
హీరో నాని అంటే మొన్నటివరకు పక్కంటి కుర్రాడి తరహా పాత్రలు చేశారు. ఇప్పుడు రూట్ మారింది.

తాజాగా రిలీజైన 'ప్యారడైజ్' టీజర్ అయితే అందరికీ పెద్ద షాకిచ్చింది.

మాట్లాడటానికే ఇబ్బందిపడే ఓ బూతు పదాన్ని ఈ గ్లింప్స్ లో చూపించారు. అదీ ఓ మహిళతో చెప్పించారు.

ఇలా గ్లింప్స్ వీడియోతో అందరి అటెన్షన్ గ్రాబ్ చేసిన 'ప్యారడైజ్'లో హీరో, అతడి తల్లి పాత్రనే కీలకమట.

హీరోగా నాని చేస్తున్నాడని తెలుసు, మరి గ్లింప్స్ కి వాయిస్ ఓవర్ ఇచ్చిన తల్లి పాత్ర సోనాలి కులకర్ణి చేస్తోంది.

సోనాలి స్వతహాగా మరాఠీ నటి. 16 ఏళ్లకే ఇండస్ట్రీలోకి వచ్చింది. హిందీ, మరాఠీలో ఎక్కువగా నటించింది.

మరాఠీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుల్లో సోనాలి కులకర్ణి ఒకరు.

సోనాలి సినిమాల్లో నటించడంతో పాటు రచయిత, నిర్మాతగానూ పలు చిత్రాలకు పనిచేయడం విశేషం.

ఒకటి రెండు తమిళ సినిమాల్లో చేసింది గానీ ఈమె గురించి దక్షిణాదిలో పెద్దగా ఎవరికీ తెలియదు.

అలాంటిది నాని-శ్రీకాంత్ ఓదెల 'ప్యారడైజ్' కోసం ఈమెని తీసుకోవడం ఆసక్తికరం.

మరి తెలుగులో సోనాలి.. తన తొలి మూవీ 'ప్యారడైజ్'తో ఎలాంటి గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి?



