appearance
-
టంగ్ కంగు తినడానికి కాదు!
ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా. అలాగే టంగ్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ హెల్త్ అనుకోవచ్చు. అంటే... నాలుక అన్నది ఆరోగ్యానికి మంచి సూచిక అని అర్థం. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లగానే నాలుక చూపించమని అడుగుతుంటారు. దాన్నిచూసిన వెంటనే డాక్టర్లకు బాధితుల ఆరోగ్య విషయాలు ఎన్నో తెలుస్తుంటాయి. తల్లో నాలుకల వ్యవహరిస్తూ అనేక నములు తున్నప్పుడు రుచి తెలియజేయడం, పంటి కిందికి ఆహారాన్ని తోయడం వంటి అనేక పనులు చేసే నాలుక గురించి మాత్రం మనందరిలోనూ పెద్దగా తెలుసుకున్న దాఖలాలు ఉండవు. నాలుక చేసే కీలకమైన పనులు, దానికి వచ్చే కొన్ని సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం.సాధారణంగా నాలుక పింక్ రంగులో ఉంటే అది ఆరోగ్యానికి ఓ మంచి సూచన. ఒకవేళ అలా లేదంటే అది ఏదైనా అనారోగ్యానికి సూచన కావచ్చు. అందుకే డాక్టర్ల దగ్గరికి వెళ్లినప్పుడు వారు నాలుక చూపించమంటారు. అలా వ్యక్తుల ఆరోగ్యాన్ని గురించి తెలుసుకుంటారు.నాలుక కింది భాగం ఓ కండరంతో నోటిలోని కింది భాగానికి అతుక్కుపోయి... బయటకు అది చాలా చిన్నగా కనిపించినప్పటికీ, దాదాపు పది సెంటీమీటర్ల పొడవుంటుంది. దాదాపు 60 గ్రాముల బరువుంటుంది.జీర్ణ ప్రక్రియలో తొలి అంకం నాలుక దగ్గర్నుంచే... ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో నాలుక భూమిక ఎంతో కీలకం. ఆహారాన్ని పళ్ల కిందికి తోసేందుకు మనమంతా మనకు తెలియకుండానే నాలుకను వాడుతుంటాం. అలా మనం తీసుకున్న ఆహారం చిన్న చిన్న ముక్కలుగా (పార్టికిల్స్గా) మారేందుకు ఉపయోగ పడుతుంది. అంటే ఆహారం జీర్ణం కావడంలో తొలి అంకం ఇక్కణ్ణుంచే మొదలవుతుంది. ఆ తర్వాత మింగడం అనే ప్రక్రియ కూడా కేవలం నాలుక వల్లనే సాధ్యమవుతుంది. నాలుక వెనుక భాగం నమిలిన ఆహారాన్ని గొంతు ద్వారా కడుపులోకి నెడుతుంది. నాలుక దిగువన ఉండే చిన్న తీగ వంటి భాగంతోనే అది నోటి అడుగుభాగానికి అతుక్కు΄ోయి ఉంటుంది. ఈ తీగ పొడవు ఉండాల్సిన దాని కంటే బాగా తక్కువగా ఉంటే, మాట్లాడటంలో సమస్యలు వస్తాయి. నత్తి వంటి చాలా ఇబ్బందులు వస్తాయి. ఒకప్పుడు ఈ తరహా ఇబ్బందులకు పరిష్కారం అంతగా ఉండేది కాదు గానీ... ఇప్పుడు ఇలాంటి సమస్యను శస్త్రచికిత్సతో సరిచేసి, సరిగా మాట్లాడేలా చేసే అవకాశముంది.రుచితోనూ ఆరోగ్యం గురించి... అనారోగ్యం కలిగిన కొన్నిసార్లు రుచి తెలియదు. ఉదాహరణకు తీవ్రమైన జ్వరం వచ్చిన సందర్భాల్లోనూ, అలాగే జలుబు చేసినప్పుడు ముక్కుకు వాసనలూ, నాలుకకు రుచులూ తెలియని పరిస్థితి వస్తుంది. తాజాగా కరోనా వైరస్ సోకినప్పుడు కూడా ఇదే ప్రక్రియ వల్ల బాధితులకు రుచి తెలియకుండా΄ోయి, తమకు కరోనా వచ్చిన సంగతి తెలిసింది.