి, ప్రభూ! ఇవాళయినా యుద్ధం లేకుండా చూడు! మనిషిని మనిషి చంపుకునే క్రూరత్వం నుంచి కొన్ని ఘడియలైనా ఈ మనుషుల్ని రక్షించు!’ అనుకున్నాడు స్కాట్ సోల్జర్ ఆల్ఫ్రెడ్ ఆండర్సన్. యుద్ధానికి వస్తుంటే తల్లి ఆశీర్వదించి ఇచ్చిన బైబిల్ అది. ఆ తరువాత జరిగిన కథే చరిత్రలో ఓ అద్భుతం. అందుకే మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులు తమ ఉత్తరాలలో, డైరీలలో ఈ ఘట్టం గురించి ఇలాంటి వర్ణనలు ఎన్నో చేశారు. నో మ్యాన్స్ల్యాండ్లోనే వెస్ట్రన్ ఫ్రంట్‌లో ఫ్రిలింఘీన్ అండ్ హూప్లైన్స్ సెక్టర్లో అనేక చోట్ల క్రిస్మస్ పండుగ జరిగింది. ఆ ప్రాంతాన్నే ఫ్లాండర్స్ అని పిలుస్తారు. ఇది ఫ్రాన్స్ సరిహద్దుకు కాస్త దూరంగా, బెల్జియంకు దగ్గరగా ఉంటుంది. అక్కడే సాగ్జన్ల కందకం, స్కాట్ల కందకం, కొన్ని గజాల దూరంలో జర్మన్లదీ, బ్రిటిష్ వాళ్ల కందకాలూ ఎదురెదురుగానే ఉండేవి. జర్మన్ల కాల్బలమే సాగ్జన్లు. ఇంగ్లిష్ సేనలో భాగం స్కాట్లు. వెస్ట్రన్ ఫ్రంట్ పోరాట రేఖ పొడవునా ఇదే పద్ధతి. బెల్జియం రేవు పట్టణం ఓస్టెండ్ నుంచి, పశ్చిమ ఫ్రాన్సు వరకు, అంటే ఇంగ్లిష్ చానల్ వరకు- చూస్తూ చూస్తూ ఉండగానే అలా ఏడు వందల కిలోమీటర్ల పోరాట రేఖ తయారయింది. దీనికే పశ్చిమ రంగమని జర్మనీ పేరు పెట్టింది. రాయల్వెల్ష్, నార్త్ఫోక్ రెజిమెంట్, వార్విక్ రెజిమెంట్- లక్షా అరవై వేల బ్రిటిష్ సేన , లక్షా ముప్పయ్ ఎనిమిదివేల వలస భారత సేన ఫ్లాండర్స్‌లో ఉండి యుద్ధం చేశాయి. ఫ్రెంచ్ రష్యా, బెల్జియం, సెర్బియా, గ్రీస్, కెనడా, పోర్చుగీస్ సేనలు ఉన్నాయి. అవతలి వైపున జర్మనీతో పాటు, సాగ్జన్లు, ఆంగ్లో సాగ్జన్లు, బవేరియా, ఆస్ట్రియా సేనలు మోహరించాయి. ఈ సేనల కందకాల మధ్య దూరం కొన్ని కొన్ని చోట్ల 60 గజాలు కూడా లేదు. కందకాల మధ్య ఖాళీ స్థలాన్నే న్యో మ్యాన్స్ ల్యాండ్ అంటారు. దాదాపు పాతిక కిలోమీటర్ల మేర క్రిస్మస్ వేడుకలు జరిగాయి. చాలాకాలం రహస్యంగా ఇంత గొప్ప చారిత్రక ఘట్టం వెంటనే వెలుగు చూడలేదు. బ్రిటన్‌కు చెందిన రాయిటర్ వార్తా సంస్థ ప్రచురణను నిలిపివేసింది. కానీ న్యూయార్క్ టైమ్స్ అదే జనవరిలో ఈ సంచలన కథనం ప్రచురించింది. తరువాత సైనికులు ఇళ్లకు రాసిన ఉత్తరాల ద్వారా కొంత వెలుగులోకి వచ్చింది. కానీ ఇప్పుడు దీని గురించి తెలిసిన వారంతా నేటి ప్రపంచానికి ఈ ఘట్టం గొప్ప సందేశాన్ని ఇవ్వగలుగుతుందని చెబుతున్నారు. అంకురార్పణ మొదటి ప్రపంచ యుద్ధం (1914-1918)లో పోరాడుతున్న దేశాలలో ఒకటి రెండు మినహా మిగిలినవి క్రైస్తవాన్ని పాటించేవే. కాబట్టి క్రిస్మస్కైనా (యుద్ధం ఆరంభమైన తరువాత వచ్చిన తొలి క్రిస్మస్) కాల్పుల విరమణ పాటించాలని డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనెడిక్ట్ పిలుపునిచ్చారు. ఆయనైనా ఆ ప్రకటన వరకే పరిమితమైనారు. యుద్ధ కండూతితో వేగిపోతున్న దేశాధినేతలు ఒక మతాధిపతి మాటను మన్నిస్తారని పోప్ భ్రమలు పెట్టుకోలేదని తెలుస్తూనే ఉంది. కానీ రెండు వైపుల సైనికులు, ముఖ్యంగా జర్మన్లు, బవేరియన్లు, సాగ్జన్లు పండుగ జరుపుకోవాలని పట్టుదలగా ఉన్నారు. దీనిని ముందే పసిగట్టిన బ్రిటిష్ ఎక్స్‌పెడిషనరీ సేనల అధిపతి ఫీల్డ్ మార్షల్ జాన్ డెంటన్ పింక్‌స్టోన్ ఫ్రెంచ్ (సర్ జాన్ ఫ్రెంచ్) తన సేనలకు పాల్గొనవద్దంటూ కచ్చితమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ కింది స్థాయిలో ప్రయత్నాలు చాలా తీవ్రంగానే జరిగాయి. పైగా క్రిస్మస్కల్లా యుద్ధం ముగిసిపోతుందనీ, తామంతా ఇళ్లకు చేరుకుంటామనీ సైనికులు నమ్మారు. సొంత కుటుంబాల నుంచి వచ్చి పడిన క్రిస్మస్ కానుకలు యుద్ధరంగంలో పండుగ వాతావరణాన్ని సృష్టించాయి. బ్రిటిష్ సేనలో సెకండ్స్కాట్స్ దళానికి చెందిన లెఫ్టినెంట్ ఎడ్వర్ట్ హూల్సేకు జర్మనీ నాయకత్వంలోని త్రిరాజ్య కూటమికి చెందిన నిమానీ అనే కెప్టెన్ క్రిస్మస్కు నాలుగు రోజుల ముందు మర్కర్ అనే స్కౌట్ కుర్రాడి చేత రహస్యంగా చిన్న ఉత్తరం పంపాడు. మర్కర్ స్కాట్లాండ్వాడే. క్రిస్మస్ రోజు కాల్పుల విరమణ గురించి ఆలోచించమని నిమానీ కోరాడు అందులో. ఆ అద్భుత వేకువలో బెల్జియం శివారు ప్రాంతంలోని ఆ చర్చి నుంచి గంటలు వినపడిన తరువాత చినుకుల్లా మొదలైన వర్షం ఆ లిప్తలోనే కుంభవృష్టిలా మారినట్టు ఆ కలకలారావం విస్తరించింది. కానీ కాస్త శ్రద్ధగా విన్న తరువాత అది కలకలం కాదని అనిపించింది. కొన్నివేల గొంతులు ఒకేసారి పలుకుతున్నట్టు ఉంది. దాడి కాబోలునని బ్రిటిష్ సైనికులు అనుమానించారు. కానీ అది ఏదో పాటలాగా ఉంది. ‘సిల్లేనాట్, హిలీజ్ నాట్...’ జర్మన్ పాట, బాణీ మాత్రం ఐరోపా అంతటికీ చిరపరిచితం. అది క్రిస్మస్ నాడు పాడే ‘సెలైంట్ నైట్ ...’ బాణీ. మిత్రరాజ్యాల కందకాలలో ఎక్కడో ఏదో బృందం కూడా పాట అందుకుంది. పాట పూర్తయిందో లేదో, క్రిస్మస్ తాత వేషంలో ఉన్న జర్మనీ పదాతి దళ సభ్యుడు ఒకరు బ్రిటిష్ వాళ్ల ప్రధాన కందకానికి దగ్గరగా వచ్చి ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. కందకం నుంచి బ్రిటిష్ సైనికులు కూడా బయటకు వచ్చారు. అతడి చేతిలో ఒక బోర్డు గజిబిజి ఇంగ్లిష్‌లో -‘ఉయ్ నో షూట్’, యూ నో