సీఐడీలో C అంటే చంద్రబాబేనా? | How Chandrababu Naidu Manage CID After Became CM | Sakshi
Sakshi News home page

సీఐడీలో C అంటే చంద్రబాబేనా?

Published Fri, Feb 21 2025 1:25 PM | Last Updated on Fri, Feb 21 2025 1:30 PM

How Chandrababu Naidu Manage CID After Became CM

దర్యాప్తు సంస్థ నడతను మార్చేసిన బాబు

వ్యవస్థలను మ్యానేజ్ చేయడం.. అందులోని వాళ్ళను వివిధమార్గాల ద్వారా తన దారికి తెచ్చుకోవడం.. అవసరాన్ని బట్టి అవతలివారి అవసరాలు తీర్చడం,. వారిని తన గుప్పెట్లోకి తెచ్చుకోవడం.. ఇలాంటి జయప్రదంగా చేసిన రికార్డ్ చంద్రబాబుకు ఉంది. ఇందుకోసం అయన ఎన్ని మెట్లు కిందికి దిగిపోవడానికైనా వెనుకాడరు. తన రాజకీయ ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఏ వ్యవస్థను అయినా భ్రష్టుపట్టించగలరు.. తన తన కాళ్లకిందకు తెచ్చుకోగలరు. 

తన చర్యలతో సదరు వ్యవస్థల గౌరవం.. ఔన్నత్యం ఎలా మంటగలిసిపోయినా చంద్రబాబు ఫర్వాలేదనుకుంటారు. తన ప్రయోజనాలే తనకు ముఖ్యం అనేది ఆయన పాలసీ. కేసులు దర్యాప్తు చేసే పోలీసు వ్యవస్థను సైతం నేరుగా వాడుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

చంద్రబాబు(Chandrababu) గతంలో  వ్యవస్థలను, ప్రభుత్వ పెద్దలను తనకు అనుకూలంగా మార్చుకుని వైయస్ జగన్ మోహన్‌ రెడ్డిని ఎంతలా ఇబ్బందులు పెట్టింది తెలిసిందే. జగన్‌ సీఎంగా ఉన్నప్పుడూ కూడా అది నడిచింది. మరోవైపు.. చంద్రబాబు 2014-19 మధ్య స్కిల్ డెవలప్‌మెంట్‌ ద్వారా డబ్బును ఏ విధంగా పక్కదారి పట్టించింది.. వేర్వేరు సంస్థలకు ఇవ్వాల్సిన డబ్బులను  సొంత సంస్థలకు మళ్లించుకుని... ఆ డబ్బును తాను కాజేసిన అంశం గురించి తెలిసిందే.  ఈ వ్యవహారంపై వైయస్ జగన్ ప్రభుత్వం కేసు నమోదు చేసింది. స్కిల్‌ స్కాంకు సంబంధించిన అన్ని ఆధారాలూ అప్పటి ఏపీ సీఐడీ(AP CID) విభాగం చీఫ్ సునీల్ కుమార్ సారథ్యంలోనే దర్యాప్తు బృందాలు సేకరించి కోర్టుకు అందజేశాయి. దీంతో చంద్రబాబు అరెస్టై.. జైలు జీవితం గడిపారు. ఆపై బెయిల్ మీద కూడా వచ్చారు. 

ఐతే ప్రభుత్వం మారగానే చంద్రబాబు దర్యాప్తు సంస్థ మీద మీద కన్నేశారు. తనను ముప్పుతిప్పలు పెట్టి అరెస్ట్ చేసి జైలుకు పంపిన సీఐడీనీ.. దాని అధికారులను టార్గెట్ చేసారు. ఐజీ సంజయ్, సునీల్ కుమార్ తదితరులకు పోస్టింగులు ఇవ్వకుండా పక్కనబెట్టారు. అంతేకాకుండా ఇప్పుడు ఆ స్కిల్ స్కామ్ కేసు సైతం లేకుండా చేసేందుకు సీఐడీలోని తన విధేయులైన అధికారులద్వారా కథ నడిపిస్తున్నారు.

ఇదీ చదవండి: చంద్రబాబుకు వ్యతిరేకంగా నోరు విప్పని సీఐడీ

రాజగురు రుణం తీర్చుకుంటూ..
ఇన్నాళ్లూ రాజకీయంగా తాను చేస్తూ వస్తున్నా అవినీతి.. అక్రమాలను కాపాడుతూ వస్తున్నా రాజగురు రామోజీరావు(Ramoji Rao)కు ఋణం తీర్చుకునేందుకు చంద్రబాబు నడుం బిగించారు. రామోజీకి చెందిన మార్గదర్శిపై రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా వేలాదికోట్ల డిపాజిట్లను సేకరించిన అభియోగం మీద కేసులు నమోదయ్యాయి. ఈమేరకు రూ. 1,050 కోట్ల మేరకు డిపాజిట్లు సేకరించినట్లు సీఐడీ సైతం తెలంగాణ హైకోర్టుకు గతంలోనే ఆధారాలు అందించింది. ఈలోపు టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మళ్ళీ సీఐడీ ప్లేటు ఫిరాయించింది. 

ఇదీ చదవండి: మార్గదర్శిపై కేసు.. మా పొరపాటే!

మార్గదర్శి అక్రమంగా డిపాజిట్లు(Margadasi Illegal Deposits) సేకరించినట్లు తాము ఆధారాలు సంపాదించలేకపోయామని, కొద్దోగొప్పో వివరాలు ఉన్నా.. వాటితో మార్గదర్శిని విచారించలేమని కోర్టుకు వాంగ్మూలం ఇచ్చింది. తాము ఇక కేసు దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదని, కేసు కొట్టేసినా ఫర్వాలేదని సీఐడీ కోర్టుకు నివేదించింది. 

చంద్రబాబు పవర్‌లో ఉంటే కేసులు కూడా మాఫీ అయిపోతాయి. తమ అనుయాయులంతా పత్తిగింజలు అయిపోతారు.. తనకు రాజకీయంగా ఎదుగుదలకు ఎంతో వెన్నుదన్నుగా మారినవాళ్లను కాపాడేందుకు చంద్రబాబు మరోమారు సీఐడీని ఇలా దిగజార్చుతున్నారు.

:::సిమ్మాదిరప్పన్న

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement