చనిపోయిందనుకుని.. అంత్యక్రియలకు సిద్ధం | A girl child alive although funerals ready | Sakshi
Sakshi News home page

చనిపోయిందనుకుని.. అంత్యక్రియలకు సిద్ధం

Published Wed, Dec 10 2014 4:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

A girl child alive although funerals ready

ఆపద్బాంధవుడిలా వచ్చి ప్రాణం పోసిన ప్రభుత్వ వైద్యుడు
 సంగారెడ్డి: ఓ శిశువు చనిపోయిందని అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా.. ఆపద్బాంధవుడిలా అటుగా వచ్చిన డాక్టర్ ప్రాణం పోశాడు. నాలుగు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన మంగళవారం వెలుగుచూసింది. మెదక్ జిల్లా హత్నూర మండలం లింగాపూర్‌కు చెందిన స్వాతిక, రాజులకు నలభై రోజుల క్రితం ఆడశిశువు జన్మించింది. అయితే, నాలుగు రోజుల క్రితం శిశువు పాలు తాగక కదలలేని స్థితికి చేరుకుంది.
 
 దీంతో చనిపోయిందని భావించిన తల్లిదండ్రులు.. ఈ నెల 6వ తేదీన పూడ్చడానికి గుంతను కూడా తవ్వించారు. ఆ సమయంలో సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రి చిన్నపిల్లల వైద్యుడు రహీం అటుగా వెళుతూ విషయం తెలుసుకుని పరిశీలించాడు. శిశువు చనిపోలేదని, వెంటనే  సంగారెడ్డిలోని ప్రభుత్వాస్పత్రిలోని శిశు సంజీవనిలో చేర్పించారు. అక్కడ వైద్యులు రిస్కీ ట్రీ ట్‌మెంట్ చేసి పసిపాపకు స్పృహలోకి తీసుకొచ్చారు. మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు డాక్టర్ రహీం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement