మృత్యువు ఎప్పుడు ఎవరిని బలి తీసుకుంటుందో ఊహించలేం.. రెప్పపాటిలో అనుబంధాలు, అనురాగాలను చిదిమేస్తుంది.. ఒకే కుటుంబానికి చెందిన అయిదుగురు దైవదర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురైన ఓ మహిళ దుర్మరణం చెందగా నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.. మరో సంఘటనలో కోడలు కోసం బంధువుల ఇంటికి వచ్చిన ఓ అత్త ప్రాణాలు పోగొట్టుకుంది. తన మనవరాలు, మరో మహిళతో కలిసి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం చెందగా మిగతా ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి...
కొత్తకోట రూరల్ : హైదరాబాద్ నగ రంలోని సైదాబాద్‌కాలనీకి చెందిన ఒకే కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం దైవదర్శనం కోసం అలంపూర్‌లోని జోగులాంబ ఆలయానికి కారులో వచ్చారు. అమ్మవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలోని కొత్తకోట మండలం విలియంకొండ స్టేజీ వద్దకు చేరుకోగానే ముందు వెళుతున్న కంటైనర్ వాహనాన్ని తప్పించబోయి ఢీకొంది. దీంతో అందులో ప్రయాణిస్తున్న నాగలక్ష్మి (71), 39ఏళ్ల శ్రీనివాసమూర్తి, 18ఏళ్ల సౌజన్యకు తీవ్ర గాయాలయ్యా యి. జోత్స్న, సౌమ్యపూజితకు స్వల్వ గాయాలయ్యాయి.
ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో క్షతగాత్రులను కొత్తకోటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలిం చారు. ఇక్కడే చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందింది. మిగతా వారిని వనపర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాసమూర్తి, సౌజన్య పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబ్‌నగర్‌కు సమీపంలోని ఎస్వీఎస్‌కు తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సం ఘటన స్థలాన్ని ఎస్‌ఐ కృష్ణ పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
రోడ్డు దాటుతుండగా..
అడ్డాకుల : మరో సంఘటనలో ఆది వారం ఉదయం పెద్దమందడి మండ లం పామిరెడ్డిపల్లికి చెందిన హరిజన్ వెంకటమ్మ (40) అడ్డాకులలో ఉంటు న్న కోడలు వెంకటమ్మ వద్దకు వచ్చిం ది. సాయంత్రం మనవరాలు అనితతో పాటు అడ్డాకులకు చెందిన బోయ వెంకటమ్మతో కలిసి ఎస్సీకాలనీ నుం చి బస్టాండు వైపు బంధువుల ఇంటికి బయలుదేరింది. ముగ్గురూ ఒకేసారి హైవేను దాటుతుండగా హైదరాబాద్ నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఆమె అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. అలాగే మనవరాలు, బోయ వెంకటమ్మకు తీవ్ర గాయాలయ్యాయి.
ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఎల్‌అండ్‌టీ అంబులెన్స్‌లో జిల్లా ప్రధాన ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ ముత్తినేని వెంకటేశ్వర్లు పరిశీలించి కేసు దర్యాప్తు జరుపుతున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రధాన ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
Published Mon, Nov 3 2014 4:26 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement