Criminal Investigation Department
-
చంద్రబాబు కనుసన్నల్లోనే స్కిల్ స్కాం: ఏపీ సీఐడీ
న్యూఢిల్లీ: గత టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో రూ. 371 కోట్లను మళ్లించినట్లు ఏపీ సీఐడీ మరోసారి స్పష్టం చేసింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించినట్లు తమ విచారణలో తేలిందని పేర్కొంది. ఆనాటి ఒప్పందంతో తమకు సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ చెప్పిందని, పక్కా ప్లానింగ్‌తోనే నిధులు మళ్లించినట్లు తేలిందని ఏపీ సీఐడీ పేర్కొంది. స్కిల్ స్కాంలో ప్రధాన సూత్రధారి చంద్రబాబేనని, ఆయన కనుసన్నల్లోనే స్కాం జరిగిందని తెలిపింది ఏపీ సీఐడీ. కాగా, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. -
పారని బాబు, నారాయణ పాచిక
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణంలో భాగమైన అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులైన మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయనకు అత్యంత ఆప్తుడు, మాజీ మంత్రి నారాయణ ఏదో జరిగిపోతోందంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వారి వినతి మేరకు హైకోర్టు స్టే ఇచ్చింది. ఆ తర్వాత వారి పిటిషన్లపై విచారణ సాగకుండా వారే శక్తియుక్తులన్నీ ప్రయోగిస్తూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్టే పొడిగింపు ఉత్తర్వులూ పొందుతున్నారు. హైకోర్టులో ఇదో పెద్ద ప్రహసనంగా మారింది. తాజాగా గురువారం ఇదే రీతిలో విచారణను సుదీర్ఘ కాలానికి వాయిదా వేయించేందుకు వారి న్యాయవాదులు ప్రయత్నించి విఫలమయ్యారు. కోర్టులో వారి ఎత్తులను రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో అడ్డుకున్నారు. న్యాయస్థానానికి సైతం వారి ఎత్తుగడలు అర్థమయ్యాయి. దీంతో వచ్చే గురువారానికి మాత్రమే విచారణను వాయిదా వేయించుకోగలిగారు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టే పొంది వాయిదాల మీద వాయిదాలు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సీఐడీ 2021లో ఈ కేసు నమోదు చేసింది. ఈ కేసు కొట్టేయాలంటూ బాబు, నారాయణ అదే ఏడాది హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఈ కేసులో దర్యాప్తుతో సహా తదుపరి చర్యలన్నింటినీ నిలిపేస్తూ 2021 మార్చి 19న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి విచారణ వాయిదా పడుతోంది. ఆ తరువాత ఈ వ్యాజ్యాలు ఓ న్యాయమూర్తి వద్ద విచారణకు రాగా, తదుపరి ఉత్తర్వులిచ్చేంత వరకు స్టే కొనసాగుతుందంటూ ఉత్తర్వులు పొందారు. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యాలు విచారణకు వచ్చాయి. చంద్రబాబు, నారాయణ తరఫు సీనియర్ న్యాయవాదుల అభ్యర్థన మేరకు విచారణ గురువారానికి వాయిదా పడింది. గురువారం మరోసారి సుదీర్ఘ వాయిదాకు వారి వ్యూహాన్ని అమల్లో పెట్టారు. బాబు తరఫు సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నానని, అయితే, ఈ కేసులో ఫిర్యాదుదారు, ప్రతివాది ఆళ్ల రామకృష్ణారెడ్డికి హైకోర్టు నోటీసు అందలేదని, అందువల్ల విచారణ జరపడం సరికాదని అన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రికార్డులను పరిశీలించిన కోర్టు అధికారి.. నోటీసు ఇచ్చినట్లు ఎలాంటి డాక్యుమెంట్ లేదన్నారు. ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకొని మరోసారి రికార్డులు చూడాలని కోరారు. మరోసారి రికార్డులను పరిశీలించగా, రామకృష్ణారెడ్డికి 2021లోనే నోటీసులు పంపినట్లు ఉన్న ఉత్తర్వుల కాపీ దొరికింది. దీంతో ఖంగుతిన్న చంద్రబాబు, నారాయణ న్యాయవాదులు విచారణ వాయిదా వేయాలని కోరారు. దీనికి సుధాకర్‌రెడ్డి అడ్డుతగిలారు. నోటీసులు అందలేదన్న సాకుతో వాయిదా వేయించాలని చూశారన్నారు. వాదనలు వినిపించేందుకు సిద్ధమని చెప్పిన దమ్మాలపాటి శ్రీనివాస్ ఎందుకు వాయిదా కోరుతున్నారని, ఇది టూ మచ్ అంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. ఇప్పటికే విచారణను ఎన్నోసార్లు వాయిదా వేయించారని చెప్పారు. వాళ్లే చాలాసార్లు వాయిదా తీసుకున్నారని దమ్మాలపాటి అనగా, ఎవరు ఎన్నిసార్లు వాయిదాలు తీసుకున్నారో తేల్చేందుకు తాను ఇక్కడ లేనని న్యాయమూర్తి కరాఖండిగా చెప్పారు. సుధాకర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. బుధవారం మరో కేసు ఉన్నందున విచారణను గురువారానికి కోరతామని దమ్మాలపాటి చెప్పడంతో తాను అంగీకరించినట్లు తెలిపారు. గురువారం కూడా వాయిదా కోరడంలో అర్థం లేదన్నారు. తమ ఎత్తుగడ ఫలించదని బాబు, నారాయణ న్యాయవాదులకు అర్థమవడంతో తాము సుదీర్ఘ వాయిదా కోరడం లేదని దమ్మాలపాటి చెప్పారు. వచ్చే గురువారానికి వాయిదా వేయాలని కోరారు. న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్ బుధవారానికి మొగ్గు చూపగా, దమ్మాలపాటి పదే పదే అభ్యర్థించడంతో విచారణను గురువారానికి వాయిదా వేశారు. -
మార్గదర్శికి మరో భారీ షాక్
సాక్షి, విజయవాడ: మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తుల్ని భారీగా అటాచ్ చేసింది ఏపీ సీఐడీ. ఈసారి ఏకంగా రూ. 242 కోట్ల ఆస్తులు(చరాస్తులు) జప్తు చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ.. ఆ కంపెనీ అధినేత, ఎండీ అయిన రామోజీరావు, శైలజాకిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదా రులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సీఐడీని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్ నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి. తాజాగా మరో రూ.242 కోట్లు జప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలను పాల్పడుతున్నట్లు స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులుగా మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతోపాటు బ్రాంచి మేనేజర్లపై (ఫోర్‌మెన్) సీఐడీ కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్న విషయం విదితమే. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది. ఇదీ చదవండి: సూర్య నారాయణపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు -
సీఐడీ దర్యాప్తుపైనా..వక్రీకరణేనా రామోజీ?
సాక్షి, అమరావతి: తనకు నచ్చినవారిని నెత్తిన పెట్టుకుంటూ.. నచ్చనివారిపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ మరోసారి తన నైజాన్ని బయటపెట్టుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారుల నిధులను చట్టానికి విరుద్ధంగా తన సొంత ప్రయోజనాలకు రామోజీరావు మళ్లించారు. ఈ నేపథ్యంలో ఆ కేసుపై ప్రస్తుతం సీఐడీ చేస్తున్న దర్యాప్తుపై కూడా వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నించడం విస్మయపరుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఎండీ, రామోజీ కోడలు శైలజా కిరణ్‌ను హైదరాబాద్‌లో రెండోసారి మంగళవారం విచారించిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తమకు చట్టాలు, నిబంధనలు వర్తించవనే రీతిలో సీఐడీ అధికారులకు ఏమాత్రం సహకరించలేదు. అక్రమాలకు సంబంధించిన ఆధారాలను చూపిస్తూ మరీ అధికారులు ప్రశ్నలు అడిగినా ‘తెలియదు’ అంటూ సమాధానాలు చెప్పకుండా దాటవేత వైఖరిని ప్రదర్శించారు. తాను విదేశాల నుంచి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేదని, కళ్లు తిరుగుతున్నాయంటూ సాకులు చెబుతూ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. విచారణకు అడుగడుగునా అడ్డుపడుతూ.. మంగళవారం దాదాపు 9 గంటల పాటు సాగిన విచారణ ప్రక్రియలో సీఐడీ అధికారులు తాము ముందుగా సిద్ధం చేసుకున్న ప్రశ్నావళిలో కనీసం 25శాతం ప్రశ్నలను కూడా శైలజను అడగలేకపోయారు. దీన్ని బట్టి ఆమె అడుగడుగునా విచారణకు అడ్డుపడుతూ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేశారని స్పష్టమవుతోంది. ఆమె తనకు ఆరోగ్యం బాగోలేదని చెప్పడంతో వైద్యులు పరీక్షించేందుకు సీఐడీ అధికారులు అవకాశం ఇచ్చారు. భోజనానికి, మందులు వేసుకోవడానికి కూడా విరామం ఇచ్చారు. అయినప్పటికీ శైలజా కిరణ్ విచారణకు ఏమాత్రం సహకరించకపోవడం గమనార్హం. అంతే కాకుండా విచారణకు సీఐడీ అధికారులతోపాటు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగులైన ఆర్థిక వ్యవహారాల నిపుణులను ఇంటిలోకి రానీయకుండా అడ్డుకునేందుకు యత్నించడం రామోజీ కుటుంబం బరితెగింపునకు నిదర్శనం. అసలు వాస్తవం ఇది.. కాగా అసలు వాస్తవం ఏమిటంటే.. తమ విచారణకు శైలజా కిరణ్ ఏమాత్రం సహకరించలేదని దర్యాప్తు అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో ఆమెకు మరోసారి నోటీసులు ఇచ్చి విచారిస్తామని కూడా ఆయన వెల్లడించారు. దర్యాప్తు అధికారి చెప్పిన విషయాలను కాకుండా తమకు అనుకూలంగా కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే తన విష పత్రికలో అబద్ధపు రాతలు రాయించారు. ఇక మార్గదర్శి చిట్‌ఫండ్స్ ముసుగులో తమ అక్రమాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ మీడియాపై కూడా రామోజీరావు అక్కసు వెళ్లగక్కారు. శైలజా కిరణ్ విచారణ ప్రక్రియకు సబంధించిన వార్తలు సాక్షి మీడియాలో ప్రసారం చేశారని గగ్గోలు పెట్టారు. వాస్తవానికి సాక్షి మీడియానే కాకుండా ఇతర చానళ్లు కూడా శైలజా కిరణ్‌ను సీఐడీ విచారించడంపై ప్రముఖంగా వార్తలను ప్రసారం చేశాయి. ఓ సంచలనాత్మకమైన కేసులో.. అందులోనూ ప్రజల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కేసులో వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం మీడియా బాధ్యత. కానీ, తాము ఎవరిపైన అయినా విషం చిమ్ముతాం.. ఇంకెవరూ తమపై మాత్రం వాస్తవాలను కూడా రాయకూడదనే తీరులో రామోజీరావు ఉండటం విడ్డూరంగా ఉంది. దశాబ్దాలుగా చంద్రబాబుకు కొమ్ము కాసేందుకు నాడు ఎన్టీ రామారావు నుంచి ఇతర ప్రత్యర్థి పార్టీల నేతలపై పెద్ద ఎత్తున దు్రష్పచారం చేసిన రామోజీ నేడు శ్రీరంగ నీతులు చెబుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమ ఆర్థిక అక్రమాల సామ్రాజ్యమైన ‘మార్గదర్శి’ కుప్పకూలుతుండటంతో సీఐడీ దర్యాప్తును కూడా వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదారి పట్టించేందుకు రామోజీ యత్నిస్తున్నారనేది స్పష్టమవుతోంది. ‘ఈనాడు’లో అబద్ధపురాతలు షురూ.. విచారణకు ఏమాత్రం సహకరించని రామోజీ కుటుంబం తమ పత్రిక ‘ఈనాడు’లో మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వార్తలు ప్రచురించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. శైలజా కిరణ్ విచారణకు పూర్తిగా సహకరించారని సీఐడీ దర్యాప్తు అధికారి రవికుమార్ తెలిపినట్టుగా ‘ఈనాడు’ తనకలవాటైన రీతిలో అబద్ధపు రాతలు వండి వార్చేసింది. అంతేకాదు.. ఇక శైలజా కిరణ్ విచారణ పూర్తయిపోయిందని.. ఇక ఆమెను విచారించాల్సిన అవసరమే లేదని ఆయన వెల్లడించినట్టు కూడా నిర్ధారించేసింది. -
అమరావతి స్కాం.. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యలు
సాక్షి, విజయవాడ: అమరావతి స్కాంలో దర్యాప్తు కొనసాగిస్తున్న ఏపీ సీఐడీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఆస్తుల ఎటాచ్‌మెంట్‌పై తదుపరి చర్యల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించనుంది. ఈ మేరకు ఇవాళ(సోమవారం) విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేయనుంది. కోర్టు నుంచి అనుమతులు రాగానే.. సీఐడీ తదుపరి ప్రక్రియ చేపట్టనుంది. ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను అంచనా వేసేందుకు సిద్ధమైంది సీఐడీ. తద్వారా ఎటాచ్ చేసిన ఆస్తుల విలువను ప్రత్యక్షంగా లెక్కించనుంది. ఇప్పటికే చంద్రబాబు కరకట్ట నివాసంతో పాటు మాజీ మంత్రి నారాయణ ఆస్తులను ఎటాచ్ చేసింది ప్రభుత్వం. రెంటల్ అగ్రిమెంట్ లేకుండా కరకట్ట నివాసంలో ఉంటున్న చంద్రబాబు.. లింగమనేనికి లబ్ధి చేకూర్చేలా కరకట్ట నివాసం తీసుకున్నట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదీ చదవండి: చంద్రబాబు క్విడ్ ప్రోకో.. అసలేం జరిగిందంటే.. -
ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్‌ల్లో సీఐడీ సోదాలు
సాక్షి, అమరావతి: దశాబ్దాలుగా వేళ్లూనుకున్న మార్గదర్శి చిట్‌ఫండ్స్ అక్రమాలను కూకటి వేళ్లతో సహా తొలగించే విస్తృత కార్యాచరణకు సీఐడీ విభాగం ఉపక్రమించింది. రాష్ట్రంలోని మొత్తం 37 మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో ఏకకాలంలో విస్తృత సోదాలు చేపట్టింది. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల వ్యవహారాల్లో కీలక ఆధారాలు లభ్యమైన నేపథ్యంలో చందాదారుల ఫిర్యాదులతో కార్యాచరణ చేపట్టింది. ఫేక్ డిపాజిట్‌దారుల పేరిట మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో భారీగా నల్లధనాన్ని చేతులు మారుస్తుండటంపై సీఐడీ కీలక ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆర్థిక అక్రమాలకు సంబంధించిన ఆధారాల ధ్వంసానికి పాల్పడటంపై ఫోరెన్సిక్ ఆడిటింగ్ చేపట్టడంతో సంస్థ చైర్మన్ చెరుకూరి రామోజీరావు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్గదర్శి చిట్‌ఫండ్స్ ఆర్థిక అక్రమాలు వెలుగు చూసిన తరువాత సీఐడీ విభాగం ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏడు బ్రాంచి కార్యాలయాలు, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో మాత్రమే సోదాలు నిర్వహించింది. ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు, ఏ–2గా ఉన్న చెరుకూరి శైలజలను విచారించింది. సహాయ నిరాకరణతో.. చిట్‌ఫండ్ చట్టం 1982కి విరుద్ధంగా రామోజీరావు యథేచ్ఛగా పాల్పడిన ఆర్థిక అక్రమాలపై సీఐడీ ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించింది. నిధుల మళ్లింపు, అక్రమ డిపాజిట్లు, అక్రమ పెట్టుబడులపై ఆధారాలను ప్రదర్శిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రధాన కార్యాలయంలోని కీలక అధికారులను ప్రశ్నించింది. చట్ట ప్రకారం బ్రాంచి మేనేజర్లకు చెక్ పవర్ ఉండాలి. చందాదారులు చెల్లించిన సొమ్మును సంబంధిత బ్రాంచి కార్యాలయాలున్న నగరాలు / పట్టణాల్లోని జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలి. అయితే అందుకు విరుద్ధంగా చందాదారుల సొమ్మును హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి తరలించి అక్రమ పెట్టుబడులు పెట్టినట్టు వెల్లడైంది. ఈ నిధుల మళ్లింపులో చెరుకూరి శైలజా కిరణ్‌తోపాటు 11 మంది మార్గదర్శి ఉన్నతాధికారులు కీలక భూమిక పోషించారు. వారిలో ఏడుగురు ఆంధ్రప్రదేశ్‌లోని బ్రాంచిలకు సంబంధించి వ్యవహారాలు నిర్వర్తించారు. కీలక ఆధారాలను ఎలా ధ్వంసం చేయాలో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా బ్రాంచి మేనేజర్లకు వివరించారు. దీనిపై ఆ ఏడుగురు ఉన్నతాధికారులను సీఐడీ అధికారులు ప్రశ్నించారు. అయితే రామోజీ ఆదేశాలతో వారు సీఐడీ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదు. దీంతో ఈ కేసులో దూకుడు మరింత పెంచాలని నిర్ణయించిన సీఐడీ ఏకకాలంలో రాష్ట్రంలోని 37 బ్రాంచి కార్యాలయాల్లో శనివారం సోదాలు చేపట్టింది. ఉదయం ప్రారంభించిన సోదాలు అర్ధరాత్రి వరకూ కొనసాగుతున్నాయి. మార్గదర్శి బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజులపాటు సోదాలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫేక్ చందాదారులు.. జాడలేని కీలక రికార్డులు ఏకకాలంలో బ్రాంచి కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సీఐడీ అధికారులు మార్గదర్శి అక్రమాలను గుర్తించి విస్తుపోయారు. చిట్‌ఫండ్ చట్టం ప్రకారం నిర్వహించాల్సిన రికార్డులు ఏవీ బ్రాంచి కార్యాలయాల్లో లేవు. చందాదారుల సొమ్మును జాతీయ బ్యాంకుల్లో జమ చేసినట్లు రికార్డులు సైతం లేకపోవడం గమనార్హం. నిధుల మళ్లింపునకు సంబంధించిన కనెక్టింగ్ రికార్డులు, లెడ్జర్ పుస్తకాలు లేకపోవడంతోపాటు బ్రాంచి కార్యాలయాల వార్షిక నివేదికల్లో వాటి ప్రస్తావనే లేదు. ఒక్కో బ్రాంచి కార్యాలయంలో నిర్వహిస్తున్న చిట్లు ఎన్ని? ఎంతమంది చందాదారులున్నారు? ప్రతి నెలా చందా మొత్తం ఎంత వస్తోంది? ఆ నిధులను ఏం చేస్తున్నారు? అనే రికార్డులేవీ మార్గదర్శి చిట్‌ఫండ్స్ సక్రమంగా నిర్వహించడం లేదని వెల్లడవుతోంది. పలువురు చందాదారులకు సంబంధించి సరైన చిరునామాలు కూడా లేవు. చందాదారుల ముసుగులో భారీ ఎత్తున నల్లధనాన్ని బ్రాంచి కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి తరలిస్తున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆ నిధులను రామోజీరావు కుటుంబానికి చెందిన ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, మార్గదర్శి చిట్‌ఫండ్స్( కర్ణాటక)– బెంగళూరు, మార్గదర్శి చిట్‌ఫండ్స్(తమిళనాడు)– చెన్నైలలో పెట్టుబడిగా చూపించారు. ఉషాకిరణ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్‌సిటీలోనే ఉంది. అంటే భారీ ఎత్తున నల్లధనాన్ని రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుబడి పెట్టినట్టు స్పష్టమవుతోంది. ఫిర్యాదులపై కార్యాచరణ మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు సీఐడీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేస్తున్నారు. తాము ష్యూరిటీ సమర్పించినా చిట్టీ మొత్తాన్ని ఇవ్వడం లేదని, చిట్టీ మొత్తంలో కొంత భాగం డిపాజిట్లుగా ఉంచారని, తమను వేధిస్తూ ఆస్తులు అటాచ్ చేశారని... పలు ఫిర్యాదులు సీఐడీ దృష్టికి వచ్చాయి. వీటికి సంబంధించి బ్రాంచి కార్యాలయాల్లో రికార్డులను పరిశీలిస్తున్నారు. అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు, ష్యూరిటీలు ఇచ్చినా చిట్టీ మొత్తాన్ని చెల్లించకుండా వేధిస్తున్నట్లు ఆధారాలు సేకరించారు. మరోవైపు ష్యూరిటీకి సంబంధించి మార్గదర్శి విధించిన షరతులు కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టంలోని మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నట్లు వెల్లడైంది. వీటిపై కీలక రికార్డులను సీఐడీ అధికారులు జప్తు చేశారు. విచారించి వాంగ్మూలాలు నమోదు మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో వారం రోజుల పాటు క్షుణ్నంగా సోదాలు కొనసాగించాలని సీఐడీ భావిస్తోంది. ప్రతి బ్రాంచి కార్యాలయం పరిధిలోని చందాదారుల్లో కనీసం 25 శాతం మందిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. డిపాజిట్లు పెట్టిన చందాదారులపై దృష్టి సారించనున్నారు. వారు చేసిన డిపాజిట్లకు ఎక్కడ నుంచి నిధులు తెచ్చారు? సంబంధించిన పత్రాలున్నాయా? ఆదాయపన్ను రిటర్న్‌లలో వాటిని చూపిస్తున్నారా? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. ఫేక్ డిపాజిట్‌దారుల పేర్లతో మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో భారీ ఎత్తున డిపాజిట్లు చూపుతున్నట్లు గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీన్ని పక్కాగా నిర్ధారించేందుకు చందాదారులు, డిపాజిట్‌దారుల ఇళ్లకు వెళ్లి ఆరా తీయనున్నారు. ఆధారాల ధ్వంసంపై ఫోరెన్సిక్ ఆడిట్ మార్గదర్శి చిట్‌ఫండ్స్ బ్రాంచి కార్యాలయాల్లో సోదాలతోపాటు సీఐడీ అధికారులు సమాంతరంగా ఫోరెన్సిక్ ఆడిట్ కూడా చేపట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్థిక అక్రమాలను కప్పిపుచ్చేందుకు ఈ కేసులో ఏ–1గా ఉన్న చెరుకూరి రామోజీరావు మరిన్ని అక్రమాలకు పాల్పడినట్లు ఇటీవల ఏడు బ్రాంచి కార్యాలయాల్లో నిర్వహించిన సోదాల్లో వెల్లడైన విషయం తెలిసిందే. నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులకు సంబంధించిన ఆధారాలను ధ్వంసం చేయడంతోపాటు కంప్యూటర్లలో కీలక రికార్డులను డిలీట్ చేసినట్లు సీఐడీ విభాగం గుర్తించింది. బ్రాంచి మేనేజర్లతో మార్గదర్శి యాజమాన్యం ప్రత్యేకంగా జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి మరీ ఆధారాల ధ్వంసానికి పాల్పడినట్లు వెల్లడైంది. కేసు దర్యాప్తులో ఉండగా ఆధారాలను ధ్వంసం చేయడం తీవ్రమైన నేరం. సీఐడీ అధికారులు దీన్ని శాస్త్రీయంగా నిరూపించే ప్రక్రియను చేపట్టారు. నిపుణుల బృందాలను నియమించి మొత్తం రికార్డులను విశ్లేషిస్తున్నారు. వారం పది రోజుల క్రితం ఏడు బ్రాంచి కార్యాలయాల్లో డిలీట్ చేసిన రికార్డులను రిట్రీవ్ చేసి వెలికి తీశారు. ప్రస్తుతం మొత్తం 37 బ్రాంచి కార్యాలయాల్లోనూ ధ్వంసం చేసిన రికార్డులను వెలికి తీయడంతోపాటు రికార్డులను ధ్వంసం చేసినట్టు శాస్త్రీయంగా రికార్డు చేస్తున్నారు. ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతోనే కీలక రికార్డులను ధ్వంసం చేసినట్లు బ్రాంచి కార్యాలయాల సిబ్బంది సీఐడీ ఎదుట అంగీకరించినట్లు తెలుస్తోంది. ఆధారాలను ధ్వంసం చేసినట్లు ఫోరెన్సిక్ ఆడిటింగ్ ద్వారా నిరూపించడం ద్వారా న్యాయస్థానంలో సమర్పించేందుకు కీలక సాక్ష్యా«దారాలను సేకరించే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేసింది. చదవండి: ‘చంద్రబాబుతో అంటకాగితే జనసేన అడ్రస్ గల్లంతే’ -
మార్గదర్శి బాగోతాలు బట్టబయలు.. కీలక విషయాలు చెప్పిన సీఐడీ చీఫ్
సాక్షి, అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ డబ్బును అక్రమంగా దారిమళ్లిస్తున్నారని సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ తెలిపారు. తనిఖీలకు యాజమాన్యం సహకరించడం లేదన్నారు. మార్గదర్శిలో రికార్డుల నిర్వహణ సరిగ్గా లేదని పేర్కొన్నారు. తన డబ్బు ఎక్కడికి వెళ్తుందో వినియోగదారుడికి తెలియడం లేదన్నారు. 'మార్గదర్శి అక్రమాలకు సంబందించి ఇప్పటికే నలుగురు బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేశాం. ఏపీ వినియోగదారుల సొమ్మును వేరే చోటుకు తరలిస్తున్నారు. చెక్ పవర్ లేని వ్యక్తిని ఇక్కడ బాధ్యుడిగా ఉంచుతున్నారు. చిట్ వేసే వారి పరిరక్షణ కోసం చిట్‌ఫండ్ చట్టం ఉంది. కానీ మార్గదర్శిలో జవాబుదారీతనం లేని పరిస్థితి ఉంది. చిట్ ఫండ్ సొమ్మును ఇతర వ్యాపారాలకు వాడుతున్నారు. బ్రాంజ్ మేనేజర్‌కు సంస్థ సమాచారం గానీ, పవర్‌గానీ లేదు. తప్పుడు రికార్డులతో చిట్స్ నడిపిస్తున్నారు. వినియోగదారులకు సమయానికి డబ్బు ఇవ్వకుండా డిపాజిట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్ల పేరుతో అమాయకులను మోసం చేస్తున్నారు. ఇప్పటి వరకు నలుగురిని అరెస్ట్ చేశాము. విశాఖపట్నం బ్రాంచ్ మేనేజర్ కి రిమాండ్ విధించారు. విజయవాడ మేనేజర్ శ్రీనివాసరావుకి 12 రోజులు రిమాండ్ ఇచ్చారు. గుంటూరు బ్రాంచ్ మేనేజర్‌కి రిమాండ్ ఇవ్వలేదు.' అని సంజయ్ వివరించారు. చదవండి: వెలుగు చూస్తున్న ‘మార్గదర్శి’ అక్రమాలు.. నలుగురు అరెస్ట్ -
మాజీ మంత్రి నారాయణ కంపెనీలపై ఏపీ సీఐడీ సోదాలు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి నారాయణకు చెందిన సంస్థలో ఏపీ సీఐడీ సోదాలు చేపట్టింది. మాదాపూర్‌లోని ఎన్ఎస్పీఐఆర్ఏ సంస్థలో సీఐడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నారాయణ సంస్థల నుంచి రామకృష్ణ హౌసింగ్ సంస్థలోకి నిధులు మళ్లినట్లు గుర్తించారు. ఈ డబ్బులతో నారాయణ బినామీల పేర్లతో అమరావతిలో చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశాడన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు సోదాలు జరిపారు. -
భర్తలేని సమయంలో మహిళా సీఐ ఇంట్లో మరో సీఐ.. అసలేం జరిగింది?
వరంగల్ క్రైం: వరంగల్ సీఐడీ విభాగంలో పనిచేస్తున్న ఓ సర్కిల్ ఇన్స్పెక్టర్పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ విషయం కమిషనరేట్‌లో సంచలనం కలిగించింది. సుబేదారి సీఐ షుకుర్ తెలిపిన వివరాల ప్రకారం.. సీఐడీలో పనిచేస్తున్న ఓ మహిళా సర్కిల్ ఇన్స్పెక్టర్ హనుమకొండ రాంనగర్లో ఉంటోంది. ఆమె భర్త రవికుమార్ మహబూబాబాద్ రూరల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు. చదవండి: కానిస్టేబుల్‌తో ఎస్సై ప్రేమాయణం.. పెళ్లి చేసుకొని.. సోమవారం మధ్యాహ్నం వరంగల్ సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవి.. రాంనగర్‌లోని మహిళా ఇన్స్పెక్టర్ ఇంటికి ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లాడు. ఆమె భర్త రవికుమార్ తన ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఉన్న బాల రవిని చూసి ఎందుకు వచ్చావని ప్రశ్నించాడు. బాల రవి తిరిగి రవికుమార్‌ను బెదిరించాడు. దీంతో తాను లేని సమయంలో, భార్య ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చిన సీఐడీ ఇన్స్పెక్టర్ బాల రవిపై కేసు నమోదు చేయాలని సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో బాల రవిపై ఐపీసీ 448, 506 సెక్షన్ల కింది కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఈ విషయం పోలీస్‌శాఖలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. -
ఎస్ఐ పోస్టుల స్కాం: పరీక్ష టైంలో ఫోన్లో మాట్లాడారా?
బనశంకరి(కర్ణాటక): రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ఎస్ఐ పోస్టుల కుంభకోణం మరిన్ని ఉద్యోగ నియమాకాలపై అనుమానాలను పెంచుతోంది. బ్లూ టూత్ సహాయంతో ఈసారి, గతంలోనూ ఎంతమంది పరీక్షల్లో అక్రమాలకు పాల్ప డ్డారోనని సీఐడీ దర్యాప్తు చేపట్టింది. ఎవరికీ కనబడకుండా చెవి లోపల చిన్న బ్లూటూత్ పరికరం పెట్టుకుని బయటి నుంచి అక్రమార్కులు సరైన సమాధానం చెబుతుంటే విని రాసి ఉద్యోగాలు వెలగబెడుతున్న వారికి ఇప్పుడు వణుకు మొదలైంది. ఇటీవల ఎస్ఐ పరీక్ష రాసిన అభ్యర్థుల మొబైల్ కాల్స్ లిస్టులను అధికారులు పరిశీలిస్తున్నారు. పరీక్ష రాసిన సమయంలో అభ్యర్థుల మొబైల్ఫోన్లకు ఎవరైనా కాల్ చేశారా, ఎంతసేపు మాట్లాడారు తదితర అంశాలను మొబైల్ టవర్ డంప్ తదితర సాంకేతికతల సహాయంతో వెలికితీయనున్నారు. సాధారణంగా పరీక్ష సమయంలో అభ్యర్థులు ఫోన్‌ను స్విచాఫ్ చేసి బయట సిబ్బందికి ఇచ్చేయాలి. లేదా స్నేహితులకు, ఇంట్లోనూ ఇచ్చి రావచ్చు. ఆ సమయంలో కాల్ వచ్చి ఎక్కువసేపు మాట్లాడి ఉంటే చిక్కుల్లో పడినట్లే. అభ్యర్థులకు ఎన్ని మొబైల్ఫోన్లు, సిమ్‌కార్డులు ఉన్నాయో కూడా వివరాలు రాబడుతున్నారు. ఈ విచారణలో అక్రమార్కులు దొరికిపోవడం ఖాయం అని సీఐడీ అధికారులు తెలిపారు. కోవిడ్ మృతుని సెల్ నుంచి దందా ఎస్ఐ కుంభకోణంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి పేరుతో ఉన్న మొబైల్‌ఫోన్‌ను వినియోగించి నిందితుడు రుద్రేగౌడ పాటిల్ అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. పాటిల్ వద్ద సోన్న గ్రామానికి చెందిన లక్ష్మీపుత్ర అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేసేవాడు. లక్ష్మీపుత్ర కోవిడ్‌తో మృతిచెందగా, అతనికి చెందిన ఒక మొబైల్‌ను పాటిల్ తీసుకున్నాడు. అదే మొబైల్‌తో ఎస్ఐ పోస్టుల నియామక పరీక్షల్లో అక్రమాలకు పాల్పడినట్లు సీఐడీ విచారణలో తెలిసింది. నేరం బయటపడినా తప్పించుకోవడానికి ఈ ఉపాయాన్ని ఆలోచించాడు. రెండు రోజుల క్రితం రుద్రేగౌడ, స్నేహితుడు మంజునాథ్‌ను అరెస్ట్‌చేసిన సీఐడీ అధికారులు 13 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. ఇతర పరీక్షల్లోనూ ప్రమేయం: ఎస్ఐ పోస్టులే కాకుండా ఎఫ్‌డీఏ, ఎస్డీఏ, ఏఈ పోస్టులతో పాటు వివిధ నియామక పరీక్షల్లో రుద్రేగౌడ పాటిల్ ముఠా అక్రమాలకు పాల్పడి ఉండొచ్చని సీఐడీ విచారణ చేస్తోంది. రుద్రేగౌడను, స్నేహితుడు మల్లికార్జున పాటిల్‌ను సీఐడీ విచారిస్తోంది. రుద్రేగౌడ నివాసంలో లభించిన హాల్‌టికెట్లు, పీఎస్ఐ పరీక్షకు ముందే ప్రశ్నాపత్రం లీకైనట్లు కొన్ని ఆధారాలు లభించాయని సమాచారం. ఇతని సహకారంతో పెద్దసంఖ్యలో నిరుద్యోగులు పలు కేపీఎస్సీ పరీక్షల్లో బ్లూటూత్‌లో సమాధానాలు పొంది ఎంపికైనట్లు తెలిసింది. ఈ వార్త కూడా చదవండి: వీసీల నియామకం రాష్ట్ర హక్కే: తమిళనాడు -
పాస్టర్ ప్రవీణ్ కేసులో లోతైన దర్యాప్తు: సీఐడీ ఎస్పీ
సాక్షి, అమరావతి/గుంటూరు: పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో లోతైన దర్యాప్తు జరుగుతున్నదని, ఈ కేసుకు సంబంధించి సోషల్ మీడియాలోనూ, మీడియాలోనూ ఊహాజనిత కథనాలు ప్రచురించవద్దని ఏపీ సీఐడీ ఎస్పీ జీఆర్ రాధిక స్పష్టం చేశారు. కేసు వివరాలను ఆమె గురువారం ఓ ప్రకటనలో వివరించా రు. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వీడియోను చూసిన గుంటూరుకు చెందిన సింగం వెంకట శ్రీలక్ష్మీనారాయణ ఈ ఏడాది జనవరి 12న సీఐడీకి ఫిర్యాదు చేశారు. ‘హిందూ దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అని, తాను ఎన్నో విగ్రహాలను అవమానించానని, అనేక గ్రామాలను క్రైస్తవ గ్రామాలుగా మార్చానంటూ’ పాస్టర్ ప్రవీ ణ్ చక్రవర్తి అన్న వ్యాఖ్యలు ఉన్న సీడీని ఫిర్యాదుకు జత చేశారు. దీనిపై మం గళగిరి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 1/2021 సెక్షన్ 153/ఎ, 153 బి(1)(సి), 505(1)(సి), 505(2), 295(ఎ), 124(ఎ), 115 రెడ్ విత్ 66 తీవ్రమెన సెక్షన్లపై కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేసిన సీఐడీ బృందం పాస్టర్ ప్రవీణ్‌ను జనవరి 13న అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించడంతో అదే రోజు అర్ధరాత్రి జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత విచారణ కోసం ప్రవీణ్‌ను కస్టడీకి ఇవ్వాలని కోర్టును అభ్యర్థించడంతో జనవరి 20 నుంచి మూడు రోజుల పాటు అనుమతించింది. ప్రస్తుతం ప్రవీణ్‌ను గుంటూరులోని సీఐడీ రీజినల్ కార్యాలయంలో విచారిస్తున్నారు. జనవరి 23తో అతని కస్టడీ ముగుస్తుంది. కాగా, ప్రజలను రెచ్చగొట్టేలా, మతాలను కించపరిచేలా మీడియాలో కథనాలు ప్రచురిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని ఎస్పీ రాధిక హెచ్చరించారు. -
అగ్రి గోల్డ్ బాధితులకు తీపి కబురు
సాక్షి, అమరావతి: అగ్రి గోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ అమలులో మరో అడుగు ముందుకు పడుతోంది. సీఎం ఇచ్చిన మాటకు కట్టుబడి ఇప్పటికే రూ.10 వేల లోపు నగదు డిపాజిట్ చేసిన వారికి ఆ మొత్తాలను చెల్లించిన సంగతి తెలిసిందే. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే అగ్రి గోల్డ్ బాధితుల కోసం రూ.1,150 కోట్లు కేటాయించారు. తొలి దశలో రూ.263.99 కోట్లు విడుదల చేసి.. గతేడాది అక్టోబర్‌లో డిపాజిటర్లకు చెల్లింపులు జరిపారు. రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి సైతం నగదు చెల్లించేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. తెలంగాణ హైకోర్టు గత నెల 9న ఇందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏపీ సీఐడీ నేతృత్వంలో వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సేకరించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మార్చి నాటికి రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారి వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని సీఐడీ చీఫ్ సునీల్‌కుమార్ చెప్పారు. చదవండి: (జనవరి 9న జగనన్న అమ్మఒడి సాయం) -
డాక్టర్ అనితారాణి ఆరోపణల్లో నిజం ఎంత?
చిత్తూరు అర్బన్: డాక్టర్ అనితారాణి. ప్రస్తుతం ఈమె పేరు తెలియనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఈ ఏడాది మార్చి 22న చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి, ఈమెకు మధ్య వివాదం మొదలయ్యింది. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులపై పెనుమూరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. కానీ గత ఆరు రోజుల్లో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. తన కేసు సీబీఐకి ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐడీ ఎస్పీ రత్నపై అట్రాసిటీ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిజమేనా? ఇందులో వాస్తవాలేమిటని చూస్తే అసలు విషయం అర్థమైపోతుంది. (అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..) అనితారాణి ఆరోపణలు ♦ మార్చి 22వ తేదీన వైద్యం కోసం వచ్చిన భరత్ తదితరులు తనపై దాడి యత్నం చేశారని పేర్కొన్నారు. ♦ ఓ గదిలో తనను నిర్బంధించారని ఆరోపించారు. ♦ గదిలోంచి బాత్రూమ్లోకి వెళ్లగా కిటికీలోంచి ఫొటోలు, వీడియోలు తీశారని వాపోయారు. ♦ ఫిర్యాదు చేయడానికి ఉదయం స్టేషన్‌కు వెళితే రాత్రి వరకు కేసు నమోదుచేయకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారనేది ఆమె వాదన. ♦ పెనుమూరులో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని, అబార్షన్లు చేయలంటూ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణ. ♦ ఇక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది సరిగా విధులకు రాకుండా హాజరు మాత్రం వేసుకుంటున్నట్లు విసుర్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే పోలీసులు నిరాకరించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపణ. ♦ సీఐడీపై తనకు నమ్మకం లేదని, వాళ్ల విచారణకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. ♦ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేసి, కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్. వాస్తవాలు ♦ పెనుమూరుకు చెందిన భరత్‌కుమార్‌కు మార్చి 22వ తేదీన కంట్లో యాసిడ్‌లాంటి ద్రావణం పడితే వైద్యం కోసం పీహెచ్‌సీకి వెళ్లారు. కరోనా నేపథ్యంలో తాను ఎవరికీ వైద్యం చేయబోనంటూ అనితారాణి చెప్పడం, ఆస్పత్రిలోనే ఓ నోటీసును అతికించడం వాస్తవం. ♦ భరత్‌కుమార్‌తో పాటు వచ్చిన గ్రామస్తులు అనితారాణి వాదనపై నిలదీశారు. దీంతో ఆమె తన గదిలోకి వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. ఎవరూ కూడా నిర్బంధించలేదు. ♦ అనితారాణి చెబుతున్నట్లు ఆస్పత్రి మరుగుదొడ్లో ఉంటే ఫొటోలు తీయడం అసాధ్యం. ఎందుకంటే మరుగుదొడ్డికి వెనుక 12 అడుగుల ఎత్తులో ఎగ్జాస్టర్ ఫ్యాన్‌ను ఏర్పాటుచేశారు. అంతపైకి ఎక్కి ఫొటోలు ఎలా తీస్తారని సీఐడీ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ♦ పోలీస్ స్టేషన్‌కు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లిన అనితారాణి ఆమె ఫిర్యాదును రాసివ్వగా పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు. కానీ ఎఫ్ఐఆర్ ఇచ్చేంతవరకు వెళ్లబోనని ఆమె స్టేషన్లోనే కూర్చుకున్నారు. మధ్యలో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ చేసేప్పుడు సర్వర్ పనిచేయలేదు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ♦ పెనుమూరులో అబార్షన్లు ఎక్కువగా ఉన్నాయనడానికి ఆమెవద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవు. అవుట్ పేషెంట్ పుస్తకంలో అసలు దీనిపై ఎక్కడా కూడా సమాచారం లేదు. ♦ సిబ్బంది హాజరుపట్టీ మొత్తం వైద్యురాలైన అనితారాణి టేబుల్‌పైనే ఉంటుంది. ఆమె అనుమతిలేనిదే సిబ్బంది హాజరుపట్టికలో సంతకం కూడా పెట్టలేరు. ♦ వివాదం జరిగిన రోజే అనితారాణి ఇచ్చిన ఫిర్యాదుపై పెనుమూరు స్టేషన్లో కేసు (క్రైం.నెం.23/2020) నమోదైంది. నిందితులపై 341, 353 సెక్షన్లు, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ, అండ్ సెక్షన్ 3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కౌంటర్ కేసుగా అనితారాణి వైద్యం చేయలేదని ఇచ్చిన ఫిర్యాదుపై క్రైం.నెం–24/2020 నమోదు కాగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 341, 506, 166బీ కింద కేసు నమోదుచేశారు. ♦ సీఐడీపై నమ్మకం లేదని చెప్పాలంటే ముందుగా అనితారాణి కేసు విచారణలో సీఐడీ చేసిన తప్పిదాలు చూపాలి. విచారణకే సహకరించని వ్యక్తి స్వయం ప్రతిపత్తి దర్యాప్తు సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ♦ ఇక ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న అనితారాణి గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి నారాయణస్వామి ఆయన ఎమ్మెల్యే కావడం, పెనుమూరు ఆయన పరిధిలోకి రావడమనే ఒకే ఒక్క అంశాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వివాదంలో తన ప్రమేయం ఉన్నట్లు ఒక్క సాక్ష్యం చూపినా రాజీనామా చేస్తానంటూ నారాయణస్వామి బహిరంగంగానే సవాల్ విసిరారు. -
అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితా రాణి వ్యవహారానికి సంబంధించి సీఐడీ విచారణ మూడోరోజు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో సహా ఇరవైమందికి పైగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ రత్నకుమారి గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘విచారణకు సహకరించాలని మొదట డాక్టర్ అనితా రాణిని ఫోన్ ద్వారా కోరడం జరిగింది. ఆమె ఇంటి వద్దకు వెళ్ళి సీబీఐ విచారణ కావాలని, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను రికార్డు చేశాం. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదేవిధంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు చిత్తూరు హెల్త్ సెంటర్ సిబ్బందిని విచారణ చేశాం. (అనితా రాణి ఇంటికి రాజకీయనేతలు..!) అనితా రాణి ఆరోపించినట్లుగా బాత్రూంలో ఫోటోలు కానీ వీడియో కానీ తీసే అవకాశం లేదు. ఆమె తన మాటల్లో డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర సంస్థలు న్యాయం చేయలేదని చెప్పారు. కేసు నమోదు అయిన వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విచారణ చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశాం. ఇప్పటివరకు ఉన్న నివేదికపై అధికారులకు చెప్పి తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అన్నది నిర్ణయిస్తారు. అనితా రాణి ఫిర్యాదు చేసిన వైద్యాధికారులను విచారించడం జరుగుతుంది.’ అని తెలిపారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) -
అనితా రాణి నుంచి సమాధానం లేదు..
-
