Anita Rani
-
డాక్టర్ అనితారాణి ఆరోపణల్లో నిజం ఎంత?
చిత్తూరు అర్బన్: డాక్టర్ అనితారాణి. ప్రస్తుతం ఈమె పేరు తెలియనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. ఈ ఏడాది మార్చి 22న చిత్తూరు జిల్లా పెనుమూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం కోసం వచ్చిన వ్యక్తికి, ఈమెకు మధ్య వివాదం మొదలయ్యింది. ఇరువురు ఇచ్చిన ఫిర్యాదులపై పెనుమూరు పోలీస్ స్టేషన్లో కేసులు కూడా నమోదయ్యాయి. కానీ గత ఆరు రోజుల్లో ఆమె ఒక్కసారిగా వార్తల్లోకెక్కారు. తన కేసు సీబీఐకి ఇవ్వాలని, ఉప ముఖ్యమంత్రిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఐడీ ఎస్పీ రత్నపై అట్రాసిటీ పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు నిజమేనా? ఇందులో వాస్తవాలేమిటని చూస్తే అసలు విషయం అర్థమైపోతుంది. (అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..) అనితారాణి ఆరోపణలు ♦ మార్చి 22వ తేదీన వైద్యం కోసం వచ్చిన భరత్ తదితరులు తనపై దాడి యత్నం చేశారని పేర్కొన్నారు. ♦ ఓ గదిలో తనను నిర్బంధించారని ఆరోపించారు. ♦ గదిలోంచి బాత్రూమ్లోకి వెళ్లగా కిటికీలోంచి ఫొటోలు, వీడియోలు తీశారని వాపోయారు. ♦ ఫిర్యాదు చేయడానికి ఉదయం స్టేషన్‌కు వెళితే రాత్రి వరకు కేసు నమోదుచేయకుండా పోలీసులు ఇబ్బంది పెట్టారనేది ఆమె వాదన. ♦ పెనుమూరులో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయని, అబార్షన్లు చేయలంటూ తనపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపణ. ♦ ఇక్కడి ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో సిబ్బంది సరిగా విధులకు రాకుండా హాజరు మాత్రం వేసుకుంటున్నట్లు విసుర్లు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టమంటే పోలీసులు నిరాకరించి, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గారని ఆరోపణ. ♦ సీఐడీపై తనకు నమ్మకం లేదని, వాళ్ల విచారణకు సహకరించేది లేదని స్పష్టం చేశారు. ♦ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేసి, కేసు సీబీఐకి అప్పగించాలని డిమాండ్. వాస్తవాలు ♦ పెనుమూరుకు చెందిన భరత్‌కుమార్‌కు మార్చి 22వ తేదీన కంట్లో యాసిడ్‌లాంటి ద్రావణం పడితే వైద్యం కోసం పీహెచ్‌సీకి వెళ్లారు. కరోనా నేపథ్యంలో తాను ఎవరికీ వైద్యం చేయబోనంటూ అనితారాణి చెప్పడం, ఆస్పత్రిలోనే ఓ నోటీసును అతికించడం వాస్తవం. ♦ భరత్‌కుమార్‌తో పాటు వచ్చిన గ్రామస్తులు అనితారాణి వాదనపై