ప్రత్యేక హోదా కోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. తమిళనాడు ప్రజలు వారి సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏకమై కేంద్రాన్ని ఒప్పించుకున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి ప్రజలు పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపి.. కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.