షూట్’ అనివుంది. అప్పుడు సైనికాధికారులు మాట్లాడుకున్నారు. నో మ్యాన్స్ ల్యాండ్ దగ్గర నుంచి జర్మన్ సైనికులు బ్రిటిష్ వారిని సాదరంగా స్వాగతించారు. పండుగ జరుపుకోవడానికి నిర్ణయమైపోయింది. చుట్టుపక్కల కందకాల నుంచి జర్మన్లు, ఇంగ్లిష్ వాళ్లు, సాగ్జన్లు, స్కాట్లు వచ్చి చేరారు. కొన్ని నిమిషాలలోనే నో మ్యాన్స్ ల్యాండ్ వేలమందితో నిండిపోయింది. చాలా మంది చేతిలో ధగధగలాడుతున్న చైనా లాంతర్లు, కొవ్వొత్తుల మాదిరిగా వారి మొహాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. సైనికాధికారుల కరుకు శాసనాలను ధిక్కరించి వచ్చామన్న భయం ఏ కోశానా కనిపించలేదు. ఒకరినొకరు కౌగిలించుకున్నారు. కరచాలనాలు చేసుకున్నారు. నిజానికి యుద్ధరంగంలో శత్రువుతో చేయి కలిపితే శిక్ష మరణదండనే! అది ధిక్కారం. ఏ స్థాయి అధికారినైనా, సైనికుడినైనా ఇందుకు పాల్పడితే వేకువ కాల్పులలో చంపుతారు. థామస్ హైగేట్ అనే ఒక సైనికుడిని ఆ సెప్టెంబర్‌లో అదే శిక్ష వేసి కాల్చి చంపారు కూడా! అప్పటికే సిద్ధం చేసి పెట్టిన పెద్ద కట్టెల గుట్టకు నిప్పు పెట్టాడొక సాగ్జన్ సోల్జరు. లాంతరు మూత తెరిచి కెనడా సైనికుడొకరు ఆముదం పోశాడు. కొద్దిసేపటికే మంటలు పైకి లేచాయి. ఒక జర్మనీ సోల్జరు పెద్ద పెట్టెతో కేకులు తెచ్చి అందరి నోటికి అందించాడు. మరో పక్క ఒక బెల్జియం సోల్జరు ఇంకో పెద్ద పెట్టెతో డ్రైఫ్రూట్స్ తెచ్చి అందరికీ పంచాడు. కొందరు బీరు సీసాలు తెచ్చారు. స్కాట్ సోల్జర్లు బ్యాగ్‌పైప్‌లు మోగిస్తూ అక్కడకి వచ్చారు. వెంటనే రెండువైపుల వారి మిలటరీ బ్యాండ్లు క్రైస్తవ గీతాలను మోగిస్తూ వచ్చాయి. కొందరు మౌతార్గన్లు మోగిస్తుంటే, ఇంకొందరు మంట చుట్టూ నిలబడి క్రైస్తవగీతాలు అందుకున్నారు. పారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానీర్ మంట ఎదుట నిలబడి పాట అందుకున్నాడు- ‘ఓ హోలీ నైట్...’. ఆ ప్రాంతం మొత్తం గానంలో ఓలలాడిపోయింది. పెను వైరాగ్యం మంట నెమ్మదిగా శాంతించింది. కొద్దిగా వెలుగు వచ్చింది. వాద్యగోష్టి మౌనం దాల్చింది. అప్పుడు కనిపించిన దృశ్యాన్ని దగ్గర నుంచి ప్రతి సైనికుడు తనను తాను అసహ్యించుకున్నాడు. అడుక్కో శవం. కుళ్లి ఉబ్బిన శవాలు, కాళ్లు తెగినవి, షెల్ దెబ్బకు తెగి చెట్లకు వేలాడే అవయవాలు... నగ్నంగా వున్నవీ, ఎలుకలు కొరికేసినవీ, పదిహేనేళ్ల బాల సైనికుల శవాలూ, పాతికేళ్ల యువకుల శవాలూ, నలభయ్లలో ఉన్న వాళ్ల శవాలూ! ముందు అనుకున్నట్టే జర్మనీ వైపు శవాలని వారి సైనికులు, ఇంగ్లండ్ వైపు యుద్ధం చేస్తూ కన్నుమూసిన వారి శవాలని వీరు బెల్జియం శివార్లలో ఒకచోటికి చేర్చారు. ఒక దాని పక్కన ఇంకొకటి - పద్ధతి ప్రకారం గోతులు తవ్వించారు. ప్రతీ గోతిలోను ఒక శవం ఉంచి, సామూహికంగా ప్రార్థించి పూడ్చి పెట్టారు. ఆ తరువాత ఎవరి కందకాలలో వాళ్లు ఆదరాబాదరా స్నానాలు ముగించారు. దుస్తులు మార్చుకున్నారు. పదిన్నర ప్రాంతంలో స్కాట్ల కందకంలో ఎవరో లేచి బైబిల్ నుంచి కొన్ని స్తోత్రాలు చదివారు. అప్పుడే జర్మన్లు పంపించిన మాంసం కూర వచ్చింది. ఇక్కడ నుంచి మద్యం అక్కడికి వెళ్లింది. అప్పటికి బాగా ఎండొచ్చింది. నేల కొంచెం ఆరింది. మిత్రుల, ఆప్తుల, సహోద్యోగుల అంత్యక్రియలతో బరువెక్కిన ఇరువైపు సైనికుల మనసులు తేలికపడ్డాయి. అనుకున్నట్టే గంటన్నర తరువాత అంతా నో మ్యాన్స్ ల్యాండ్‌కి వచ్చారు. శాంతి కపోతాల దర్శనం అప్పటి దాకా కొంచెం దూరం నుంచి నో మ్యాన్స్ ల్యాండ్ మీద కనిపించిన దృశ్యాన్ని చూసిన అందరి ముఖాల మీద చిరునవ్వు విరిసింది. తోటి సైనికుల మృతదేహాలను ఖననం చేసిన తరువాత ఆవహించిన వైరాగ్యం ఒక్కసారిగా బద్దలైంది. గడచిన ముప్పయ్, ముప్పయ్ అయిదు గంటల నుంచి అసలు పేలుడే లేదు. ఎక్కడ నుంచి వచ్చాయో వందల పావురాలు. వేకువన సైనికులు పడేసిన కే కు, చాక్లెట్ ముక్కలనీ, ఇతర తినుబండారాలనీ తాపీగా పొడుచుకుని తింటున్నాయి. కానుకలు, కళలు మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికులలో రకరకాల రంగాలవారు, నిపుణులు, కళాకారులు, క్రీడాకారులు ఉన్నారు. మ్యాజిక్ బాగా తెలిసిన ఓ జర్మనీ సోల్జరు తన ప్రతిభను చూపితే, నిజ జీవితంలో బార్బర్ అయిన ఒక బ్రిటిష్ ఆ కాసేపు తాత్కాలిక సెలూన్ తెరిచి తల ఒక్కింటికి రెండు సిగరెట్ల రుసుం తీసుకుని వేణీసంహారం గావించాడు. ఎలా పట్టుకొచ్చారో కొందరు సైనికులు తాము కొట్టి తెచ్చుకున్న పందిని సరదాగా కాలుస్తున్నారు. అక్కడే కనిపించిన ఒక జర్మన్ సోల్జర్ని చూసి ‘నీవు లండన్‌లో వెయిటర్‌గా పని చే శావ్ కదా’ అని అడిగాడు ఒక ఇంగ్లిష్ అధికారి. ‘ఔన’న్నాడతడు, జర్మన్ యాసతో ఇంగ్లిష్‌లో. ఈ వాస్తవాన్ని 2003లో తాను రాసిన పుస్తకం ‘పెద్ద యుద్ధంలో చిన్న ఘట్టం’ (క్రిస్మస్ శాంతి ఒప్పందమే ఇతివృత్తం) అనే పుస్తకంలో మైఖేల్ జ్యూర్గ్ అనే జర్మన్ నమోదు చేశాడు. యుద్ధం మొదలు కావడానికి ముందు ఇంగ్లండ్‌లో ఎనభయ్ వేల మంది జర్మన్లు ఉన్నారు. చాలామంది చక్రవర్తి విల్హెల్మ్ పిలుపు అందుకుని సైన్యంలో చేరినవాళ్లే. కానీ వాళ్ల కుటుంబాలు మాత్రం యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో కూడా అక్కడే ఉన్నాయి. నిజానికి ఇంగ్లిష్ మాట్లాడడం వచ్చిన కొందరు జర్మన్ల వల్లనే ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మధ్యాహ్నం వారందరికీ ఎంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడారు. వెదురుబొంగులను నిలిపి, తమ టోపీలతో గోల్‌పోస్ట్‌ను తయారు చేసుకుని, చిత్తడిగా ఉన్న ఆ నేలతోనే ఆట ఆడారు. ఇందులో 3:2 స్కోరుతో జర్మనీ విజయం సాధించింది. కానీ యుద్ధంలో అది ఓడిపోయింది. అలాగే యుద్ధరంగంలో పావురాలు ఎగిరే దృశ్యాన్ని చూసే అవకాశం సైనికాధికారులు మళ్లీ ఎప్పుడూ రానివ్వలేదు. యువరాణి క్రిస్మస్ కానుక చరిత్ర ఎరుగని ‘గ్రేట్‌వార్’కు వెళ్లిన బ్రిటిష్ సేనలకీ, వలస దేశాల సైనికులకీ క్రిస్మస్ పర్వదినాన ప్రత్యేకమైన కానుకను అందించాలని యువరాణి మేరీ ఆలోచించింది. బ్రిటిష్ చక్రవర్తి ఐదో జార్జి, రాణి మేరీల కుమార్తె ఈమె. వెంటనే ఇంగ్లండ్ జాతీయ పత్రికలలో నవంబర్, 1914లో ఒక ప్రకటన వెలువడింది. ‘సెయిలర్స్ అండ్ సోల్జర్స్ క్రిస్మస్ ఫండ్’ పేరుతో వచ్చిన ఈ ప్రకటనలకి అనూహ్య స్పందన వచ్చింది. 1,62,591 పౌండ్లు వచ్చి పడ్డాయి. ‘సముద్రం మీద ఉన్న ప్రతి నావికుడికీ, సమరభూమిలో ఉన్న ప్రతి సైనికుడికీ’ ఈ కానుక అందాలని యువరాణి భావించింది. కుప్పతెప్పలుగా వచ్చిన నిధులను బట్టి ‘కింగ్స్ యూనిఫారమ్’ ధరించిన వారితో (సైనికులు, నావికులు) పాటు యుద్ధం పనులకు సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికీ, డాక్టర్లకీ, నర్సులకీ, మరణించిన సైనికుల భార్యలకూ లేదా ఇతర కుటుంబ సభ్యులకూ కూడా ఈ కానుక అందించాలని నిర్ణయించారు. ఇలాంటి వారు - 2,62,019 5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 1.5 అంగుళాల ఎత్తు ఉన్న ఈ ఇత్తడి పెట్టెలను యాడ్స్హెడ్ అండ్ రామ్సే సంస్థ సుందరంగా రూపొందించింది. 4,26,000 పెట్టెలు తయారు చేయడానికి సన్నాహాలు చేశారు. అవసరమైన ఇత్తడిని అమెరికా నుంచి (అప్పటికి ఆ దేశం యుద్ధంలో దిగలేదు) దిగుమతి చేసుకున్నారు. మూత మీద యువరాణి మేరీ శిరస్సు బొమ్మను ఉబ్బెత్తుగా అచ్చువేశారు. బొమ్మకు అటు ఇటు ఆమె పేరుతో ఇంగ్లిష్ అక్షరం ‘ఎం’ అని ముద్రించారు. జర్మనీకి వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న బెల్జియం, జపాన్, మాంటెనీగ్రో, ఫ్రాన్స్, రష్యా పేర్లు కూడా నలుమూలలా అచ్చువేశారు. ‘జాతి అందిస్తున్న అపురూప కానుక’ అంటూ డిసెంబర్ 25, 1914 నాటికి దిగ్విజయంగా 3,55,000 పేటికలను అందించగలిగారు. మిగిలినవి సకాలంలో ఉత్పత్తి చేయలేకపోవడంతో 1915, 16 వరకు కూడా యుద్ధభూమికి వస్తూనే ఉన్నాయి. ఆఖరికి ఈ కానుక అందలేదని 1919లో కూడా వాపోయినవారు ఉన్నారు. ఇంతకీ ఈ పెట్టెలో ఏం ఉన్నాయి? మూడు, నాలుగు రకాల స్థాయిలుగా విభజించి, అందుకు తగ్గట్టు కొన్ని వస్తువులు పెట్టారు. ఆఫీసర్ హోదా కలిగిన వారికి అందించిన పెట్టెలలో ఒక పైప్, ఔన్స్ పొగాకు, 20 సిగరెట్లు, లైటర్ ఉన్నాయి. పొగతాగని వారి కోసం సిగరె ట్లు, పొగాకు స్థానంలో పెన్సిల్, స్వీట్ ప్యాకెట్ పెట్టారు. భారత సిపాయీలకి స్వీట్లు, సుగంధ ద్రవ్యాల పెట్టెలు అందాయి. నర్సులకి పూర్తిగా చాక్లెట్లు పెట్టిన పెట్టెలు ఇచ్చారు. రాచ కుటుంబం పేరు మీద క్రిస్మస్ శుభాకాంక్షలు, యుద్ధంలో విజయం సాధించాలంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసే గ్రీటింగ్ కార్డు మాత్రం అన్ని పెట్టెలలోనూ ఉంచారు. వేదిక ఎక్కబోతున్న జ్ఞాపకం మొదటి ప్రపంచ యుద్ధ ఘట్టాలను ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల గుర్తు చేసుకుంటున్నారు. స్ట్రాట్ఫోర్ట్ అపాన్ ఎవాన్‌లో జరగబోయే ప్రదర్శన అలాంటిదే. విలియం షేక్స్పియర్ పుట్టిన ఈ ప్రాంతంలో ఆయన పేరు మీదే ఏర్పాటు చేసిన షేక్స్పియర్ రాయల్ థియేటర్లో క్రిస్మస్ శాంతి ఒప్పందం ఇతివృత్తంగా ఒక నాటకం వేదిక ఎక్కబోతున్నది. మొదటి ప్రపంచంలో పాల్గొన్న వార్విక్ సైనికులే పాత్రలుగా ఈ నాటకం రూపొందుతోంది. ఈ ప్రాంతంలోనే పుట్టి ఆ యుద్ధంలో పాల్గొన్న కెప్టెన్ రాబర్ట్ హ్యామిల్టన్ అక్షరబద్ధం చేసిన కొన్ని అనుభవాల ఆధారంగా ఫిల్ పోర్టర్ అనే నాటకకర్త రాసిన నాటకమిది. మొదటి ప్రపంచ యుద్ధం నూరేళ్ల సందర్భంగా జరప తలపెట్టిన కార్యక్రమాల గురించి చర్చించడానికి మొన్న మార్చిలో ఏర్పాటు చేసిన ఒక సమావేశమే ఫిల్కు ఈ నాటకం రాయడానికి ప్రేరణ ఇచ్చింది. మహాయుద్ధంలో పాల్గొన్న సైనికుల వారసులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కుటుంబాలకు ఆ సైనికులు చెప్పిన జ్ఞాపకాలనూ, రాసిపెట్టిన కథనాలనూ ఈ సమావేశంలో వారంతా వినిపించారు. - డా. గోపరాజు నారాయణరావు -
స్మరణ త్రయోదశి...దీపాల చతుర్దశి
దీపం అంటే వెలుగు. దీపావళి అంటే వెలుగుల వరుస. సాధారణంగా దీపావళిని ఒకరోజు లేదా రెండురోజుల పండుగగానే జరుపుకుంటారు కానీ, నిజానికి ఇది మూడురోజుల పండుగ. మొదటిరోజు బలిత్రయోదశి (దీనినే ఇటీవల ధనత్రయోదశిగా జరుపుకుంటున్నారు). రెండవరోజు నరక చతుర్దశి, మూడవరోజు దీపావళి అమావాస్య. బలిత్రయోదశి: ఈ రోజు ఉదయమే తలస్నానం చేసి మన ఇంటిలో, మన బంధువర్గంలో, అలాగే మనకి జీవితంలో