నిలదీశారు. దీంతో ఆమె తన గదిలోకి వెళ్లి లోపల గడియపెట్టుకున్నారు. ఎవరూ కూడా నిర్బంధించలేదు. ♦ అనితారాణి చెబుతున్నట్లు ఆస్పత్రి మరుగుదొడ్లో ఉంటే ఫొటోలు తీయడం అసాధ్యం. ఎందుకంటే మరుగుదొడ్డికి వెనుక 12 అడుగుల ఎత్తులో ఎగ్జాస్టర్ ఫ్యాన్‌ను ఏర్పాటుచేశారు. అంతపైకి ఎక్కి ఫొటోలు ఎలా తీస్తారని సీఐడీ అధికారులు కూడా అనుమానం వ్యక్తం చేశారు. ♦ పోలీస్ స్టేషన్‌కు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో వెళ్లిన అనితారాణి ఆమె ఫిర్యాదును రాసివ్వగా పోలీసులు కేసు నమోదు చేస్తామన్నారు. కానీ ఎఫ్ఐఆర్ ఇచ్చేంతవరకు వెళ్లబోనని ఆమె స్టేషన్లోనే కూర్చుకున్నారు. మధ్యలో ఎఫ్ఐఆర్ ఆన్లైన్ చేసేప్పుడు సర్వర్ పనిచేయలేదు. దీంతో రాత్రి 7.30 గంటల ప్రాంతంలో పోలీసులు ఎఫ్ఐఆర్ జారీ చేశారు. ♦ పెనుమూరులో అబార్షన్లు ఎక్కువగా ఉన్నాయనడానికి ఆమెవద్ద ఎలాంటి సాక్ష్యాలూ లేవు. అవుట్ పేషెంట్ పుస్తకంలో అసలు దీనిపై ఎక్కడా కూడా సమాచారం లేదు. ♦ సిబ్బంది హాజరుపట్టీ మొత్తం వైద్యురాలైన అనితారాణి టేబుల్‌పైనే ఉంటుంది. ఆమె అనుమతిలేనిదే సిబ్బంది హాజరుపట్టికలో సంతకం కూడా పెట్టలేరు. ♦ వివాదం జరిగిన రోజే అనితారాణి ఇచ్చిన ఫిర్యాదుపై పెనుమూరు స్టేషన్లో కేసు (క్రైం.నెం.23/2020) నమోదైంది. నిందితులపై 341, 353 సెక్షన్లు, 506 రెడ్‌విత్ 34 ఐపీసీ, అండ్ సెక్షన్ 3 ఆఫ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కౌంటర్ కేసుగా అనితారాణి వైద్యం చేయలేదని ఇచ్చిన ఫిర్యాదుపై క్రైం.నెం–24/2020 నమోదు కాగా ఆమెపై ఐపీసీ సెక్షన్ 341, 506, 166బీ కింద కేసు నమోదుచేశారు. ♦ సీఐడీపై నమ్మకం లేదని చెప్పాలంటే ముందుగా అనితారాణి కేసు విచారణలో సీఐడీ చేసిన తప్పిదాలు చూపాలి. విచారణకే సహకరించని వ్యక్తి స్వయం ప్రతిపత్తి దర్యాప్తు సంస్థపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారు. ♦ ఇక ఈ కేసులో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిని బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్న అనితారాణి గంగాధరనెల్లూరు నియోజకవర్గానికి నారాయణస్వామి ఆయన ఎమ్మెల్యే కావడం, పెనుమూరు ఆయన పరిధిలోకి రావడమనే ఒకే ఒక్క అంశాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. అయినప్పటికీ ఈ వివాదంలో తన ప్రమేయం ఉన్నట్లు ఒక్క సాక్ష్యం చూపినా రాజీనామా చేస్తానంటూ నారాయణస్వామి బహిరంగంగానే సవాల్ విసిరారు. -
అనితా రాణి మాటలను రికార్డ్ చేశాం..
