ప్రభుత్వ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి
Published Sun, Oct 2 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
ఏలూరు అర్బన్ : సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వ వైద్యుల సంఘం తక్షణం ఏర్పాటు కావాల్సి ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ వైద్యులు స్పష్టం చేశారు. శనివారం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఏపీవీవీపీ జిల్లాస్థాయి సమావేశం జరిగింది. ప్రభుత్వాసుపత్రుల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా వైద్యులు తమ ఇబ్బందులను ఏకరువు పెట్టారు. రాష్ట్ర విభజనానంతరం ఉమ్మడి ఏపీ వీవీపీ వైద్యుల అసోసియేషన్ రదై్దన విషయాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం నూతన ఏపీకి అసోసియేషన్ లేకపోవడంతో వైద్యుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోయిందన్నారు. సమావేశానికి అ«ద్యక్షత వహించిన సీడబ్ల్యూసీ రాష్ట్ర కోఆర్డినేటర్ డాక్టర్ జయ«ధీర్ మాట్లాడుతూప్రభుత్వ వైద్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్, ఏపీవీవీపీ రీజనల్ కో ఆర్డినేటర్, డాక్టర్ ఏవీఆర్ మోహన్, ఏపీవీవీపీ రాష్ట్ర కో ఆర్డినేటర్ డాక్టర్ వినయ్, ట్రెజరర్, రామకోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement