పంజగుట్ట: పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదయ్యింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీటెక్ విద్యార్థి వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విద్యానగర్‌కు చెందిన పున్నం లోకేష్ (21) బాచుపల్లిలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి కాలేజీకి స్నేహితుడితో కలిసి వెళ్తున్నాడు.
పంజగుట్ట– అమీర్‌పేట మార్గంలోని బిగ్‌బజార్ ఎదురుగా గుర్తు తెలియని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేగంతో వచ్చి వెనక నుంచి లోకేష్ బైక్‌ను ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న లోకేష్ తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో యువకుడికి స్వల్ప గాయాల య్యాయి. ప్రమాద స్థలికి వచి్చన పోలీసులు లోకేష్ మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి సోదరుడు ప్రవీణ్‌కుమార్ ఫిర్యాదు మేర కు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
యథేచ్ఛగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు..
ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ఈ ప్రాంతంలో నిత్యకృత్యమయాయి. ట్రావెల్స్ బస్సులు ఉదయం 7.30 గంటల్లోపే నగరంలోని రోడ్లల్లో తిరగాలనే నిబంధనలు ఉండడంతో సమయంలోపు నగర శివారు దాటాలన్న ఉద్దేశంతో అతివేగంగా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారని స్థానికులు అంటున్నారు. పోలీసులు సమయం దాటిన తర్వాత రోడ్లపైకి వచ్చే వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవని వారు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment