government doctor
-
సీఎం జగనే ప్రాణం పోశారు..
ఒంగోలు: కరోనా బాధితులకు వైద్యం చేస్తూ.. తానూ కరోనా బారినపడి మృత్యువు అంచుకు చేరిన ఓ వైద్యుడిని అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదుకుని ప్రాణం పోశారు. తనకు ప్రాణదానం చేసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆ వైద్యుడు కృతజ్ఞతలు చెబుతూ మళ్లీ విధులకు సిద్ధమయ్యాడు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలిసారిగా కారంచేడులో కరోనా కేసులు వెలుగుచూశాయి. ఆ సమయంలో కారంచేడు ప్రభుత్వ వైద్యశాల వైద్యుడిగా భాస్కర్ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఒంగోలు రిమ్స్‌లో రేడియాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. తొలినాళ్లలో 2020 ఏప్రిల్ 24న భాస్కర్ కరోనా సోకింది. తొలుత ఆయన గుంటూరు జనరల్ ఆస్పత్రిలో, తర్వాత విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే రూ.50 లక్షల దాకా ఖర్చుచేశారు. సంపాదించిన డబ్బులతో పాటు అప్పు తెచ్చినా వైద్యానికి సరిపోలేదు. అపోలో వైద్యులు అతనికి ఊపిరితిత్తులు మార్పిడి చేయాలని, దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ఆ సమయంలోనే రిమ్స్ ఒంగోలు రీజనల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్‌రెడ్డి, ఓబుల్‌రెడ్డి, ఒంగోలు క్యాన్సర్ హాస్పిటల్ ఆంకాలజీ వైద్యుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి సాయంతో అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి సాయం చేయాలని కోరారు. వైద్యుడి విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి బాలినేని తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఎం చికిత్సకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ఆ మేరకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించారు. దీంతో డాక్టర్ భాస్కర్ ఆరోగ్యం కుదుటపడింది. ఇటీవలే కోలుకున్నారు. డాక్టర్ దంపతులు ఆదివారం ఎమ్మెల్యే బాలినేనిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తనకు పునర్జన్మ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కల్పించాలని డాక్టర్ భాస్కర్ కోరారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపాకవిధుల్లో చేరాలనుకుంటున్నట్లు చెప్పారు. దీనికి స్పందించిన బాలినేని.. సీఎంను కలిసే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. -
డాక్టర్‌కు అండగా నిలబడిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపుట్టుగకు చెందిన పీహెచ్సీ వైద్యాదికారి ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఇటీవలే కరోనా బారిన పడి ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు ఊపిరితిత్తులు మార్చాలని తేల్చిన వైద్యులు అందుకు రూ.1.50 కోట్లకు పైగా ఖర్చవుతుందని చెప్పారు. అంత ఆర్థిక స్థోమత లేకపోవడంతో డాక్టర్ భాస్కరరావు కుటుంబ సభ్యులు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆశ్రయించారు. బాలినేని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. తక్షణం స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. అతడి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.కోటి వెంటనే చెల్లించాలని, అవసరమైతే మరో రూ.50 లక్షలు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారని మంత్రి బాలినేని తెలిపారు. ఆయన చికిత్సకు అయ్యే ఖర్చును రాష్ట్రం ప్రభుత్వం ముందుకు రావడంతో ఏపీ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ శనివారం వైఎస్ జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపింది. వారు స్పందిస్తూ.. '' ఆపదలో ఆపదలో ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ ఉదారతకు ఇవే మా కృతజ్ఞతలు. కష్టకాలంలో తోడుగా నిలిచిన సీఎంకు అభినందనలు తెలుపుతున్నాం. కరోనా విపత్తులో కారంచేడులో డాక్టర్ భాస్కర్‌రావు వైద్య సేవలు అందించారు. ఆరు వేల మందికి పైగా కోవిడ్ పరీక్షలు చేశారు. దురదృష్టవశాత్తూ ఆయన కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరారు. ఖరీదైన వైద్యం చేస్తే గానీ .. ప్రాణాలు నిలబడిని పరిస్థితికి భాస్కర్‌రావు ఆరోగ్యం చేరుకుంది. దీంతో దిక్కుతోచని స్థతిలో ఉన్న ఆయన కుటుంబానికి సీఎం వైఎస్ జగన్ అండగా నిలిచారు. అత్యంత ఖరీదైన వైద్యానికి ఖర్చులు భరించేందుకు వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి సీఎం చాటుకున్నారు. సీఎం స్పందించిన తీరుతో మా బాధ్యత మరింత పెరిగిందని'' తెలిపారు. కాగా డాక్టర్ ఎన్.భాస్కరరావు ప్రకాశం జిల్లా కారంచేడు పీహెచ్సీ వైద్యాధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతాధికారుల ఆదేశాలతో సుమారు 6 వేల మందికి కోవిడ్–19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్‌గా తేలిన వారెందరికో అండగా నిలబడ్డారు. ఆయన అందించిన వైద్యంతో వేలాది మంది కోవిడ్ బారినుంచి బయటపడ్డారు. ఏప్రిల్ 24న ఆయనకు కరోనా సోకింది. నెలాఖరు వరకు హోమ్ ఐసోలేషన్‌లో ఉండి వైద్యం పొందారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో భార్య డాక్టర్ భాగ్యలక్ష్మి ఆయనను విజయవాడ ఆయుష్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ 10 రోజుల వైద్యం తరువాత మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ యశోదా హాస్పిటల్, తరువాత గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందారు. ఊపిరితిత్తులు పూర్తిగా పాడవటంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలుగుతుండటంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందిస్తున్నారు. చదవండి: Andhra Pradesh: ఆ వైద్యుడి చికిత్స ఖర్చు ప్రభుత్వానిదే..! -
8,536 మందికి ఒక ప్రభుత్వ డాక్టర్
సాక్షి, హైదరాబాద్: ఎంతమందికి జనాభాకు ఒక ప్రభుత్వ డాక్టర్ అందుబాటులో ఉన్నారనే నిష్పత్తిలో తెలంగాణ దేశంలో 15వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజా జాతీయ ఆరోగ్య గణాంకాల నివేదిక–2019 వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో అక్కడి జనాభాలో డాక్టర్లు ఎందరున్నారో విశ్లేషించింది. తెలంగాణలో ప్రభుత్వ అలోపతిక్ డాక్టర్ల సంఖ్య 4,123 మంది ఉన్నారు. అంటే 8,536 మంది జనాభాకు ఒక ప్రభుత్వ అలోపతిక్ డాక్టర్ ఉన్నారు. ఏపీలో 9,657 మందికి ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నారు. తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,066 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అంటే 33,015 మంది జనాభాకు ఒక పీహెచ్సీ డాక్టర్ ఉన్నట్లు పేర్కొంది. ఇక రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయుష్ డాక్టర్లు 20,926 మంది ఉండటం విశేషం. అంటే ప్రతీ 1,682 మందికి తెలంగాణలో ఒక ఆయుష్ డాక్టర్ ఉన్నారు. ఆయుష్ డాక్టర్లలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్రంలో మొత్తం 12,159 మంది నర్సులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ప్రతీ 2,894 మందికి ఒక నర్సు ఉన్నారు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది. ఇక రాష్ట్రంలో ఫార్మసిస్టుల సంఖ్య ఏకంగా 64,881 మంది ఉండటం విశేషం. ప్రతీ 542 మంది జనాభాకు ఒక ఫార్మసిస్టు ఉన్నారని కేంద్రం తెలిపింది. ఫార్మసిస్టుల సంఖ్యలో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి.ఆ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సంఖ్య పెరగాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అమెరికాలో ప్రతీ 200 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండటం గమనార్హం. -
కృష్ణానదిలోకి దూకి డాక్టర్ ఆత్మహత్య
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమం): భార్యాభర్తల మధ్య వివాదాలు తలెత్తడంతో ఓ ప్రభుత్వ వైద్యుడు ఆదివారం రాత్రి అందరూ చూస్తుండగానే కృష్ణానదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రకాశం జిల్లా వాసి డాక్టర్ అద్దేపల్లి శ్రీనివాస్ (40) గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్నారు. గుంటూరు కొత్తపేటలో భార్యాపిల్లలతో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో డా. శ్రీనివాస్ ప్రకాశం బ్యారేజీ వద్దకు చేరుకుని ప్రకాశం విగ్రహం వద్ద మెయిన్ కెనాల్లోకి దూకేశారు. (చదవండి: విదేశీ యువతిపై అత్యాచార యత్నం) అంతకుముందు తన జేబులో ఉన్న ఐడీకార్డు, ఆధార్, ఫోన్లను తీసి పక్కనే పెట్టేశారు. ఈ హఠాత్పరిణామాన్ని చూసిన వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడే ఉన్న విజయవాడ వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో తాడు సాయంతో శ్రీనివాస్‌ను పైకి తేవడానికి ప్రయత్నించారు. నీటి వడి ఎక్కువగా ఉండటంతో అందరూ చూస్తుండగానే శ్రీనివాస్ కనపడకుండా మునిగిపోయారు. అతను వదిలేసిన ఫోన్లో నంబర్ల ఆధారంగా తండ్రికి ఫోన్ చేయగా.. భార్యాభర్తలమధ్య గొడవ జరిగిందని ఆయన తెలిపారు. (చదవండి: రూ.కోటి కోసం బాలుడి కిడ్నాప్) -
అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితా రాణి వ్యవహారానికి సంబంధించి సీఐడీ విచారణ మూడోరోజు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో సహా ఇరవైమందికి పైగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ రత్నకుమారి గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘విచారణకు సహకరించాలని మొదట డాక్టర్ అనితా రాణిని ఫోన్ ద్వారా కోరడం జరిగింది. ఆమె ఇంటి వద్దకు వెళ్ళి సీబీఐ విచారణ కావాలని, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను రికార్డు చేశాం. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదేవిధంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు చిత్తూరు హెల్త్ సెంటర్ సిబ్బందిని విచారణ చేశాం. (అనితా రాణి ఇంటికి రాజకీయనేతలు..!) అనితా రాణి ఆరోపించినట్లుగా బాత్రూంలో ఫోటోలు కానీ వీడియో కానీ తీసే అవకాశం లేదు. ఆమె తన మాటల్లో డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర సంస్థలు న్యాయం చేయలేదని చెప్పారు. కేసు నమోదు అయిన వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విచారణ చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశాం. ఇప్పటివరకు ఉన్న నివేదికపై అధికారులకు చెప్పి తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అన్నది నిర్ణయిస్తారు. అనితా రాణి ఫిర్యాదు చేసిన వైద్యాధికారులను విచారించడం జరుగుతుంది.’ అని తెలిపారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) -
అనితారాణి ఇంటికి రాజకీయనేతలు..!
పెనుమూరు/చిత్తూరు అర్బన్: ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితారాణి వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూస్తోంది. గత వారం రోజులుగా ఈమె నివాసముంటున్న ఇంటికి రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు.. అని ఈ మేరకు స్థానికులతో పాటు అనితారాణి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సీఐడీ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో పనిచేసేప్పుడు తనను కులంపేరిట దూషించారంటూ అనితారాణి మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇటీవల మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వం ఈకేసు సీఐడీకి బదిలీ చేసింది. బుధవారం సీఐడీ ఎస్పీ రత్న, డీఎస్పీ రవికుమార్‌తో కూడిన బృందం మురకంబట్టులోని అనితారాణి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటి తలుపులు కూడా తీయలేదు. ఇదే విషయమై ఎస్పీ రత్న ఫోన్లో మాట్లాడితే.. ‘‘నాకు సీఐడీపై నమ్మకంలేదు. నేను మీకు సహకరించను. సీబీఐ వాళ్లు వస్తేనే మాట్లాడుతా. మీరు ఏ నోటీసులు ఇచ్చినా తీసుకోను.’’ అంటూ సమాధానమిచ్చారు. ► మార్చి 22వ తేదీన పెనుమూరు పీహెచ్సీలో జరిగిన వివాదంపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. అనితారాణి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులైన భరత్‌కుమార్, రవికుమార్, రాజేష్‌తో పాటు వీడియోలో ఉన్న మరో వ్యక్తిని విచారించారు. ► విచారణ అనంతరం సీఐడీ ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడారు. అనితారాణికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించారన్నారు. ► పైగా సీఐడీపై నమ్మకంలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను తక్కువచేసి మాట్లాడటం ప్రభుత్వ ఉద్యోగికి తగదన్నారు. అనితారాణి నివాసముంటున్న పరిసరాల్లో, ఇంటి యజమాని, పెనుమూరు పోలీసులను, పీహెచ్సీ సిబ్బందిని విచారించి స్టేట్మెంట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
అనితా రాణి నుంచి సమాధానం లేదు..
-
అనితా రాణి తలుపులు తీయడం లేదు..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యురాలు అనితా రాణి విచారణకు సహకరించడం లేదని సీఐడీ ఎస్పీ రత్నకుమారి తెలిపారు. ఆమె బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ అనితా రాణిని విచారణ చేసేందుకు రెండు రోజులుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ రవికుమార్ నేతృత్వంలో విచారణ జరుగుతోందని రత్నకుమారి తెలిపారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) ‘నిన్న చిత్తూరుకు చేరుకున్నాం. సీఆర్పీ 160 సెక్షన్ కింద నోటీసులు పంపాం. విచారణ నిమిత్తం చిత్తూరులోని ఆమె ఇంటికి వెళితే తలుపులు తెరవలేదు. ఫోను ద్వారా సంప్రదించాం. తనకు రాష్ట్ర పోలీసులు, సీఐడీ మీద నమ్మకం లేదని చెబుతున్నారు. ఇవాళ ఉదయం 5.30 గంటలకు అనితా రాణి ఇంటికి వెళ్లాం. కాలింగ్ బెల్ నొక్కినా ఆమె నుంచి సమాధానం రాలేదు. మరోసారి ఫోన్ చేశాం. తనకు సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని బర్తరఫ్ చేసిన తర్వాత విచారణకు రావాలని చెబుతున్నారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) తనకు కాలు విరిగిందని చెప్పారు. అనితా రాణి నివాసం ఉంటున్న సమీపంలోని చుట్టుపక్కల ఇళ్లవారిని విచారించి వివరాలు నమోదు చేసాం. అనిత రాణి ఇంటికి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు వస్తున్నారని చెప్పారు. దీంతో ఇవాళ పెనుమురు వచ్చి ఆసుపత్రితో పాటు పోలీస్ స్టేషన్లోనూ విచారణ చేశాం. ఒక వైద్యురాలిగా ఉంటూ సీఐడీ మీద నమ్మకం లేదని చెప్పడం భావ్యం కాదు. అన్ని కోణాల్లో మా విచారణ కొనసాగుతుంది’ అని ఎస్పీ రత్నకుమారి స్పష్టం చేశారు. -
విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి
-
విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి
సాక్షి, చిత్తూరు : చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు అనితా రాణి సీఐడీ విచారణకు సహకరించడం లేదు. అధికారులు ఫోన్ చేసినా ఆమె స్పందించకపోవడంతో వారే..స్వయంగా అనితా రాణి నివాసానికి వెళ్లారు. సీఐడీ అధికారులను చూడగానే అనితా రాణి ఇంటి తలుపులు వేసుకున్నారు. ‘నాకు సీఐడీ పోలీసులపై నమ్మకంలేదు. నన్ను విచారించడానికి మీరు ఎవరూ కూడా నా ఇంటి వద్దకు రాకండి. మీరు పిలిచినా నేను రాను. నా కేసు సీబీఐతో విచారించాల్సిందే..’ అంటూ ప్రభుత్వ వైద్యురాలు అనితారాణి పేర్కొన్నారు. ఆమెను విచారించడానికి చిత్తూరుకు చేరుకున్న సీఐడీ పోలీసులు నిన్న (మంగళవారం) అనితారాణికి ఫోన్‌చేయగా.. ఆమెనుంచి ఇలాంటి సమాధానం వచ్చింది. దాంతో సీఐడీ అధికారులు బుధవారం ఆమె నివాసానికి వెళ్లగా...అధికారులను చూడగానే తన నివాసంలో తలుపులు మూసివేశారు. (అనితారాణి ఆరోపణలు: విచారణకు సీఎం జగన్ ఆదేశం) కాగా ఈ ఏడాది మార్చి 22వ తేదీ పెనుమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి భరత్ అనే వ్యక్తి వైద్యం కోసం రాగా వైద్యం చేయకుండా అనితారాణి తలుపులు వేసుకున్నారు. ఇదేమిటని గ్రామస్తులు నిలదీయడంతో తనను కులం పేరిట ధూషించారని, బాత్రూమ్లో ఉంటే ఫొటోలు తీశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ వైద్యురాలిగా ఉంటూ వైద్యసేవలు అందివ్వలేదంటూ భరత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంతలో తనకు న్యాయం జరగలేద ని అనితారాణి మీడియాకు ఎక్కారు. ఈ వ్యవహారంపై నిజానిజాలు తేల్చడానికి కేసును సీఐడీకి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఆదేశాలు జారీ చేసింది. విచారించడానికి చిత్తూరుకు వచ్చిన సీఐడీ పోలీసులు అనితారాణిని ఫోన్లో సంప్రదించగా ఆమె నిరాకరించారు. అయితే ఈ వ్యవహారాన్ని రాష్ట్ర టీడీపీ నాయకులు దగ్గరుండీ మరీ వివాదంగా మారుస్తున్నారని పెనుమూరు వాసులు అంటున్నారు. -
వరకట్న వేధింపుల కేసులో ప్రభుత్వ వైద్యుడి అరెస్ట్
తూర్పుగోదావరి ,అమలాపురం టౌన్: అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సూరిశెట్టి విద్యాసాగర్‌పై వరకట్నం, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. ఆయన భార్య సూరిశెట్టి మణిక ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ సీఐ కోలా రజనీకుమార్ దర్యాప్తు చేశారు. దీంతో డాక్టర్ విద్యాసాగర్‌ను సీఐ రజనీకుమార్ ఆ రెండు సెక్షన్ల కింద బుధవారం అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరిచారు. ఇదే కేసులు నిందితులుగా ఉన్న డాక్టర్ విద్యాసాగర్ తల్లిదండ్రులు ఉన్నారు. వారిని అరెస్ట్ చేయాల్సి ఉంది. డాక్టర్‌కు కోర్టు 14 రోజల రిమాండ్ విధించడంతో డాక్టర్‌ను సబ్ జైలుకు తరలించారు. ఈ కేసు సంబంధించిన వివరాలను సీఐ రజనీకుమార్ వివరించారు. ప్రస్తుతం అమలాపురంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్నున్న విద్యాసాగర్ పట్టణంలోని ఎస్ఎస్ నాయుడు లే అవుట్‌లోని సాయిరామ్ ఫ్లాజాలో నివసిస్తున్నారు. బాధితురాలైన డాక్టర్ భార్య అయిన మణిక ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం... వీరికి 2014 మే 24న విశాఖలోని దసపల్లా హోటల్లో పెళ్లి జరిగింది. ఆ సమయంలో తన తల్లిదండ్రులు రూ.పది లక్షల నగదుతో పాటు విశాఖ మహానగరంలో పలు చోట్ల మూడు ఇళ్ల ప్లాట్లు, కొంత భూమి కట్నంగా ఇచ్చారని భార్య మణిక ఫిర్యాదులో పేర్కొంది. డాక్టర్ విద్యాసాగర్ కట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ కాబోయే తన భార్య పేరున రాసి ఇస్తేనే వివాహం చేసుకుంటానని మెలిక పెట్టడంతోపాటు ఒత్తిడి కూడా తేవడంతో మణిక తల్లిదండ్రులు వరకట్నంగా ఇచ్చిన ఆస్తులన్నీ రాసి ఇచ్చారు. వారి వివాహమైన తర్వాత వారి కాపురం ఏడాది పాటు సజావుగా సాగింది. తర్వాత తన భర్త చెడు అలవాట్లు, మద్యానికి బానిసై అదనపు కట్నం కోసం వేధించారని పేర్కొంది. తన పేరున ఉన్న కట్నంగా ఇచ్చిన ఆస్తులను తన పేరున రాయాలని భర్తే కాకుండా ఆయన తల్లిదండ్రులు కూడా తనను నిత్యం వేధించారని ఆ ఫిర్యాదులో వివరించింది. చివరకు తన పేరున ఉన్న ఆస్తులను పెద్దల తగువులో తన పేరున, భర్త పేరున రాసేందుకు నిర్ణయించారు. ఇంతలో గత మార్చి నెలలో తన భర్త విద్యాసాగర్‌కు అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఉద్యోగం రావడంతో పట్టణంలో కాపురం పెట్టామని, నెల రోజులు తనను బాగానే చూసుకున్నారని మణిక పేర్కొంది. పది రోజుల క్రితం తమకు ఉన్న ఓ ప్లాట్‌ను అమ్మేద్దామని.., తనపై ఒత్తిడి తేవడం మొదలు పెట్టారని, అంతే కాకుండా అప్పటికే ఆయన ఒత్తిడితో అమ్మేసిన రెండు ప్లాట్ల సొమ్ముతో వేరే చోట కొత్త ప్లాట్ కొన్నానని తనను నమ్మించారే తప్ప దానిని తనకెప్పుడు చూపించలేదని ఫిర్యాదులో తెలిపింది. ఇదిలా ఉండగా గత నెల 28న పట్టణంలోని వారి వసతి ఇంట్లో ప్లాట్ అమ్మే విషయంలో భార్యభర్తలకు వాగ్వివాదం జరిగిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ ఘటనలో డాక్టర్ విద్యాసాగర్ భార్య మణికి పీక నొక్కేసి తలను నేలనేసి కొట్టి చంపే ప్రయత్నం చేశాడన్న అభియోగంపై డాక్టర్‌పై అదనపు కట్నం కోసం వేధింపులు, హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్టు సీఐ రజనీకుమార్ తెలిపారు. -
ప్రజల మనసు గెలుచుకున్న ప్రభుత్వ డాక్టర్
-
ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు అర్బన్ : సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వ వైద్యుల సంఘం తక్షణం ఏర్పాటు కావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వైద్యులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఏపీవీవీపీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రాష్ట్ర విభజనానంతరం ఉమ్మడి ఏపీ వీవీపీ వైద్యుల అసోసియేషన్ రదై్దన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం నూతన ఏపీకి అసోసియేషన్ లేకపోవడంతో వైద్యుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోయిందన్నారు. సమావేశానికి అ«ద్యక్షత వహించిన సీడబ్ల్యూసీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ జయ«ధీర్ మాట్లాడుతూప్రభుత్వ వైద్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, ఏపీవీవీపీ రీజనల్ కో ఆర్డినేటర్, డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఏపీవీవీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వినయ్, ట్రెజరర్, రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చనిపోయిందనుకుని.. అంత్యక్రియలకు సిద్ధం
ఆపద్బాంధవుడిలా వచ్చి ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యుడు సంగారెడ్డి: ఓ శిశువు చనిపోయిందని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆపద్బాంధవుడిలా అటుగా వచ్చిన డాక్టర్ ప్రాణం పోశాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్‌కు చెందిన స్వాతిక, రాజులకు నలభై రోజుల క్రితం ఆడశిశువు జన్మించింది. అయితే, నాలుగు రోజుల క్రితం శిశువు పాలు తాగక కదలలేని స్థితికి చేరుకుంది. దీంతో చనిపోయిందని భావించిన తల్లిదండ్రులు.. ఈ నెల 6వ తేదీన పూడ్చడానికి గుంతను కూడా తవ్వించారు. ఆ సమయంలో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి చిన్నపిల్లల వైద్యుడు రహీం అటుగా వెళుతూ విషయం తెలుసుకుని పరిశీలించాడు. శిశువు చనిపోలేదని, వెంటనే సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రిలోని శిశు సంజీవనిలో చేర్పించారు. అక్కడ వైద్యులు రిస్కీ ట్రీ ట్మెంట్ చేసి పసిపాపకు స్పృహలోకి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ రహీం తెలిపారు. -
విదేశాల్లో ఉద్యోగం.. నెలనెలా ప్రభుత్వ జీతం!