సాక్షి, చిత్తూరు: పెనుమూరు ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితా రాణి వ్యవహారానికి సంబంధించి సీఐడీ విచారణ మూడోరోజు కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటివరకూ పోలీసులు, ఆస్పత్రి సిబ్బందితో సహా ఇరవైమందికి పైగా విచారణ జరిపారు. ఈ సందర్భంగా సీఐడీ ఎస్పీ రత్నకుమారి గురువారమిక్కడ మాట్లాడుతూ... ‘విచారణకు సహకరించాలని మొదట డాక్టర్ అనితా రాణిని ఫోన్ ద్వారా కోరడం జరిగింది. ఆమె ఇంటి వద్దకు వెళ్ళి సీబీఐ విచారణ కావాలని, రాష్ట్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకం లేదని చెప్పిన మాటలను రికార్డు చేశాం. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి అదేవిధంగా ఆస్పత్రి సిబ్బందితో పాటు చిత్తూరు హెల్త్ సెంటర్ సిబ్బందిని విచారణ చేశాం. (అనితా రాణి ఇంటికి రాజకీయనేతలు..!) అనితా రాణి ఆరోపించినట్లుగా బాత్రూంలో ఫోటోలు కానీ వీడియో కానీ తీసే అవకాశం లేదు. ఆమె తన మాటల్లో డాక్టర్ సుధాకర్ విషయంలో రాష్ట్ర సంస్థలు న్యాయం చేయలేదని చెప్పారు. కేసు నమోదు అయిన వెంటనే ఎస్సీ ఎస్టీ సెల్ డీఎస్పీ విచారణ చేశారు. ప్రాథమిక విచారణ పూర్తి చేశాం. ఇప్పటివరకు ఉన్న నివేదికపై అధికారులకు చెప్పి తర్వాత ఏ విధంగా ప్రొసీడ్ కావాలి అన్నది నిర్ణయిస్తారు. అనితా రాణి ఫిర్యాదు చేసిన వైద్యాధికారులను విచారించడం జరుగుతుంది.’ అని తెలిపారు. (విచారణకు సహకరించని డాక్టర్ అనితా రాణి) -
అనితారాణి ఇంటికి రాజకీయనేతలు..!
పెనుమూరు/చిత్తూరు అర్బన్: ప్రభుత్వ వైద్యరాలు డాక్టర్ అనితారాణి వ్యవహారంలో కొత్తకోణం వెలుగుచూస్తోంది. గత వారం రోజులుగా ఈమె నివాసముంటున్న ఇంటికి రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు.. అని ఈ మేరకు స్థానికులతో పాటు అనితారాణి అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని సీఐడీ అధికారుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. పెనుమూరు ఆరోగ్య కేంద్రంలో పనిచేసేప్పుడు తనను కులంపేరిట దూషించారంటూ అనితారాణి మూడు నెలల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఇటీవల మీడియాకు ఎక్కడంతో ప్రభుత్వం ఈకేసు సీఐడీకి బదిలీ చేసింది. బుధవారం సీఐడీ ఎస్పీ రత్న, డీఎస్పీ రవికుమార్‌తో కూడిన బృందం మురకంబట్టులోని అనితారాణి ఇంటికి వెళ్లగా ఆమె ఇంటి తలుపులు కూడా తీయలేదు. ఇదే విషయమై ఎస్పీ రత్న ఫోన్లో మాట్లాడితే.. ‘‘నాకు సీఐడీపై నమ్మకంలేదు. నేను మీకు సహకరించను. సీబీఐ వాళ్లు వస్తేనే మాట్లాడుతా. మీరు ఏ నోటీసులు ఇచ్చినా తీసుకోను.’’ అంటూ సమాధానమిచ్చారు. ► మార్చి 22వ తేదీన పెనుమూరు పీహెచ్సీలో జరిగిన వివాదంపై సీఐడీ అధికారులు విచారణ చేపట్టారు. అనితారాణి ఇచ్చిన ఫిర్యాదులో నిందితులైన భరత్‌కుమార్, రవికుమార్, రాజేష్‌తో పాటు వీడియోలో ఉన్న మరో వ్యక్తిని విచారించారు. ► విచారణ అనంతరం సీఐడీ ఎస్పీ రత్న మీడియాతో మాట్లాడారు. అనితారాణికి 160 సీఆర్పీసీ నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించగా ఆమె నిరాకరించారన్నారు. ► పైగా సీఐడీపై నమ్మకంలేదని పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. రాజ్యాంగ వ్యవస్థను తక్కువచేసి మాట్లాడటం ప్రభుత్వ ఉద్యోగికి తగదన్నారు. అనితారాణి నివాసముంటున్న పరిసరాల్లో, ఇంటి యజమాని, పెనుమూరు పోలీసులను, పీహెచ్సీ సిబ్బందిని విచారించి స్టేట్మెంట్లు తీసుకున్నట్లు పేర్కొన్నారు. -
సీఎం జగన్ దృష్టికి ప్రభుత్వ డాక్టర్ అనితారాణి వ్యవహారం
-
ఆనాటి చేదు జ్ఞాపకం!
