
సాధారణంగా హీరోయిన్లకు పేరు రావాలంటే కాస్త టైమ్ పడుతుంది. ఈమె మాత్రం టీనేజీలోనే స్టార్ అయిపోయింది.

హీరోయిన్‌గా చేసిన తొలి మూవీనే ఏకంగా ఆస్కార్ రేసులో నిలబడింది. ఆమెనే నితాన్షి గోయల్.

ఈ ఏడాది రిలీజైన బెస్ట్ సినిమాల్లో 'లాపతా లేడీస్' మూవీ ఒకటి. ఈ హిందీ మూవీలోనే నితాన్షి హీరోయిన్.

ఫూల్ అనే అమాయకమైన కొత్త పెళ్లి కూతురిగా అద్భుతమైన నటన కనబరిచింది.

నోయిడాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ.. తొమ్మిదేళ్లకే యాక్టింగ్ మొదలుపెట్టేసింది.

'విక్కీ డోనర్' ఈమె తొలి మూవీ కాగా.. ధోని, ఇష్క్ బాజ్, పెష్వా బాజీరావ్ తదితర చిత్రాల్లో బాలనటిగా చేసింది.

ఈ ఏడాది రిలీజైన 'లాపతా లేడీస్'లో ఓ హీరోయిన్‌గా సూపర్ యాక్టింగ్ చేసింది.

భారత్ నుంచి ఈ ఏడాది ఆస్కార్‌కు ఈ మూవీనే పంపించారు. కానీ షార్ట్ లిస్ట్ కాలేకపోయింది.

నితాన్షికి అయితే సినిమాల్లో ఆఫర్లు వస్తున్నాయి కానీ ఆచితూచి ఎంపిక చేసుకుంటోంది.

నితాన్షి.. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సీరియల్స్, వెబ్ సిరీసుల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.