నాలుకకు వచ్చే కొన్ని అనారోగ్యాలు... అన్ని అవయవాల లాగే నాలుకకూ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలుంటాయి. నాలుకకు వచ్చే ఇన్ఫెక్షన్ను గ్లాసైటిస్ అంటారు. కొన్ని యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ఇన్ఫెక్షన్ను తేలిగ్గా తగ్గించవచ్చు. ఐరన్‌లోపంతో వచ్చే రక్తహీనత (అనీమియా) ఉన్నవారిలో నాలుక ఆరోగ్యకరమైన పింక్ రంగుకు బదులుగా ఎర్రగా ఉండి, ముట్టుకుంటే బాధకలిగించే టెండర్‌గా మారుతుంది పచ్చకామెర్లు (జాండీస్) సోకినవారిలో పసుపురంగులోకి మారి కనిపిస్తుంటుంది.కొన్ని ఫంగస్‌లు సోకినప్పుడు నాలుకపై నల్లని మచ్చలు కనిపిస్తాయి. యాంటీఫంగల్ మందులు వాడటం ద్వారా దీన్ని తేలిగ్గా అధిగమించవచ్చు జింక్ లోపం వల్ల తలెత్తే ‘డిస్గ్యూసియా’ అనే సమస్య వచ్చిన వారిలో చక్కెర చేదుగానూ, చాక్లెట్ ఉప్పగానూ అనిపించవచ్చు. సాధారణంగా ఫ్లూ వంటి వ్యాధులు సోకిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతూ ఉంటుంది. జింక్ పుష్కలంగా ఉండే పోషకాహారం తీసుకుంటే, కొద్ది రోజుల్లోనే నాలుక మళ్లీ సాధారణ స్థితికి వచ్చేస్తుంది అరుదుగా వచ్చే ‘హై΄ోగ్యూసియా’ అనే సమస్యలో నాలుక రుచులను గుర్తించే సామర్థ్యాన్ని దాదాపుగా కోల్పోతుంది. వారు ఏది తిన్నా రుచీపచీ ఉండదు విటమిన్ (చాలావరకు విటమిన్ బి కాంప్లెక్స్) లోపాల వల్ల నాలుక పగుళ్లుబారినట్లు అనిపించడం, నాలుక మీద పొక్కులు రావడం మామూలే. సాధారణంగా ‘బి–కాంప్లెక్స్’ మందులతో ఈ సమస్యను తేలిగ్గా అధిగమించవచ్చు పొగతాగేవారిలో నాలుక మీద ఉండే రుచిమొగ్గలు తమ సామర్థ్యాన్ని కోల్పోతాయి. అందుకే పొగతాగేవారికి రుచులు అంత స్పష్టంగా తెలియవు. అంతేకాదు... పొగతాగడం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లతో పాటు నాలుక క్యాన్సర్ కూడా రావచ్చు. ఇది ప్రమాదకరమైన పరిణామం అందుకే పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. -
అంబానీ-రాధిక ప్రీ-వెడ్డింగ్: ఈ బ్యూటీ సందడి మామూలుగా లేదు (ఫోటోలు)
-
ప్రత్యేక హోదా కోసం 26న కొవ్వొత్తుల ప్రదర్శన
అనంతపురం : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న సాయంత్రం అనంతపురం నగరంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ తెలిపారు. తమిళనాడు ప్రజలు వారి సంప్రదాయ క్రీడ జల్లికట్టు కోసం ఏకమై కేంద్రాన్ని ఒప్పించుకున్న వైనాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఇక్కడి ప్రజలు పార్టీలకతీతంగా ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజా సంఘాల నేతలు మద్దతు తెలిపి.. కొవ్వొత్తుల ప్రదర్శనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. -
కొత్త జిల్లాల ఏర్పాటుతో మారేనా?
