సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితా రాణి వ్యవహారానికి సంబంధించి సీఐడీ విచారణ మూడోరోజు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో సహా ఇరవైమందికి పైగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ రత్నకుమారి గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘విచారణకు సహకరించాలని మొదట డాక్టర్ అనితా రాణిని ఫోన్ ద్వారా కోరడం జరిగింది. ఆమె ఇంటి వద్దకు వెళ్ళి సీబీఐ విచారణ కావాలని, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను రికార్డు చేశాం. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదేవిధంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు చిత్తూరు హెల్త్ సెంటర్ సిబ్బందిని విచారణ చేశాం. (అనితా రాణి ఇంటికి రాజకీయనేతలు..!)
అనితా రాణి ఆరోపించినట్లుగా బాత్రూంలో ఫోటోలు కానీ వీడియో కానీ తీసే అవకాశం లేదు. ఆమె తన మాటల్లో డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర సంస్థలు న్యాయం చేయలేదని చెప్పారు. కేసు నమోదు అయిన వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విచారణ చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశాం. ఇప్పటివరకు ఉన్న నివేదికపై అధికారులకు చెప్పి తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అన్నది నిర్ణయిస్తారు. అనితా రాణి ఫిర్యాదు చేసిన వైద్యాధికారులను విచారించడం జరుగుతుంది.’ అని తెలిపారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి)
Comments
Please login to add a commentAdd a comment