స్థిరపడేందుకు సహాయం చేసిన ఆప్తమిత్రులు, మనకి చక్కటి విద్యాబోధన చేసి, మంచి బుద్ధినిచ్చి, ఇంతటి వాళ్లనుగా తీర్చిదిద్దిన గురువులు లేదా పెద్దలు, మన శ్రేయోభిలాషులను గుర్తు తెచ్చుకోవాలి. వారిలో ఎవరెవరు గతించారో, వారిని పేరు పేరునా తలచుకుంటూ, వారిని మన కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తూ వాళ్లు మనకి చేసిన సహాయాన్ని వివరిస్తూ, ఒక్కొక్కరి పేరున ఒక్కొక్క దీపాన్ని పూజామందిరం వద్ద వెలిగించాలి. జంతువుల కొవ్వుతో చేసిన కొవ్వొత్తి కాకుండా ప్రమిదలో నూనె పోసి, వత్తిని వెలిగించిన దీపాన్ని మాత్రమే వెలిగించాలి. ఇలా దీపాలని వెలిగించాక యోగ్యుడైన ఒక విప్రుడిని లేదా పండితుడిని పిలిచి, వీటన్నింటినీ పెట్టినందుకు సాక్ష్యంగా మరో దీపాన్ని వెలిగించి, ఆ దీపాన్ని ఆయనకు దానం చేయాలి. ఈ దీపాలనే బలిదీపాలు అంటారు. వీటిని త్రయోదశినాడు పెడతారు కాబట్టి ఈ రోజును బలిత్రయోదశి అని కూడా అంటారు. అపమృత్యుదోషాన్ని పోగొట్టుకునేందుకు ఈ రోజున యమరాజు ఉండే దక్షిణ దిక్కుగా ఒక దీపాన్ని ఉంచాలి. దీనినే యమదీపం అని కూడా అంటారు. రెండవరోజు నరక చతుర్దశి: ఆదివరాహ రూపంలో ఉన్న శ్రీహరికీ, భూదేవికీ జన్మించిన వాడు నరకుడు. నరాన్ కాయతే ఇతి నరకః అంటే ప్రజలను కాల్చుకుతినేవాడు అని ఈ నరకపదానికి అర్థం. లోకంలో భూదేవికి మించిన సహనం కలవాళ్లెవరూ లేరు. అంటే భూదేవి అంటే... నరకుని తల్లి, తన కుమారుడు ప్రజలను పెట్టే బాధలని చూడలేక, భరించలేక భర్తయైన శ్రీహరితో న రకుణ్ణి వధించి లోకాలని రక్షించవలసిందిగా మొరపెట్టుకుంది. అప్పుడు శ్రీకృష్ణుని అవతారంలో ఉన్న శ్రీహరి, సత్యభామావతారంలో ఉన్న భూదేవితో కలసి వెళ్లి న రకుడిని సంహరించాడు. దీనినే నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఇందుకు ప్రతీకగా ఆ నరకుని బొమ్మను పనికిరాని కర్రలు, గుడ్డముక్కలతో తయారు చేయించి పిల్లలందరినీ తల్లిదండ్రులు తెల్లవారుజామునే లేపి, దాన్ని కాల్పిస్తూ, ఈ కథని వాళ్లకి బాగా అర్థమయ్యేలా వివరించాలి. పిల్లలుగా ఉన్నప్పుడు మనం చేసే నీతిబోధ వారిలో బాగా నాటుకుంటుంది. కాబట్టి, ఇతరులని ఏడిపించరాదనీ, ఐకమత్యంతో ఉండి పరస్పరం సహకరించుకుంటూ ఉండాలనీ, ఈ పండుగలోని నరకాసుర దహన కాలంలో మనం బోధించాలి. గంగాస్నానం: గంగాస్నాన ఫలం అందరికీ లభించే అవకాశం ఉన్న ఒకే ఒక్కరోజు నరక చతుర్దశి. ఈ రోజు పిల్లలందరికీ నువ్వుల నూనె ఒంటినిండుగా పట్టించి కొంతసేపు నాననిచ్చి, ఆ మీదట సున్నిపిండితో నలుగు పెట్టి, కుంకుడురసంతో తలస్నానం చేయించాలి. అనంతరం తలచుట్టూ ఆనప (సొర) లేదా ఆముదపు తీగలతో ముమ్మారు తిప్పి, దృష్టిదోషాన్ని తీసివేయాలి. ఆ తర్వాత పెద్దలు కూడా ఇదేవిధంగా అభ్యంగన స్నానం చేయాలి. ఈ వేళ ప్రతి ఒక్కరూ తమ బంధుమిత్రులను ‘నరక చతుర్దశీ గంగాస్నానం అయిందా?’ అని ప్రశ్నించుకోవాలని చెప్పింది శాస్త్రం. ఈ రోజున నువ్వుల నూనెలో లక్ష్మీదేవి, నీటిలో గంగానదీ శక్తి ఉంటుందట. అపమృత్యుదీపదానం: ఈరోజు కూడా ముందురోజులాగానే మళ్లీ పెద్దలందరినీ పేరు పేరునా తలచుకుంటూ దీపాలు వెలిగించి- ఇన్ని దీపాలని పెట్టినందుకు సాక్ష్యంగా, మరో దీపాన్ని పెట్టి, ఆ దీపాన్ని మళ్లీ ఓ విప్రునికి దానం ఇస్తూ... ‘యమాయ ధర్మరాజాయ మృత్యవే చాంతకాయచ ఔదుంబరాయ దధ్యాయ నీలాయ పరమేష్టినేన అగ్ని దగ్ధాశ్చయే జీవా యేప్య దగ్ధాః కులే మమ ... ఉజ్జ్వల జ్యోతిషా వర్మ ప్రపశ్యంతు వ్రజంతు మే’ అని అనాలి. అంటే ‘నా వంశంలో పెద్దలు అగ్ని కారణంగా గాని, మరే ఇతర కారణంగా కాని మరణించి పితృలోకాలని చేరారో, వారందరికీ నరక బాధ లేకుండా చేసేందుకు భక్తితో, కృతజ్ఞతతో నేనిస్తున్న ఈ దీపం వారికి దోవను చూపుగాక! ఏ యముడు వ్యక్తుల ప్రాణాలను హరిస్తాడో, ఆయన మా ఎవరికీ అపమృత్యుదోషం (అకస్మాత్తుగా అనూహ్యంగా లభించే వాహన ప్రమాద మరణం మొదలైనవి) లేకుండా చేయుగాక అంటూ ఆ దీపాన్ని విప్రునికి దానం చేయాలి. ఇందులోనుండి మనం గ్రహించవలసినదేమంటే... నరక చతుర్దశినాడు ఆముదపు తీగె లేదా ఆనప తీగెతో దిష్టి తీసి వేస్తున్నాం అంటే... ఆరోగ్యరీత్యా ఆశ్వయుజ కార్తీకమాసాలలో సొరకాయని ఏ విధంగానూ వాడరాదనీ, ఆముదాన్ని కూడా ఉపయోగించరాదనీ తెలుసుకోవాలి. అలాగే కనీసం ఏడాదికి ఒకటి రెండు రోజులైనా సరే, ఒంటికి నువ్వులనూనె పట్టించి, సున్నిపిండితో నలుగుపెట్టుకుని, కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయడం ఎంతో మంచిదనీ. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... తమ పుత్రుడు ఎంత నీచుడూ, దుర్మార్గుడూ, ఘాతకుడూ అయినప్పటికీ ఎలాగో వాడికి శిక్షపడకుండా తమకున్న పలుకుబడితో, ధనబలంతో, అంగబలంతో రక్షించుకునే తల్లిదండ్రులనే మనం చూస్తాం. అయితే ప్రాచీన భారతీయ సంప్రదాయంలో తల్లిదండ్రులు ఎంతటి ఉదాత్తమైన చరిత్ర కలవారంటే...ప్రజాకంటకులైన పక్షంలో... లోకక్షేమం కోసం తమ పుత్రుణ్ణి కూడా చంపి, జనరక్షణ చేయవలసిందిగా ప్రార్థించేటంతటి గొప్ప వాళ్లని, అంతేకాదు...జీవించిన వారికే కాదు, గతించిన వారికి సైతం కృతజ్ఞతలు చెల్లించాలని బోధించిన మన పెద్దలకు జేజేలు. - విప్రవర్య మైలవరపు