ప్రభుత్వం దసరా నుంచి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్న తరుణంలో పోలీస్‌స్టేçÙన్లను ఒకే సర్కిల్, ఒకే సబ్ డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా పోలీస్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. లేనిఎడల తాము పాలనా పరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల ఏర్పాటు అనంతరం ఇదేవిధంగా ఉంటే మిడ్జిల్ మండల ప్రజలు ఆయా ఠాణాల సమస్యలపై నాగర్‌కర్నూల్ జిల్లాపై ఆధారపడాల్సి వస్తుందని, అదేవిధంగా బాలానగర్ మండల ప్రజలు శంషాబాద్ జిల్లా అధికారులపై ఆధారపడాల్సి వస్తుందని వారు పేర్కొంటున్నారు. కల్వకుర్తికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిడ్జిల్ మండలం ఇప్పపహడ్, తదితర గ్రామాల ప్రజలు డీఎస్పీని కలవాలంటే దాదాపు 90కిమీల దూరంలో షాద్‌నగర్‌కు వెళ్లే పరిస్థితి ఉంది. అదేవిదంగా జడ్చర్లకు 10కిమీల దూరంలో ఉన్న మిడ్జిల్ మండలం బైరంపల్లి, తదితర గ్రామాల ప్రజలు సీఐని కలవాలంటే 40 కిమీల దూరంలోని కల్వకుర్తికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని మండలాల్లోని ఆయా గ్రామాల ప్రజలకు పోలీస్ సేవలు దూరంగా ఉన్నాయి. ఆయా సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులు భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నియోజకవర్గంలోని అన్ని పోలీస్‌స్టేçÙన్లను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. -
ఆశలు తీర్చే అభిషేకం
పంచామృతంతో అభిషేకం.. ఆరోగ్య ప్రాప్తి. పాలతో అభిషేకం.. దీర్ఘాయు ప్రాప్తి. పెరుగుతో అభిషేకం.. సత్సంతాన ప్రాప్తి. గంధంతో అభిషేకం.. లక్ష్మీకటాక్ష ప్రాప్తి. స్వామి దర్శనం చేతనే వివాహయోగం. వివాహమైన వారికి దాంపత్య జీవితం సుఖసంతోషాలమయం. పదిహేనువేల మంది దేవతలు తరలి వచ్చి ఆరాధించిన స్వామి పల్లికొండేశ్వరుడు. కొలువుదీరిన నేల సురుటపల్లి. సాధారణంగా దాదాపు అన్ని శివాలయాల్లోనూ శివుడు లింగాకారంలో దర్శనమిస్తాడు. కొన్నిచోట్ల ధ్యానముద్రలో ప్రశాంతంగా కూర్చున్న భంగిమలో శివయ్యను దర్శించుకుంటాం. కానీ, పార్వతీదేవి ఒడిలో ఆదమరచి నిద్రిస్తున్న భంగిమలో ఉన్న శివుడి విగ్రహాన్ని భక్తజనం ఎక్కడా చూసి ఉండరు. పద్నాలుగు అడుగుల ఎత్తులో ఈ అరుదైన శయన శివుడి దర్శనం మనకు చిత్తూరు జిల్లాలోని సురుటపల్లి గ్రామంలోని పల్లికొండేశ్వర ఆలయంలో లభిస్తుంది. చుట్టూ బ్రహ్మ విష్ణువులు, సూర్యచంద్రాదులు, నారద తుంబురులు, ఇంద్రుడు, కుబేరుడు, మార్కండేయుడు, అగస్త్య, పులస్త్య, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు కొలువు తీరి ఉండగా శివుడు సర్వమంగళాదేవి (పార్వతీదేవి) ఒడిలో తలపెట్టుకుని నిద్రిస్తున్న భంగిమలో భక్తులకు దర్శనమిచ్చే దృశ్యం కన్నులపండుగగా ఉంటుంది. బుక్కరాయలు నిర్మించిన ఆలయం తిరుపతి- చెన్నై జాతీయు రహదారిలో అరుణానది ఒడ్డున ఈ ఆలయుం కొలువుదీరి ఉంది. భక్తుల పాలిట కల్పతరువుగా భావించే ఈ ఆలయూన్ని 1344-47 మధ్యకాలంలో విజయునగరాధీశుడైన హరిహర బుక్కరాయులు నిర్మింపజేశారు. 