అనితా రాణి తలుపులు తీయడం లేదు..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి విచారణకు సహకరించడం లేదని సీఐడీ ఎస్పీ రత్నకుమారి తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అనితా రాణిని విచారణ చేసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోందని రత్నకుమారి తెలిపారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) ‘నిన్న చిత్తూరుకు చేరుకున్నాం. సీఆర్పీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపాం. విచారణ నిమిత్తం చిత్తూరులోని ఆమె ఇంటికి వెళితే తలుపులు తెరవలేదు. ఫోను ద్వారా సంప్రదించాం. తనకు రాష్ట్ర పోలీసులు, సీఐడీ మీద నమ్మకం లేదని చెబుతున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటలకు అనితా రాణి ఇంటికి వెళ్లాం. కాలింగ్ బెల్ నొక్కినా ఆమె నుంచి సమాధానం రాలేదు. మరోసారి ఫోన్ చేశాం. తనకు సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్తరఫ్ చేసిన తర్వాత విచారణకు రావాలని చెబుతున్నారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) తనకు కాలు విరిగిందని చెప్పారు. అనితా రాణి నివాసం ఉంటున్న సమీపంలోని చుట్టుపక్కల ఇళ్లవారిని విచారించి వివరాలు నమోదు చేసాం. అనిత రాణి ఇంటికి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. దీంతో ఇవాళ పెనుమురు వచ్చి ఆసుపత్రితో పాటు పోలీస్ స్టేషన్లోనూ విచారణ చేశాం. ఒక వైద్యురాలిగా ఉంటూ సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పడం భావ్యం కాదు. అన్ని కోణాల్లో మా విచారణ కొనసాగుతుంది’ అని ఎస్పీ రత్నకుమారి స్పష్టం చేశారు. -
విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు అనితా రాణి సీఐడీ విచారణకు సహకరించడం లేదు. అధికారులు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో వారే..స్వయంగా అనితా రాణి నివాసానికి వెళ్లారు. సీఐడీ అధికారులను చూడగానే అనితా రాణి ఇంటి తలుపులు వేసుకున్నారు. ‘నాకు సీఐడీ పోలీసులపై నమ్మకంలేదు. నన్ను విచారించడానికి మీరు ఎవరూ కూడా నా ఇంటి వద్దకు రాకండి. మీరు పిలిచినా నేను రాను. నా కేసు సీబీఐతో విచారించాల్సిందే..’ అంటూ ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి పేర్కొన్నారు. ఆమెను విచారించడానికి చిత్తూరుకు చేరుకున్న సీఐడీ పోలీసులు నిన్న (మంగళవారం) అనితారాణికి ఫోన్‌చేయగా.. ఆమెనుంచి ఇలాంటి సమాధానం వచ్చింది. దాంతో సీఐడీ అధికారులు బుధవారం ఆమె నివాసానికి వెళ్లగా...అధికారులను చూడగానే తన నివాసంలో తలుపులు మూసివేశారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) కాగా ఈ ఏడాది మార్చి 22వ తేదీ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భరత్ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకున్నారు. ఇదేమిటని గ్రామస్తులు నిలదీయడంతో తనను కులం పేరిట ధూషించారని, బాత్రూమ్లో ఉంటే ఫొటోలు తీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉంటూ వైద్యసేవలు అందివ్వలేదంటూ భరత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతలో తనకు న్యాయం జరగలేద ని అనితారాణి మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. విచారించడానికి చిత్తూరుకు వచ్చిన సీఐడీ పోలీసులు అనితారాణిని ఫోన్లో సంప్రదించగా ఆమె నిరాకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర టీడీపీ నాయకులు దగ్గరుండీ మరీ వివాదంగా మారుస్తున్నారని పెనుమూరు వాసులు అంటున్నారు. -
రమేష్ కుమార్ లేఖను లెక్కతేల్చే పనిలో సీఐడీ
-
రమేష్ కుమార్ లేఖను లెక్కతేల్చే పనిలో సీఐడీ
సాక్షి, అమరావతి : రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ లేఖ వెనుక ఉన్న లెక్కను తేల్చే పనిలో సీఐడీ దూకుడు పెంచింది. ఇప్పటికే నిమ్మగడ్డ అదనపు పీఎస్‌గా పనిచేసిన సాంబమూర్తి నుంచి విస్తుపోయే విషయాలను రాబట్టిన సీఐడీ అధికారులు మరింత లోతైన దర్యాప్తు చేస్తోంది. రమేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి పంపిన లేఖను ఎవరో నిమ్మగడ్డకు మెయిల్ ద్వారా పంపినట్టు సీఐడీ గుర్తించింది. దీంతో లేఖను తయారు చేసిన వ్యక్తి ఐపీ అడ్రస్ కోసం సీఐడీ ప్రయత్నిస్తోంది. ఈ కోణంలోనే కేసును దర్యాప్తు చేసి.. మరికొన్ని వివరాలను రాబట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రమేష్ కుమార్‌ను సైతం సీఐడీ విచారించే అవకాశం ఉంది. అయితే ఆదివారం నాటి విచారణలో పీఎస్ సాంబమూర్తి పలు విషయాలను వెల్లడించారు. నిమ్మగడ్డ పంపిన లేఖను డౌన్ లోడ్ చేసుకుని కేంద్రానికి పంపినట్లు పీఎస్ వాంగ్మూలం ఇచ్చారు. లేఖ విషయంలో సీఐడీ ఇప్పటికే పలు కీలక విషయాలను రాబట్టినట్టు సమాచారం. (నిమ్మగడ్డ లేఖ విషయంలో సంచలన నిజాలు) కాగా నిమ్మగడ్డ కేంద్ర హోం శాఖకు రాసిన లేఖపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి ఇటీవల డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అనంతరం ఈ కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. సీఐడీ ఏడీజీ పీవీ సునీల్‌కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం సాంబమూర్తిని కొద్ది రోజుల క్రితం విచారించింది. నిమ్మగడ్డ కేంద్ర హోంశాఖకు రాసిన లేఖ విషయంలో సాంబమూర్తి పొంతన లేని సమాధానాలు చెప్పడంతోపాటు లేఖకు సంబంధించిన అనేక ఆధారాలను నాశనం చేయడం పట్ల సీఐడీ అనుమానాలు వ్యక్తం చేసింది. (టీడీపీ అడ్డా నుంచే నిమ్మగడ్డ లేఖ?) ఆ లేఖ నిజంగా నిమ్మగడ్డ స్వయంగా రాసి ఉంటే సాక్ష్యాలను నాశనం చేయాల్సిన అవసరమేంటి? సాంబమూర్తి ఎందుకు భిన్నంగా చెబుతున్నారు? అనే కోణాల్లో సీఐడీ ఆరా తీస్తోంది. ఈ నేపథ్యంలోనే సాంబమూర్తిని హైదరాబాద్‌లో శనివారం సీఐడీ ప్రత్యేక బృందం విచారించి.. ఎన్నికల వాయిదా, కేంద్ర హోంశాఖకు లేఖ తదితర అనేక విషయాల్లో నిమ్మగడ్డ వ్యవహరించిన తీరుపై పలు వివరాలు రాబట్టాలని ప్రయత్నిస్తోంది. -
అమరావతి భూ అక్రమాలపై దూకుడు పెంచిన సీఐడీ
సాక్షి, అనంతపురం : అమరావతిలో భూ అక్రమాల వ్యవహారంపై సీఐడీ విచారణ ముమ్మరం చేసింది. టీడీపీ నేతల ఇన్సైడర్ ట్రేడింగ్‌పై దర్యాప్తు వేగవంతం చేసిన సీఐడీ అధికారులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతల చిట్టా తవ్వుతున్నారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా కనగానపల్లి తహశీల్దార్ కార్యాలయంపై మంగళవారం సీఐడీ అధికారులు దాడులు నిర్వహించారు. అమరావతిలో భూములు కొనుగోలు చేసిన తెల్ల రేషన్ కార్డుదారుల వివరాలు సేకరించారు. (చదవండి : రాజధానిలో అక్రమాలకు ఆధారాలివిగో..) అమరావతిలో మాజీ మంత్రి పరిటాల సునీతతో పాటు కనగానపల్లి వాసులు జయచంద్రచౌదరి, నిర్మలా చౌదరి భూములు కొనుగోలు చేశారు. తెల్ల రేషన్ కార్డుదారులు కోట్ల విలువైన భూములు ఎలా కొనుగోలు చేశారన్న విషయంపై వివరాలు సేకరించారు. మాజీ మంత్రి పరిటాల సునీత ప్రోద్బలంతో కొనుగోలు చేశారా లేదా ఇతర వ్యక్తుల బినామీగా ఉన్నారా? అన్న వివరాలపై సీఐడీ ఆరా తీసింది. కాగా, అమరావతిలో 4వేల ఎకరాల భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్టుగా కేబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదిక ఆధారంగా భూములు కొనుగోలు చేసిన రాజకీయ నాయకులపై సీఐడీ విచారణ చేస్తోంది. -
హీరా గ్రూప్‌కు ఈడీ వేడి!
