బ్రెసీలియా: బ్రెజిల్ దేశంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై బస్సును ట్రక్కు ఢీకొన్న ఘటనలో దాదాపు 38 మంది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.
వివరాల ప్రకారం.. బ్రెజిల్‌లోని మినాస్‌గైరస్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. హైవేపై ట్రక్కును బస్సు ఢీకొన్న ఘటనలో 38 మంది మృతిచెందారు. బస్సు ప్రయాణంలో ఉండగా టైర్ ఊడిపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు బ్రెజిల్ దేశ మీడియా తెలిపింది. అయితే, టైర్ ఉడిపోవడంతో డ్రైవర్ బస్సును కంట్రోల్ చేసే సమయంలో వేగంగా ట్రక్కు ఢీకొన్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరో 13 మంది గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
MG: acidente com ônibus, carreta e carro deixa 38 mortos
Ônibus vinha de São Paulo com 45 passageiros. O acidente ocorreu quando um pneu do coletivo estourou, em Teófilo Otoni, Minas Gerais pic.twitter.com/JAzdqjOol5— Regresso Nacional (@RegressoNaciona) December 22, 2024
Comments
Please login to add a commentAdd a comment