1833లో శ్రీకాళహస్తి సంస్థానాధీశులైన రాజావారు జీర్ణోద్ధరణ చేసినట్లు ఆలయు కుడ్యాలపై శాసనాలు ఉన్నాయి. ఈ ఆలయు ప్రాశస్త్యాన్ని గుర్తించిన శ్రీ కంచి కావుకోటి పీఠాధిపతి శ్రీ జయేంద్ర చంద్రశేఖర సరస్వతి స్వామి వారు 1979లో ఇక్కడ వుహాకుంభాభిషేకం నిర్వహించారు. ఆ సందర్భంలో చంద్రశేఖర సరస్వతి స్వావుుల వారికి పరవుశివుడు దర్శన భాగ్యం కలిగించడంతో ఆయున ఈ ఆలయుంలోనే గడిపినట్లు స్వయుంగా పేర్కొన్నారు. గరళకంఠుడు సేదదీరిన నేల క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టుకు వచ్చినప్పుడు భీతావహులైన సురాసురులు లోకాలను కాపాడాలంటూ పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నారు. త్రిలోక రక్షణాదక్షుడైన శివుడు ఆ హాలాహలాన్ని స్వీకరించాడు. గరళం కడుపులోకి వెళ్లకుండా పార్వతీదేవి పతి గొంతును నొక్కిపట్టి ఉంచింది. దీంతో ఆ విషం గొంతులోనే ఉండిపోయి ఆ భాగమంతా నీలిరంగులోకి మారింది. విషప్రభావంతో సొమ్మసిల్లిన శివుడు పార్వతీ దేవి ఒడిలో శయనించాడు. నారదుడు ముల్లోకాలకూ ఈ సమాచారం చేరవేశాడు. అన్ని సురగణాలకూ ఆ దృశ్యం సురటపల్లిలో కనిపించింది. నీలకంఠుడికి స్వస్థత చేకూర్చాలని సురగణమంతా సురటపల్లికి చేరింది. అలా తరలి వచ్చిన దేవగణాన్ని పరమేశ్వరుడు విశ్రాంతి తీసుకుంటున్నాడని నందీశ్వరుడు నిలువరించాడు. విషయం తెలుసుకున్న శివుడు మేలుకుని దేవతలకు దర్శనభాగ్యం కలిగించాడు. దేవతలంతా ఆనందంతో నృత్యాలు చేశారు. సప్తరుషులు, దేవతలు పరమేశ్వరుణ్ణి కృష్ణ పక్ష త్రయోదశి నాడు దర్శించుకున్నార ని... ఈ కథనాన్ని శివపురాణం చెబుతోంది. కృష్ణ పక్ష త్రయోదశి శనివారం మహాప్రదోష వేళలో దేవతలు పళ్లికొండేశ్వర స్వామి దర్శనానికి వస్తారని, ఆరోజు దర్శనానికి వెళితే చాలు సమస్త దేవతల కరుణాకటాక్షాలను అందుకోవచ్చని భక్తుల నమ్మకం. శివుడు హాలాహలాన్ని మింగి సొమ్మసిల్లిన వేళ పదిహేనువేల మంది దేవతలు ఈ స్థలానికి వేంచేసినట్లు శివపురాణం చెబుతోంది. ఇక్కడ పరమేశ్వరుడిని నీలకంఠుడిగా, శ్రీ కంఠ, నంజుండస్వామిగానూ ఈ పళ్లికొండేశ్వర స్వామిగా భక్తులు స్తుతిస్తారు. రామయ్య చేతితో.. రావణ సంహారణానంతరం బ్రహ్మహత్యా పాతకం పోగొట్టుకోవడానికి శ్రీరాముడు ఇక్కడ శివలింగం ప్రతిష్ఠించాడని, రామాయణం రచించిన వాల్మీకి కూడా ఇక్కడ శివలింగ ప్రతిష్ఠాపన జరిపాడని చెబుతారు. వాల్మీకి ప్రతిష్ఠించిన శివలింగాన్ని వాల్మీకేశ్వరస్వామిగా పిలుస్తారు. దాంపత్య దక్షిణావుూర్తి ఓ ప్రత్యేకత ఈ ఆలయుంలో దంపతీ సమేతుడైన దక్షిణావుూర్తి దాంపత్య దక్షిణావుూర్తిగా వెలుగొందుతున్నాడు. దంపతీ సమేతుడై కటాక్షించడం వల్ల ఈ స్వామి దర్శనం సర్వసౌఖ్యాలకు సోపానంగాను, గురు దక్షిణావుూర్తి కావున సర్వలోకాలకు జ్ఞానప్రదాయకుడిగా కీర్తిస్తుంటారు. ఈ ఆలయుంలోని వాల్మీకేశ్వరాలయు ప్రాకారంలో దక్షిణ భాగంలో కొలువై ఉన్న ఈ స్వామివారిని భక్తులు విరివిగా సేవిస్తున్నారు. శివుడి అరవై నాలుగు రూపాలలో దక్షిణావుూర్తి రూపం ఒకటి. ఈయున ఈ ఆలయుంలో వృషభవాహనారూఢుడై వావుభాగం(ఎడవు భాగం)లో గౌరీదేవి సమేతుడై ఉన్నందువల్ల దాంపత్య దక్షిణావుూర్తిగా పూజలందుకుంటున్నాడు. దేశంలోనే ఏకైక ప్రదోష క్షేత్రం సురటపల్లిలోని ఈ శైవక్షేత్రం దేశంలోనే ఏకైక ప్రదోష క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ అతి ముఖ్యమైనది శని ప్రదోష పూజ. శని పీడనతో బాధపడేవారు శనివారంనాడు వచ్చే కృష్ణపక్ష త్రయోదశి రోజున ప్రదోష వేళలో ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతారు. సూర్యాస్తమయానికి గంటన్నర ముందు నుంచి గంటన్నర తర్వాత వరకు గల మూడుగంటల కాలాన్ని ప్రదోషవేళ అంటారు. ఈ ప్రదోషవేళలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు అసంఖ్యాకంగా పాల్గొంటారు. అలాగే, ప్రతి గురువారం దక్షిణామూర్తి చెంత భక్తుల రద్దీ ఎక్కువ. ఇక్కడ ఏడు వారాల పాటు నిమ్మచెక్కలో ఆవునెయ్యి పోసి దీపారాధన చేస్తే అన్ని సమస్యలూ తొలగి సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం. ఈ ఆలయం రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ప్రతి రోజూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రదోష పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రవేశించిన భక్తులు ముందు మరకతాంబిక, వాల్మీకేశ్వరులను దర్శించుకొని ఆ తర్వాత మహాదేవుని దర్శనానికి వెళతారు. - గోల్కొండ ఢిల్లీ బాబు నాగలాపురం, చిత్తూరు జిల్లా, సాక్షి ప్రత్యేకతలు వురకతాంబిక ఈ ఆలయుంలోని వుూలస్థాన దేవతలలో ప్రధాన అంశ వురకతాంబిక అవ్మువారు. ఈమె సిరిసంపదలను ఇస్తుందని నిత్యసంపత్కరీ అని స్తుతిస్తుంటారు. స్వయుంభువు వాల్మీకేశ్వరస్వామి వుూలస్థాన దేవతల్లో స్వయుంభువు వాల్మీకేశ్వరస్వామికి ప్రత్యేకత ఉంది. స్వయుంభువు లింగక్షేత్రాన్ని దర్శించడం వేరుు వూనుష ప్రతిష్టా లింగాలను దర్శించినంత ఫలితాన్ని ఇస్తుందన్న నవ్ముకంతో భక్తులు స్వామిని సేవిస్తున్నారు. పూర్ణపుష్కల సమేత అయ్యుప్ప అపరబ్రహ్మచారిగా ప్రఖ్యాతి గడించిన అయ్యుప్ప ఈ ఆలయుంలో పూర్ణ, పుష్కల దేవేరులతో దర్శనమివ్వడం చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. కలియుుగాన బ్రహ్మచారి అరుున అయ్యప్పకు త్రేతాయుుగంలో ఇద్దరు దేవేరులు ఉండేవారని ఈ విగ్రహం ద్వారా తెలుస్తున్నది. వురో అందమైన విగ్రహం ఏకపాద త్రివుూర్తి. బ్రహ్మ, విష్ణు, వుహేశ్వరులు ఒకే పాదంపై ఉండటం విశేషం. ఓ చేతిలో అగ్నిని పూని వుూడు శిరస్సులు, వుూడు హస్తాలతో జ్వరహరవుూర్తిగా దర్శనమిస్తున్నాడు శివుడు. ఈ స్వామిని మిరియూల పొడి కలిపిన నీటితో అర్చిస్తే ఎంతటి విషజ్వరమైనా హరించుకుపోతుందని ప్రచారం. వూనవ కపాలాన్ని చేత బూని నిలుచొని ఉన్న కపాల హస్త విష్ణువును ఆలయు పడవుర ప్రాంతాన దర్శించవచ్చు. మరో 84 సుందర శిలావిగ్రహాలను ఈ ఆలయుంలో దర్శించుకోవచ్చు. సురుటపల్లికి వెళ్లే దారి తిరుపతి నుంచి 73 కి.