లండన్: కాలంతో పాటు కరిగిపోని కొన్ని చేదు జ్ఞాపకాలు మన కళ్లు ముందు కదలాడితే అవి చాలా బాధాకరంగా ఉంటాయి. అటువంటి కన్నీటి జ్ఞాపకమే భారత సంతతి ప్రముఖ జర్నలిస్టు, టీవీ వ్యాఖ్యాత అనితా రాణికి తారసపడింది. ఇందుకు బీబీసీ నిర్వహించిన ఓ కార్యక్రమమే కారణం.1947 వరకూ బ్రిటీష్ పాలనలో ఉన్న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే క్రమంలో అనితా రాణి కుటుంబంలో చోటు చేసుకున్న కొన్ని విషాదకర పరిస్థితులు బీబీసీ షో ద్వారా తెలుసుకున్న ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.సెలబ్రిటీల పూర్వీకుల జీవితాల్లో కొన్ని రహస్యాలను తెలియజెప్పే 'హూ డూ యూ థింక్ యూ ఆర్? అనే పేరుతో బీబీసీ నిర్వహించిన షోతో అనితా రాణి తన కుటుంబ పూర్వ స్థితి గురించి తెలుసుకుని కలత చెందారు. ఆనాటి బ్రిటీష్ పాలనలో అనితా రాణి తాతయ్య శాంతా సింగ్ జవానుగా పని చేసేవారు. శాంతా సింగ్ కుటుంబ పోషణలో భాగంగా ఉన్న ఊరికి వెయ్యి కిలో మీటర్ల దూరంలో పని చేసేవాడు. అయితే అదే సమయంలో దేశ విభజన కోసం జరిగిన అల్లర్లు తారాస్థాయికి చేరాయి. ఆ విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకోలేక పోయిన శాంతా సింగ్ భార్య ప్రీతమ్ కౌర్ ను కొంతమంది ఆందోళన కారులు బావిలోకి తోసివేయడంతో మృతిచెందింది. ఈ ఘటనలో ప్రీతమ్ తన ఏడేళ్ల కూతురు కూడా ప్రాణాలు కోల్పోయింది. కాగా, అమ్మమ్మ ప్రీతమ్ మరణించిన విషయం కుటుంబ సభ్యులకు కొంతవరకూ తెలిసినా.. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి కూడా మృతిచెందిన విషయం మాత్రం ఎవ్వరికీ తెలియదట .ఈ విషయాన్ని బీబీసీ ప్రోగ్రామ్ ద్వారా తెలుసుకున్న అనితా రాణి ఆవేదన చెందారు. ఆనాటి చేదు జ్ఞాపకాన్ని తెలుసుకున్న అనితా రాణి ఉట్టిపడుతున్నకన్నీటిని దాచిపెట్టుకున్నారు. ఈ షో అక్టోబర్ 1 వ తేదీన బీబీసీలో ప్రసారం కానుంది. అనితా రాణి తల్లి సిక్కు మతానికి చెందిన వ్యక్తి కాగా, తండ్రి హిందూ మతానికి చెందిన వారు. లండన్ లోని బ్రాండ్ ఫోర్డ్ లో పుట్టిన అనితా రాణి.. యూనివర్శిటీ ఆఫ్ లీడ్స్ నుంచి బ్రాడ్ కాస్టింగ్ లో డిగ్రీ చదివారు. తన 14 ఏట సిటీ సన్ రైజ్ రేడియోలో కెరీర్ ను ఆరంభించిన అనితా రాణి.. ఆ తరువాత ఛానల్ ఫైవ్, స్కై స్పోర్ట్స్, ఛానల్ ఫోర్, బీబీసీ టూ, బీబీసీ త్రీ, బీబీసీ ఆసియన్ నెట్ వర్క్ లలో జర్నలిస్టుగా పనిచేశారు.