సాక్షి, హైదరాబాద్: ఒక కంపెనీ లేదు.. మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ లేదు.. కనీసం క్రయవిక్రయ దుకాణాలు సైతం లేవు.. అయినప్పటికీ కేవలం స్కీముల పేరుతో రూ.వేల కోట్ల స్కామ్‌కు పాల్పడిన హీరా గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రత్యేక దృష్టి పెట్టింది. నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా నౌహీరా షేక్ చుట్టూ ఉచ్చు బిగించడానికి రంగం సిద్ధం చేస్తోంది. హీరా సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన వారిలో కొందరు డమ్మీలు ఉన్నారని, మనీల్యాండరింగ్‌లో భాగంగానే ఈ పెట్టుబడులు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. నౌహీరాతో పాటు ఆమె సంస్థలపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్న ఈడీ గురువారం సీసీఎస్ అధికారులతో భేటీ అయింది. రిటర్నుల్లో తేడాలు.. హీరా గ్రూప్ సంస్థ ఆరేళ్లల్లో రూ.6 వేల కోట్లు టర్నోవర్ చేసినట్లు గతంలో రిటర్నులు దాఖలు చేసింది. 2010–11లో కేవలం రూ.27 లక్షలుగా ఉన్న గ్రూ ప్ టర్నోవర్.. 2016–17 నాటికి రూ.800 కోట్లు దాటేసింది. అయి తే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు ఎక్కడా అందుబాటులో లేవు. ఆదాయపు పన్ను (ఐటీ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో), రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) వీటిలో ఒక్కో విభాగానికి ఒక్కో రిటర్ను ఫైల్ చేసింది. కనీసం డిపాజిట్‌దారుల జాబితా సైతం బయటపెట్టకపోవడంతో అనేక ప్రయత్నాలు చేసిన సీసీఎస్ పోలీసులు హీరా గ్రూప్ సర్వర్‌ను బంజారాహిల్స్‌లోని ఓ ఇంట్లో గతేడాది గుర్తిం చారు. దీంతో పాటు స్వాధీనం చేసుకున్న కొన్ని హార్డ్‌డిస్క్‌ల్ని విశ్లేషించి అనేక కీలక విషయాలు గుర్తించారు. విదేశీ ఇన్వెస్టరు.. ‘ఫెమా’ఉల్లంఘన! ప్రాథమికంగా 1.7 లక్షలు మంది ఇన్వెస్టర్ల జాబితాను సంగ్రహించగలిగారు. వీరిలో కొందరు విదేశీయులుగా ఆ రికార్డులు చెప్తున్నాయి. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం విదేశీ పెట్టుబడుల్ని అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాత కేవలం భారత కరెన్సీలోనే స్వీకరించాలి. అయితే ఇప్పటివరకు సేకరించిన వివరాల ప్రకారం హీరా గ్రూప్ రూ.5,647 కోట్లు భారత కరెన్సీలో భారతీయుల నుంచి డిపాజిట్లు సేకరించింది. దీనికి తోడు 6 లక్షల అమెరికా డాలర్లు, 132 కోట్ల యూఏఈ దిరమ్స్, 45 కోట్ల సౌదీ రియాల్స్, 10 కోట్ల కువైడ్ దీనార్స్ పెట్టుబడులుగా వచ్చాయి. ఇలా విదేశీ కరెన్సీలో పెట్టుడబులు సేకరించడం ఫెమా చట్టానికి వ్యతిరేకం. మరోపక్క ఇప్పటి వరకు హీరా గ్రూప్ భారత్ కరెన్సీలో రూ.2,500 కో ట్లు, 2 లక్షల అమెరికా డాలర్లు, 120 కోట్ల యూఏఈ దిరమ్స్, 1.36 లక్షలు సౌదీ రియా ల్స్ డిపాజిట్‌దారులకు తిరిగి చెల్లించినట్లు తేలింది. వీటితోపాటు విదేశీ బ్యాంకుల్లో ఈ సంస్థకు చెందినవిగా అనుమానిస్తున్న 8 బ్యాం కు ఖాతాలను సీసీఎస్ పోలీసులు గుర్తించారు. దర్యాప్తు సంస్థలకు సీసీఎస్ లేఖలు.. సీసీఎస్ పోలీసులు తాము సేకరించిన వివరాలన్నీ క్రోడీకరిస్తూ తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈడీ, ఆదాయపుపన్ను శాఖ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్‌లకు లేఖలు రాశారు. దీంతో స్పందించిన ఈడీ ప్రాథమిక విచారణ నేపథ్యంలో ఈ స్కామ్ వెనుక మనీల్యాండరింగ్ సైతం ఉన్నట్లు గుర్తించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాల కోసం గురువారం సీసీఎస్ డీసీపీ అవినాష్ మహంతితో ఈడీ హైదరాబాద్ యూనిట్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ భేటీ అయ్యారు. సీసీఎస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో అదనపు డీసీపీ జోగయ్య, కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న ఏసీపీ రామ్‌కుమార్ సైతం పాల్గొన్నారు. తమ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన, సేకరించిన వివరాలను సీసీఎస్ పోలీసులు ఈడీ దృష్టికి తీసుకువెళ్లారు. కొన్ని కీలక డాక్యుమెంట్లను అప్పగించారు. ఇప్పటి వరకు లభించిన ఆధారాలను బట్టి హీరా గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన వారి సంఖ్య దాదాపు 2 లక్షల వరకు ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. రూ.60 కోట్లతో ఫైవ్‌స్టార్ హోటల్.. పోలీసులు ఖాతాలు ఫ్రీజ్ చేసే నాటికి ఈ సంస్థకు ఉన్న వివిధ బ్యాంకు ఖాతాల్లో కేవలం రూ.25 కోట్లు మాత్రమే నగదు నిల్వ ఉంది. కేవలం 12,000 మంది ఇన్వెస్టర్లకు తిరిగి చెల్లించాల్సిన మొత్తమే రూ.300 కోట్లుగా బయటపడింది. దీనికి తోడు ఇప్పటివరకు మరో 10 వేల మంది తమకు రూ.350 కోట్లు రావాల్సి ఉందంటూ పోలీసులకు నివేదించారు. ఈ మిస్టరీని ఛేదించడంపై ఈడీ అధికారులు దృష్టిపెట్టారు. కేరళలోని కొచ్చిన్‌లో ఉన్న ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌ను నౌహీరా షేక్ రూ.60 కోట్లు వెచ్చించి ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ప్రస్తుతం ఆ హోటల్లో ఎలాంటి బుకింగ్స్ జరగట్లేదు. దీంతో దాని కార్యకలాపాలు ఆరా తీయాలని అధికారులు భావిస్తున్నారు. -
ఇక సీసీఎస్ నిఘా
విజయవాడ సిటీ : నగర పోలీస్ కమిషనరేట్‌లో నేర పరిశోధక విభాగం పటిష్టతకు చర్యలు ప్రారంభమయ్యాయి. నేరాల నియంత్రణకు సీసీఎస్, క్రైం విభాగాలున్నప్పటికీ ఆశించిన ఫలితాలు రాకపోవడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలకు శ్రీకారం చుట్టారు. సోమవారం జరిగిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఇదే విషయంపై అధికారుల అభిప్రా యాలను కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు స్వీకరించారు. ఈ మేరకు సీసీఎస్ (సెంట్రల్ క్రైం స్టేషన్)ను పునర్వవ్యవస్థీకరించారు. క్రైం విభాగంలో సమూల మార్పులు తీసుకొచ్చి కేంద్రీకృత వ్యవస్థను ఏర్పాటుచేస్తే నేరాల కట్టడి సాధ్యమవుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ కేంద్రీకృత వ్యవస్థ పరిధిలోకి పోలీసుస్టేషన్లలో పని చేస్తున్న క్రైం సిబ్బందితోపాటు సీసీఎస్ విభాగం సిబ్బందిని కూడా తీసుకొచ్చి సమాచార సేకరణ, విచారణ, నియంత్రణ విభాగాలుగా విభజించారు. వీరికి అవసరమైన వాహనాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి, నగదు అందజేశారు. వీరు మంగళవారం నుంచి విధులు ప్రారంభించారు. కేంద్రీకృత వ్యవస్థ పనితీరు ఇలా.. సమాచార సేకరణ విభాగం : ఆస్తి దొంగతనాలకు అలవాటుపడిన నేరస్తుల సమాచారాన్ని ఈ విభాగంలో పనిచేసేవారు సేకరిస్తారు. ఇదే సమయంలో నేరస్తులపై నిఘా ఉంచడంతో పాటు వారిని గుర్తించేందుకు, పొరుగు జిల్లాల నేరస్తుల ఆచూకీ తెలుసుకునేందుకు వేగుల ఏర్పాటు సహా వివిధ పద్ధతులు అమలు చేస్తారు. ఏదైనా పోలీసు స్టేషన్ పరిధిలో నేరం జరిగితే వీరు వెళ్లి కేసు పూర్వాపరాలు విశ్లేషించడంతో పాటు నేరానికి పాల్పడేందుకు అవకాశం ఉన్న వారిని గుర్తిస్తారు.తద్వారా విశ్లేషించిన సమాచారాన్ని దర్యాప్తు విభాగానికి అందజేస్తారు. దర్యాప్తు విభాగం : విశ్లేషణ విభాగం నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ విభాగం సిబ్బంది దర్యాప్తు చేస్తారు. వీరికి వచ్చిన సమాచారంలో తమ అనుభవాన్ని జోడించి నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో పాటు చోరీకి గురైన సొత్తును రాబడతారు. నియంత్రణ విభాగం : నగరవాసులను అప్రమత్తం చేస్తూ నేరాల నియంత్రణకు ఈ విభాగం కృషిచేస్తుంది. తమకు ఇచ్చిన ప్రచార సాధనాల (రికార్డెడ్ సూచనలు)తో కాలనీలు, అపార్టుమెంట్లు, హోటళ్లలో చోరీల నియంత్రణకు తీసు కోవాల్సిన చర్యలను వివరిస్తారు. ప్రజలు సంచరించే షాపులు, థియేటర్లు, హోటళ్లు తదితర ప్రాంతాల్లో సీసీ కెమేరాల ఏర్పాటు వంటి చర్యలను ఈ విభాగమే చూసుకుంటుంది.