మీటర్లు, చెన్నై నుంచి 68 కి.మీటర్ల దూరం. ఈ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సుల్లో సురుటపల్లి చేరుకోవచ్చు. తిరుపతి నుంచి సత్యవేడు వెళ్లే బస్సులలో సురుటపల్లికి చేరుకోవచ్చు. తెలుగురాష్ట్రాల నుంచి భక్తులు తిరుపతికి రైలులో చేరుకొని, అక్కడ నుంచి బస్సులలో సురుటపల్లి చేరుకోవచ్చు. సమీప విమానాశ్రయం తిరుపతిలో ఉంది. సురుటపల్లి చిన్న గ్రామం కాబట్టి ఇక్కడ బస సదుపాయాలు లేవు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
మృత్యువు ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో ఊహించలేం.. రెప్పపాటిలో అనుబంధాలు, అనురాగాలను చిదిమేస్తుంది.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళ దుర్మరణం చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. మరో సంఘటనలో కోడలు కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఓ అత్త ప్రాణాలు పోగొట్టుకుంది. తన మనవరాలు, మరో మహిళతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి... కొత్తకోట రూరల్ : హైదరాబాద్ నగ రంలోని సైదాబాద్‌కాలనీకి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం దైవదర్శనం కోసం అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలోని కొత్తకోట మండలం విలియంకొండ స్టేజీ వద్దకు చేరుకోగానే ముందు వెళుతున్న కంటైనర్ వాహనాన్ని తప్పించబోయి ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నాగలక్ష్మి (71), 39ఏళ్ల శ్రీనివాసమూర్తి, 18ఏళ్ల సౌజన్యకు తీవ్ర గాయాలయ్యా యి. జోత్స్న, సౌమ్యపూజితకు స్వల్వ గాయాలయ్యాయి. ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఎల్అండ్టీ అంబులెన్స్‌లో క్షతగాత్రులను కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. ఇక్కడే చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. మిగతా వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసమూర్తి, సౌజన్య పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌కు సమీపంలోని ఎస్వీఎస్కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సం ఘటన స్థలాన్ని ఎస్ఐ కృష్ణ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. రోడ్డు దాటుతుండగా.. అడ్డాకుల : మరో సంఘటనలో ఆది వారం ఉదయం పెద్దమందడి మండ లం పామిరెడ్డిపల్లికి చెందిన హరిజన్ వెంకటమ్మ (40) అడ్డాకులలో ఉంటు న్న కోడలు వెంకటమ్మ వద్దకు వచ్చిం ది. సాయంత్రం మనవరాలు అనితతో పాటు అడ్డాకులకు చెందిన బోయ వెంకటమ్మతో కలిసి ఎస్సీకాలనీ నుం చి బస్టాండు వైపు బంధువుల ఇంటికి బయలుదేరింది. ముగ్గురూ ఒకేసారి హైవేను దాటుతుండగా హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. అలాగే మనవరాలు, బోయ వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎల్అండ్టీ అంబులెన్స్‌లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.